Search
  • Follow NativePlanet
Share
» »ఉదయగిరి కొండపై సుదర్శన చక్ర దర్శనం - బ్రహ్మంగారి కాలజ్ఞానం

ఉదయగిరి కొండపై సుదర్శన చక్ర దర్శనం - బ్రహ్మంగారి కాలజ్ఞానం

మానవునికి సంపూర్ణ ఆయుషును అందించే ఔషధముల తయారీకి ఉపయోగపడే ఔషధ మొక్కలు ప్రకృతి సిద్ధంగా లభించే నెల్లూరు జిల్లా ఉదయగిరి కొండను సంజీవ కొండ అంటారు.

By Venkatakarunasri

మానవునికి సంపూర్ణ ఆయుషును అందించే ఔషధముల తయారీకి ఉపయోగపడే ఔషధ మొక్కలు ప్రకృతి సిద్ధంగా లభించే నెల్లూరు జిల్లా ఉదయగిరి కొండను సంజీవ కొండ అంటారు.

సూర్యోదయ మొట్టమొదటి కిరణాలు 3079 అడుగుల ఎత్తు ఉన్న ఈ సంజీవ కొండపై పడుట వలన దీనికి ఉదయగిరి అని పేరు.

ఈ కారణంగానే సంజీవ కొండకు తూర్పు వైపున వున్న గ్రామానికి ఉదయగిరి అనే పేరు వచ్చింది.

ఈ సంజీవ కొండ నెల్లూరు నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో పడమర వైపు ఉన్నది. ప్రకృతి సిద్ధమైన కొండ, లోయలలోని పచ్చని చెట్లు రమణీయతను గొలుపుతూ చూడ ముచ్చటగా ఉంటాయి.

ఉదయగిరి కొండపై సుదర్శన చక్ర దర్శనం - బ్రహ్మంగారి కాలజ్ఞానం

 1. మనస్సును ఆహ్లాదపరిచే జలపాతాలు

1. మనస్సును ఆహ్లాదపరిచే జలపాతాలు

కొండపై నుంచి జారే జలపాతం, కొండపై నుంచి ప్రవహించే కాలువలలోని నీరు దాహార్తిని తీర్చడమే కాకుండా మనస్సును ఆహ్లాదపరుస్తాయి.

PC: YVSREDDY

 2. దాహార్తిని తీర్చే నీరు

2. దాహార్తిని తీర్చే నీరు

ఈ సంజీవ కొండపై నుంచి కాలువ ద్వారా ప్రవహించిన నీరు ఉదయగిరి గ్రామ వాసుల దాహార్తిని కూడా తీరుస్తుంది.

PC: YVSREDDY

3. ఎన్నో చారిత్రక నిర్మాణాలు

3. ఎన్నో చారిత్రక నిర్మాణాలు

ఈ కొండ మీద చారిత్రక నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి.

PC:wikimedia.org

4. రాతి మెట్ల సౌకర్యం

4. రాతి మెట్ల సౌకర్యం

ఈ కొండపైకి వెళ్లేందుకు కొంతవరకు వెడల్పయిన రాతి మెట్ల సౌకర్యం కలదు.

PC:Kabita.singh

5. కలియుగాంతం ముందు ఒక అద్భుతం

5. కలియుగాంతం ముందు ఒక అద్భుతం

నెల్లూరు జిల్లా చరిత్రలో ప్రసిద్ధిచెందిన ఉదయగిరి కొండపై కలియుగాంతం ముందు ఒక అద్భుతం జరుగుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు.

PC:Zippymarmalade

6. చక్రం దర్శనం

6. చక్రం దర్శనం

కలియుగ అంతానికి 20 ఏళ్ల ముందు ఒక పౌర్ణమి రోజు అర్ధరాత్రి 12 గంటలకు ఉదయగిరి కొండపై శ్రీ మహావిష్ణువు చక్రం దర్శనం ఇస్తుందని బ్రహ్మంగారు చెప్పారట.

PC:Ashishkumarnayak

7. విష్ణుచక్రం

7. విష్ణుచక్రం

అర్ధరాత్రి కనిపించే ఆ విష్ణుచక్రం ఎలా వుంటుందో స్వామి వారు ఇలా వివరించారు.

PC:wikimedia.org

8. సూర్యగోళం చుట్టూ ప్రకాశించే దృశ్యం

8. సూర్యగోళం చుట్టూ ప్రకాశించే దృశ్యం

పట్టపగలు సూర్య గ్రహణం మధ్యలో గ్రహణం ముసురుకున్న సమయంలో సూర్యగోళం చుట్టూ ప్రకాశించే దృశ్యం ఎంత అద్భుతంగా వుంటుందో ఇదీ అంత వింతగా వుంటుందని చెప్పారు.

PC:wikimedia.org

9. సుదర్శన చక్రం

9. సుదర్శన చక్రం

వెన్నెల రాత్రిలో ఈ చక్రం ఇంద్రధనుస్సు రంగును పోలివుంటుంది. ఉదయగిరి కొండపై కనిపించే ఈ సుదర్శన చక్రం కొద్ది సేపే వుంటుందని స్వామి చెప్పారు.

PC:wikimedia.org

10. కొత్త యుగానికి నాంది ప్రస్తావన

10. కొత్త యుగానికి నాంది ప్రస్తావన

బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ఈ సుదర్శన చక్ర దర్శనం మరో కొత్త యుగానికి నాంది ప్రస్తావన అని రాబోయే యుగాన్ని ఆవిష్కరించే కార్యక్రమమని స్వామివారు చెప్పారు.

PC:wikimedia.org

11. సుదర్శన చక్ర దర్శనం

11. సుదర్శన చక్ర దర్శనం

బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉదయగిరి కొండపై సుదర్శన చక్ర దర్శనం ఇంద్రధనస్సు లాగా కనిపిస్తుందనిచెప్పటమే కాదు.

PC:wikimedia.org

12. సంజీవని

12. సంజీవని

ఆ కొండ భవిష్యత్తులో సంజీవనిగా మారుతుందని చెప్పారు.

PC:wikimedia.org

13. కాలజ్ఞానం

13. కాలజ్ఞానం

కొండపై వుండే అడవిలో సంజీవని మొక్క వుందని కూడా స్వామివారు తన కాలజ్ఞానంలో చెప్పారు.

PC:wikimedia.org

14. భవిష్యత్తు

14. భవిష్యత్తు

భవిష్యత్తులో ఉదయగిరికొండ ప్రభావాన్ని తన కాలజ్ఞానంలో స్వామివారు ఈ విధంగా పేర్కొన్నారు.

PC:wikimedia.org

15. అబ్దుల్ ఖాదిర్ షావలి దర్గా

15. అబ్దుల్ ఖాదిర్ షావలి దర్గా

సంజీవ కొండ పైకి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో 5 గంధమహోత్సవాలు జరుపుకున్న హాజరత్ సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ షావలి దర్గా కనిపిస్తుంది.

PC:wikimedia.org

16. ఎలా వెళ్ళాలి?

16. ఎలా వెళ్ళాలి?

నెల్లూరు నుండి ఉదయగిరికి 2 గంటల ప్రయాణం వుంది.

ఎలా వెళ్ళాలి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X