Search
  • Follow NativePlanet
Share
» »అరుణాచల్ ప్రదేశ్ : అనుభవించే ప్రదేశాలు కోకొల్లలు !

అరుణాచల్ ప్రదేశ్ : అనుభవించే ప్రదేశాలు కోకొల్లలు !

By Mohammad

వికసించే పూతోటలు, మంచుచే కప్పబడిన పర్వత శిఖరాలు, లోయలు, అడవులు, ఆకుపచ్చని ఆకులు, ఇరుకైన పాయల్లో ప్రవహించే నీరు, పై నుంచి అమాంతంగా కిందకు జాలువారే జలపాతాలు, బౌద్ధ సన్యాసులు మరియు వారి మఠాలు అతిథి సత్కారాలు ; వీటన్నింటినీ అనుభవించాలంటే అరుణాచల్ ప్రదేశ్ తప్పక సందర్శించాలి.

ఇది కూడా చదవండి : హజో ... హయగ్రీవ మహాదేవ ఆలయం !

భారతదేశానికి తూర్పు దిక్కున ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ను 'ఉదయిస్తున్న సూర్యుని భూమి' అంటారు. ఈ రాష్ట్ర పర్యాటకం మీకు వివిధ సంస్కృతి, ప్రజలు, ప్రకృతి, భాషల కలగూరగంపను దర్శింప జేస్తుంది. ఒక్కో పర్యాటక ప్రదేశం మిమ్మలి ఒక్కో అనుభూతిలోకి తీసుకెళ్తుంది.

రవాణా సౌకర్యాలు

రవాణా సౌకర్యాలు

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రదేశానికైనా చేరుకోవాలంటే ముందు ఈశాన్య ముఖద్వారం "గౌహతి" చేరుకోవాలి. ఇక్కడ అన్ని వసతులతో కూడిన వినామాశ్రయం, ప్రధాన రైల్వే స్టేషన్ మరియు బస్సు సౌకర్యాలు ఉన్నాయి. వెళ్ళటానికి, రావటానికి ఇదే అనుకూలంగా ఉంటుంది.

చిత్ర కృప : দিব্য দত্ত

ఇటానగర్

ఇటానగర్

ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం

గౌహతి(389 KM) నుండి నహర్లగు కు హెలికాఫ్టర్ సర్వీసులు రెగ్యులర్ గా అందుబాటులో ఉంటాయి. అక్కడి నుండి 10 కి. మీ ల దూరంలో ఉన్న ఇటానగర్ సులభంగా చేరుకోవచ్చు

సమీప రైల్వే స్టేషన్

అస్సాం లోని హర్ముతి రైల్వే స్టేషన్ ( 32 కి. మీ)

బస్సు / రోడ్డు మార్గం

నహర్లగున్, గౌహతి, బందేరదేవ, తేజ్పూర్, లిఖిమ్పూర్ ల నుండి ఇటానగర్ కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి.

చిత్ర కృప : Rudrajit Mukhopadhyay

ఇటానగర్

ఇటానగర్

ఇటానగర్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని. దీనిని మినీ భారతం అని కూడా పిలుస్తారు. ఫోర్ట్, మ్యూజియములు, పార్క్, అభయారణ్యం, సరస్సు లతో పాటు పురావస్తు మరియు చారిత్రక ప్రదేశాలు చూడదగ్గవి.

ఇది కూడా చదవండి : ఇటానగర్ - పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : FlickreviewR

బొమ్డిలా

బొమ్డిలా

రవాణా వ్యవస్థ

సమీప విమానాశ్రయం - తేజ్పూర్ విమానాశ్రయం (153 కి.మీ)

సమీప రైల్వే స్టేషన్ - తేజ్పూర్ సమీప రైల్వే స్టేషన్

బస్సు/ రోడ్డు మార్గం

తేజ్పూర్, ఇటానగర్ నుండి తరచూ బస్సులు, ప్రవేట్ వాహనాలు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : manoj.raphael.T

