Search
  • Follow NativePlanet
Share
» »ధనౌల్తి - డూం వ్యాలీ యొక్క అందాలు !!

ధనౌల్తి - డూం వ్యాలీ యొక్క అందాలు !!

సుర్కందదేవి ఆలయం ధనౌల్తి కి కేవలం 8 కి. మీ. దూరంలో చుట్టూ దట్టమైన అడవిలో నిర్మించినారు. ఈ ప్రాంతం చంబా వెళ్ళే మార్గంలో కలదు.

By Mohammad

ధనౌల్తి సముద్ర మట్టం నుండి 2286 మీటర్ల ఎత్తులో ఉన్న ధనౌల్తి ఉత్తరాఖండ్ లోని గర్హ్వాల్ జిల్లాలో ఉంది. ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణం కలిగిన ఈ ప్రాంతం చంబా నుండి ముసోరి వెళ్ళే మార్గం లో ఉంది. ముస్సొరి కి కేవలం 24 కిలో మీటర్ల దూరం లో ఉన్నందువల్ల ఈ ప్రాంతం పర్యాటకుల లో అమితం గా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రాంతం నుండి మంత్రముగ్ధుల్నిచేసే డూం వాలీ యొక్క అందాలను పర్యాటకులు తిలకించవచ్చు.

చుట్టూ దేవదారు వృక్షాలు కలిగిన ఎకో పార్క్ ఈ ధనౌల్తి లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. వీటితో పాటు, ఈ ప్రాంతం బంగాళా దుంప పంట కి ప్రాచుర్యం చెందినది కావడం వల్ల "ఆలూ ఖేట్" గా ప్రసిద్ది చెందింది.

తెల్లవారుజామున దృశ్యం

తెల్లవారుజామున దృశ్యం

చిత్రకృప : Arup1981

థంగ్ధర్ క్యాంపు

సముద్ర మట్టం నుండి 8300 అడుగుల ఎత్తులో ఉన్న సాహసోపేతమైన క్యాంపు ఈ థంగ్ధర్ క్యాంపు. ఇది ప్రధాన మార్కెట్ నుండి 14 కిలోమీటర్ల దూరం లో ఉంది. వసతి సదుపాయం తో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన ఈ థంగ్ధన్ క్యాంపు లో పర్యాటకులు ఎంతో ఆనందాన్ని పొందవచ్చు. రాక్ క్లైమ్బింగ్, రివర్ క్రాసింగ్, హైకింగ్, ట్రెక్కింగ్, జిగ్ జాగ్ బార్స్, కమెండో నెట్ వంటి వివిధ క్రీడలు సాహసోపేతమైన కార్యక్రమాలంటే ఇష్టపడే పర్యాటకులని ఆకట్టుకుంటాయి.

ఎకో పార్క్

ఎకో పార్క్

ఎకో పార్క్

చిత్రకృప : Alok Prasad

ధనౌల్తి లో తప్పక సందర్శించవలసిన ప్రాంతం ఎకో పార్క్. అంబర్ మరియు ధార అనబడే రెండు ఎకో పార్క్స్ ఇక్కడ ఉన్నాయి. స్థానిక యువతతో కలిసి ఉత్తరాఖండ్ ఫారెస్ట్ డిపార్టుమెంటు ఇటివలే ఈ పార్క్ ని అభివృద్ధి చేసింది. స్థానిక గైడ్స్ సహకారం తో ఈ పార్క్ గురించి సందర్శకులు మరింత సమాచారం తెలుసుకోవచ్చు. ఈ పార్క్ లో సంరక్షింపబడుతున్న చిన్న దేవదారు వృక్షాల అడవి ఉంది. ఈ అడవి లో కి ప్రవేశించడానికి నామమాత్రపు ప్రవేశ రుసుము చెల్లించాలి.

పొటాటో ఫార్మ్

"ఆలూ ఖేర్" గా కూడా ప్రసిద్ది చెందిన బంగాళాదుంప పంట ధనౌల్తి ప్రధాన మార్కెట్ నుండి సమీపం లో ఉంది. ఉత్తరఖండ్ ప్రభుత్వం అధీనం లో ఈ పొలం ఉంది. సన్ రైస్ పాయింట్ గా ప్రసిద్ది చెందిన ఈ ప్రాంతం నుండి డూన్ వాలీ యొక్క విశాలదృశ్య వీక్షణం కావించవచ్చు. అందమైన ప్రకృతిదృశ్యాలను తనివి తీరా చూడడానికి సందర్శకులు గుర్రాలను అద్దెకి తీసుకోవచ్చు.

సుర్కంద దేవి ఆలయం

సుర్కంద దేవి ఆలయం

చిత్రకృప : Lucky Shalini

సుర్కంద దేవి ఆలయం

ఈ ఆలయం ధనౌల్తి కి కేవలం 8 కి. మీ. దూరంలో చుట్టూ దట్టమైన అడవిలో నిర్మించినారు. ఈ ప్రాంతం చంబా వెళ్ళే మార్గంలో కలదు. గంగా దసరా అనేది ఇక్కడ ప్రధాన పండగ. ఈ పండగని ప్రతి సంవత్సరం మే - జూన్ నెలల మధ్యలో వైభవంగా జరుపుతారు. ఈ ఆలయం కొండ మీద ఉంది. కనుక ఈ ప్రాంతానికి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు.

దశావతార్ టెంపుల్, న్యూ తెహ్రి టౌన్ షిప్, బరేహిపని మరియు జోరండ ఫాల్స్, డియోగర్ ఫోర్ట్ మరియు మతటిల డ్యాం వంటివి ఇక్కడికి సమీపం లో ఉన్న మరికొన్ని ప్రసిద్ద పర్యాటక ఆకర్షణలు.

ధనౌల్తి ఎలా చేరుకోవాలి ??

రోడ్డు మార్గం : ఢిల్లీ మరియు చండిగర్ నుండి ముసోరీ కి చేరుకోవడానికి ప్రైవేటు లేదా ప్రభుత్వ బస్సు సర్వీస్ సదుపాయాలు పర్యాటకులు వినియోగించుకోవచ్చు.

రైలు మార్గం: ధనౌల్తి కి 92 కిలోమీటర్ల దూరం లో రిషికేశ్ రైల్వే స్టేషన్ అలాగే 56 కిలోమీటర్ల దూరం లో డెహ్రాడున్ రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ నుండి పర్యాటకులు ధనౌల్తి కి చేరుకోవచ్చు.

వాయు మార్గం : ధనౌల్తి నుండి 83 కిలో మీటర్ల దూరం లో ఉన్న జోలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ అఫ్ డెహ్రాడున్ ధనౌల్థ్ కి సమీపం లో ఉన్న విమానాశ్రయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X