Search
  • Follow NativePlanet
Share
» »ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన జలపాతాలు !!

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన జలపాతాలు !!

నీటిని చూస్తేనే తెలీని ఆనందం ప్రతీ అణువులోనూ ప్రసరిస్తుంది. మనిషికీ నీటికీ మధ్య ఉన్న కెమిస్ట్ర్రీ ఇది. అదే నీరు దివి నుంచి భువికి దిగివచ్చినట్లు మేఘాల మీదుగా జాలువారినట్లు... ఆకాశంలోంచి ఒక్క ఉదుటన ఉరకలు పెట్టినట్లు వయ్యారంగా నడిచొస్తే ఎలా ఉంటుంది. శరీరమంతా మధురానుభూతులు గిలిగింతలు పెట్టి కళ్లు వెయ్యి ఓల్టుల వెలుగులతో నిండిపోతాయి. కళ్లల్లోనే విద్యుద్దీపాలు మెరిసిపోతాయి. అలా వయ్యారాలు పోతూ ఉరికే నీటినే జలపాతాలు అంటారు. ప్రకృతి మనకందించిన అరుదైన అద్భుతాల్లో జలపాతాలు అత్యంత కీలకమైనవి. ఆ జలపాతాల సోయగాలను ఒక్క సారి వీక్షించి వస్తే జన్మ జన్మల అలసట కూడా మాయమైపోతుంది. మరి సిటీ లైఫ్ లో పడి నవ్వడం కూడా మర్చిపోయిన మనం ఒక్క సారి జలపాతాల్లోకి ఉరుకుదాం.పదండి.

ఏడాదిలో కనీసం ఒక్కసారైనా అలా జలపాతాల దగ్గరకెళ్లి .. నీరు చేసే అద్భుతాన్ని చూస్తే...అదో రిలీఫ్. అలాంటిలాంటి రిలీఫ్ కాదు. జలపాతాలన్నీ ప్రకృతి సిద్ధమైనవే ... కాకపోతే ఒక్కో జలపాతానిదీ ఒక్కో ప్రత్యేకత. ఒక్కో జలపాతానిదీ ఒక్కో అందం. వాటిని చూసి తరించాలే కానీ మాటలతో వర్ణించడం కష్టం. మన దేశంలోనూ జలపాతాల సవ్వడి చేసే ప్రాంతాలకు లోటు లేదు. అవన్నీ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెంది జనాల మతులు పోగొడుతున్నాయి. ఇలాంటి జలపాతాలే మన రాష్ట్రంలో కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రసిద్ధి చెందివని ఉన్నాయి మరికొన్ని అంతగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండానూ ఉన్నాయి మరికొన్ని కేవలం ఆ చుట్టూ ప్రక్కల ప్రజలను మాత్రమే అలరిస్తున్నాయి. మరి మనం తెలుగు గడ్డ మీద పుట్టి , మన చుట్టూ ప్రక్కల ఉన్న జలపాతాల అందాలను తెలుసుకొనకపోతే ఈ జీవితం వృధా !!

ఎత్తిపోతల జలపాతాలు

ఎత్తిపోతల జలపాతాలు

ఎత్తిపోతల జలపాతాలు నాగార్జునసాగర్ పట్టణానికి చాల సమీపంలో ఉన్నాయి మరియు నాగార్జునసాగర్ డాంకు 11 కి.మీ. దూరంలో ఉన్నాయి. కృష్ణ నదికి ఉపనది అయిన చంద్రవంక 70 అడుగుల ఎత్తు నుండి ఉధృతంగా ప్రవహించటం వలన ఈ జలపాతాలు ఏర్పడ్డాయి. నిజానికి, చంద్రవంక వాగు, తుమ్మల వాగు మరియు నక్కల వాగు అనే మూడు నదుల కలయికే ఈ జలపాతాలు. ఈ జలపాతాల నీరు నాగార్జునసాగర్ డాం నుండి కృష్ణ నదిని చేరుతుంది. ఈ జలపాతం నదికి 3 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ జలపాతాలు పర్యాటకులకు ఒక గొప్ప ఆకర్షణగా ఉన్నాయి మరియు సంవత్సరం అంతా చాలామంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. ఈ జలపాతాల స్థలం నిజంగా ఉత్కంఠ భరితమై ఉంటుంది. ఈ జలపాతాలు అడవి మధ్యలో ఉండి మరియు ఉధృతంగా ప్రవహిస్తూ పర్యావరణానికి అందాన్నిచేకూరుస్తున్నాయి. ఈ జలపాతాలకు దగ్గరలో ఉన్న కొండ మీద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక దృక్కోణం నిర్మించింది. రంగనాథ మరియు దత్తాత్రేయ ఆలయాలు ఈ జలపాతాలకు చాలా దగ్గరగా ఉన్నాయి.

