Search
  • Follow NativePlanet
Share
» »దీపావళి జరుపుకొనే ప్రదేశాలు !!

దీపావళి జరుపుకొనే ప్రదేశాలు !!

దీపావళి ... ఈ పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చేది హోరెత్తించే టపాకాయలు, కాంతులు విరజిమ్మే దీపాలు. ఈ పండుగను ఆశ్వీయుజమాస బహుళ అమావాస్య దినమున జరుపుకుంటారు. దీపావళి అంటే దీపముల వరుస అని అర్థం. దీపావళి రోజున పేదవాని గుడిసైనా, ధనవంతుని మేడైనా దీప కాంతులతో వెలిగిపోవలసిందే ..!

దీపావళి గురించి ఒక్కమాటలో ..!

పూర్వం భూ మండలం మీద నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఇతను దేవతలను, నరులను కష్టాల పాలు చేసి శ్రీ కృష్ణుడినే ఎదిరించెను. 16,000 మంది స్త్రీ లను చెరసాలలో బంధించి ఉండగా కృష్ణుడు సత్యభామతో రథం పై వచ్చి ఆమెతోనే నరకాసరుడిని చంపించివేస్తాడు. ఎందువల్ల అనగా ఈ రాక్షసుడు (నరకాసురుడు) విష్ణువు వరాహ అవతారంలో ఉండగా భూదేవికి, విష్ణువుకు జన్మించిన కుమారుడు. ఇతనికి తల్లి చేతిలో తప్ప మరే విధంగా చావు లేదనే వరమున్నది. అందుకే శ్రీ కృష్ణుడు సత్యభామతో వచ్చి నరకాసుర వధ కావించెను దీనికి గాను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకొన్నారట. అదే దీపావళి గా ప్రసిద్ధికెక్కింది.

ఈ దీపావళి పండుగను మన రాష్ట్రంలో పాటుగా వివిధ రాష్ట్రాలలో ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఇళ్ళలో పసందైన పిండివంటలు తయారుచేసుకుంటారు. రాత్రి పూట ఇంటి బయట దీపాలను వెలిగించి బాణాసంచా కాలుస్తుంటారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకొనే పండగ ఈ దీపావళి.

ధర్మస్థల, కర్నాటక

ధర్మస్థల, కర్నాటక

దీపావళి పండగ ను దక్షిణ కర్నాటక రాష్ట్రంలోని ధర్మస్థల లో బాగా జరుపుకుంటారు. ఇక్కడ గల శ్రీ క్షేత్ర దేవాలయంలో లక్ష దీపోత్సవం నిర్వహిస్తారు. వివిధ ఆధ్యాత్మిక, వినోద, సాంస్కృతిక కార్యాక్రమాలను దేవస్థానం వారు నిర్వహించి భక్తుల మనసులను రంజింపజేస్తారు. దీపావళి సమయంలో ఇక్కడ ఏటా రధోథ్సవం జరుపుతారు. ఆ సమయంలో భక్తులు వేలాది సంఖ్యలో హాజరవుతారు. ఇక్కడ గల శ్రీ క్షేత్రంలో ప్రతిరోజు అన్నదానం నిర్వహిస్తుంటారు.

మరింత సమాచారం కోసం చదవండి : భక్తులను అలరించే ధర్మ స్థల దీపోత్సవం !!

Photo Courtesy: Dhilung Kirat

వారణాసి, ఉత్తర ప్రదేశ్

వారణాసి, ఉత్తర ప్రదేశ్

వారణాసి అంటే దీపావళి, దీపావళి అంటే వారణాసి అని చెప్పాలి. అంటే అర్థం చేసుకోండి ఇక్కడ దీపావళి ఎంత బాగా జరుపుకుంటారో అని ..! దీపావళిని ఉత్తర భారతదేశంలో 5 రోజుల పాటు జరుపుకుంటారు. వారణాసి నగరంలో దీపావళి సమయాన గంగా నది కి, ఆలాగే కాశి విశ్వనాథుడికి హారతులు ఇస్తారు. దేవ దీపావళి ని గంగా నది చివరి రోజున నిర్వహిస్తారు. సుమారు పది లక్షల కు పైగా మట్టి ప్రమిదలను భక్తులు గంగా నది లో ఒత్తులు వెలిగించి వదులుతారు.

మరింత సమాచారం కోసం చదవండి : వారణాసి నగరంలో జరిగే దేవ దీపావళి వేడుకలను చూద్దాం పదండి !!

Photo Courtesy: Maciej Dakowicz

ఢిల్లీ

ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీ లో దీపావళి వేడుకలను అతి వైభవంగా జరుపుకుంటారు. విశాల మైదానాలైన రామ్ లీలా వంటి బహిరంగ ప్రదేశాలలో రాముని జీవితం ప్రతిబింబించే విధంగా చిత్రాలను ప్రదర్శిస్తారు. భారీ కటౌట్ లను నిలబెడతారు. చుట్టుప్రక్కల ప్రజలు తమ బంధువులతో, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఈ మైదానానికి గుంపులు గుంపులుగా తరలివస్తారు.

మరింత సమాచారం కోసం : ఢిల్లీ లో జరిగే దీపావళి వేడుకలు !!

