Search
  • Follow NativePlanet
Share
» »మహారాజుల తోట బృందావన్ గార్డెన్స్

మహారాజుల తోట బృందావన్ గార్డెన్స్

అది మహారాజుల తోట ... సాయంత్రం అయ్యిందంటే అక్కడ రాజ కుటుంబాలు వాలిపోతుంటారు. రాజ కుటుంబీకుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన తోట నేడు దేశ, విదేశ పర్యాటకులకు ఒక గమ్యస్థానం.

By Venkatakarunasri

బృందావనం లేదా బృందావన్ గార్డెన్స్ కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరానికి చేరువలో ప్రవహిస్తున్న కావేరి నది పై నిర్మించిన కృష్ణరాజసాగర డ్యాం ను అనుకోని ఉన్నది. ఈ ఉద్యానవనం మైసూర్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు నుండి 144 కిలోమీటర్ల దూరంలో కలదు. మైసూర్ వచ్చే ప్రతి పర్యాటకుడు బృందావనం గార్డెన్ చూడనిదే పర్యటన పూర్తికాదు. దీని గురించి మరిన్ని వివరాలు క్లుప్తంగా ... !

అది మహారాజుల తోట ... సాయంత్రం అయ్యిందంటే అక్కడ రాజ కుటుంబాలు వాలిపోతుంటారు. రాజ కుటుంబీకుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన తోట నేడు దేశ, విదేశ పర్యాటకులకు ఒక గమ్యస్థానం. ఏటా ఆ తోటలను సందర్శించటానికి పాతిక లక్షలు పైగా వస్తుంటారని అంచనా. మైసూర్ దగ్గరలో ఉన్న ఆ ఉద్యానవనమే ... బృందావన్ లేదా బృందావనం !!

బస్ స్టాప్

బస్ స్టాప్

మైసూర్ ప్యాలెస్ బస్ స్టాప్ నుంచి బృందావన్ గార్డెన్స్ కు అనేక ప్రవేట్, సిటీ బస్సులు తిరుగుతాయి. మైసూర్ ప్యాలెస్ నుండి అరగంట ప్రయాణంలో ఈ బృందావన్ ఉద్యానవనం చేరుకోవచ్చు.

pc: Sugnyan

కృష్ణరాజసాగర డ్యామ్

కృష్ణరాజసాగర డ్యామ్

బృందావన్ గార్డెన్స్ కు నీటి కొదువలేదు. పక్కనే డ్యాం ఉండటంచేత నీరు నిరంతరం అందుబాటులో ఉంటుంది. అందమైన మొక్కలు, పచ్చిక బయళ్ళు, ఫౌంటైన్ లు కలవు.

pc: PP Yoonus

ఉద్యానవనం

ఉద్యానవనం

ఉద్యానవనం మొత్తం చూసిరావటానికి రెండు - మూడు గంటల సమయం పడుతుంది. ఇది సుమారు 60 ఎకరాలకు పైగా విస్తరించింది.

pc: Joe Ravi

వెలుతురు

వెలుతురు

ఉదయం వేళ కంటే సాయంత్రం వేళ గార్డెన్ సందర్శన ఉత్తమం. సాయంత్రం తోటలను అందమైన రంగురంగుల విదుద్దీపాలతో అలంకరిస్తారు. ఆహ్లాదకరమైన సంధ్యాసమయాన్ని ఆస్వాదించవచ్చు. బృందావనం లో లైట్లు ప్రతిరోజూ సాయంత్రం 7 నుండి రాత్రి 8 గంటల వరకు వెలుగుతాయి.

pc: Rishabh Mathur

లైట్ కాంతులు

లైట్ కాంతులు

చిన్న,పెద్ద ఫౌంటైన్ ల నీటి పొంగులు మరియు లైట్ లతో అలంకరించబడిన వివిధ ఉద్యానవనాలు మొదలైన ప్రత్యేకతలు ఎన్నో పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి.

pc: Rohin

ఉద్యానవనం

ఉద్యానవనం

దీనిని ఒకప్పుడు కృష్ణరాజ టెర్రస్ గార్డెన్స్ అని పిలిచేవారు. 1927 వ సంవత్సరంలో ఈ ఉద్యానవనం పనులు ప్రారంభించి 1932 వ సంవత్సరంలో పూర్తి చేశారు. కె. ఆర్. ఎస్. డ్యాం ను భారతరత్న విశ్వేశ్వరయ్య నిర్మిస్తే, ఉద్యానవనమును సర్ మీర్జా ఇస్మాయిల్ కట్టించెను.

pc: Ashwin Kumar

సరస్సు

సరస్సు

గార్డెన్ లో బొటానికల్ గార్డెన్స్, వాటర్ ఫౌంటైన్స్ మరియు సరస్సులు కలిగి ఉన్నది. సరస్సులలో బోట్ రైడ్ ను ఎంజాయ్ చేయవచ్చు.

pc: MikeLynch

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X