Search
  • Follow NativePlanet
Share
» »తోరన్మల్ - ఆనందం కలిగించే కొండ ప్రాంతం !!

తోరన్మల్ - ఆనందం కలిగించే కొండ ప్రాంతం !!

చుట్టూ కొండలతో, పచ్చని మైదానాలతో కింకారణ్యాన్ని తలపించే తోరన్మల్, మహారాష్ట్ర లో రెండవ అతి శీతల కొండ ప్రాంతంగా పేరుగాంచినది. ముగ్ధమనోహర దృశ్యాలు, సరస్సులు ఇక్కడ కలవు.

By Mohammad

మహారాష్ట్ర లోని నందూర్బార్ జిల్లాలో వున్న చిన్న కొండ ప్రాంతం తోరన్మల్. సాత్పురా పర్వత శ్రేణుల్లో వున్న ఈ యాత్రా స్థలం సముద్ర మట్టానికి 1150 మీటర్ల ఎత్తున వుంది. కేవలం 44 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన తోరన్మల్ ప్రధానంగా ఒక మైదాన ప్రాంతం.

ఇక్కడి చాలా ఆకర్షణల్లో యశ్వంత్ చెరువు యాత్రికులని సూదంటురాయిలా ఆకర్షిస్తుంది. ఇక్కడ గోరఖ్ నాథ్, నాగార్జున దేవాలయాల్లాంటి చాలా గుళ్ళు వున్నాయి. సితాఖాయి మీరు తప్పక చూడాల్సిన లోయ ప్రాంతం కాగా, ఖడ్కీ పాయింట్, సన్ సెట్ పాయింట్ల నుంచి పరిసర ప్రాంతాల మనోహర దృశ్యాలు చూడవచ్చు.

తోరన్మల్ ఎందుకు చూడాలి?

ఒక కొండపైన ఉండడంతో తోరన్మల్ లో ఏడాది పొడవునా చక్కటి వాతావరణం వుంటుంది. అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు అనుసంధానం చేసి వుండడం వలన ఇక్కడికి అనుకున్నదే తడవుగా వెళ్లిపోవచ్చు.

చుట్టూ కొండలతో పచ్చని కీకారణ్యం లా వుండే తోరన్మల్ మహారాష్ట్రలో రెండో అతి శీతల కొండ ప్రాంతంగా పేరుపొందింది. ఇక్కడ అందమైన సరస్సులు, మనోహరమైన దృశ్యాలు వుంటాయి, పర్వతారోహకులకు ఆనందం కలిగించే పర్వత మార్గాలు సరే సరి. నగరం హడావిడికి దూరంగా ప్రశాంతత ను అనుభవించడానికి ఈ చిన్ని కొండ ప్రాంతాన్ని తప్పక సందర్శించండి.

ఆవాశబరి పాయింగ్

ఆవాశబరి పాయింగ్

చుట్టుపక్కల పర్వతాలను, అటవీ విశ్రాంతి మందిరాన్ని చక్కగా చూపించేదే అవాశబరి పాయింట్. ఇది మధ్యప్రదేశ్ సరిహద్దుకి దగ్గరగా వుంది.దగ్గరలోని జలీంద్రనాథ్ దేవాలయం ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ. సమీపంలోని గోండ్ రాజా కోట చరిత్ర ప్రేమికులు చూసి తీరాల్సిన ప్రదేశం.

చిత్రకృప : cool_spark

లోటస్ సరస్సు

లోటస్ సరస్సు

లోటస్ సరస్సు తోరన్మల్ లో ప్రధాన ఆకర్షణ. లోటస్ లేక్ అనే ఆంగ్ల అర్ధం వచ్చేలా స్థానికంగా దీన్ని కమల్ తలావ్ అని పిలుస్తారు - ఈ చెరువులో వుండే అసంఖ్యాక కలువ పూవులు దీని అందాన్ని ఇనుమడింప చేస్తాయి.ఈ చెరువు జలపాతంగా మొదలై, క్రిందికి జాలువారి సీతా ఖాయి లోయలో కలుస్తుంది.