Photo Courtesy: bot

తలకోన జలపాతం

తలకోన జలపాతం

తలకోన జలపాతం చిత్తూర్ జిల్లాలో దట్టమైన అరణ్యం మధ్యలో అదికూడా తిరుపతి పుణ్య క్షేత్రానికి సుమారుగా 58 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ ప్రాంతం నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. సాక్షాత్తూ ఆదిశేషుడే పర్వత రూపం దాల్చాడని పురాణ గాథ. కుబేరుని అప్పు తీర్చేందుకు శ్రీనివాసుడు ధనాన్ని కొలిచి అలసిపోయి నిద్రపోయాడని చెబుతారు. అలా పడుకోవడంలో తల భాగం ఇక్కడ ఉన్న కొండ(కోన)శిఖరం మీద ఆనించాడని అందుకే ఈ ప్రదేశానికి తలకోన అనే పేరు వచ్చిందని స్థలపురాణం. మన రాష్ట్రంలో ఎత్తయిన జలపాతం కూడా ఇదే మరి!!. దీన్ని శిరోద్రోణం అని కూడా పిలుస్తారు. నల్లమల పర్వతశ్రేణుల్లో ఈ జలపాతం ఉండడం విశేషం. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు... మధ్యలో జలపాతాన్ని చూసిన పర్యాటకులకు చిత్రమైన అనుభూతి కల్గుతుంది. జలపాత దృశ్యం నయనానంద కరంగా, చాలా అకర్షణీయంగా వుంటుంది. దాదాపు అరవై మీటర్ల ఎత్తునుంచి జాలువారే జలపాతం కింద నిలబడితే శరీరమంతా చిత్రమైన జలదరింపుకు లోనవుతుంది. ఇక అక్కడినుండి కదలాలని ఎవరికైనా అనిపిస్తుందా చెప్పండి! అలాగే జలపాతం కింద పడడం వల్ల ఆ ప్రాంతంలో ఓ పెద్ద గుంటలా ఏర్పడింది. అక్కడ పర్యాటకులు హాయిగా ఈత కొడుతుంటారు.

Photo Courtesy: Adityamadhav83

సంగద జలపాతం

సంగద జలపాతం

సంగద వాటర్ ఫాల్స్ అందమైన తూర్పు కనుమలలో అరకు వాలీ లో ఒక భాగం గా కలవు. ఈ జలపాతాలు సంగద అనే గ్రామానికి సమీపం గా వుండటం తో వాటికి ఆ పేరు వచ్చింది. ఈ జలపాతాలు, ఎంతో సుందరమైన ప్రదేశం లో ఆకర్షణీయంగా ఉండటంతో ఒక ప్రసిద్ధ పర్యాటక స్థలం గా పేరు పడింది. ఈ జలపాతాలు దట్టమైన అడవుల మధ్యలో వున్నాయి. జలపాతాల హోరు తప్ప ఇక్కడ ఇంక ఎ శబ్దం వుండదు. ఇది ఒక పిక్నిక్ స్పాట్ గా వుంటుంది. ప్రజలు వారి కుటుంబాలతో వచ్చి ఆనందిస్తారు. రోడ్డు మార్గం లో ఇక్కడకు తేలికగా చేరవచ్చు.

