Search
  • Follow NativePlanet
Share
» »ఓనం - మళయాళీయుల తొలి పండగ !!

ఓనం - మళయాళీయుల తొలి పండగ !!

By Super Admin

కేరళ ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఉత్సాహభరితంగా జరుపుకొనే పండగ ఓనం. మహాబలి ఆగమనాన్ని పురస్కరించుకొని కేరళ వాసులు ఓనం పండగని సంబరాల మధ్య జరుపుకుంటారు. కేరళ ఘనమైన సంస్కృతి సంప్రదాయాలకు వారసత్వంగా ఈ పండగను పది రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పండగ విశేషాలు తెలుసుకోవడానికి విదేశీయులు సైతం కేరళ వస్తుంటారు. ఇక్కడ నృత్యాలు, విందు భోజనాలు, పులి వేషాలు, ప్రాచీన విద్యలు - ఆటలు మరియు పడవ పందేలు కన్నుల పండగ గా జరుగుతాయి.

మలయాళీయుల పంచాంగం ప్రకారం ఆగస్టు- సెప్టెంబర్ లో ఓనం వస్తుంది. మరి ఈ ఓనం పండగ ఎలా వచ్చింది, ఎలా జరుపుకుంటారు, ప్రత్యేకత ఏంటి ?? వంటి విశేషాలు తెలుసుకోవాలంటే ....

భారతదేశంలో 10 ట్విన్ టౌన్స్ మరియు సిస్టర్ సిటీస్ గురించి మీకు తెలుసా?భారతదేశంలో 10 ట్విన్ టౌన్స్ మరియు సిస్టర్ సిటీస్ గురించి మీకు తెలుసా?

ఓనం పండగ ఎందుకు ??

ఓనం పండగ ఎందుకు ??

పాతాళం లోకి వామనుడి అవతారంలో వచ్చిన విష్ణుమూర్తిచే నెట్టివేయబడిన బలిచక్రవర్తి కోరక కోరక ఒక కోరిక కోరతాడు. విష్ణుమూర్తి ఆ కోరిక మేరకు ప్రతి ఏడాది తన ప్రజలను చూసేందుకు వచ్చేలా వరమిస్తాడు. మహాబలి చక్రవర్తి ఓనం రోజున తన ప్రజలను కలుసుకొనేందుకు ఆత్మరూపంలో వస్తాడని కేరళీయుల నమ్మకం. అందుకనే అతడిని తమ ఇళ్ళలో ఆహ్వానించడానికే ఈ పండగను జరుపుకుంటారు.

Photo Courtesy: S y a m S u b r a m a n i a n

ఓనం పండగ మొదలు .. ముగింపు

ఓనం పండగ మొదలు .. ముగింపు

‘ఆతం' పేరుతో తొలిరోజు ప్రారంభమయ్యే ఉత్సవాలు పదో రోజున ‘తిరు ఓనం'తో ఘనంగా ముగుస్తాయి. పదిరోజుల పాటు భారీగా జరిగే ఈ సంబరాలు మలయాళీల ఆచారాలను, కళలను ప్రతిబింబిస్తాయి. కొత్త దుస్తులు, సాంప్రదాయ వంటలు, నృత్యము మరియు సంగీతములతో పాటు రాష్ట్రమంతటా పాటించే ఆచారములు, ఈ వ్యవసాయ పండుగకు చిహ్నములు.

Photo Courtesy: Malayalam News Jeddah

వేశాధారణ

వేశాధారణ

ఓనం పండగ రోజున మగవారు చొక్కా, లుంగీ ( మండు) కడతారు. ఆడవారు పావడ మరియు రవికె ధరిస్తారు.

Photo Courtesy: Sarah Joy Jones

ఆడవాళ్ళు ..

ఆడవాళ్ళు ..

మహాబలి ని ఆహ్వానిస్తూ, ఇంటి ముందర పేడ నీళ్ళు చల్లి రంగురంగుల పూలతో అందంగా రంగవల్లులను తీర్చి దిద్దుతారు. వీటిని పూగళమ్ అంటారు. సంప్రదాయ బంగారు రంగు అంచు కలిగిన తెల్లని చీరను ధరించి మహిళలు పూల రంగవల్లుల మధ్య దీపాలను ఉంచి వాటి చుట్టూ తిరిగి పాటలు పాడి మైమరిచిపోతారు. వీళ్ళు చేసే నృత్యాలలో కైకొట్టి కలై, తుంబి తుల్లల్ లు ముఖ్యమైనవి.

Photo Courtesy: Arunanand T A

మగవాళ్ళు ..

మగవాళ్ళు ..

సంప్రదాయ పడవ పందాలు, అలాగే బాల్ ఆటలు, విలువిద్యా పోటీలు, కబడ్డీ , కత్తి యుద్దాలు వంటి ఇతర క్రీడా పోటీల్లో యువకులు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. అంటే యువకులు శారీరక శ్రమ కలిగించే ఆటలు ఆడతారన్నమాట !!