బొమ్డిలా

బొమ్డిలా

బొమ్డిలా సముద్రమట్టానికి 8000 అడుగుల ఎత్తున ఉంటుంది. యాపిల్ తోటలు, బౌద్ద ఆరామాలు, హిమాలయ శ్రేణులు యాత్రికులను అలరిస్తాయి. సాహస ప్రియులకు పర్వతారోహణ శిక్షణ ఇచ్చే కేంద్రం కూడా కలదు. భాలుక్పొంగ్ , ఈగల్ నెస్ట్ వన్యప్రాణుల అభయారణ్యం, ఏనుగుల రిజర్వ్ ఫారెస్ట్, సేస్సా పూతోటల అభయారణ్యం, బొమ్డిలా గోమ్పాలు ఇక్కడ చూడదగ్గవి.

చిత్ర కృప : Karl Heinz Grass

తేజు

తేజు

రవాణా సౌకర్యాలు

సమీప విమానాశ్రయం : తేజు ఎయిర్ పోర్ట్, డిబ్రుఘర్ ఎయిర్ పోర్ట్ ( 154 కి. మీ )

సమీప రైల్వే స్టేషన్ : తిన్సుకియా సమీప రైల్వే స్టేషన్

రోడ్డు / బస్సు మార్గం : ఇటానగర్ తో పాటు చుట్టుపక్కల పట్టణాల నుండి తేజు కి బస్సులు నడుస్తాయి.

చిత్ర కృప : Karma Jigme

తేజు

తేజు

తేజు అందమైన లోయలకు, నదులకు పేరుగాంచింది. ఇక్కడి ప్రధాన ఆకర్షణలు పరుశురామ్ కుండ్, డాంగ్, గ్లో సరస్సు , హవా కాంప్, వేడి నీటి బుగ్గలు చూడదగ్గవి. ఇక్కడ ఏటా ఫిబ్రవరి మాసమలో మిష్మి పండగ జరుపుకుంటారు.

చిత్ర కృప : Prashanthns

అలాంగ్

అలాంగ్

రవాణా సౌకర్యాలు

సమీప విమానాశ్రయం : అలాంగ్ ఎయిర్ పోర్ట్

సమీప రైల్వే స్టేషన్ : సిలపతార్ రైల్వే స్టేషన్ (63 కి.మీ)

రోడ్డు/ బస్సు మార్గం : అలాంగ్ గుండా జాతీయ రహదారి 52 వెళుతుంది. ఇటానగర్ మరియు సమీప పట్టణాల నుండి ఇక్కడికి బస్సులు నడుస్తాయి.

చిత్ర కృప : Go Travel East

అలాంగ్

అలాంగ్

అలాంగ్ సముద్ర మట్టానికి 619 మీటర్ల ఎత్తులో, పర్వతాల మధ్యలో ఉన్నది. ఇక్కడి సహజ సిద్ద మైన ప్రకృతి సౌందర్యం, లోయలు, ట్రెక్కింగ్, రివర్ రాప్టింగ్, హైకింగ్ వంటివి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఆకాశంగంగ, దోనయి పోలో ఆలయం , హాంగింగ్ బ్రిడ్జ్ లు, మలినిథాన్ లు అలాంగ్ లో చూడదగ్గవి.

చిత్ర కృప : Catherine Marciniak

రోయింగ్

రోయింగ్

రవాణా వ్యవస్థ

సమీప విమానాశ్రయం : హెలికాప్టర్ లు దంబక్, అనిని, పసిఘాట్ నుండి రోయింగ్ కు నడుపుతారు. కనీస రేట్లతో వీటిని ఎక్కి రోయింగ్ చేరవచ్చు.

సమీప రైల్వే స్టేషన్ : తిన్సుకియా రైల్వే స్టేషన్ (113 కి. మీ)

రోడ్డు/ బస్సు మార్గం : అస్సాం లోని ధోల, సదియాల మీదుగా తిన్సుకియ నుండి రోడ్డు మార్గాన సందర్శకులు రోయింగ్ చేరవచ్చు.

