Search
  • Follow NativePlanet
Share
» »ఐపీఎల్ స్టార్లు... పుట్టిన ప్రదేశాలు!!

ఐపీఎల్ స్టార్లు... పుట్టిన ప్రదేశాలు!!

క్రికెట్...ఇప్పుడు భారత దేశంలో ఒక ప్రధాన క్రీడగా క్రికెట్ అభిమానులు పిలుస్తారు. ఇంతవరకు డే మ్యాచ్ లు...టెస్టులు....ఆఖరికి వరల్డ్ కప్ అని ఉండేది కానీ ఇప్పుడు ఇక్కడ కూడా ఐపీఎల్ అని ఒకటి ఏర్పడింది. దీనిలో ప్రాంతాల వారీగా టీమ్ లు ఉంటాయి. ఉదాహరణకి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా... ఇలా ఉంటాయి. మీరు ఇంతవరకు ఏ దేశం వాళ్ళు ఆదేశ జట్టులోనే ఆడేవాళ్ళు అని తెలుసు. కానీ ఐపీఎల్ అలా కాదు. అన్ని దేశాల ఆటగాళ్లు ఒక్కొక్క టీమ్ లో ఉంటారు. ఇందులో ఆటగాళ్లను వేలంపాటలో కొంటారు. ఒక్కొక్క ఆటగాడిని లక్షలు, కోట్లు పెట్టికొంటారు. అందుకే దీనికంత క్రేజ్. కరెక్టుగా ప్రతి ఏడాది ఏప్రిల్-మే నెలలో ప్రారంభమవుతుంది.

భారత క్రికెటర్ల గురించి తెలుసుకోవాలని చాలా మంది క్రికెట్ అభిమానులకి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ అభిమాన స్టార్ క్రికెటర్లు ఎక్కడ పుట్టారో మరియు ఆ ప్రాంతం విశేషాలేమిటో ఒకసారి తెలుసుకుందాం...

ఫ్రీ కూపన్లు : హోటల్స్ & ట్రావెల్ బుకింగ్స్ చేసుకోండి 70% ఆఫర్ పొందండి

మహేంద్ర సింగ్ ధోని- రాంచి

మహేంద్ర సింగ్ ధోని- రాంచి

జార్ఖండ్ రాజధాని రాంచి. దీనిని "జలపాతాలు మరియు సరస్సుల నగరం" అని కూడా పిలుస్తారు. సంవత్సరంలో ఎప్పుడైనను ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు. రాంచి ఒక పర్వత స్థలాకృతి కలిగి మరియు దట్టమైన ఉష్ణమండల అడవుల కలయికతో రాష్ట్ర ఇతర ప్రాంతాలతో పోల్చినపుడు ఒక ఆధునిక శీతోష్ణస్థితిని కలిగి ఉంటుంది. గతంలో ఇది బ్రిటిష్ పాలనలో ఒక 'హిల్ స్టేషన్' హోదాను పొందింది. వేగవంతమైన జనాభా పెరుగుదల, పారిశ్రామిక విధానంలో కొత్తదనం చేకూరి ప్రస్తుతం ఒక మెట్రోపాలిటన్ సిటీ గా అవతరిస్తున్నది. ఈ సిటీకి మరొక ప్రత్యేక ఆకర్షణ మహేంద్ర సింగ్ ధోని. ఎందుకంటే ఆయన ఇక్కడే పుట్టారు. ప్రస్తుతం ఆయన భారత క్రికెట్ జట్టుకి సారధ్యం వహిస్తూ, చెన్నై సూపర్ కింగ్స్ కి కూడా కెప్టన్ గా వ్యవహరిస్తున్నారు.

