Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు బోర్ కొట్టిందా ??

బెంగళూరు బోర్ కొట్టిందా ??

భద్ర వైల్డ్ లైఫ్ శాంక్చువరి అటవీ పర్యాటకులకు ట్రెక్కింగ్, క్యాంపింగ్, రాక్ క్లైంబింగ్, బర్డ్ వాచింగ్, బోటింగ్ సౌకర్యాలు కలిపిస్తుంది. భధ్ర నిశ్వబ్దంగా ఉండటమే కాదు, ఎన్నో సహజ అందాలు కూడా కలిగి ఉండటంతో

By Mohammad

బెంగళూరు బోర్ కొట్టిందా ? మీరు ఈ వీకెండ్ ఎక్కడికైనా ప్లాన్ చేయాలనుకుంటున్నారా ? ఐతె 'భద్ర' వెళ్ళి చూసిరండి. వీకెండ్ తక్కువ బడ్జెట్ లోనే అయిపోతుంది. భద్ర ప్రధానంగా ఒక వన్య ప్రాణుల సంరక్షణాలయం దీనినే 'భద్ర వైల్డ్ లైఫ్ శాంక్చువరి' అని కూడా అంటారు. ఇది చిక్కమగళూరు జిల్లాలో ఉంది. పడమటి కనుమలలో ఉన్న ఈ అటవీ ప్రదేశంను 'పులుల సంరక్షణాలయం' గా కూడా నిర్వహిస్తున్నారు. ఈ శాంక్చువరీని 1958 లో స్ధాపించారు మరియు దీని విస్తీర్ణం సుమారు 492 చ.కి.మీ.లు. చిక్కమగళూరు పట్టణానికి ఇది 38 కి.మీ. బెంగుళూరు నగరానికి 282 కి.మీ. దూరంలో ఉంది.

బెంగళూరు టు సంగమ రోడ్ ట్రిప్ జర్నీ !

భద్ర నది ఉప నదులు భధ్ర శాంక్చువరి గుండా ప్రవహిస్తాయి. చుట్టూ హెబ్బెగిరి, గంగే గిరి, మల్లయన గిరి, బాబా బూదాన్ గిరి వంటి కొండలు రమణీయంగా కనపడతాయి. పడమటి కనుమలలోని కుద్రేముఖ్ వద్ద మూలస్ధానంగా గల భద్రానది మూలాలను తప్పక చూడాల్సిందే.

బెంగళూరు నుండి సకలేశ్ పూర్ రోడ్ ట్రిప్ జర్నీ !

లక్కవల్లి డ్యామ్

లక్కవల్లి డ్యామ్

లక్కవల్లి సమీపంలో భద్ర నది పై డ్యామ్ కట్టారు. ఇక్కడనుండి అది భద్రావతి మీదుగా ప్రవహించి కూడ్లి వద్ద తుంగ నదితో కలుస్తుంది. ఇది శివమొగ్గ కు దగ్గరగా ఉంది. చుట్టూ హెబ్బెగిరి, గంగే గిరి, మల్లయన గిరి, బాబా బూదాన్ గిరి వంటి కొండలు రమణీయంగా కనపడతాయి.

చిత్రకృప : Dineshkannambadi

టైగర్ రిజర్వ్

టైగర్ రిజర్వ్

భద్ర వన్య జంతువుల సంరక్షణాలయం 1951 లో స్థాపించినప్పటికీ, 1998 సంవత్సరంలో ప్రభుత్వం ఈ సంక్చురి ని ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్ గా ప్రకటించింది. ఇప్పటివరకు 33 పులులు ఉన్నట్లు గుర్తించారు.

చిత్రకృప : Yathin S Krishnappa

చెట్లు, మొక్కలు

చెట్లు, మొక్కలు

ఈ అటవీ ప్రాంతంలో మొక్కల జాతులు సుమారు 120 రకాల వరకు ఉంటాయి. వాటిలో టేకు, రోజ్ వుడ్, బ్యాంబూ, జాక్ ఫ్రూట్ అంటే పనస వంటివి ప్రధానంగా కనపడతాయి.

చిత్రకృప : Subharnab Majumdar

జంతు సంపద

జంతు సంపద

జింకలు, సాంబర్, మచ్చల జింకలు, చిరుతలు, లేళ్ళు, దుప్పులు, మలబార్ ఉడుతలు, ఏనుగులు కూడా ఈ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాయి.

చిత్రకృప : jerry john

పక్షులు

పక్షులు

250 పక్షి జాతులతో పక్షుల ప్రియులకు స్వర్గం గా ఉంటుంది. ఎన్నో చిలకలు, పావురాలు, వడ్రంగి పిట్టలు, మైనాలు, వివిధ రకాల అటవీ పక్షులు కనపడతాయి.

చిత్రకృప : Sandeep Gangadharan

జలచర ప్రాణులు

జలచర ప్రాణులు

మీరు సరీసృపాలు ఇష్టపడేవారైతే, ఎన్నో రకాల పాములు, మొసళ్ళు, నాగుపాములు, వైపర్లు, సాధారణ పాములు, ర్యాట్ స్నేక్స్, పిట్ వైపర్లు, వంటివి కూడా చూడవచ్చు. రంగు రంగుల సీతాకోక చిలుకలు కూడా మీకు ఆహ్లాదాన్నిస్తాయి.

చిత్రకృప : David Brossard

సందర్శన సమయం

సందర్శన సమయం

తెరిచే సమయం : ఉదయం 6:30 AM నుండి 8:00 AM వరకు తిరిగి

సాయంత్రం 4:00 PM నుండి 6:00 PM వరకు.

ప్రవేశ రుసుము : ఒక్కొక్కరికి 400 రూపాయలు.

