Search
  • Follow NativePlanet
Share
» »ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఆంధ్రప్రదేశ్ లో నల్లమల అటవీ ప్రాంతంలో శివాలయాలకు కొదువలేదు. ఆ శివాలయం చిన్నదైనా, పెద్దదైనా అక్కడికి వెళ్లిరావటానికి భక్తులు పరవశించిపోతుంటారు. అలాంటి శివాలయాలలో ఒకటి భైరవకోన లో కలదు.

By Venkatakarunasri

ఆంధ్రప్రదేశ్ లో నల్లమల అటవీ ప్రాంతంలో శివాలయాలకు కొదువలేదు. ఆ శివాలయం చిన్నదైనా, పెద్దదైనా అక్కడికి వెళ్లిరావటానికి భక్తులు పరవశించిపోతుంటారు. అలాంటి శివాలయాలలో ఒకటి భైరవకోన లో కలదు. శివాలయమే కాదు, పార్వతీదేవి ఆలయం, దేవీదేవతల శిలారూపాలు, గ్రానైట్ శిలలతో చెక్కబడ్డ శివలింగాలు, ఆకాశగంగ ను తలపించేలా జలపాతం, చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతి ఇవన్నీ కూడా యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. భైరవకోన గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. భైరవకోనలో భైరవఆలయమే కాకుండా ఇంకా చాలా ఆలయాలు వున్నాయి.అయితే కొండల నడుమన ఏర్పడిన శిలలతో ఆలయాన్ని రూపొందించిన ఇక్కడ ఆశ్చర్యకరమైన సంఘటనలేంటో ఇప్పుడు చూద్దాం.

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఎక్కడ వుంది?

భైరవకోన, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం -ప్రకాశం జిల్లా - చంద్రశేఖరపురం మండలంలోని కొత్తపల్లి గ్రామం సమీపాన కలదు. కొత్తపల్లి గ్రామం నుండి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో భైరవకోన క్షేత్రం కలదు. నెల్లూరు సరిహద్దుల్లో ఈ భైరవకోన అనే పుణ్యక్షేత్రం వుంది.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఈక్షేత్రంలో బ్రహ్మ, రుద్ర,విష్ణుకుంటలనడుమ ప్రకృతిరమణీయంగా విరాజిల్లే ప్రాంతమే భైరవకోన. ఇక్కడ ఒక రాతిలో మొలచిన 8శివాలయాలు భైరవుని ఆలయాలు ప్రత్యేకతని సంతరించుకున్నాయి. భైరవకోన లో ప్రసిద్ధిగాంచిన శివాలయం కలదు. దేనిని క్రీ.శ. 9 వ శతాబ్దంలో నిర్మించారు.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

పల్లవ రాజుల అద్భుత శిల్పకళకు నెలవు ఈ భైరవకోన. కొండల్ని తొలచి గుహాలయాలుగా నిర్మించడం అన్నది అప్పట్లో ఒక గొప్ప అద్భుత కళ. గుహల గోడలపై చెక్కిన శిల్పాలు పల్లవుల శిల్పకళ ను గోచరిస్తుంది. స్థలపురాణం ప్రకారం, కృతయుగం నృసింహాలయంలో ప్రహ్లాదుడు నియమించిన అర్చకుడు భైరవుడు.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ప్రహ్లాదుడు చనిపోయాక ఈ గుడిని పట్టించుకొనే నాధుడు లేక పొట్టకూటి కోసం భైరవుడు దారిదోపిడీలకు పాల్పడేవాడు. అందుకు ఆగ్రహించిన నృసింహస్వామి రాక్షసుడు అవ్వమని, తనకంటికి కనిపించకుండా భక్తులు తెచ్చినది ఏదైనా తన ప్రసాదంగా స్వీకరించమని, కలియుగానంతరం మరలా తనను సేవించవచ్చని చెబుతాడు.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

