Search
  • Follow NativePlanet
Share
» »హాఫ్లాంగ్ - 'అస్సాం' ఏకైక హిల్ స్టేషన్ !!

హాఫ్లాంగ్ - 'అస్సాం' ఏకైక హిల్ స్టేషన్ !!

హాఫ్లాంగ్ ను పర్యాటకులు 'తూర్పు స్విజర్లాండ్' అని ముద్దుగా పిలుచుకుంటారు. అలా అని అక్కడ ఎల్లప్పుడూ మంచు ఉంటుందనుకుంటే పొరబడినట్లే !

By Mohammad

పర్యాటక ప్రదేశం : హాఫ్లాంగ్
రాష్ట్రం : అస్సాం
ప్రసిద్ధి : హాయినిచ్చే పర్వతాలు, అందమైన హాఫ్లాంగ్ సరస్సు

అస్సాం రాష్ట్రములోని హాఫ్లాంగ్ వివరించాలి అంటే - "ఇది కేవలం మంత్రముగ్ధుల్ని చేసే' ఏకైక పర్వత ప్రాంతం. దీనికి 'తూర్పు స్విట్జర్లాండ్' అని ముద్దుపేరు, హాఫ్లాంగ్ మంచుతో కప్పబడి ఉండదు కానీ స్విట్జర్లాండ్ లాంటి అందమైన ప్రదేశంగా పరిగణిస్తారు. ఇది ఉత్తర కచార్ జిల్లాకి ప్రధాన కేంద్రం, బరాక్ లోయకు చాలా దగ్గరగా ఉంది. హాఫ్లాంగ్ పర్యాటక సమీపంలోని నగరాలూ, పట్టణాల ప్రజలు చల్లని వేసవులను గడపడానికి ఇక్కడికి రావడానికి ఉత్సాహపడతారు.

హాఫ్లాంగ్ పట్టణం పర్వతాల మధ్య నెలకొని ఉంది. 513 మీటర్ల ఎత్తునున్న హాఫ్లాంగ్, చల్లగా, అందంగా, చక్కగా ఉంటుంది. జాలువారే జలపాతాలు, పారే సెలయేళ్ళు, చిక్కటి పచ్చదనం అన్నీ కలిసి మనసుమీద చెరగని ముద్ర వేస్తాయి. హాఫ్లాంగ్ ను చెదల కొండ అనికూడా అంటారు.

ఆకుపచ్చని వ్యవసాయ క్షేత్రాలు

ఆకుపచ్చని వ్యవసాయ క్షేత్రాలు

చిత్రకృప : PhBasumata

హాఫ్లాంగ్ లోని పర్యాటక ప్రదేశాలు

హాఫ్లాంగ్ లో ఉన్నపుడు, హాయినిచ్చే పర్వతాల వైపు చూస్తూ కూర్చోండి. అయితే, మంత్రముగ్ధుల్ని చేసే అందమైన హాఫ్లాంగ్ సరస్సు కూడా ఇక్కడి పర్యాటకానికి మరింత అందాన్ని చేకూరుస్తుంది. దిమాస కచారి రాజ్యపు ప్రాచీన రాజధాని పట్టణం మైబాంగ్ ను కూడా పర్యాటకులు చూడవచ్చు.

హాఫ్లాంగ్ సరస్సు

ఊరి మధ్యలో ఉన్న హాఫ్లాంగ్ సరస్సు ఈ పర్వత పట్టణానికి గర్వకారణం. హాఫ్లాంగ్ యాత్రలో ఈ సరస్సు చూడకుండా ఉండడం సాధ్యం కాదు. అస్సాం లోని సహజ జలశయాలలో ఒకటైన ఈ సరస్సు అ౦దంవల్ల దీన్ని అస్సాం లోని స్కాట్లాండ్ గా పిలుస్తారు.