Photo Courtesy: Manojk

పెద్దవారు

పెద్దవారు

ఓనం పండగ లో పెద్దవారు సైతం అనేక క్రీడల్లో పాలుపంచుకుంటుంటారు. అయితే ఎక్కవ భాగం మాత్రం ఇంట్లోనే పేకాట, చెస్ వంటి ఇండోర్ గేమ్స్ ఆడుతూ కనిపిస్తారు. ఆడవాళ్ళు వంటలు ప్రిపేర్ చేస్తూ ... పిల్లలకి చిరుతిండి అందిస్తూ .. ఆనందంగా గడిపేస్తారు. ఈ సమయంలో ఇల్లు మొత్తం సందడి సందడి గా కోలాహాలంగా ఉంటుంది.

Photo Courtesy: theakanath

చిన్నా .. పెద్దా .. తేడా లేదు

చిన్నా .. పెద్దా .. తేడా లేదు

చిన్న, పెద్ద అనే వయోభేదం లేకుండా అందరూ ఎంతో ఉత్సాహ భరితంగా పాల్గొంటూ పండగ సంరంభంలో మమేకవుతుంటారు. తమ ప్రాంతాన్ని మహాబలి సుభిక్షంగా పరిపాలించినందుకు కృతజ్ఞతగా మలయాళీలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నప్పటికీ భక్తిశ్రద్ధలతో ఓనం పండగను పాటిస్తారు. పండగ వేడుకల్లో టపాసులు కాల్చి, ఇంటిని దీపాలతో శోభాయమానంగా అలంకరించడం కనిపిస్తాయి.

Photo Courtesy: Manojk

కథకళి

కథకళి

కళా ప్రదర్శనలు ఎన్ని ఉన్నప్పటికీ ‘కథకళి' నృత్యానికే అగ్ర తాంబూలం. రామాయణ, మహాభారతాల్లోని కొన్ని ఘట్టాలను విధిగా ప్రదర్శిస్తారు. పురాణాలు, చరిత్రపై పిల్లల్లో తగిన అవగాహన కల్పించేందుకు సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో దోహద పడతాయని మలయాళీల విశ్వాసం.

Photo Courtesy: Ashok N Pulliyerengi

స్నేక్ బోట్ రేస్

స్నేక్ బోట్ రేస్

సంవత్సరానికి ఒకసారి ఓనం పండగ సందర్భంగా నిర్వహించే స్నేక్ బోట్ రేస్ కేరళ లో ప్రధాన ఆకర్షణ. సుమారు వంద అడుగుల పొడవు ఉండే పడవల్లో దాదాపు 150 మంది యువకులు కూర్చుని ఉత్సాహ భరితంగా పోటీలో పాల్గొంటారు. సుమారు 40 కిలోమీటర్ల వరకూ ఈ పడవలు దూసుకుపోతుంటాయి. పాములా మెలికలు తిరిగే ఈ పడవలు నీటిపై జోరుగా సాగుతుంటే వేలాదిమంది జనం ఉత్కంఠతో వీక్షిస్తారు.

Photo Courtesy: Abraham Jacob

స్నేక్ బోట్ రేస్ ఎక్కడ ??

స్నేక్ బోట్ రేస్ ఎక్కడ ??

కేరళ రాష్ట్రంలో అలెప్పి బోట్ రేస్ లకి పెట్టింది పేరు. అద్బుతమైన రెగ్గట్టా, ఆరుములా వల్లంకలి(స్నేక్‌ బోట్‌ రేస్‌) అనేది సంప్రదాయబద్ధంగా జరిగే ఇక్కడి బోట్‌ కార్నివాల్‌ . ఓనం పండగ టైమ్ లోనే జరిగే ఈ పోటీలు చూసేందుకు దేశ విదేశాల నుండి పర్యాటకులు తరలివస్తుంటారు. వందలమంది వేసే తెడ్లతో పంబానదిని వాయు వేగంతో చీల్చుకుంటూ పోతున్నట్లుగా కనిపించే పాము పడవల్ని చూసేందుకు పర్యాటకులు, అక్కడి ప్రజలు ఎనలేని ఆసక్తి ని కనబరుస్తుంటారు.

Photo Courtesy: Manar Holidays

స్నేక్ బోట్ రేస్ ఎందుకు ప్రత్యేకం ??

స్నేక్ బోట్ రేస్ ఎందుకు ప్రత్యేకం ??