Photo Courtesy: Adityamadhav83

కటికి జలపాతం

కటికి జలపాతం

కటికి వాటర్‌ ఫాల్స్‌ కి వెళ్ళాలంటే జీపు ప్రయాణం శ్రేయస్కరం. ఏ ప్రాంతం అంతా కూడా కొండ దారే మరి!! కొండల్లో ప్రవహించే వాగు పక్కనే ప్రయాణం. దారంతా రాళ్లు, గుంటల మయంగేయా ఉంటుంది. సాహస యువకులు మోటార్ సైకిళ్లమీద రావచ్చు. తరువాత అక్కడ ఒక రైలు కట్ట కనబడుతుంది. అక్కడి నుంచి కాలి బాటనే శరణ్యం. ఏ మాత్రం స్లిప్‌ అయినా లోయలో పడిపోతాం. ఇదో పెద్ద సాహస యాత్రలా అనిపిస్తుంది మనకు. ఇక్కడ ఇరుకు దారిలో జారుతున్న కాలిబాటలో పైకెక్కడంలో ఉంది అసలు నరకం. చూట్టూ ఎప్పుడూ చూడని ప్రకృతి అందాలు, లోయలో జలపాతం... పై నుండి పడుతున్న నీటి తుంపరలు ఇవన్ని చూసి అలసటంతా మటుమాయం అయిపోతుంది. కేరింతాలతో పై నుండి పడుతున్న నీటి శబ్దంతో ఆ ప్రాంతం అంతా కూడా సందడి సందడి వాతావరణం గా ఉంటుంది. నిట్టనిలువు కొండమీద నుండి దూకుతున్న జలపాతం, దానికింద నిలబడి స్నానం చేయడం ప్రత్యేక అనుభూతి. అక్కడి వరకు చేరలేనివారు కిందున్న వాగులో అక్కడిక్కడే స్నానాలు చేయవచ్చు.

Photo Courtesy: Adityamadhav83

కుంటల జలపాతం

కుంటల జలపాతం

బోథ్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న కుంటాల జలపాతం రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరొందింది. కుంటాల పేరు వెనుక చరిత్ర చూస్తే....శకుంతలా దుష్యంతులు ఈ ప్రాంతంలో సంచరించారని, అందుకే దీనికి కుంతల జలపాతం అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. కుంతల రానురాను కుంటాలగా మారింది. జలపాతం చేరాలంటే మెట్లు దిగి వెళ్లాలి. దగ్గరికెళ్తున్న కొద్దీ పరుగులు తీస్తున్న నీళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ దృశ్యం అద్భుతంగా అనిపిస్తుంది. 45 అడుగుల ఎత్తు నుండి కిందికి పడే నీళ్లు వినసొంపైన శబ్దం చేస్తుంటాయి. జలపాతం కిందికి చేరుకొని జలకాలాటలలో..కిలకిల పాటలలో కొద్దిసేపు ఎంజాయ్ చెయ్యొచ్చు. వర్షా, శీతాకాలాల్లో ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే జలపాతం దగ్గర జాగ్రత్తగా ఉండాలి. జలకన్య అందాలను దూరం నుంచే ఆస్వాదించాలి. మరీ సమీపంలోకి వెళ్లకూడదు. హెచ్చరికలను బేఖాతరు చేస్తే ప్రాణాలకే ప్రమాదం. అందాలను తిలకించడానికి వచ్చి హెచ్చరికలు పాటించకుండా మృతి చెందిన సంఘటనలూ ఉన్నాయి. జలపాతం పక్కనే ఏడు అడుగుల గుహ ఉంది. దీని గుండా మనిషి మాత్రమే ప్రవేశించే వీలుంది.

Photo Courtesy: Ppavan1

పొచ్చెర జలపాతం

పొచ్చెర జలపాతం

బోథ్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న పొచ్చెర జలపాతం ప్రసిద్ధి చెందింది. చూడముచ్చటగా ఉన్న పొచ్చెర జలపాతం పక్కనే పార్కు ఉంది. కొండకోనల మధ్య నుండి నీళ్లు వయ్యారంగా వంపులు తిరుగుతూ, పైనుండి కిందకు పడుతున్న నీటిని చూస్తుంటే భలేగా ఉంటుంది. ఆ జలపాతాన్ని చూస్తూ తడవకుండా ఉండడం సాధ్యం కాదేమో!?