చిత్ర కృప : Jonesy38

రోయింగ్

రోయింగ్

పచ్చని లోయలతో కూడిన కొండ భూమి రోయింగ్. మచుతో కప్పబడిన శిఖరాలు , కల్లోల నదులు, లోయలు, వృక్ష - జంతు సంపద ఇక్కడి కొన్ని ఆకర్షణలు. మేహవో సరస్సు, సాలీ సరస్సు, భీష్మక్ నగరం, హున్లి, ఇఫిపని, రుక్మిణి నతి, వన్య ప్రాణుల అభయారణ్యం , నిజోమ ఘాట్ లు చూడదగ్గవి.

చిత్ర కృప : Uday Swargiary

మియావో

మియావో

రవాణా వ్యవస్థ

సమీప విమానాశ్రయం : దిబ్రుఘర్ విమానాశ్రయం

సమీప రైల్వే స్టేషన్ : తీన్సుకియా రైల్వే స్టేషన్

రోడ్డు / బస్సు మార్గం : బస్సు ద్వారా దిబ్రూఘర్ నుంచి తీన్ సుకియా, మార్ఘేరిటా, లేడో, జగున్, ఖార్సాంగ్ ల మీదుగా మియావోకు నిత్యం అస్సాం ప్రభుత్వ బస్సులు, అరుణాచల్ ప్రదేశ్ బస్సులు తిరుగుతాయి.

చిత్ర కృప : Koustabh Bora

మియావో

మియావో

ఎత్తైన అడవులు, చల్లటి వాతావరణం మియావో సొంతం. హిమాలయాలకు తూర్పువైపు విస్తరణగా ఉండే పాటకాయి బుం అనే పర్వతశ్రేణులు ఈ నగరం చుట్టూ ఉంటాయి. ప్రశాంతంగా ఉండే ఈ పట్టణంలో, బోర్డుమ్సా, నామ్సై, నామ్పొంగ్, జైరంపూర్ లాంటివి చూడదగ్గ ప్రధానమైన ప్రదేశాలు.

చిత్ర కృప : Abhishek Reji

పసిఘాట్

పసిఘాట్

రవాణా సౌకర్యాలు

సమీప విమానాశ్రయం : లీలబరి విమానాశ్రయం

సమీప రైల్వే స్టేషన్ : సెలెక్ ముర్కొంగ్ రైల్వే స్టేషన్

బస్సు/ రోడ్డు మార్గం : సమీప నగరాల నుండి, గౌహతి నుండి రాత్రి పూట పసి ఘాట్ కు బస్సులు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : Frans Devriese

పసిఘాట్

పసిఘాట్

పసిఘాట్ అరుణాచల్ ప్రదేశ్ వేలల్తానికి ప్రవేశ ద్వారం. ఇది రాష్ట్రంలోనే పురాతన పట్టణం. ఇక్కడ దాయింగ్ ఎరింగ్ వన్య ప్రాణల అభయారణ్యం, పంగిన్, జలపాతాలు , వ్రేలాడుతున్న వంతెనలు, కేకర్ మొన్యింగ్, కొమ్సింగ్ లు ఆకర్షణలుగా ఉన్నాయి.

చిత్ర కృప : Kunal Dalui

జిరో

జిరో

రవాణా వ్యవస్థ

సమీప ఎయిర్ పోర్ట్ : లిలబరి విమానాశ్రయం

సమీప రైల్వే స్టేషన్ : గౌహతి రైల్వే స్టేషన్

బస్సు / రోడ్డు మార్గం : గౌహతి, ఇటానగర్ ల నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు లభిస్తాయి.

చిత్ర కృప : Krish9

జిరో

జిరో

జిరో సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తులో, అందమైన పైన్ వృక్షాల సమూహం మధ్య ఉన్న చిన్న అందమైన పర్వత ప్రాంత వేసవి విడిది. ఇక్కడ ఆపతాని తెగ వారు ప్రకృతిని దేవతగా ఆరాధిస్తారు. తాలీ లోయ, జిరో పుటూ చిన్న కొండ, తారిన్ చేప ఫామ్, కర్దో ఫారెస్ట్ వద్ద ఉన్న శివలింగం చూడదగినవి.