నాటి నుండి నేటివరకుభైరవుడు భైరవకోనలో పూజలు అందుకుంటున్నాడు. శ్రీ దుర్గ భైరవేశ్వర స్వామి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరవ కోనలో ఉంది.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

కృతయుగం నృసింహాలయంలో ప్రహ్లాదుడు నియమించిన అర్చకుడు భైరవుడు ప్రహ్లాదుడు పరమపదించిన తరువాత పట్టించుకొనే వారులేక క్షుద్బాధ భరించలేక దారిదోపిడీలకు పాల్బడేవాడు అందుకు ఆగ్రహించిన నృసింహాస్వామి రాక్షసుడవుకమ్మని శపించాడు.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

తెలిసి చేసినతప్పు కాదని ఆకలి భరించలేక చేసానని పరిహారం శూచించమని భైరవుడు ప్రాదేయ పడటంతొ కలియుగాంతం వరకు తనకంటికి కనిపించకుండా తనభక్తులు తెచ్చినది ఏదైనా తనప్రసాదంగా భావించి స్వీకరిస్తూ ఉండమనీ కలియుగనంతరం మళ్లీ తన సేవకు వినియెగించుకుంటానని వరమిచ్చాడు నాటినుంచి భైరవుడు భైరవకోనలో పూజలందుకుంటున్నాడు.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి.వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే గ్రానైట్‌ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

అంతేకాకుండా ఒకే రాతిలో మొలచిన 8శివాలయాల్లో 8రూపాలుగా శివాలయాలను మలచారు. ఈ ఎత్తైన భైరవకోనలో కోటొక్కలింగాలు ప్రతిష్టించాలని పురాణాలద్వారా తెలుస్తోంది. పూర్వం ఇక్కడ భైరవ,దుర్గ లకు 128ఆలయాలను నిర్మించినట్లు ప్రతీతి.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిపై దేవతల చిత్తరువులతోపాటు ఆ దేవతలకు ఆలయాలని కూడా నిర్మించటం అందరికీ ఆశ్చర్యం కలిగించే సంగతి. భైరవకోనలో 7ఆలయాల మధ్యలో సుమారు 2అడుగుల లోతున దుర్గాదేవి ఆలయం వుంది. ఇక్కడ కనకదుర్గాదేవి విగ్రహం అద్భుతంగా వుంటుంది.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఈ విగ్రహం దుర్గమ్మతల్లి,సరస్వతీదేవి, పార్వతిదేవిల ముఖాలతో కనిపిస్తూ భక్తులని అలరిస్తుంది. దుర్గాదేవి ఆలయం కొంచెం క్రిందిభాగంలో సెలయేరు ప్రవహిస్తూవుంటుంది. ఈ సెలయేరు వేసవిలో కూడా ఎండిపోదు. ఈ సెలయేరు ఎప్పుడూ ప్రవహిస్తూవుంటుంది.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకేచోట ముగ్గురుమూర్తులు ఎనిమిది గుహలలో ఒకటి ఉత్తరముఖంగా (మొదటిది), మిగిలిన ఏడు గుహలు తూర్పుముఖంగా ఉంటాయి. మొదటిగుహ : తలపాగా ధరించిన ద్వారపాలకులు ఈ గుహ ప్రధాన ఆకర్షణ. ఉత్తరముఖంగా ఉంటుంది. గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

రెండవ గుహ - ఏడవ గుహ

రెండవ గుహ మొదలు ఏడవ గుహ వరకు ఆలయాలన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. గర్భగుడి అన్నింటిలో గ్రానైట్ తో చెక్కబడిన శివలింగాలను ప్రతిష్టించారు.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఎనిమిదో గుహ

ఎనిమిదో గుహ ప్రత్యేకమైనది. లింగంతో పాటు బ్రహ్మ, విష్ణు బొమ్మలను చెక్కి ఉండటం విశేషం.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

