Search
  • Follow NativePlanet
Share
» »బిందు : భారత్ - భూటాన్ సరిహద్దు ప్రదేశం !!

బిందు : భారత్ - భూటాన్ సరిహద్దు ప్రదేశం !!

నిజమైన బాహ్య, ప్రకృతి ప్రేమికులు విశ్లేషించడానికి బిండు పర్యాటకం ఆదర్శ ప్రాంతంగా భావిస్తారు. ఈ ప్రదేశం శిబిరాలను వేసుకోవడం, భోగి మంటలు ఇష్టపడే ప్రయాణికులకు సరైన ప్రదేశం.

By Mohammad

పర్యాటకులు భూటాన్ నుండి ప్రయాణం చేయాలనుకుంటే ఇది ఖచ్చితంగా అందమైన, పూర్తీ సుందరమైనదిగా ఉంటుంది. దట్టమైన టీ తోటల గుండా రహదారులు ఉంటాయి, బిందులో దారులతో సహా చిన్న ప్రశాంత గ్రామాలూ చిరస్మరణీయ ప్రయాణం. నిజమైన బాహ్య, ప్రకృతి ప్రేమికులు విశ్లేషించడానికి బిందు పర్యాటకం ఆదర్శ ప్రాంతంగా భావిస్తారు. ఈ ప్రదేశం శిబిరాలను వేసుకోవడం, భోగి మంటలు ఇష్టపడే ప్రయాణికులకు ఈ కార్యక్రమాలను ఆనందించడానికి ఇది సరైన ప్రదేశం.

బిందు లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

ఈ గ్రామానికి కుడివైపునుండి ప్రవహించే జల్ధక సెలయేరు బిందు లో అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. ఫోటోగ్రఫి ప్రియులు కొన్ని అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కోసం ఈ స్థలాన్ని సందర్శించవచ్చు. జల్ధక నదిపై ఉన్న బిందు ఆనకట్ట ముగ్దమనోహర అందాన్ని కలిగిఉంది. జల్ధక హైడల్ ప్రాజెక్ట్ నీటి సరఫరా కోసం ఈ డాం పై ఆధారపడి ఉంది.

బిందు వాతావరణం

బిందు వాతావరణం

చిత్రకృప : Abhijit Kar Gupta

బిందు డాం

బిందు రోడ్డు గురించి చెప్పినవారు బిందు ఆనకట్ట గురించి కూడా చెప్తారు. ఈ డామ్ జల్ధక నది పై ఉంది. రబ్బరు తోటలు, అందంగా తయారుచేయబడిన ఈ ప్రదేశం, చాయాచిత్రగ్రాహకులకు ప్రయోగం కోసం ఎన్నో దృశ్యాలను అందిస్తుంది.

బిందు నుండి భూటాన్ వెళ్ళే మార్గంలో ఉంటే, ముందుకు వెళ్ళే ముందు ప్రశాంతత కోసం కొన్ని నిముషాలు ఆగడం మర్చిపోవద్దు. బిందు లో శీతాకాలంలో మంచుతో కప్పబడిన అద్భుతమైన పర్వత శిఖరాలు కళ్ళు చెదిరేలా చేస్తాయి. ఈ పర్వతాలే కాకుండా, శీతాకాలంలో మాత్రమె కనిపించే అనేక ఇతర ఆశ్చర్యపరిచే సుందర దృశ్యాలు కూడా ఉన్నాయి. జల్ధక హైడల్ ప్రాజెక్ట్ బిందు డాం నుండి నీటిని సరఫరా చేసుకుంటుంది.

బిందు డ్యాం

బిందు డ్యాం

బిందు వద్ద హైకింగ్

బిందులో కొన్ని సమూహాలు చిన్న హైకింగ్ యాత్రలను ప్రతిపాదిస్తున్నాయి, వాటిలో అత్యంత ప్రసిద్ది పొందినవి టోడెయ్ నుండి టంగ్ట , నేరోర వాలీ నేషనల్ పార్క్ కి. ఇవి కాలింపాంగ్ అనే దిగవ ప్రాంతాలలో, హిమాలయాల దిగువ ప్రాంతాల ద్వారా ఉన్నాయి.