సందర్శనకు పట్టే సమయం : 1-2 గంటలు.

ఎవరు ఇష్టపడుతారు : నేచర్ లవర్స్, అడ్వెంచర్ కోరుకునేవారు.

చిత్రకృప : balu

సౌకర్యాలు

సౌకర్యాలు

అటవీ శాఖ పర్యాటకులకు ట్రెక్కింగ్, క్యాంపింగ్, రాక్ క్లైంబింగ్, బర్డ్ వాచింగ్, బోటింగ్ సౌకర్యాలు కలిపిస్తుంది. భధ్ర నిశ్వబ్దంగా ఉండటమే కాదు, ఎన్నో సహజ అందాలు కూడా కలిగి ఉండటంతో మీకు జీవితంలో మరువలేని అనుభవాలు కలిగిస్తుంది.

చిత్రకృప : balu

బస

బస

భద్ర వైల్డ్ లైఫ్ శాంక్చువరి లో బస చేయటానికి అనేక రిసార్ట్ లు, హోటళ్ళు, లాడ్జీలు కలవు. వాటిలో టెక్స్ వుడ్స్ రిసార్ట్, ది రివర్ టర్న్ లాడ్జ్, ఈగల్ ఐ రిసార్ట్ మొదలుగునవి కలవు. బడ్జెట్ ధరలలోనే గదులు లభిస్తాయి. సమీపంలోని చిక్కమగళూరు లో కూడా బస చేయవచ్చు.

చిత్రకృప : balu

ఉష్ణోగ్రత

ఉష్ణోగ్రత

ఈ ప్రదేశ ఉష్ణోగ్రతలు కనిష్టం 10 డిగ్రీల నుండి గరిష్టం 35 డిగ్రీలుగా మారుతూంటాయి. పక్షులు వలసలు వచ్చే శీతాకాలం సందర్శనకు అనుకూలమైనది.

చిత్రకృప : Subharnab Majumdar

భధ్రావతి

భధ్రావతి

భధ్రావతిలో దిగువ ప్రాంతంలో ప్రతిష్టించబడిన శివ విగ్రహం అతి పెద్దది. దీనిని పర్యాటకులు తప్పక చూడవలసినదిగా సిఫార్సు చేయవచ్చు.

చిత్రకృప : Prof tpms

త్రికూటాచల గుడి

త్రికూటాచల గుడి

త్రికూటాచల గుడి గా కూడా పిలువబడే ఈ దేవాలయం 13వ శతాబ్దిలో హోయసల వంశస్ధులచే నక్షత్ర ఆకారంలో నిర్మించబడింది. గుడి మహా విష్ణువుకు అంకితం చేయబడింది. ఇక్కడ శ్రీక్రిష్ణ, గణేశ, పురుషోత్తమ, మాత శారదాంబల విగ్రహాలను భక్తులు చూసి తరించవచ్చు. అదే ప్రాకారంలో బయటవైపు, రాతి స్తంభ ద్వజస్తంభం, హొయసలుల శిల్ప శైలిని చూడవచ్చు.

చిత్రకృప : wagon16

దర్శించదగినవి

దర్శించదగినవి

సందర్శకులు పవిత్ర భధ్రావతి మఠాన్ని సందర్శించవచ్చు. భధ్ర నది ఒడ్డున గల సున్నద హళ్ళి, గోంధి, శారద, కుండ్లి మరియు శంకర్ మఠాలు దర్శించదగినవి.

చిత్రకృప : Manjeshpv

మల్నాడు ప్రాంతంలో

మల్నాడు ప్రాంతంలో

భధ్రావతి పట్టణ నడిబొడ్డున ఉన్న హల్లదామ్మ దేవి గుడిని పర్యాటకులు తప్పక చూడాలి. మల్నాడు ప్రాంతంలో ఆధునిక సౌకర్యాలతో అతి పెద్ద దేవాలయంగా పేరొందింది. జైన్ బసాడి భధ్రావతిలోని ఎన్ ఎస్ టి రోడ్డులో ఉంది. పర్యాటకులు చాలామంది దీనిని చూస్తారు.

చిత్రకృప : b sarangi

హేబ్బే జలపాతాలు

హేబ్బే జలపాతాలు

సంక్చురి కి తూర్పు భాగాన 551 మీ. ల ఎత్తు నుండి పడే హేబ్బే జలపాతాలు ఒక ప్రధాన ఆకర్షణ. బాబా బూదాన్ గిరి హిల్స్ సమీపంలో మానిక్యదారా జలపాతాలు కూడా చూడవచ్చు.

చిత్రకృప : Srinivasa83

ఏ ఏ ప్రదేశాలను చూడవచ్చు ?

ఏ ఏ ప్రదేశాలను చూడవచ్చు ?

భద్ర చుట్టూ చిక్కమగళూరు (43 కి.మీ), బేలూరు (68 కి.మీ), శృంగేరి(74 కి.మీ), హొరనాడు (77 కి.మీ), హళిబేడు (77 కి.మీ), కుద్రేముఖ్ (94 కి.మీ) ప్రదేశాలను చూడవచ్చు.

చిత్రకృప : prashantby

భద్ర సంక్చురి

భద్ర సంక్చురి

సంక్చురి సమీపంలో భద్రావతి, తారికేరే, చంనగిరి పట్టణాలు కలవు. పర్యాటకులు ఈ పట్టణాలలో తగిన వసతులు పొందవచ్చు.భద్రా వతి పట్టణానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రైలు, బస్సు సౌకర్యాలు కలవు. భద్రావతి నుండి 170 కి.మీ. ల దూరంలో, హుబ్లి లో సమీప విమానాశ్రయం కలదు.

చిత్రకృప : b sarangi

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X