అమ్మవారిగుడి

భైరవకోన క్షేత్రంలో అమ్మవారి గుడి నూతనంగా నిర్మించారు. ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహం మాత్రం పురాతనమైనది. ఈ గుడి అడవిలో ఉన్నందున ప్రతిరోజూ కాకుండా, శుక్రవారం అర్చిస్తారు. పండుగలు, పర్వదినాలలో ఉత్సవాలు నిర్వహిస్తారు.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

అయితే ఎక్కువగా వర్షాలు పడినప్పుడు ఈ సెలయేరు ఎంత వేగంగా ప్రవహించినప్పటికీ ఆలయంలోకి ఒక చుక్క నీరు అనేది కూడా రాకపోవటం అందరినీ ఆశర్యానికి గురిచేస్తోంది. ఇదే కాకుండా ఇక్కడ ఇంకో విశేషం కూడా వుంది.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

పౌర్ణమి అందాలు ప్రతి సంవత్సరం కార్తీకపౌర్ణమి రోజున చంద్రబింబం, అక్కడి ఆలయాలనికి మూడు అడుగుల కింద ప్రవహించే సెలయేటిలో పడి, దుర్గాదేవి విగ్రహం పై పడుతుంది. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు ఆ రోజున అధికంగా తరలివస్తుంటారు.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ప్రతీఏటా కార్తీకపౌర్ణమి రోజున రాత్రి 7నుండి 9గంటల సమయంలో చంద్రుని కిరణాలు దుర్గాదేవి ఆలయంలోకి నేరుగా ప్రవేశిస్తాయి. ఈ అద్భుతాన్ని చూడటానికి వేలాదిమంది భక్తులు ఈ సమయంలో ఆలయాన్ని దర్శిస్తారు.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

జలపాతం భైరవకోన లో కొండల మధ్య నుంచి దూకే జలపాతం యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ జలపాతం కింద పిల్లలు, పెద్దలు తడుస్తూ ఆనందించవచ్చు. నింగిని తాకేలా వృక్షాలు, పక్షులకిలకిలారావాలు, ఆహ్లాదభరితవాతావరణం తప్పక ఉత్సాహాన్ని కలిగిస్తాయి.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

హోటల్ సౌకర్యం

ఈ క్షేత్రంలో హోటల్ సౌకర్యం లేదు. రెండు సత్రాలు మాత్రమే నివాసం కోసం ఉపయోగపడుతున్నాయి.

PC:youtube

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

విస్తారంగా బస్సు సౌకర్యం

నెల్లూరులోనే ఆత్మకూరు బస్టాండ్ నుండి పీఠాపురం లేదా ఉదయగిరి విస్తారంగా బస్సు సౌకర్యం వుంది. నెల్లూరు బస్టాండ్ నుండి మధ్యాహ్నం 12గంటల 30ని.కు కొత్తపల్లికి నేరుగా బస్సు వుంది. కొత్తపల్లి నుండి ప్రైవేట్ వాహనాలలో భైరవకొన శివాలయానికి సులువుగా చేరుకోవచ్చు. ఇక విజయవాడ నుండి ఒంగోలు, కందుకూరు మరియు కనిగిరి పట్టణాలకు బస్సుసౌకర్యం వుంది. అక్కడ నుండి సిఎస్ పురానికి నేరుగా బస్సు సౌకర్యం వుంది.

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ప్రకాశం నుండి ప్రతిరోజూ నిర్దిష్ట సమయంలో 'భైరవకోన' కు ప్రభుత్వ బస్సులు తిరుగుతుంటాయి. ప్రకాశం నుండి భైరవకోన కోన 70 కిలోమీటర్ల దూరంలో కలదు. కొత్తపల్లి, అంబవరం గ్రామాల నుండి కూడా భైరవకోన కు ప్రభుత్వ బస్సులు, ప్రవేట్ జీపులు, ఆటోలు దొరుకుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X