స్టే చేయడం, షాపింగ్

బిందు లోని కొన్ని హోటళ్ళు సౌకర్యవంతమైన వసతిని కల్పిస్తున్నాయి. పర్యాటకులు ప్రయాణం చేసి వచ్చిన తరువాత అలసిపోయి ఇక్కడ ఉండవచ్చు. శివాజీ ఇన్ అనే స్థలం మంచి పాకేజ్ ని అందిస్తుంది.

బిందు జ్ఞాపకాలుగా తెచ్చుకునే వస్తువుల సాధారణ సంప్రదాయ ఉత్పత్తుల ఒక చిన్న స్థానిక మార్కెట్ ను కలిగి ఉంది. సిలిగురి కి దగ్గరగా ఉన్న బిందు లో విమానాశ్రయం కూడా ఉంది. ఇక్కడి నుండి సిలిగురికి, అక్కడి నుండి ఇక్కడికి రోడ్డు ప్రయాణం షుమారు 3 గంటలు పడుతుంది.

జల్దక సెలయేరు

జల్దక సెలయేరు

చిత్రకృప : Sudeshnapal

బిందు సందర్శనకు సరైన సమయం : అక్టోబర్ తరువాత బిందు సందర్శన సరైనది.

బిందు కు సమీపాన ఉన్న పెద్ద పట్టణం మరియు జిల్లా డార్జీలింగ్. డార్జీలింగ్ టీ తోటలకు, నాణ్యతకు ప్రసిద్ధి చెందినది. డార్జీలింగ్ లో ప్రధానంగా చూడవలసినవి కొన్ని ఉన్నాయి. వాటిలో బతసియా లూప్ యుద్ధ స్మారకం, కేబుల్ కార్, డార్జీలింగ్ - హిమాలయాన్ రైల్వే, హ్యాపీ వాలీ టీ ఎస్టేట్స్, ల్లొయాడ్స్ బొటానికల్ గార్డెన్, వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం మొదలగునవి ఇక్కడ చూడవచ్చు. డార్జీలింగ్ స్థానిక వంటలైన మోమోలు పర్యాటకులు తప్పక రుచి చూస్తారు. ఇది రుచి చూడకపోతే పర్యటన పూర్తి కాదు.

ఇది కూడా చదవండి : డార్జీలింగ్ -భారతదేశ 'టీ' స్వర్గం !

వసతి

డార్జీలింగ్ లో వసతి సదుపాయాలు ఉన్నాయి. పర్యాటకులు ఇక్కడ బస చేయటానికి ఏసీ, నాన్ - ఏసీ తదితర తరగతుల గదులు అద్దెకు దొరుకుతాయి. డార్జీలింగ్ ఉత్తర భారతదేశంలో రానున్న వేసవిలో తప్పక చూడవలసిన పర్యాటక గమ్యస్థానం. బిందు లో కూడా వసతి సౌకర్యాలు లభిస్తాయి.

టీ తోటలు

టీ తోటలు

చిత్రకృప : Anilbharadwaj125

బిందు ఎలా చేరుకోవాలి ?

  • విమాన మార్గం : సిలిగురి విమానాశ్రయం బిందు కు సమీపాన కలదు. ఈ విమానాశ్రయం కోల్కతా, గౌహతి కు చక్కగా అనుసంధానించబడింది. ఎయిర్ పోర్ట్ బయట క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని బిందు చేరుకోవచ్చు.
  • రైలు మార్గం : బిందు లో రైల్వే స్టేషన్ లేదు. సిలిగురి సమీప రైల్వే స్టేషన్. గౌహతి, కోల్కతా, ఖరగ్పూర్, కాన్పూర్ తదితర ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్ళు వస్తాయి. సిలిగురి నుండి బిందు 101 కిలోమీటర్ల దూరంలో కలదు.
  • రోడ్డు మార్గం : బిందు గుండా జాతీయ రహదారి 31 వెళుతుంది. సిలిగురి, డార్జీలింగ్ నుండి బిందు కు ప్రభుత్వ/ప్రవేట్ బస్సులు తిరుగుతాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X