Photo Courtesy: Native Planet / thatsCRICKET.com

విరాట్ కోహ్లి- ఢిల్లీ

విరాట్ కోహ్లి- ఢిల్లీ

ఢిల్లీ... దీనిని దిల్లి అని కూడా పిలుస్తారు. ఇది దేశ రాజధాని మాత్రమేకాదు ఒక కేంద్ర పాలిత ప్రాంతం. దేశంలో జనాభా పరంగా ముంబై మహానగరం తరువాత అత్యధికంగా జనాభాగల ప్రదేశం. ప్రపంచపు వారసత్వపు సంపదగా ఉన్న తాజ్‌మహల్ ఇక్కడికి చేరువలో ఉన్న కట్టడం. అంతే కాదు ఢిల్లీ ఒక అధునాతన నాగరికతకు అలవాటు పడుతున్న కేంద్రం. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు అనేకం. వాటిలో కుతుబ్ మినార్, ఎర్రకోట, ఇండియన్ గేట్, జంతర్‌మంతర్ ఇలా అనేకం ఉన్నాయి. ఇక్కడే విరాట్ కోహ్లి పుట్టినాడు. ఇతను భారత జట్టులో కీలకమైన ఆటగాడు. జట్టుని నడిపించడంలో ధోని తరువాత ఇతనే. ప్రస్తుతం భారత జట్టుకి వైస్ కెప్టన్ గా ఉన్నాడు. ఐపీఎల్ లో ఇతను బెంగళూరు జట్టుకి కెప్టన్ గా వ్యవహరిస్తున్నాడు.

Photo Courtesy: Neel.kapur / thatsCRICKET.com

యువరాజ్ సింగ్ - చంఢీఘర్

యువరాజ్ సింగ్ - చంఢీఘర్

చంఢీఘర్... ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఈ ప్రాంతానికి ఉన్న మరొక విశేషం ఏమిటంటే- ఇది రెండు రాష్ట్రాలకు రాజధాని అవి వరుసగా పంజాబ్ మరియు హర్యానా. ఒక ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ అయిన లీ కార్బూసియర్ పట్టణ ప్రణాళికతో 1950 వ సమయంలో చండీగఢ్ నగరం రూపొందించబడింది. ఇక్కడకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. లే కోర్బూసియర్ 'ఓపెన్ హ్యాండ్' తో అతి పెద్ద సృష్టి చేసిన కాపిటల్ కాంప్లెక్స్ నగరం లోపల ఉంది. హౌసింగ్ మూడు సంస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థ మరియు నగరం చిహ్నంగా ఉన్నది. కాపిటల్ కాంప్లెక్స్ చండీగఢ్ సందర్శించే పర్యాటకులకు ఒక ప్రధాన ఆకర్షణగా ఉంది. చండీగఢ్ పర్యాటణకు ఒక ఊపును తీసుకువచ్చే మరొక ప్రసిద్ధ ప్రదేశం రాక్ గార్డెన్. ఇది సంస్కృతి మరియు కళ యొక్క నివాసంగా ఉండి అంతర్జాతీయంగా మెప్పు పొందినది. ఇంకా నగరంలో అంతర్జాతీయ డాల్స్ మ్యూజియం మరియు ప్రభుత్వ మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీ వంటి ఆసక్తికరమైన వస్తుప్రదర్శనశాలలకు స్థావరంగా ఉంది. ఇది భారత క్రికెట్ జట్టులోని బ్యాట్స్‌మన్ అయిన యువరాజ్ సింగ్ పుట్టిన ప్రదేశం. ఇతను 2011 వరల్డ్ కప్ లో అత్యద్భుతమైన ప్రదర్శన కనబరచి మ్యాన్ ఆఫ్ ద సీరీస్ కీవాసం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్ విషయానికొస్తే మొదట ఇతను పంజాబ్ ఎలెవన్ లో ఆటగాడిగా, పూణే వారియర్స్ లో సభ్యునిగా, బెంగళూరు జట్టులో ఆటగానిగా రాణించాడు. ప్రస్తుతం ఈ సంవత్సరం లో ఇతనిని ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో చూడవచ్చు.