Photo Courtesy: Adityamadhav83

మల్లెల తీర్ధం

మల్లెల తీర్ధం

మల్లెల తీర్థం ఒక జలపాతం. శ్రీశైలం పట్టణానికి ఇది సుమారు 50 కి. మీ. ల దూరం లో కలదు. ఈ నీరు ఎంతో పవిత్రమైనదని భావించటం తో భక్తులు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో వచ్చి స్నానాలు చేస్తారు. ఈ జలపాతాలు దట్టమైన అడవుల మధ్యన ఉన్నప్పటికీ రోడ్ మార్గం లో తేలికగా ప్రయాణించవచ్చు. వర్షాకాలం లో మాత్రం రోడ్ సరిగ్గా వుండదు. ఈ మల్లెల తీర్థం లో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని మోక్షం దొరుకుతుందని భావించటం తో ఈ జలపాతాలు ప్రాముఖ్యతని సంతరించుకొన్నాయి. అయితే, ఈ నీటిలోకి చేరాలంటే సుమారు 250 మెట్లు దిగి వెళ్ళాలి కనుక, చాల జాగ్రత తీసుకోవాలి. జారి పడే అవకాశం వుంటుంది. వేగిర పడకుండా నిదానంగా మెట్లు దిగి వెళ్ళాలి.

Photo Courtesy: Ylnr123

కపిల తీర్ధం

కపిల తీర్ధం

తిరుపతి, తిరుమల వంటి ప్రసిద్ధ నగరాలకు దగ్గరలో శివుని విగ్రహం ఉన్న ఒకేఒక ఆలయం కపిల తీర్ధం. ఈ పెద్ద ఆలయం తిరుమల కొండ పాదాల వద్ద పర్వత ప్రవేశ౦లో ఉంది. ఈ ఆలయ ప్రవేశం వద్ద శివుని వాహనం ‘నంది' ఉంది. శివుని విగ్రహం ముందే ఇక్కడ కపిల మహర్షి ఇక్కడ ఉన్నట్లు, ఆయన పేరుతో దీనికి ఆ పేరు వచ్చినట్లు చెప్తారు. తీర్థం అంటే ప్రసిద్ధ సరస్సు అని అర్ధం, వినాశనం జలపాతాల ఆలయం దగ్గరలో ఏర్పాటు చేయబడింది. ఈ ఆలయం 13,16 శతాబ్దాలలో విజయనగర రాజుల ప్రోత్సాహంతో ప్రాచీన కాలంలో బాగా ప్రాచుర్యం పొందిందని చెబుతారు. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంరక్షణలో పోషించబడుతుంది.

Photo Courtesy: Adityamadhav83

కొత్తపల్లి జలపాతం

కొత్తపల్లి జలపాతం

విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం కొత్తపల్లి వద్ద జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. వయ్యారంగా కొండలపైనుంచి జాలువారే నీటిని చూసేందుకు ఏటా ఎండాకాలంలో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. పాడేరు నుండి 35 కిలోమీటర్ల దూరంలో, జి.మాడుగుల నుండి చింతపల్లి మార్గంలో ఈ జలపాతం ఉంది. కొత్తపల్లి గ్రామస్తులు, కొంతమంది విద్యార్థులు ఈ జలపాతాన్ని మూడు సంవత్సరాల క్రితం వెలుగులోకి తెచ్చారు. అప్పటి నుంచి గ్రామస్తులు, పర్యటకుల సహకారంతో అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నారు. కొత్తపల్లిలో సుమారు 200 నుండి 300ల అడుగుల లోతున ఈ జలపాతం పర్యటకులకు కనిపిస్తుంది. గ్రామస్తులు తన సొంతసొమ్ముతో రహదారి, కర్రలతో కంచె వేసి మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ జలపాతం ముందు భాగం నుంచి కర్రలు, రోడ్డు మార్గం నుండి పర్యటకులు లోపలికి వెళ్తుంటారు.