స్నేక్ బోట్ రేస్ వేడుకలకు ఆరముల పార్థసారథి దేవాలయంతో దగ్గర సంబంధాలున్నాయి. పాతరోజుల్లో ఆరముల పార్థసారధి దేవాలయంలో జరిగే తిరువోనసడయ( ఓనమ్ విందు)కు అవసరమైన కూరగయాలు, పప్పులు మరియు ఇతర ఆహార పదార్థాలను పాము బోట్లలో ఊరేగింపుగా తీసుకొచ్చేవారు. దానికి గుర్తు చేసేందుకు ఆరుములా వల్లంకలిని నిర్వహిస్తూ ఉంటారు.

Photo Courtesy: vipin raj

పులి వేషాలు

పులి వేషాలు

శాస్త్రీయ వాయిద్యపరికరాలను వాయిస్తుండగా, పులి వేషాలు ధరించిన వారు ఆ చప్పుళ్లకు నృత్యాలు చేస్తూ కనిపించడం ఓనం పండగలో ఆకర్షణ. దీనిని కేరళీయులు 'పులిక్కలి' అంటారు. భారతదేశం లో అతి ప్రాచీన వేడుకగా దీనికి పేరుంది. త్రిస్సూర్ లో ఈ వేడుక ఘనంగా నిర్వహిస్తూ పులి వేషం ధరించిన వారికి బహుమతులు ప్రదానం చేస్తుంటారు.

Photo Courtesy: f i Я a x

ఊయల

ఊయల

ఊయల ఓనం పండగ లో ఒక ప్రత్యేక ఆకర్షణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అందంగా ముస్తాబైన యువతీ యువకులు కొత్త దుస్తులు ధరించి ఓనం పాటలు పాడుతూ కనిపిస్తారు, ఎత్తైన కొమ్మ మీద త్రాడు వేసి, ఊయల కట్టి అందులో కూర్చొని ఒకరికొకరు ఊపుకుంటూ కనిపిస్తారు.

Photo Courtesy: Ben3john

త్రివిక్రముడికి ప్రత్యేక పూజలు

త్రివిక్రముడికి ప్రత్యేక పూజలు

ఓనం పండగ రోజులలో కేరళలోని త్రిక్కకరలో గల వామనమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తమ తమ ఇళ్ల లో త్రిక్కకర అప్పన్‌ (వామనుడు) విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తారు.

Photo Courtesy: Titto

పది రోజుల వేడుకగా ...

పది రోజుల వేడుకగా ...

కేరళ పర్యాటక సంస్థ తో పాటుగా, స్థానిక ప్రజలు ఓనం పండగ సందర్భంగా రాష్ట్ర రాజధాని దగ్గరలోని కోవళం గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతుంది. వీటిలో నాటకాలు, శాస్త్రీయ నృత్యాలు, జానపద కళలు , ఆహార శాలలు, చేతివృత్తుల కేంద్రాలు ప్రధాన ఆకర్షణ. ఈ పండగ చివరి రోజున అలంకరించబడిన గజరాజులతో చేసే విన్యాసాలు చూపరులను సైతం అబ్బురపరుస్తాయి.

Photo Courtesy: Parthasarathy S K

సామూహిక విందు భోజనాలు ...

సామూహిక విందు భోజనాలు ...

ఓనం పండగ లో చివరి రోజున ‘తిరు ఓనం' సందర్భంగా పచ్చని ఆకులో 20 రకాల వంటకాలతో, పాలు మరియు చక్కెరతో చేసిన పాయాసంతో 'ఓన సధ్య' సామూహికంగా స్వీకరిస్తారు. సాంప్రదాయక ఊరగాయలు అప్పడములు మరియు దానితో పాటు ఇతర సాంప్రదాయ భారతీయ పిండివంటలు కూడా వడ్డిస్తారు. ఈ వంటలు తింటుంటే మీకు అహా ..! ఒహో ...! అని అనిపించకమానదు. చాపపై కూర్చుని అరటి ఆకులో ఈ పదార్థాలను తినడం ఓనం ప్రత్యేకత. ఇందులో తప్పక పాలుపంచుకోవాలనే ఆచారం వారికి ఉంది.

Photo Courtesy: George Augustine

పాయసం

పాయసం

ఓనం పండగ పాయసం చాలా బాగా ఉంటుంది. ఇందులో పాలు, చక్కెర, జీడిపప్పు, ఎండు ద్రాక్ష మరియు సన్న సేమియాలు వేసి రుచికరంగా చేస్తారు.

Photo Courtesy: Kalakki

అందరూ జరుపుకొనే పండగ

అందరూ జరుపుకొనే పండగ

కేరళలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఈ పండగను జరుపుకోవడంతో ఓనం కి ఇంత ప్రాధాన్యత వచ్చింది. ఓనం హిందువుల పండగ అయినప్పటికీ, ఈనాడు ఈ పండుగను హిందువులు, ముస్లిములు మరియు క్రైస్తవులు సమానమైన ఉత్సాహముతో జరుపుకుంటున్నారు.

Photo Courtesy: Smugglerjohn

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X