Search
  • Follow NativePlanet
Share
» »అద్భుత నిర్మాణకళకు నిదర్శనం : భోజేశ్వర్ ఆలయం !

అద్భుత నిర్మాణకళకు నిదర్శనం : భోజేశ్వర్ ఆలయం !

By Mohammad

భోజ్పూర్ నగరం ఒక అన్ - ఫినిష్డ్ నగరం అంటే అసంపూర్ణ నగరం అని అర్థం. ఇతర పర్యాటక ప్రదేశాలలో, మీరు పురాతన నగరాలు నాశనమవటాన్నిగమనించవొచ్చు, కాని ఇక్కడ నగరం పూర్తి అవటం అంటూనే జరగదు. భారత మధ్య భూభాగంలో ఉన్న పర్వత పంక్తుల మీద క్రీ. శ. 11 వ శతాబ్దంలో పుట్టుకొచ్చింది భోజ్పూర్ నగరం.

ఈ పురాతన నగరానికి వెనుక వైపు బెత్వ నది ప్రవహించడం వలన, భోజుపూర్ (భోజ్పూర్)ప ర్యాటక ప్రదేశ మనోజ్ఞతకు వన్నె తెచ్చినట్లుగా ఉన్నది. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన భోపాల్ నుండి 28 కి.మీ. దూరంలో ఉన్నది.

భోజ్పూర్ లో ప్రధానంగా చూడవలసిన ప్రదేశాలు రెండు. ఒకటి భోజేశ్వర ఆలయం, మరొకటి పార్వతి గుహ. వీటితో పాటు జైన దేవాలయాలను, రాయల్ ప్యాలెస్ ను కూడా సందర్శించవచ్చు.

భోజేశ్వర్ దేవాలయం

భోజేశ్వర్ దేవాలయం

చిత్ర కృప : Yann

భోజేశ్వర్ దేవాలయం

భోజేశ్వర్ ఆలయం భోజ్పూర్ లో అసంపూర్తిగా ఉన్న ఒక అద్భుతమైన నిర్మాణం. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఇండియాలో ఉన్న పెద్ద శివలింగాలలో ఈ ఆలయంలో ఉన్న శివలింగం ఒకటి. ఈ ఆలయంలో శివలింగం ఒకే రాతిలో మలచబడి, 7.5 అడుగుల పొడవు మరియు 17.8 అడుగుల చుట్టుకొలతను కలిగి ఉన్నది. ఈ ఆలయం 'తూర్పు సోమ్నాథ్' అని పిలువబడుతున్నది.

ఇది కూడా చదవండి : అటవీ అందాల నిలయం - పెంచ్ నేషనల్ పార్క్ !

ఈ ఆలయం క్రీ. శ. 11-13 వ శతాబ్దపు నిర్మాణకళకు ఉదాహరణగా నిలిచి ఉన్నది, ఈ ఆలయం పూర్తిగా నిర్మించి ఉన్నట్లయితే, ఇది ఇండియాలో ఒక అద్భుతంగా నిలిచి ఉండేది. ఈ ఆలయం యొక్క అద్భుతంగా చెక్కబడిన గోపురం, రాతి నిర్మాణాలు, చిక్కగా చెక్కబడిన ద్వారబంధం మరియు రెండువైపులా అద్భుతంగా చెక్కబడిన బొమ్మలు కలిగిన ద్వారబంధాలు చూపరులను అలానే నిలబెడతాయి.

ఆలయంలోని శివలింగం

ఆలయంలోని శివలింగం

చిత్ర కృప : Zippymarmalade

ఈ ఆలయ బాల్కనీలు భారీ బ్రాకెట్లతో మరియు స్తంభాలతో మద్దతు ఇవ్వబడుతున్నాయి. ఈ ఆలయ బయటివైపు గోడలు మరియు ఈ ఆలయ అద్భుత నిర్మాణం ఎప్పుడు, ఎక్కడ కట్టబడలేదు, కట్టలేరు. గోపురం స్థాయికి ఆలయం పెంచడానికి ఉపయోగించిన పాత మట్టి రాంప్, ప్రాచీనకాలం నాటి రాతి నిఘా రుచిని అందిస్తున్నది, అది ఇప్పటికీ కనిపిస్తున్నది.

పార్వతి గుహ

పార్వతి గుహ భోజ్పూర్ లో తప్పక చూడవలసిన ప్రదేశం. ఇది భోజేశ్వర్ ఆలయానికి ఎదురుగా ఉన్నది. ఈ గుహలో క్రీ. శ. 11 వ శతాబ్ద కాలానికి చెందిన అనేక రాతి నిర్మాణాలు, పురాతన శిల్పాలు కలవు.

పార్వతి గుహ

పార్వతి గుహ

చిత్ర కృప : Zippymarmalade

పర్యాటకులు ఇక్కడ ఉన్న భోజుపూర్ దేవాలయం మరియు పార్వతి గుహ ఒక పురాతన ప్రపంచంలోకి తీసుకెళ్తాయి అనటంలో అతిశయోక్తి లేదు.

జైన దేవాలయం

జైన దేవాలయాలు భోజేశ్వర్ ఆలయానికి సమీపంలో ఉన్నాయి. ఈ ఆలయంలో కూడా అన్ని అజిన దేవాలయాల వలెనే మూడు తీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయి. వీటిలో ఒకటి వర్ధమాన మహావీరుని విగ్రహం 20 అడుగుల విగ్రహం, మిగిలిన రెండు విగ్రహాలు పార్శ్వనాథుడువి గా ఉన్నాయి.

జైన దేవాలయం

జైన దేవాలయం

చిత్ర కృప : Atishay Jain

భిమేత్క గుహలు

నగరం నుండి కొద్దిగా వెళితే, 20కి.మీ. అవతల భిమేత్క ఉన్నది. ఇక్కడి రాక్ చిత్రాలు యొక్క గొప్ప సమూహం మిమ్మలిని ఆకర్షిస్తుంది. ప్రపంచంలో ఉత్తమమైన వాటిలో ఒకటిగా భిమేత్క ను వరల్డ్ హెరిటేజ్ సెంటర్ యునెస్‌కో గుర్తించింది.

మీకు సమయం ఉంటె భోజాస్ రాయల్ ప్యాలెస్, రాక్ డ్రాయింగ్స్ మరియు క్వారీ చూసిరండి.

భిమేత్క గుహలు

భిమేత్క గుహలు

చిత్ర కృప : Tanujdeshmukh

భోజ్పూర్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు / బస్సు మార్గం : భోజ్పూర్ నుండి బస్సు మార్గం ద్వారా భోపాల్ కు మంచి కనెక్టివిటీ ఉన్నది. భోపాల్ కు హైవే చేరువలో ఉండటం వలన, ఇది సమర్థవంతమైన అంతర రాష్ట్ర రోడ్డు రవాణా సౌకర్యాలను కలిగి ఉన్నది.

రైలు మార్గం : భోజ్పూర్ కు సమీపాన భోపాల్ రైల్వే స్టేషన్ కలదు. దేశం యొక్క దాదాపు అన్ని ప్రదేశాలకు ఈ రైల్వే స్టేషన్ కనెక్ట్ అయి ఉన్నది.

విమాన మార్గం : భోజ్పూర్ కు సమీపాన భోపాల్ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X