Photo Courtesy: flickr

ఉబ్బల మడుగు జలపాతం

ఉబ్బల మడుగు జలపాతం

ఉబ్బల మడుగు జలపాతం ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా లో బుచ్చినాయుని కండ్రిగ, వరదయ్య పాలెం మండలాల్లొ ఉంది . శ్రీకాళహస్తి నుండి 35 కిలోమీటర్ల దూరంలో సిద్దుల కోన అని పిలువ బడే అడవిలో వున్నది. ఇది ప్రధాన వర్షాకాల సమయంలో అనగా అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ జలపాతంలో నీరు పడుతుంటుంది. ఈ ప్రాంతం పచ్చదనంతో కళకళలాడుతు వుంటుంది. ట్రెక్కింగుకు, మరియు విహార యాత్రలకు ఇది చాల అందమైన ప్రదేశము. దీన్ని వీక్షించడానికి అధిక సంఖ్యలో తమిళనాడు నుంచి పర్యాటకులు వస్తూంటారు. ఇక్కడ సందర్శకుల కోసం అతిధిగృహాలు ఏర్పాటు చేశారు.

Photo Courtesy: Tamba52

గండాహతి జలపాతం

గండాహతి జలపాతం

దట్టమైన అడవి... కొండకోనలు, అంతకు మించి మనసును ఆనందడోలికల్లో ముంచేసే జలసొగసులు.. ఇవన్నీ ఒకే చోట చేరితే.. ఇంకేమైనా ఉందా క్షణం ఆలస్యం చేయకుండా అక్కడ వాలిపోయి మైమరిచిపోవాలని అన్పించదు. అయితే ఆలస్యం దేనికి శ్రీకాకుళం జిల్లా సమీపంలో ఒడిషా సరిహద్దుల్లోకి వెళ్దాం ఎందుకంటే ఇక్కడే ఈ గండాహతి జలపాతం ఉంది. ఒడిషా రాష్ట్ర వాసులతో పాటు శ్రీకాకుళం జిల్లా లోని పాతపట్నం, పలాస, మెళియాపుట్టి, కొత్తూరు వంటి ప్రాంతాల నుంచి ఈ జలపాతం చూసి సేదదీరేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఆదివారం వచ్చిందంటే కాకులు దూరని కారడివిలో ఉన్న ఈ ప్రాంతం ఒక్కసారిగా జనారణ్యంగా మారిపోతుంది. ఏపి-ఒడిషా వాసులకు పిక్నిక్‌ స్పాట్‌..... ఆంధ్రా, ఒడిషా సరిహద్దు వాసులకు పిక్నిక్‌ స్పాట్‌గా మారిన ఈ జలపాతం వద్ద చల్లటి వాతావరణం ఉంటుంది. రోజంతా సేదదీరేందుకు అనువైన ప్రాంతం. అడవి అందాలతో పాటు ఎత్తైన కొండల నుంచి జాలువారే జలసోయగాలు చూడముచ్చట గొలుపుతాయి. జలపాతం కింద చేరి కేరింతలు కొడుతూ ఆడుతూ పాడుతూ స్నానాలు చేస్తే ఆ అనుభూతే వేరు.

Photo Courtesy: sirkakulam.co.in

రంపచోడవరం జలపాతం

రంపచోడవరం జలపాతం

రంపచోడవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. ఈ జలపాతం తూర్పు కనుమలలో విస్తరించి ఉంది. ఇక్కడకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. శని , ఆది వారం దొరికంటే చాలు ప్రకృతి పర్యాటకులు ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటారు. ఇక్కడ అల్లూరి సీతారామారాజు బస చేసిన ప్రదేశం చూడవచ్చు. అంతే కాక ఇక్కడ సమీపంలో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో అల్లూరి సీతారామరాజు పూజలు చేసేవాడట !!. ఈ జలపాతాన్ని చూస్తే గనక పర్యావరణ అమ్మ ఒడిలో సేదతీరుతున్నట్లుగా ఉంటుంది. ఈ ప్రదేశానికి వెళుతున్నప్పుడు మనకు " బొంగు చికెన్ " దుకాణాలు తారాసపడతాయి.