చిత్ర కృప : Krish9

తవాంగ్

తవాంగ్

రవాణా సౌకర్యాలు

సమీప విమానాశ్రయం : తేజ్పూర్ విమానాశ్రయం

సమీప రైల్వే స్టేషన్ : రంగ పార రైల్వే స్టేషన్ (160 కి. మీ)

బస్సు / రోడ్డు మార్గం : గౌహతి, తేజ్పూర్ నుండి తవాంగ్ కు బస్సులు అందుబాటులో ఉన్నాయి.

చిత్ర కృప : Dhrubazaanphotography

తవాంగ్

తవాంగ్

'తవాంగ్' భారతదేశ భౌగోళిక పటంలో సుస్థిర స్థానం కలిగి ఉన్నది. ఇండియా లో మొట్టమొదట సూర్యుడు ఇక్కడే ఉదయిస్తాడు. ఆరామాలు, జలపాతాలు, శిఖరాలు సందర్శకులకు మంత్రముగ్ధులను చేసి ఆనందపరుస్తాయి. తవాంగ్ మానేస్త్రీ, సెలా పాస్, బాలీవుడ్ చిత్రాలకు సరైన ప్రదేశాలుగా ఉన్న అనేక ఇతర జలపాతాలు వంటివి కొన్ని తవాంగ్ లోని ప్రధాన ఆకర్షణలు.

ఇది కూడా చదవండి : తవాంగ్ - పర్యాటక స్థలాలు !

చిత్ర కృప : Saurabhgupta8

నమ్దఫా నేషనల్ పార్క్

నమ్దఫా నేషనల్ పార్క్

రవాణా సౌకర్యాలు

సమీప విమానాశ్రయం : మోహన్బరి లేదా దిబ్రుఘర్ విమానాశ్రయం (182 కి. మీ)

సమీప రైల్వే స్టేషన్ : తిన్సుకియా రైల్వే స్టేషన్ (141 కి.మీ)

బస్సు / రోడ్డు మర్గం : తేజ్పూర్, దిబ్రుఘర్, గౌహతి నుండి రాత్రి పూట బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Rohit Naniwadekar

నమ్దఫా నేషనల్ పార్క్

నమ్దఫా నేషనల్ పార్క్

దట్టమైన సతితహరితారణ్యాల నడుమ నమ్దఫా అభయారణ్యం కొండెక్కి కూర్చుంది. వన్య ప్రాణి ఔత్సాహికులు ఉత్తేజమైన క్రీడలను ఆస్వాదించవచ్చు. ఏనుగు, దున్న, చిరుత, సాంబార్, హిమాలయా ఎలుగుబంట్లు, పులి ఇలా ఎన్ని ఉన్నప్పటికీ సీతాకోకచిలుకలు ఈ అభయారణ్య అందాలను రెట్టింపు చేస్తాయి. సాహస ప్రియులు ఇక్కడి పాములతో జాగ్రత్తా ... !

చిత్ర కృప : Umeshsrinivasan

పక్కే టైగర్ రిజర్వ్

పక్కే టైగర్ రిజర్వ్

రవాణా సౌకర్యాలు

సమీప విమానాశ్రయం : తేజ్పూర్ విమానాశ్రయం

సమీప రైల్వే స్టేషన్ : రంగపర రైల్వే స్టేషన్

బస్సు / రోడ్డు మర్గం : తేజ్పూర్, సమీప నగరాల నుండి రోజువారీ బస్సులు అందుబాటులో ఉంటాయి.

చిత్ర కృప : goldentakin

పక్కే టైగర్ రిజర్వ్

పక్కే టైగర్ రిజర్వ్

తూర్పు కమెంగ్ జిల్లాలో ఉన్న పక్కే టైగర్ రిజర్వ్ 862 చ. కి. మి. మేర విస్తరించి ఉన్నది. ఇక్కడ పులులతో పాటు నక్కలు, చిరుత, దున్నలు, ఉడుతలు, ఏనుగు, సాంబార్ వంటి వన్య ప్రాణులు సంరక్షించబడుతున్నాయి. విభిన్న రకాల సరీసృపాలు, పక్షులు ఈ రిజర్వ్ లో కనిపిస్తాయి.

చిత్ర కృప : TourTravelCompanies Companies

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X