చిత్రకృప : cool_spark

మచ్చీంద్రనాద్ గుహ

మచ్చీంద్రనాద్ గుహ

ఈ ప్రదేశంలోనే ధ్యానం చేసిన మచ్చీంద్రనాద్ అనే ముని పేరు ఈ గుహకు పెట్టారని నమ్ముతారు. తోరన్మల్ కొండ ప్రాంతం లో వున్న ఈ గుహ సహజసిద్ధంగా ఏర్పడింది. మచ్చీంద్ర నాథ్ గుడి, మార్కండేయ ఋషి కూర్చున్న ప్రదేశం ఇక్కడ చూడాల్సిన ఇతర ప్రదేశాలు.

చిత్రకృప : Jitendra Kumar‎

యశ్వంత్ సరస్సు

యశ్వంత్ సరస్సు

యశ్వంత్ సరస్సు 1.6 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన సహజ జలాశయం.ఈ ప్రాంతానికి వెళ్ళే యాత్రికులు బోటింగ్ లేదా ఫిషింగ్ లో పాల్గొనవచ్చు. ఇక్కడికి దగ్గరలోనే ఉన్న ప్రొటెస్ట౦ట్ చర్చి ఈ దృశ్యాన్ని మరింత రమణీయంగా మారుస్తుంది.

చిత్రకృప : AbhiRiksh

అటవీ ఉద్యానవనం & ఔషధ మొక్కల తోట

అటవీ ఉద్యానవనం & ఔషధ మొక్కల తోట

తోరన్మల్ కొండ ప్రాంతంలో వున్న అటవీ ఉద్యానవనం, వనమూలిక ఔషధాల తోటగా పిలవబడే ఔషధ మొక్కల తోట వివిధ ఔషధ మొక్కలు, పొదలు వుండే ప్రదేశం. ఈ ప్రదేశాన్ని సందర్శించే యాత్రికులు వివిధ మొక్కలను, వివిధ రోగాల చికిత్సలో ప్రతి మొక్కకు వున్న ఔషధ విలువను గమనించవచ్చు.

చిత్రకృప : AbhiRiksh

తోర్నా దేవి గుడి

తోర్నా దేవి గుడి

తోర్నాదేవి గుడి ఆరు వందల ఏళ్ళ కన్నా పురాతనమైనది. ఇక్కడి దేవత తోర్నా దేవి. ఈ దేవత విగ్రహం నల్ల రాతితో చేయబడింది. తోరన్మల్ కొండ ప్రాంతంలో ఈ గుడి వుంది.

చిత్రకృప : cool_spark

ఖడ్కీ పాయింట్

ఖడ్కీ పాయింట్

ఆవాశబరి పాయింట్ లాగానే ఖడ్కీ పాయింట్ కూడా తోరన్మల్ కొండ ప్రాంతంలో ప్రసిద్ధ ప్రదేశం. శతాబ్దాల క్రితం ఈ కొండ ప్రాంతం పొడవునా ఒక పెద్దగోడ ఉండేదని నమ్ముతారు - దీని అవశేషాలు తవ్వకాల్లో బయల్పడ్డాయి కూడా.

చిత్రకృప : cool_spark

సీతా ఖాయి

సీతా ఖాయి

సీతా దేవి పేరిట ఏర్పడ్డ సీతా ఖాయి తోరన్మల్ కి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో వున్న అందమైన లోయ ప్రాంతం. ఇక్కడి జలపాతం వర్షాకాలంలో చాల మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడికి దగ్గరలోనే ఎకో పాయింట్ వుంది.

చిత్రకృప : cool_spark

తోరన్మల్ ఎలా చేరుకోవాలి ?

తోరన్మల్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : ఔరంగాబాద్ సమీప విమానాశ్రయం. ఇక్కడికి ముంబై, గాంధీనగర్, జైపూర్, నాగపూర్, పూణే నుండి విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి తోరన్మల్ చేరుకోవచ్చు.

రైలు మార్గం : నందూర్బార్ రైల్వే స్టేషన్ తోరన్మల్ కు సమీపాన కలదు. ముంబై, పూణే తదితర ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్ళు వస్తుంటాయి. స్టేషన్ వద్ద దిగి టాక్సీ లో తోరన్మల్ చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం : ముంబై, పూణే, హైదరాబాద్ నుండి తోరన్మల్ కు పలు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి.

చిత్రకృప : cool_spark

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X