Search
• Follow NativePlanet
Share
» »ఏపీలో సైబీరియా పక్షుల సందడి !

ఏపీలో సైబీరియా పక్షుల సందడి !

By Mohammad

ఈ సీజన్ ... వలస పక్షుల సీజన్. ఇండియాలో ఎక్కడ చూసిన తీరప్రాంతాలలో వలస పక్షుల సందడి ఈ సీజన్ లోనే ఆరంభమవుతుంది. సైబీరియా, రష్యా ఇలా చాలా దేశాల నుండి వివిధ రకాల పక్షులు ఇండియా తీరప్రాంతాలలో నివాసాలను ఏర్పరుచుకొని, ఆరు నెలలు ఉండి మరలా సొంత గూటికి చేరుకుంటాయి.

మన రాష్ట్రంలో కూడా వలస పక్షులకు కొన్ని నివాస ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొల్లేరు సరస్సు, తేలినీలాపురం, పులికాట్ సరస్సు, నేలపట్టు మొదలైనవి కలవు. పక్షుల రాకతో ఈ ప్రదేశాల్లో సందడి మొదలవుతుంది. వీటిని చూడటానికి పర్యాటకులు, స్థానికులు సెలవుదినాలలో, వారాంతంలో తరలివస్తుంటారు.

నేలపట్టు వలస పక్షుల కేంద్రం

నేలపట్టు వలస పక్షుల కేంద్రం

చిత్రకృప : GnanaskandanK

01. నేలపట్టు

నేలపట్టు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట సమీపాన కలదు. ఇది వలస పక్షుల కేంద్రం. ఇక్కడికి రకరకాల రంగురంగుల పక్షులు వలస వస్తుంటాయి. పక్షులకు ఆహారమైన చేపలు ఇక్కడ సమృద్ధిగా దొరుకుతాయి. ప్రతిఏటా సెప్టెంబర్ నెలలో వలస వస్తుంటాయి.

నెల్లూరులో తప్పక సందర్శించవలసిన ప్రదేశాలు !నెల్లూరులో తప్పక సందర్శించవలసిన ప్రదేశాలు !

నెల్లూరు నుండి సూళ్లూరుపేట కు గంటగంటకు ప్రభుత్వ బస్సులు నడుస్తాయి. ఇక్కడి నుండి 20 కి. మీ ల దూరంలో ఉన్న నేలపట్టుకు చేరుకోవటానికి ఆటోలు, జీపులు మరియు ఆర్డినరీ బస్సులు తిరుగుతాయి.

పులికాట్ సరస్సు

పులికాట్ సరస్సు

చిత్రకృప : A N Suresh Kumar

02. పులికాట్ సరస్సు

పులికాట్ సరస్సు కూడా నెల్లూరు జిల్లాలో కలదు. ఇది కూడా సూళ్లూరు పేట సమీపాన కలదు. నేలపట్టు కు మరియు పులికాట్ సరస్సు కు మధ్య దూరం 28 కి. మీ. ఈ సరస్సు ఎన్నో జాతి పక్షులకు, ప్రకృతి సంపదకు నిలయం.

భక్తుల కోర్కెలను తీర్చే ఘటిక సిద్దేశ్వర స్వామి !భక్తుల కోర్కెలను తీర్చే ఘటిక సిద్దేశ్వర స్వామి !

సూళ్లూరుపేట నుండి పులికాట్ సరస్సు కు మధ్య దూరం 12 కి. మీ. సరస్సు కు చేరుకోవటానికి జీపులు, ఆటోలు దొరుకుతాయి.

కొల్లేరు సరస్సు

కొల్లేరు సరస్సు

చిత్ర కృప : J.M.Garg

03. కొల్లేరు సరస్సు

కొల్లేరు సరస్సు కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్ల మధ్య వ్యాపించి ఉన్నది. ఇది మంచి నీటి సరస్సు. ఇక్కడికి వలస వచ్చే వాటిలో పరజి, పరాజము, ములుగు పిట్ట. సైబీరియా నుండి సైతం పక్షులు ఇక్కడికి వలసలు వస్తుంటాయి. సమీపాన ఉన్న పెద్దింట్లమ్మ దేవాలయం దర్శించదగినది.

విజయవాడ కు 100KM లోపు పర్యాటక ప్రదేశాలు !విజయవాడ కు 100KM లోపు పర్యాటక ప్రదేశాలు !

ఆకివీడు నుంచి లాంచీల ద్వారా, లేదా ఆలపాడు నుంచి చిన్న రవాణా సాధనాలతో కర్ర వంతెనల ద్వారా , ఏలూరు నుండి కైకలూరు మీదుగా బస్సు ద్వారా కొల్లేరు సరస్సు చేరుకోవచ్చు.

తేలినీలాపురం

తేలినీలాపురం

చిత్రకృప : Srikaanth Sekar

04. తేలినీలాపురం

తేలినీలాపురం టెక్కలి కి చెందినది. ఇది శ్రీకాకుళం నుని 65 కి. మీ ల దూరంలో, టెక్కలి 7 కి. మీ ల దూరంలో కలదు. ప్రతి సంవత్సరం 3000 పెలికాన్ మరియు స్టార్క్స్ పక్షులు సైబీరియా నుండి వలస వస్తుంటాయి. జర్మనీ, రష్యా, మలేషియా, హంగేరి, సింగపూర్, సైబీరియా నుండి 113 రకాల పక్షులు వలస వస్తుంటాయి. ఈ ప్రదేశం పక్షి ప్రేమికులకు అద్భుతంగా ఉంటుంది.

శ్రీకాకుళం - బౌద్ధ, జైన, శైవ మతాల సంగమం !!శ్రీకాకుళం - బౌద్ధ, జైన, శైవ మతాల సంగమం !!

శ్రీకాకుళం, నరసన్నపేట ప్రాంతాల నుండి ఆర్డినరీ బస్సులు మరియు టెక్కలి నుండి ఆటోలు, ప్రవేట్ వాహనాల ద్వారా తేలినీలాపురం చేరుకోవచ్చు.

ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం

ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం

చిత్ర కృప : J.M.Garg

ఆంధ్ర ప్రదేశ్ లో ఇతర పక్షుల సంరక్షణ కేంద్రాలు

ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం (ఉప్పలపాడు, గుంటూరు జిల్లా)

శ్రీ పెనుశిల నరసింహ వన్యప్రాణి అభయారణ్యం (నెల్లూరు జిల్లా)

పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి ఆలయ దివ్య క్షేత్రం !పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి ఆలయ దివ్య క్షేత్రం !

తెలుకుంచి పక్షి అభయారణ్యం (తెలుకుంచి, ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లా)

సైబీరియా పక్షులు

సైబీరియా పక్షులు ప్రతి ఏడాది ఏడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఇవి సెప్టెంబర్ మాసంలో వలస వచ్చి గ్రుడ్లు పెట్టి ఏడూ నెలల పాటు గూళ్ళు కట్టుకొని నివసిస్తాయి. ఆ గ్రుడ్లు పొదిగాక తమ పిల్లలతో కలిసి తమ మాతృదేశానికి వెళతాయి. బాధ కలిగించే విషయమేమిటంటే, ఇది వరకు ఇవి పదివేలు ఉండేవట. కానీ నేడు వీటి సంఖ్య మూడువేలకు పడిపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X