Photo Courtesy: Rod Waddington / thatsCRICKET.com

మురళి విజయ్- చెన్నై

మురళి విజయ్- చెన్నై

చెన్నై లేదా చెన్నపట్టణం లేదా మద్రాస్... ప్రస్తుత తమిళనాడు రాజధాని మరియు ఒక మెట్రోపాలిటన్ నగరం. ఇది కోరమండల్ తీరంలో ఉన్నది. ఇది దక్షిణ భారతదేశం అత్యంత ముఖ్యమైన నగరాల్లో ఒకటి, అలాగే దేశంలో వాణిజ్యం, సంస్కృతి, విద్య మరియు ఆర్ధిక పరంగా కూడా ఈ నగరం ముఖ్యమైనదే. వాస్తవానికి, చెన్నై ప్రముఖంగా దక్షిణ భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధానిగా పేరు పొందింది. టూరిజం పరంగా చూసినట్లయితే ఇక్కడ చాలా వరకు ప్రసిద్ది చెందిన ఆలయాలు, బీచ్ లు , హిల్ స్టేషన్ లు ఈ ప్రదేశం చుట్టూ ఉన్నాయి. అంతే కాదు జాతీయ వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం గిండి నేషనల్ పార్క్ ఇక్కడనే ఉంది. మురళి విజయ్ అనే ఆటగాడు పుట్టింది ఇక్కడనే. ఇతను కూడా ఒక కొత్త బ్యాట్స్‌మన్. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో ఆటగాడిగా రాణించాడు. ప్రస్తుతం ఈ సంవత్సరంలో పంజాబ్ ఎలెవన్ లో ఇతనిని చూడవచ్చు.

Photo Courtesy: Sarath Kuchi / thatsCRICKET.com

రాబిన్ ఉతప్ప - కూర్గ్

రాబిన్ ఉతప్ప - కూర్గ్

కూర్గ్ లేదా కొడగు పట్టణం కర్నాటక లోని ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది పడమటి కనుమల మల్నాడు ప్రాంతంలో కర్నాటకలోని నైరుతి ప్రాంతంలో కలదు. ఈ ప్రాంతం ప్రధానంగా పర్వతమయం. కూర్గ్ ను ఇండియాలోని స్కాట్ లాండ్ అంటారు. మరో రకంగా కర్నాటకలోని కాశ్మీర్ అని కూడా అంటారు. ఎల్లపుడూ పచ్చగా ఉండే అడవులు, లోయలు, మంచుపడే కొండ ప్రాంతాలు, విస్తారించిన కాఫీ తోటలు, టీ ఎస్టేట్లు, నారింజ తోటలు, ఎత్తైన శిఖరాలు వేగంగా ప్రవహించే జలపాతాలు, దీనికి ఆ పేరు తెచ్చి పెట్టాయి. ట్రెక్కింగ్, గోల్ఫ్, చేపలు పట్టుట, రివర్ ర్యాఫ్టింగ్ వంటి వాటికి ఎన్నో అవకాశాలు కలవు. రాబిన్ ఉతప్ప అనే ఇండియన్ క్రికెటర్ ఇక్కడే పుట్టినాడు. ఇతను ఒక వికెట్ కీపర్ గా మరియు బ్యాట్స్‌మన్ గా రాణిస్తున్నాడు. ఈ ఆటగాడు ఎన్నో ఐపీఎల్ టీమ్ లలో ఆడినాడు అవి వరుసగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలేంజర్స్ బెంగళూరు, పూణే వారియర్స్. ప్రస్తుతం ఇతను కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్ లో ఆటగానిగా చూడవచ్చు.

Photo Courtesy: Native Planet / thatsCRICKET.com

రోహిత్ శర్మ - నాగ్‌పూర్

రోహిత్ శర్మ - నాగ్‌పూర్

"నారింజ నగరం" గా పిలవబడే నాగపూర్ మహారాష్ట్రలో ఒక ముఖ్యమైన నగరం. ముంబై, పూణేల తరువాత ఇది మూడవ అతి పెద్ద నగరం. దీన్నే ‘భారత దేశపు పులుల రాజధాని' అని కూడా అంటారు. గోండ్ వంశస్తులు స్థాపించిన నాగపూర్ నగరాన్ని తర్వాత మరాఠా భోంస్లే రాజులు హస్తగతం చేసుకున్నారు. అనంతర కాలంలో బ్రిటీష్ వారు చేజిక్కించుకుని దీనిని సెంట్రల్ ప్రావిన్సెస్ కు రాజధాని గా చేశారు. ఆసక్తికరంగా నాగపూర్ కి సర్పంలా కదిలే నాగ అనే నది నుంచి, సంస్కృతం, హిందీ లలో నగరాల్ని సూచించే ఉపచయం ‘పూర్' తో కలిసి - నాగపూర్ అనే పేరు వచ్చింది. ఈ నగరంపై విడుదల చేసిన తపాల బిళ్ళ పై కూడా ఇప్పటికీ పాము బొమ్మ వుంటుంది. డెక్కన్ పీఠ భూమి లో 310 మీటర్ల ఎత్తులో వుండి దాదాపు 10000 చదరపు కిలోమీటర్ల మేర నాగపూర్ విస్తరించి వుంది. నాగపూర్ పచ్చని వాతావరణం కలిగిన నగరం గా పేరుపొందింది, చండీగడ్ తర్వాత హరిత నగరం ఇదే. మహారాష్ట్రకు ముంబై తర్వాత ఇది రెండో రాజధాని. ఇండియన్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇక్కడనే పుట్టినాడు. ఇతను భారత జట్టులో ఓపెనర్ గా రాణిస్తున్నాడు. ఇతను ముంబై ఇండియన్స్ టీమ్ లో కెప్టన్ గా వ్యవహరిస్తున్నాడు.