హాఫ్లాంగ్ సరస్సు సందర్శించేటపుడు పర్యాటకులు ఈ సరస్సు లోని వినోద కార్యకలాపాలలో ఒకటైన బోట్ షికారు మిస్ అవకూడదు. హాఫ్లాంగ్ సరస్సుపై బోటింగ్ చేసేటపుడు కొండ ప్రాంతాల, చేరిక పర్వతాల విస్తృత దృశ్యాలను ఇస్తుంది. ఈ పట్టణం ఇప్పటికీ కాలుష్యం లేకుండా ఉంది కాబట్టి, హాఫ్లాంగ్ సరస్సు పై బోట్ షికారు చేసేటపుడు, పారదర్శకమైన ఆకాశం, ముగింపు లేని క్షితిజ సమాంతరాల అద్భుతమైన వీక్షణను అందిస్తుంది.

హాప్లాంగ్ సరస్సు

హాప్లాంగ్ సరస్సు

చిత్రకృప : Thoiba Paonam

హాఫ్లాంగ్ సరస్సు కొండ ప్రదేశం మధ్యలో ఉంది, పర్యాటకులు ఈ అద్భుతమైన ప్రదేశంలో రోజులు ఖచ్చితంగా గడపడానికి కొన్ని రోజులు ఈ హిల్ స్టేషన్ పై ఉండాలని కోరుకుంటారు.

హాఫ్లాంగ్ వాతావరణం

హాఫ్లాంగ్ లో ఉప-ఉష్ణమండల శీతల వాతావరణం ఉంటుంది. వేసవి కాలాలు వెచ్చగా ఉన్నప్పటికీ, హాయిగానే ఉంటుంది. అయితే శీతాకాలాలు మాత్రం చాలా చల్లగా ఉంటుంది. వర్షాకాలంలో ఈ పర్వత పట్టణంలో బాగా వర్షాలు పడతాయి.

ఇది కూడా చదవండి : అస్సాం లో ప్రసిద్ధి చెందిన నేషనల్ పార్కులు !!

హాఫ్లాంగ్ చేరుకోవడం ఎలా ??

రోడ్డుద్వారా

హాఫ్లాంగ్ కు రోడ్డుమార్గాలు లైఫ్ లైన్ లు. ఈ హిల్ స్టేషన్ గుండా ఉన్న 54, 27 జాతీయ రహదారులు, అస్సాం లోని అన్ని భాగాలను, పొరుగు రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్ లను కలుపుతాయి. సిల్చార్ సమీప, అతిపెద్ద నగరం కాగా, గౌహతి 299 కిలోమీటర్ల దూరంలో ఉంది. హాఫ్లాంగ్ నుండి రోజువారీ బస్సులు అందుబాటులో ఉంటాయి.

ముగ్ధమనోహర దృశ్యాలు

ముగ్ధమనోహర దృశ్యాలు

చిత్రకృప : chetrikrishna15@yaho...

రైలుమార్గం ద్వారా

హాఫ్లాంగ్ సిల్చార్, లుమ్డింగ్, మైబొంగ్, జతింగా ను కలిపే దిగువ హాఫ్లాంగ్ ఒక మీటర్ గేజ్ రైల్వే స్టేషన్. లుమ్డింగ్ హిల్ స్టేషన్ నుండి 131 కిలోమీటర్ల దూరంలో ఉంది, గౌహతిని కలిపే అనేక ప్రధాన రైళ్ళు లుమ్డింగ్ వద్ద నిలుస్తాయి. గౌహతి ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్.

వాయుమార్గం ద్వారా

హాఫ్లాంగ్ కు కుమ్భిర్గ్రం వద్ద ఉన్న సిల్చార్ సమీప విమానాశ్రయం. సిల్చార్ హిల్ స్టేషన్ నుండి షుమారు 106 కిలోమీటర్ల దూరంలో రోడ్డు ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. సిల్చార్ విమానాశ్రయ నుండి కోల్కతా, దిబ్రుగర్హ, గౌహతి కి రోజువారీ విమానాలు నడుస్తాయి. ఈ విమానాలు డిల్లీ, ముంబై, బెంగళూరు కి కూడా కలుపబడి ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X