Search
  • Follow NativePlanet
Share
» »ముంబై నగర విహంగ విహారం !

ముంబై నగర విహంగ విహారం !

ముంబై అనగానే అందరికీ బిజి లైఫ్, నగర ట్రాఫిక్, అతి పెద్ద భవనాలు గుర్తుకు వస్తాయి. అయితే, ముంబై నగరం పక్షి ప్రియులకు ఒక మంచి స్వర్గంలా కూడా వుంటుంది. ముంబై సారవంతమైన కొంకన్ భూమిలో కలదు. చుట్టూ సహ్యాద్రి పర్వత శ్రేణులు, పడమటి కనుమలు, అనేక కొలనులు వంటి వాటితో పక్షులకు ఒక మంచి స్థావరంగా కూడా వుంది.

స్థానిక పక్షుల నుండి, విదేశీ పక్షుల వరకు ముంబై లో మీకు కనపడతాయి. ఎత్తైన భవనాలు, సరస్సులు, కొలనులు, తేమ భూములు, ఎక్కడ పడితే అక్కడ మీకు అవి దర్శనమిస్తాయి. మీకు కావలసినదల్లా, వాటిని చూడాలన్న ఆసక్తి. మరి ఈ విహంగ వీక్షణ కొరకు మీరు ఒక మంచి బైనాక్యులర్స్ తో పాటు, చక్కని సహనత కూడా కలిగి వుండాలి.

 అరుదైన పక్షులు

అరుదైన పక్షులు

పక్షి అభిమానులు ఇక్కడ అరుదైన వివిధ జాతుల పక్షులు చూడవచ్చు. గ్రేట్, మలబార్, పీద్ హార్న్ బిల్ల్స్, మలబార్ త్రోగోన్, గోల్డెన్ ఒరియోల్, కామన్ అయోరా, వైట్ స్తార్క్ వంటివి కనబడతాయి.

Photo Courtesy: Peter Broster

కర్నాల బర్డ్ సాన్క్చురి

కర్నాల బర్డ్ సాన్క్చురి

కర్నాల ప్రదేశంలోనే మీరు సుమారు 150 రకాల పక్షులు చూడవచ్చు. కర్నాల బర్డ్ సాన్క్చురి లో ప్రధానంగా, ఆశి మినివేట్, హార్ట్ స్పాట్ వుడ్ పెక్కర్స్ వంటివి కనపడతాయి. కర్నాల ఫోర్ట్ నుండి ఈ ప్రాంతానికి వలసలు వస్తూ ఎగిరి పక్షులు చూడవచ్చు.

Photo Courtesy: Elroy Serrao

సరస్సులు

సరస్సులు

వలస పక్షుల సంతానోత్పత్తి సమయంలో ముంబై సరస్సులు అందమైన నీటి పక్షులను స్వాగతిస్తాయి. సుందరమైన ఈ సరస్సులలో కల పచ్చటి ప్రాంతాలు ఈ పక్షులకు సహజ, సౌకర్యవంతమైన వసతి కల్పిస్తాయి.

Photo Courtesy: Michael Kohli

ఎగ్రేట్ పక్షులు

ఎగ్రేట్ పక్షులు

ఎగ్రేట్ లో కేటేల్ లార్జ్, మీడియం, వెస్ట్రన్ రీఫ్ వంటివి ఇక్కడ బాగా కనపడతాయి. మరింత ఆసక్తి కలవారు వాటిని సమీపంలో చూసేందుకు అడవులలోకి కూడా వెళతారు.

Photo Courtesy: Mangrove Mike

హేరాన్స్

హేరాన్స్

ఇండియన్ పాండ్ హెరాన్, బ్లాకు క్రౌన్ నైట్ హెరాన్, గ్రే హెరాన్, పర్పుల్ హెరాన్ వంటివి కూడా ముంబై లో చూడవచ్చు.

Photo Courtesy: Jan Arendtsz

ఎన్నో రకాలు

ఎన్నో రకాలు

ముంబై నగరం మొత్తంగా సుమారు 350 రకాల పక్షులు చూడవచ్చు. గ్రేటర్ రాకెట్ టైల్ ద్రోన్గో, ఫ్లై కేచార్, మాగ్పీ రాబిన్, మలబార్ విజిలింగ్ ట్రాష్, గోల్డెన్ బ్యాక్ వుడ్ పెక్కర్, సేర్పెంట్ ఈగిల్ వంటివి కూడా కనపడతాయి.

ఫ్లామింగో పక్షులు

ఫ్లామింగో పక్షులు

ఫ్లామింగో పక్షులు ఫోటోలకు బాగుంటాయి. ఈ పక్షుల గుంపులు సాధారణంగా సమూహాలలో దూర తీరాలకు వససలు పోయే దృశ్యం కన్నులకు ఇంపుగా వుంటుంది. దేవ దూతల వంటి ఈ పక్షులను చూసేందుకు మీరు తానే క్రీక్ మరియు యురాన్ క్రీక్ ప్రదేశాలు ఎంపిక చేయవచ్చు.

Photo Courtesy: Brian Ralphs

ఎక్కడ అధికం ?

ఎక్కడ అధికం ?

పక్షులు అధికంగా వుండే స్థావరాలు, నవి ముంబై, తానే క్రీక్, స్వారి, ఎలి ఫేంట ఐలాండ్, సంజయ్ గాంధి నేషనల్ పార్క్, ఉరాన్ క్రీక్, ఖర్ఘర్ హిల్స్, భాన్ దూప్ , ములుంద్, మాతేరాన్, వంటి ప్రదేశాలలోనూ దక్షిణ ముంబై లోను ఈ పక్షులు చూడవచ్చు.

Photo Courtesy: Michael Kohli

సంతానోత్పతి సీజన్

సంతానోత్పతి సీజన్

ముంబై లో పక్షుల విహారం చూసి ఆనందించాలంటే, అధిక సంతానోత్పత్తి సమయం అయిన డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకూ సరైన సమయం.

Photo Courtesy: Thimindu Goonatillake

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X