Search
  • Follow NativePlanet
Share
» »కుద్రేముఖ్ ను పర్యాటకులు ఎందుకు ఇష్టపడతారు ??

కుద్రేముఖ్ ను పర్యాటకులు ఎందుకు ఇష్టపడతారు ??

కుద్రేముఖ్ లో తప్పక చూడవలసిన ప్రదేశాలు : కుద్రేముఖ్ శిఖరం, కుద్రేముఖ్ జాతీయ పార్కు, హనుమాన్ గుండి జలపాతం, కాదాంబి జలపాతాలు మరియు మొదలగునవి.

By Mohammad

కుద్రేముఖ్, కుద్రేముఖ్ పర్వతశ్రేణులు కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లాలో ఉన్నాయి. ఈ పర్వతాలను ఒక ప్రక్క నుండి చూస్తే అత్యంత ప్రకృతి రమణీయంగా గుఱ్ఱపు ముఖం ఆకారంగా కనిపించే కారణం చేత ఈ పర్వతాలకు కుద్రేముఖ్ అని పేరు వచ్చింది. కన్నడ భాషలో కుద్రే అనగా గుర్రం, ముఖ్ అనగా ముఖం. కార్కళకు 48 కి.మీ.లు, కలసకు 20 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పర్వత శ్రేణుల మీద ఒక చిన్న పట్టణం కూడా ఉంది.

ఇది కూడా చదవండి : అన్ని కాలాలకు కర్ణాటక పర్యాటక ప్రదేశాలు !!

దట్టమైన అడవుల మధ్య, వైవిధ్య వృక్ష-వన్యమృగ సంపద ఉన్న ఈ పర్వతశ్రేణులను చేరే రహదారి ప్రకృతి రమణీయంగా ఉంటుంది. తుంగ, భద్ర, నేత్రావతి నదుల జన్మస్థానం ఈ పర్వతశ్రేణుల మధ్య ఉన్నదని చెబుతారు. 1.8 మీటర్ల ఎత్తు ఉన్న భాగవతి మరియు వరాహ విగ్రహాలు ఉన్న గుహ పర్యాటకులకు ఒక ప్రత్యేక ఆకర్షణ. తుంగ, భద్ర నదులు ఇక్కడ పారుతుంటాయి. కుద్రేముఖ్‌ను సందర్శించడానికి వచ్చిన పర్యాటకులు కదంబి జలపాతం చూసి తీరవలసిందే. ఇక్కడ కనిపించే వన్యమృగాలలో ముఖ్యమైనవి మలబార్ సివెట్, వేట కుక్కలు, స్లాత్ ఎలుగు బంటి, మచ్చలతో ఉన్న జింక.

సతత హరిత అరణ్యాలలో

సతత హరిత అరణ్యాలలో

600 కి.మీ విస్తీర్ణంలో ఉన్న కుద్రేముఖ్, పశ్చిమ కనుమలలో ఉన్న సతత హరిత అరణ్యాలలో అతిపెద్ద సంరక్షిత స్థలం. జంతు వైవిధ్యం ఉండి ప్రపంచం మొత్తం మీద సంరక్షిత స్థలాలుగా ఎన్నుకొనబడిన 25 ప్రదేశాలలో పశ్చిమ కనుమలలోని కుద్రేముఖ్ ఒకటి.

చిత్రకృప : Karunakar Rayker

వన్యప్రాణి సంరక్షణా సంస్థ

వన్యప్రాణి సంరక్షణా సంస్థ

వన్యప్రాణి సంరక్షణా సంస్థ (వన్యప్రాణి కన్సర్వేషన్ సొసైటీ) మరియు వర్డ్ వైడ్ ఫండ్ చేత అవిష్కరించబడుతున్న ఈ కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనం గ్లోబల్ టైగర్ కన్సర్వేషన్ ప్రయారిటీ - I క్రిందకు వస్తుంది.

చిత్రకృప : Nabeelhut

సోమేశ్వర వన్యమృగ సంరక్షణ స్థలం

సోమేశ్వర వన్యమృగ సంరక్షణ స్థలం

కుద్రేముఖ్ ఉద్యానవనం పశ్చిమాన సోమేశ్వర వన్యమృగ సంరక్షణా స్థలానికి ఆనుకొని ఉన్నది, దక్షిణం వైపు సన్నటి రోడ్డుతో పుష్పగిరి వన్యసంరక్షణ స్థలానికి అనుసంధించబడి ఉంది. ఈ ఉద్యానవనం దక్షిణ-పశ్చిమ వైపులలో నిటారుగానున్న లోయప్రాంతాలు గలిగివున్నది.

చిత్రకృప : karnatakatouristguide

పచ్చికబయళ్ళతో

పచ్చికబయళ్ళతో

శిఖరపు ఎత్తులు 100 మీటర్లనుండి 1892 మీటర్ల వరకు ఉన్నాయి. వీటి ఉత్తర, మధ్య మరియు తూర్పు భాగాలు, కొండల గొలుసులవలె యేర్పడివున్నవి. వీటి పచ్చికబయళ్ళతో ఈ ప్రాంతం పచ్చని తివాచీ వలె కానవస్తుంది. ఈ ప్రాంతపు సరాసరి వర్షపాతం 7000 మి.మీ. అందుకే ఈ ప్రాంతం సతత హరిత అడవులు గల ప్రాంతం.

