Search
  • Follow NativePlanet
Share
» »మధుబని - రంగురంగుల పెయింటింగ్ లకు ప్రసిద్ధి !!

మధుబని - రంగురంగుల పెయింటింగ్ లకు ప్రసిద్ధి !!

మధుబని పర్యటకంలో జైనగర్, సూరత్, కపిలేశ్వరస్తాన్, భవానీపూర్, ఝ౦ఝర్పుర్, ఫుల్లహర్ ప్రధానమైనవి. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి షుమారు 56 మీటర్ల ఎత్తున ఉంది.

By Mohammad

మధుబని దాని అందమైన రంగురంగుల పెయింటింగ్ లకు ప్రసిద్ధి. క్రీ.శ.17 వ శతాబ్దం నుంచే ఇక్కడ చిత్రకళా ప్రాధాన్యతను సంతరించుకుంది. వీటిని చిత్రీకరించటానికి కూరగాయలను, లాంప్ బ్లాక్ లను మరియు కాంవాస్ మరియు పేపర్ మీద చిత్రీకరిస్తుంటారు. ప్రస్తుతం పలు మధుబని శైలి చిత్రాలను దుస్తుల మీద, హ్యాండ్ బ్యాగ్ ల మీద, చేతి రుమాలు మీద, పింగాణీ వస్తువుల మీద చిత్రిస్తున్నారు. సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ వస్తువులకు విదేశాల్లో బాగా గిరాకీ ఉంది. మధుబని అనే పాదంలో మధు అంటే తీపి అని, బని అంటే గొంతు అని అర్థం.

మధుబని లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

మధుబని పర్యటకంలో జైనగర్, సూరత్, కపిలేశ్వరస్తాన్, భవానీపూర్, ఝ౦ఝర్పుర్, ఫుల్లహర్ ప్రధానమైనవి. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి షుమారు 56 మీటర్ల ఎత్తున ఉంది. ఇక్కడ గొప్ప పురావస్తు, ధార్మిక నిధులు ఆలయాలు, విగ్రహాల రూపంలో ఉంటాయి. ఏడాది పొడవునా పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. మధుబని పురావస్తు శాస్త్రంలో ప్రారంభ మధ్యయుగ కాలం నాటి జాడలను చూడవచ్చు.

మధుబని చిత్రకళ

మధుబని చిత్రకళ

చిత్రకృప : Soumyadeep Paul

మధుబని పర్యటనలో

మంత్రముగ్ధుల్ని చేసే మధుబని పర్యాటకం, దాని పరిభాష మనోజ్ఞతను చూసిన ప్రతి ప్రయాణికుడు ఆ ప్రాంత సౌందర్యాన్ని, వారసత్వాన్ని తిరస్కరించలేడు. అద్భుతమైన పర్యాటక ప్రదేశాన్ని అందించే మధువని పర్యటన ఒక్కసారైనా చేయవలసిందే.

భగవతి కి అంకితం చేసిన ఆలయం, ఉగార్నాధ ఆలయం పర్యాటకులు 'సందర్శించాలి' అనే జాబితాలో మొదటి స్థానంలో ఉండాలి. ఈ రోజుకూ ఇవి మధుబని పర్యాటక అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షనలలో ఉన్నాయి.

ఝ౦ఝర్పుర్

ఝాంఝార్పుర్ హిమాలయాల పదాల వద్ద ఉన్న ప్రదేశం, అది దాని స్థలాకృతి, వృక్షాల కారణంగా అందంగా ఉంది. ఝ౦ఝర్పుర్ ఇంద్ర పూజ, దుర్గ పూజ లను అసమానమైన ఉత్సాహంతో నిర్వహిస్తుంది. ఎంతో భక్తితో ఇంద్రుడిని పూజించే ఇందిరా పూజ పండుగను పడి రోజులు జరుపుకుంటారు.

మధుబని లో పురాతన దేవాలయం

మధుబని లో పురాతన దేవాలయం

చిత్రకృప : Dharmbirjha

భవానీపూర్

దుర్గామాత పేరునుండి భవానీపూర్ అనే పేరు వచ్చింది, యాత్రికులలో, పర్యాటకుల కోసం ఎంతో ప్రకాశవంతంగా ఈ అందమైన ఆలయాలు బాగా ప్రసిద్ది చెందాయి.

జైనగర్

జైనగర్, మధువని జిల్లలో ఒక నగరం. ఇది మధువని పర్యటనలో అంతర్భాగంగా ఉంది. ఇది రైలుమార్గం ద్వారా అనుసంధానించబడి, నేపాల్ నుండి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. జైనగర్ సందర్సన ద్వారా పాత, కొత్త కలయికలను, ఇక్కడి ఆలయాలను చూడవచ్చు.

మధుబని లో చారిత్మక కట్టడం

మధుబని లో చారిత్మక కట్టడం

సూరత్

సూరత్ ఒక అందమైన గ్రామ౦. సూరత్ సభ గచ్చి మధువని, సూరత్ లో జరిగే అత్యంత ప్రధాన సంఘటన. ఇక్కడ మైతిల్ బ్రాహ్మలు జాతకాల ప్రకారం అబ్బాయిల, అమ్మాయిల పెళ్ళిళ్ళు ఖాయపరచడానికి పెద్ద సంఖ్యలో పోగవుతారు.

కపిలేశ్వరస్తాన్

కపిలేశ్వరస్థాన్ అనేక ఆలయాలు, విగ్రహాలు కలిగిన ఒక ప్రసిద్ధ యాత్రాస్థలం. ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.

ఇది కూడా చదవండి : మౌర్యులు కొండలను తొలిచి నిర్మించిన బరాబర్ గుహలు !

మధుబని చిత్రకళ

ఈ చిత్రకళ పాచూర్యంలో ఉన్న ఒక హిందూ చిత్ర శైలి. ఇందులో చిత్రపటాలను చేతివేళ్ళు, కుంచెలు, కలాలు, అగ్గిపుల్లలు మొదలైన వాటిని ఉపయోగించి, ప్రకృతి సిద్ధమైన వర్ణకాలను ఉపయోగించి కళ్ళకు కట్టుకొనే జియోమెట్రికల్ గా కనిపించేవాటిని తయారు చేస్తారు. ఇవి అన్ని పండుగలకు మరియు జీవిత విశేషాలకు సంబంధించినవిగా ఉంటాయి. ఇక్కడ నిర్వహించే ప్రసిద్ధ పండుగలలో చ్చాత్ ఒకటి.

దుకాణాలలో అమ్మటానికి సిద్ధంగా ఉన్న మధుబని పెయింటింగ్ ఫ్రేమ్స్

దుకాణాలలో అమ్మటానికి సిద్ధంగా ఉన్న మధుబని పెయింటింగ్ ఫ్రేమ్స్

చిత్రకృప : Deepanjali Kakati

మధుబని ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం : మధుబని లో ఎటువంటి ఎయిర్ పోర్ట్ లేదు. దీనికి సమీపాన పాట్నా ఎయిర్ పోర్ట్ కలదు. పాట్నా ఎయిర్ పోర్ట్ - 128 కి. మీ., గయా విమానాశ్రయం - 208 కి.మీ.

రైలు మార్గం : మధుబని లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి గువహతి, పాట్నా, కలకత్తా నుండి రెగ్యులర్ గా రైళ్ళు వస్తుంటాయి. మధుబని సమీపంలో ఉన్న ఇతర రైల్వే స్టేషన్లు : రాజనగర్, లలిత్ లక్ష్మిపూర్.

రోడ్డు మార్గం : రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి, పాట్నా నుండి మధుబని కి ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X