Search
  • Follow NativePlanet
Share
» »మూడో మంత్రాలయంగా పిలవబడుతున్న బిచ్చాలి గ్రామం

మూడో మంత్రాలయంగా పిలవబడుతున్న బిచ్చాలి గ్రామం

బిచ్చాలి గ్రామం పవిత్ర పుణ్యక్షేత్రం. మంత్రాలయం నుండి 20 కి.మీ దూరంలో ఉంది. మంత్రాలయం నుండి బిచ్చాలికి 30 ని. పడుతుంది. ఈ గ్రామం "శ్రీ రాఘవేంద్ర స్వామి" తన జీవితంలో 12 సంవత్సరాలు గడిపిన పవిత్ర ప్రదేశం

By Venkata Karunasri Nalluru

"బిచ్చాలి", మంత్రాలయ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తులకు చాలా ముఖ్యమైన ప్రదేశం. "బిచ్చాలి" అనగా "భిక్షాలయం". ఈ నిర్మలమైన స్థలం కర్ణాటకలో వుంది. అయితే మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో ఉంది. 2009 సం. లో మంత్రాలయాన్ని వరదలు ముంచెత్తడంతో బిచ్చాలి గ్రామం మొత్తం మునిగిపోయింది. అప్పటి శిధిలాలు ఇప్పటికీ పరిసరాల్లో కనిపిస్తాయి.

మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఆలయం:

Bichali – A Place Known As The Third Mantralaya

PC : Sameera Bellary

బిచ్చాలి యొక్క పురాణం:

"బిచ్చాలి" గ్రామం "శ్రీ రాఘవేంద్ర స్వామి" భక్తుడైన "శ్రీ అప్పనాచార్యుని" గూర్చి తెలుపుతుంది. "అప్పనాచార్యుడు" వేదాలు మరియు ఉపనిషత్తులు బోధించేవాడు. ఒక గొప్ప పండితుడు. ఇతను ఒక సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ భిక్షాటనంను వృత్తిగా స్వీకరించి నిరాడంబరమైన జీవితంను గడిపారు. అతను తన విద్యార్ధులు, ఋషులు యొక్క జీవితం అర్థం చేసుకోటానికి వేదాలలో వివరించినట్లుగా భిక్ష వేడుకోవాలని ప్రోత్సహించారు. శిష్యులు భిక్షగా తీసుకువచ్చిన బియ్యాన్ని ఒక గుడ్డలో మూటగా కట్టి సమీపంలో గల ఒక గమ్ చెట్టు కొమ్మకి వేలాడదీస్తారు. "అప్పనాచార్యుడు" తన ఉపన్యాసం పూర్తి చేసేటప్పటికి బియ్యం దానంతటకదే ఉడికిపోయేది.

Bichali – A Place Known As The Third Mantralaya

PC : Sameera Bellary

ఈ స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మంత్రాలయం వద్ద బృందావనంలో ప్రవేశించే తేదీ నిర్ణయించుకున్న చోటు అని చెబుతారు.

బిచ్చాలిలో బృందావనం యొక్క నిర్మాణం:

శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావన ప్రవేశం తర్వాత "అప్పనాచార్యుడు" ప్రతి రోజు తుంగభద్ర నది గుండా "శ్రీ రాఘవేంద్ర స్వామి" ని చూచుటకు మంత్రాలయానికి వెళ్ళేవారు. తన గొప్ప భక్తుడు యొక్క దురవస్థ చూడలేక ఒక రోజున శ్రీ రాఘవేంద్ర స్వామి అప్పనాచార్యుని కలలో కనపడి, తుంగభద్ర నదీ తీరంలో ఏకశిలా బృందావనాన్ని స్థాపించి ఆచారాలు, పూజలు నిర్వహించమని చెప్తాడు. బృందావనం వద్ద పొంగిపొరలే తుంగభద్ర నది చుట్టూ ప్రశాంతత గల స్థలంలో ఆత్మానందం కలుగుతుంది.

Bichali – A Place Known As The Third Mantralaya

PC : Sameera Bellary

బిచ్చాలి గ్రామంలో అప్పనాచార్యుని యొక్క నివాసం:

అప్పనాచార్యుని యింటి శిధిలాలు బిచ్చాలి దగ్గరలో గల మరొక ఆకర్షణ. ఇక్కడ రాఘవేంద్ర స్వామి 12 సం. లు నివసించారు. ఆ ఇంట్లో ఒక గదిలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం మరొక గదిలో నాగదేవత విగ్రహం వుంది. శ్రీ రాఘవేంద్ర స్వామి నిద్ర పోయే స్థలాన్ని సూచిస్తూ ఆ ఇంటిలో కొన్ని గుర్తులు ఉన్నాయి. ఇక్కడ అప్పనాచార్యుడు ప్రతి రోజు రాఘవేంద్ర స్వామి కోసం రోకలి ఉపయోగించి పచ్చడిని తయారుచేసేవారు. ఈ రుబ్బు రోలును ఇక్కడ చూడవచ్చును.

Bichali – A Place Known As The Third Mantralaya

PC : Sameera Bellary

బిచ్చాలి గ్రామంలో జరుపుకొనే పండుగలు:

బిచ్చాలిలో మంత్రాలయంలో ఏవిధంగా జరుగుతుందో అదే విధంగా శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన మూడు రోజులు గొప్పగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు అనేక మంది భక్తులు తరలి వస్తారు.

బిచ్చాలి గ్రామంలో వసతులు:

ఇక్కడ ఏ విధమైన వసతి సౌకర్యాలు లేవు. ఎందుకంటే బిచ్చాలి ఒక గ్రామం. అయితే మంత్రాలయలో అనేక హోటళ్ళు, లాడ్జీలు అద్దెకు అందుబాటులో ఉన్నాయి.

Bichali – A Place Known As The Third Mantralaya

PC : Sameera Bellary

బిచ్చాలి చేరటానికి:

మంత్రాలయ ఆలయం నుండి బిచ్చాలి చేరుకోటానికి అనేక ఆటో రిక్షాలు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ఒక ప్రైవేట్ టాక్సీలో ప్రయాణం చేసి అక్కడకు దగ్గరలో గల పంచముఖి ఆంజనేయ ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు లక్ష్మీ ఆలయం వంటి బిచ్చాలి చుట్టూ వున్న ఇతర ఆలయాలు చూడవచ్చును.

బిచ్చాలి సందర్శించడానికి ఉత్తమ సమయం:

అక్టోబర్ నుండి డిసెంబర్ నెలల మధ్యలో వాతావరణంలో వేడి తక్కువగా వుంటుంది. బిచ్చాలిని సందర్శించటానికి ఇది అనువైన సమయం. నదిలో నీటి స్థాయిలు కూడా తక్కువగా ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X