Photo Courtesy: Tamba52

కైగల్ జలపాతం

కైగల్ జలపాతం

దీనినే దుముకురాళ్ల జలపాతం అని కూడా పిలుస్తారు. పలమనేరు నుంచి కుప్పం మార్గంలో ఉంది. తిరుపతి నుంచి 150 కిలోమీటర్ల దూరం. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో కొండల పై జాలువారే నీటి ప్రవాహంతో చూపరులను ఇట్టే ఆకర్షించే కైగల్‌ దుముకురాళ్ళ జలపాతాన్ని ఒక్కసారి చూశారంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా జలపాత అందాలు ఆకట్టుకొంటాయి. వేసవిలో సైతం ఈ జలపాతం నీటితో కళకళలాడటం విశేషం. ప్రతి ఏటా ఎండలు ఎక్కువగా ఉండే ఏప్రిల్‌, మే మాసాల్లో ఈ జలపాతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వేసవి సెలవుల్లో విద్యార్థులే కాకుండా ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో ఇక్కడి అందాలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున వేంచేస్తుంటారు. ఈ అందమైన జలపాతాన్ని చూడడానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం రాళ్ళు, రప్పల మధ్య నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. మొత్తానికి ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే ఏదో సాహసయాత్ర చేసినట్లుగా అనుభూతి చెందుతారు. పిల్లలు, పెద్దలు అందరూ ఏకం అయి ఇక్కడి జలపాతంలో స్నానాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తారు. బోటు షికారు ఏరాటు చేస్తే మరింతమంది పర్యాటకులను ఆకర్షించవచ్చు.

Photo Courtesy: tirumala tourism

కైలాస కోన జలపాతం

కైలాస కోన జలపాతం

కైలాస కోన జలపాతం చిత్తూర్ జిల్లా, నారాయణవనం మండలంలో ఉంది. ఇది ఎత్తైన కొండలపై నుంచి అనేక ఔషధీ వృక్షాల వేర్లను తాకుతూ ప్రవహిస్తూ 100 అడుగుల పైనుంచి పడుతూ ఉంటుంది. ఈ జలపాతంలో స్నానమాచరిస్తే పుణ్యంతోపాటు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్నది ప్రజల విశ్వాసం. ఈ ప్రాంతమంతా ఎత్తైన చెట్లతో పచ్చగా నిండి ఉంటుంది. అందుకే ఈ జలపాతం వద్దకి భక్తులతో పాటుగా , వ్యాధిగ్రస్తులు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తుంటారు. ఈ జలపాతాన్ని శివుని ప్రతీతిగా భావిస్తారు.

Photo Courtesy: chittoor

పెంచలకుండ జలపాతం

పెంచలకుండ జలపాతం

ఈ జలపాతం నెల్లూరు జిల్లాలోని రాపూర్ మండలంలో కలదు. ఈ జలపాతం చూడటానికి బహు ముచ్చటగా ఉంటుంది. ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలే కాక, ప్రక్కనే ఉన్న తమిళనాడు వాసులు కూడా వస్తుంటారు. ఈ పెంచలకొండ జలపాతం ప్రతి శని, ఆది వారాలలో సందడిగా ఉంటుంది. చూడటానికి ఏమో అనిపించినా సౌండ్ మాత్రం అదిరిపోతుంది.

Photo Courtesy: Chandu3782

మాంసాహారులకు నోరూరించే బొంగు చికెన్‌

మాంసాహారులకు నోరూరించే బొంగు చికెన్‌

ఆంధ్ర ప్రదేశ్ లో జలపాతాల వద్దకు అదికూడా కోస్తా ప్రాంతాల జలపాతాలవైపు వెళితే మనకు బొంగుల చికెన్ షాప్ లు కనపడతాయి. ఇవి గిరిజనుల ప్రసిద్ధ వంటకం. బొంగు చికెన్‌ పేరులోనే కాదు. తయారీలోనూ ప్రత్యేకతను సంతరంచుకుంది. కోడి మాంసానికి ఉప్పూకారం, మసాలా దట్టించి వెదురుబొంగులో కూర్చి వండుతారు. దీన్నిచూడగానే ఎవరికైనా మళ్లీ తినాలనిపిస్తుంది. వెదురుబొంగులో నూనె లేకుండానే ఈ వంటకాన్ని తయారుచేస్తారు.

Photo Courtesy: andhra ruchulu

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X