Search
  • Follow NativePlanet
Share
» »భైరవకోన - అద్భుత గుహాలయాలు !

భైరవకోన - అద్భుత గుహాలయాలు !

By Mohammad

ఆంధ్రప్రదేశ్ లో నల్లమల అటవీ ప్రాంతంలో శివాలయాలకు కొదువలేదు. ఆ శివాలయం చిన్నదైనా, పెద్దదైనా అక్కడికి వెళ్లిరావటానికి భక్తులు పరవశించిపోతుంటారు. అలాంటి శివాలయాలలో ఒకటి భైరవకోన లో కలదు. శివాలయమే కాదు, పార్వతీదేవి ఆలయం, దేవీదేవతల శిలారూపాలు, గ్రానైట్ శిలలతో చెక్కబడ్డ శివలింగాలు, ఆకాశగంగ ను తలపించేలా జలపాతం, చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతి ఇవన్నీ కూడా యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

ఎక్కడ ఉంది ?

భైరవకోన, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం -ప్రకాశం జిల్లా - చంద్రశేఖరపురం మండలంలోని కొత్తపల్లి గ్రామం సమీపాన కలదు. కొత్తపల్లి గ్రామం నుండి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో భైరవకోన క్షేత్రం కలదు.

భైరవకోన క్షేత్రం

భైరవకోన క్షేత్రం

చిత్రకృప : Ck984923

ఎలా వెళ్ళాలి ?

ప్రకాశం నుండి ప్రతిరోజూ నిర్దిష్ట సమయంలో 'భైరవకోన' కు ప్రభుత్వ బస్సులు తిరుగుతుంటాయి. ప్రకాశం నుండి భైరవకోన కోన 70 కిలోమీటర్ల దూరంలో కలదు. కొత్తపల్లి, అంబవరం గ్రామాల నుండి కూడా భైరవకోన కు ప్రభుత్వ బస్సులు, ప్రవేట్ జీపులు, ఆటోలు దొరుకుతాయి.

<strong>ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలో గల నెమలిగుండం చూసొద్దామా !</strong>ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలో గల నెమలిగుండం చూసొద్దామా !

శివాలయం

భైరవకోన లో ప్రసిద్ధిగాంచిన శివాలయం కలదు. దేనిని క్రీ.శ. 9 వ శతాబ్దంలో నిర్మించారు. పల్లవ రాజుల అద్భుత శిల్పకళకు నెలవు ఈ భైరవకోన. కొండల్ని తొలచి గుహాలయాలుగా నిర్మించడం అన్నది అప్పట్లో ఒక గొప్ప అద్భుత కళ. గుహల గోడలపై చెక్కిన శిల్పాలు పల్లవుల శిల్పకళ ను గోచరిస్తుంది.

స్థలపురాణం ప్రకారం, కృతయుగం నృసింహాలయంలో ప్రహ్లాదుడు నియమించిన అర్చకుడు భైరవుడు. ప్రహ్లాదుడు చనిపోయాక ఈ గుడిని పట్టించుకొనే నాధుడు లేక పొట్టకూటి కోసం భైరవుడు దారిదోపిడీలకు పాల్పడేవాడు. అందుకు ఆగ్రహించిన నృసింహస్వామి రాక్షసుడు అవ్వమని, తనకంటికి కనిపించకుండా భక్తులు తెచ్చినది ఏదైనా తన ప్రసాదంగా స్వీకరించమని, కలియుగానంతరం మరలా తనను సేవించవచ్చని చెబుతాడు. నాటి నుండి నేటివరకుభైరవుడు భైరవకోనలో పూజలు అందుకుంటున్నాడు.

శ్రీ దుర్గా భైరవేశ్వర స్వామి దేవాలయం

శ్రీ దుర్గా భైరవేశ్వర స్వామి దేవాలయం

చిత్రకృప : YVSREDDY

ఎనిమిది శివాలయాలు

నల్లమల అభయారణ్యంలో ఎక్కడ చూసిన దేవీదేవతలు శిల్పాలే దర్శనమిస్తుంటాయి. ఓ కొండ రాతిని తొలిచి అందులో ఎనిమిది శివాలయాలను చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంది. వీటన్నింటినీ ఒకేసారి దర్శించుకోవచ్చు. అన్ని ఆలయాల్లో గర్భగుడి, వరండాలు, స్తంభాలు అన్నీ కూడా కొండ రాయితోనే మలచడం విశేషం. శివలింగాలను మాత్రేమే గ్రానైట్ రాయితో చెక్కి ప్రతిష్టించారు.

<strong>దక్షిణ పూరీ క్షేత్రం - వడాలి, కృష్ణా జిల్లా !</strong>దక్షిణ పూరీ క్షేత్రం - వడాలి, కృష్ణా జిల్లా !

ఒకేచోట ముగ్గురుమూర్తులు

ఎనిమిది గుహలలో ఒకటి ఉత్తరముఖంగా (మొదటిది), మిగిలిన ఏడు గుహలు తూర్పుముఖంగా ఉంటాయి.

మొదటిగుహ : తలపాగా ధరించిన ద్వారపాలకులు ఈ గుహ ప్రధాన ఆకర్షణ. ఉత్తరముఖంగా ఉంటుంది. గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది.

అఖండ జ్యోతి ఉన్న గుహ

అఖండజ్యోతి దర్శనానికి వెళ్ళే మెట్లు, అఖండ జ్యోతి ఉన్న గుహ

చిత్రకృప : YVSREDDY

రెండవ గుహ - ఏడవ గుహ : రెండవ గుహ మొదలు ఏడవ గుహ వరకు ఆలయాలన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. గర్భగుడి అన్నింటిలో గ్రానైట్ తో చెక్కబడిన శివలింగాలను ప్రతిష్టించారు.

ఎనిమిదో గుహ : ఎనిమిదో గుహ ప్రత్యేకమైనది. లింగంతో పాటు బ్రహ్మ, విష్ణు బొమ్మలను చెక్కి ఉండటం విశేషం.

అమ్మవారిగుడి : భైరవకోన క్షేత్రంలో అమ్మవారి గుడి నూతనంగా నిర్మించారు. ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహం మాత్రం పురాతనమైనది. ఈ గుడి అడవిలో ఉన్నందున ప్రతిరోజూ కాకుండా, శుక్రవారం అర్చిస్తారు. పండుగలు, పర్వదినాలలో ఉత్సవాలు నిర్వహిస్తారు.

భైరవకోన జలపాతం

భైరవకోన జలపాతం

చిత్రకృప : YVSREDDY

జలపాతం

భైరవకోన లో కొండల మధ్య నుంచి దూకే జలపాతం యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ జలపాతం కింద పిల్లలు, పెద్దలు తడుస్తూ ఆనందించవచ్చు. నింగిని తాకేలా వృక్షాలు, పక్షులకిలకిలారావాలు, ఆహ్లాదభరితవాతావరణం తప్పక ఉత్సాహాన్ని కలిగిస్తాయి.

<strong>ఏపీలోని ఈ శివాలయాలను మీరెప్పుడైనా విన్నారా ?</strong>ఏపీలోని ఈ శివాలయాలను మీరెప్పుడైనా విన్నారా ?

పౌర్ణమి అందాలు

ప్రతి సంవత్సరం కార్తీకపౌర్ణమి రోజున చంద్రబింబం, అక్కడి ఆలయాలనికి మూడు అడుగుల కింద ప్రవహించే సెలయేటిలో పడి, దుర్గాదేవి విగ్రహం పై పడుతుంది. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు ఆ రోజున అధికంగా తరలివస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X