చిత్రకృప : solarisgirl

హనుమాన్ గుండి జలపాతం

హనుమాన్ గుండి జలపాతం

ఈ జలపాతం కలసకు 32 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ జలపాతం నుండి పడుతున్న నీటి వల్ల 100 అడుగుల ఎత్తుగల సహజ సిద్ధమైన శిలలు ఏర్పడ్డాయి. కొండలు అధిరోహించే ఆసక్తి ఉన్నవారికి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. అక్టోబరు-మే నెలల ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి అనువైన నెలలు.

చిత్రకృప : Arun Keerthi K. Barboza

కుద్రేముఖ్ పీక్

కుద్రేముఖ్ పీక్

కుద్రేముఖ్ సందర్శించే పర్యాటకులు కుద్రేముఖ్ శిఖరాన్ని కూడా తప్పక చూసి ఆనందించాలి. ఇది సముద్ర మట్టానికి 1894 అడుగుల ఎత్తున ఉంది. ట్రెక్కింగ్ లేదా అటవీ పరిశోధన చేయాలనుకునేవారికి కుద్రేముఖ్ శిఖరం ఎంతో అనువుగా ఉంటుంది. కుద్రేముఖ్ శిఖరం నుండి అందమైన అరేబియా సముద్రం చూసేందుకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. పర్యాటకులు సింహాలను కొండ ముచ్చులను చూసి ఆనందించవచ్చు.

చిత్రకృప : Jesjose

వసతి

వసతి

కుద్రేముఖ్ శిఖరాన్ని చూడగోరే పర్యాటకులకు అన్నిరకాల వసతులు, ట్రెక్కింగ్ కు అవసరమైన పరికరాలు అందజేస్తారు. కుద్రేముఖ్ శిఖరం వద్ద తగిన బస సదుపాయాలుంటాయి కనుక యాత్రికులు తమ వసతికై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ అటవీ లాడ్జి లు, గెస్ట్ హౌస్ మొదలైనవి ఉంటాయి. ఈ ప్రదేశం చేరటానికి సమీప కలాసా టవున్ నుండి బస్సులు, ప్రయివేట్ వాహనాలు ఉంటాయి.

చిత్రకృప : b sarangi

కాదంబి జలపాతాలు

కాదంబి జలపాతాలు

కుద్రేముఖ్ సందర్శకులు కాదంబి ఫాల్స్ కూడా చూడవచ్చు. ఇవి చిక్కమగళూరులోని కుద్రేముఖ్ నేషనల్ పార్క్ సమీపంలో ఉన్నాయి. పర్యాటకులకు ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది.

చిత్రకృప : solarisgirl

కుద్రేముఖ్ నేషనల్ పార్క్

కుద్రేముఖ్ నేషనల్ పార్క్

కుద్రేముఖ్ లో ప్రధాన ఆకర్షణ అంటే కుద్రేముఖ్ నేషనల్ పార్క్ మాత్రమే. ఈ పార్క్ ను 1987 లో నేషనల్ పార్క్ గా ప్రకటించారు. సుమారు 600 చ. మీ. ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. చిరుతలు, సింహాలు, కోతులు, అటవి పందులుఅడవి కుక్కలు వంటి జంతువులకు ఈ పార్క్ నిలయంగా ఉంది.

చిత్రకృప : solarisgirl

 పార్క్ మొత్తం చూడాలంటే

పార్క్ మొత్తం చూడాలంటే

పార్క్ మొత్తం చూడాలంటే, పర్యాటకులకు ఉన్నత అధికార్ల ముందస్తు అనుమతులు కావాలి. కుద్రేముఖ్ నేషనల్ పార్క్ వద్ద బస చేయాలంటే, అటవీ శాఖ రెస్ట్ హౌస్ కలదు. ఈ పార్క్ సందర్శనకు పర్యాటకులు స్ధానిక బస్ లు లేదా ఆటో లేదా రిక్షాలను ఉపయోగించవచ్చు.

చిత్రకృప : Nabeelhut

కుద్రేముఖ్ ఎలా చేరుకోవాలి ?

కుద్రేముఖ్ ఎలా చేరుకోవాలి ?

బస్ ప్రయాణం
కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ కుద్రేముఖ్ కు అనేక వోల్వో, ఎయిర్ కండిషన్ బస్సులను కూడా నడుపుతోంది. కార్కాల నుండి 50 కి.మీ. మంగుళూరు నుండి 130 కి.మీ. బెంగుళూరు నుండి 350 కి.మీ. దూరంలో బస్ సౌకర్యం లభిస్తుంది.

రైలు స్టేషన్
కుద్రేముఖ్ లో రైలు స్టేషన్ లేదు. మంగుళూరు రైలు స్టేషన్ కుద్రేముఖ్ కు సమీప రైలు స్టేషన్. ఇది 110 కి.మీ. దూరం ఉంది.

విమాన ప్రయాణం
మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కుద్రేముఖ్ పర్యటనా స్ధలానికి దేశీయ మరియు అంతర్జాతీయ విమానాశ్రయంగా వ్యవహరిస్తుంది. ఇది కుద్రేముఖ్ కు సుమారు 130 కి.మీ. దూరంలో ఉంది.

చిత్రకృప : Kishrk91

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X