Photo Courtesy: Dharmit Shah / thatsCRICKET.com

ధావల్ కుల్కర్ణి - ముంబై

ధావల్ కుల్కర్ణి - ముంబై

ముంబై - ఈ ప్రాంతం మహారాష్ట్ర రాజధాని. భారత దేశంలో చెప్పుకునే ప్రదేశాలలో ముందు వరుసలో ఏదైన ఉంది అంటే ఆది ముంబై మహా నగరమే. ఈ నగరం అన్ని జాతుల కలయికలతో కలసి ఉంది. ఫ్యాషన్ ప్రపంచానికి, భారత చలన చిత్ర రంగానికి ఈ నగరమే పునాది. ముంబై నగరంలో మీకు అన్నీ లభ్యమవుతాయి. తినే ఆహారాలు, షాపింగ్ నుండి సైట్ సీయింగ్ నుండి ఎంతో ఘనంగా చెప్పుకునే రాత్రి జీవిత విధానాలవరకు మీకు ఈ నగరం అందిస్తుంది. నగరం అందించే అనేక ప్రసిద్ధ బ్రాండు వస్తువులే కాక మీరు ఫ్యాషన్ స్ట్రీట్ లోను మరియు బంద్రాలోని లింకింగ్ రోడ్ లోను రోడ్ సైడ్ షాపింగులు చేసి ఆనందించవచ్చు. ఎండవేళ మధ్యాహ్నాలు బీచ్ లలో ఆనందించవచ్చు. పిక్ నిక్ లు పెట్టుకోవచ్చు. బీచ్ లలోని ఆహారాలు సిగ్నేచర్ శాండ్ విచ్ లు, కుల్ఫి, ఫలూదా, పానీ పూరి లేదా మహారాష్ట్ర స్వంత వంటకం వడా పావు వంటివి వివిధ రకాలుగా తినవచ్చు. ధావల్ కుల్కర్ణి, ముంబై మహా నగరం లో పుట్టినాడు. ఇతను ఐపీఎల్ లో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న వర్ధమాన క్రికెటర్. ఐపీఎల్ లో మనము ఇతనిని తన సొంత టీమ్ ముంబై ఇండియన్స్ లో చూడవచ్చు. అంతకు ముందు 2014 లో రాజస్థాన్ రాయల్స్ జర్సీ లో ఆటాగానిగా రాణించాడు.

Photo Courtesy:garbyal / PTI

భువనేశ్వర్ కుమార్- బులంద్‌షహర్

భువనేశ్వర్ కుమార్- బులంద్‌షహర్

బులంద్‌షహర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బులంద్‌షహర్ జిల్లాలో ఉన్న ఒక నగరం. అంతేకాకుండా పరిపాలక రాజధానిగా కూడా ఉంది. ఈ ప్రాంతంలో మహాభారతం కాలంనాటి వారసత్వ మూలాలను కనుగోన్నారు. ఇక్కడ నిర్వహించిన అనేక త్రవ్వకాలలో దొరికిన పురాతన నాణేలు మరియు కళాఖండాలు ప్రస్తుతం లక్నో మ్యూజియంలో సంరక్షింపబడుతున్నాయి. ఈ ప్రాంతం పాండవుల రాజధాని హస్తినాపూర్ కు సమీపంలో ఉన్నది. ఇండియన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఈ చిన్న ప్రాంతం నుంచి వచ్చి బెంగళూరు రాయల్ , పూణే వారియర్స్ లో ఆడినాడు. ప్రస్తుతం ఇతనిని హైదరాబాద్ టీమ్ సన్‌రైసర్స్ లో చూడవచ్చు.

Photo Courtesy: Rajeev / PTI

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X