Photo Courtesy: Sakshi Kumar

అమృత్‌సర్, పంజాబ్

అమృత్‌సర్, పంజాబ్

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ నగరంలో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఆ సమయంలో స్వర్ణ దేవాలయం (గోల్డెన్ టెంపుల్) మిరమిట్లుగొలిపే కాంతులతో దేదివ్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తుంది. ఆలయం వెలుపలి భాగాలు దీపాలతో పూర్తిగా అలంకరించబడి ఉంటాయి. సంప్రదాయ మట్టి ప్రమిదలను వెలిగించి తమ తమ ఇళ్ళలో వారి దైవాలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

మరింత సమాచారం కోసం చదవండి : అమృత్‌సర్ లో దీపావళి వేడుకలు !!

Photo Courtesy: gags9999

జైపూర్, రాజస్థాన్

జైపూర్, రాజస్థాన్

పింక్ సిటీ గా పిలువబడే రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలో కూడా దీపావళి వేడుకలను వైభవంగా జరుపుకుంటారు. దీపావళి రోజున ఈ నగరమంతా విరజిమ్మే వెలుగులతో నిండి ఉంటుంది. పండగ సమయాలలో ప్రతి ఒక్కరూ ఇంటికి సున్నాలు(రంగులు) వేయించి ప్రమిదలను వెలిగిస్తారు.

మరింత సమాచారం కోసం చదవండి : జైపూర్ నగరంలో దీపావళి వేడుకలు !!

Photo Courtesy: Ankit Agarwal

కలకత్తా, పశ్చిమ బెంగాల్

కలకత్తా, పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా నగరంలో దీపావళి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధాల మధ్య జరుపుకుంటారు. ఇక్కడ జరిగే వేడుకలు ఇతర రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా, విభిన్నం గా ఉంటాయి. ఇక్కడ కాళీమాత ను శక్తి వంతమైన దేవత గా పరిగణించి పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో పూజలను, నైవేద్యాలను వారు అర్ధరాత్రి సమయాలలో నిర్వహిస్తారు.

మరింత సమాచారం కోసం చదవండి : కలకత్తా నగరంలో దీపావళి వేడుకలు !!

Photo Courtesy: Avik Sarkar

కలకత్తా, పశ్చిమ బెంగాల్

కలకత్తా, పశ్చిమ బెంగాల్

కలకత్తా ప్రజలు ఒకరోజు ముందే ఇళ్ళ ను దీపాలతో, మట్టి ప్రమిదలతో కాంతులను విరజిమ్మేలా అలంకరిస్తారు. ప్రతి ఇంటిని పూలతో, మామిడి తోరణాలతో అలంకరిస్తారు. ప్రతి ఇంటిలో కుటుంబసభ్యులు నూతన దుస్తులను ధరించి ఇరుగుపొరుగు వారితో దీపావళి శుభాకాంక్షలను తెలుపుకొని స్వీట్స్ పంచుకుంటారు.

మరింత సమాచారం కోసం చదవండి : కలకత్తా నగరంలో దీపావళి వేడుకలు !!

Photo Courtesy: Avik Sarkar

గోవా

గోవా

గోవా పేరు చెప్పగానే ఆహ్లాదకరమైన బీచ్ లు, అందమైన ప్రకృతి కళ్లముందు అలా కదిలిపోతాయి. మరి ఇటువంటి ప్రదేశంలో కూడా దేపావళి పండగ ను " దియాంచి ఆలి" గా జరుపుకుంటారు. ఇక్కడ ప్రతి ఇంట్లో మట్టి ప్రమిదల లో నూనె పోసి, ఒత్తులు వేసి సంప్రదాయ మట్టి ప్రమిదలను వెలిగిస్తారు. దీపావళి రోజున అత్యంత ఉత్సాహంతో ప్రహి ఇంటిని ఆకాశ దీపాలతో వెలిగిస్తారు. అంటే రంగురంగుల లాంతర్లు అని అర్థం. వీటిని వారు ఇంటి కిటికీ లకు వేలాడకడతారు.

మరింత సమాచారం కోసం చదవండి : గోవా లో జరిగే దీపావళి వేడుకలు !!

Photo Courtesy:Joegoauk Goa

ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్

మన రెండు తెలుగు రాష్ట్రాలలో దీపావళి పండుగను అతి వైభవంగా మూడు రోజులపాటు జరుపుకుంటారు. ఉదయాన్నే లేచి ఇళ్ళ ను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని, స్నానం చేసి కొత్త బట్టల ను ధరిస్తారు. ఇళ్ళలో శ్రీకృషుని విగ్రహాలను పెట్టి పూజిస్తారు అలాగే రెండవరోజు మాతా లక్ష్మి దేవి ఇంటికి వస్తుందని ఆమెకు పూజలు చేసి నైవేద్యం పెడతారు. ఇరుగు పొరుగు వారితో పిండి వంటాలను పంచుకుంటారు. కుటుంబం మొత్తం ఒకసారి కూర్చొని భోజనం చేస్తారు. రాత్రి పూట చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎంతో ఉత్సాహంగా, ఆట్టహాసంగా బాణాసంచా కాలుస్తారు.

Photo Courtesy: Lovell D'souza

గుజరాత్

గుజరాత్

దీపావళి వేడుకలలో బాణాసంచా కాల్చడం గుజరాత్ లోనే మొదలైనది. ఇక్కడ నరక చతుర్ధశి రోజును "ధన్ తెరాస్" అని పిలుస్తారు. ఈ రోజున వారు లక్ష్మి పూజ చేసి కొత్త గుజరాత్ సంవత్సరాన్ని ఆరంభిస్తారు. ధన్ తెరాస్ రోజున బంగారం కొనుగోలు చేయడం శుభప్రధంగా భావిస్తారు. మూడవ రోజున "భాయ్ బీజా " అంటారు. ఈ రోజున సోదరీమణుల క్షేమాన్ని కోరుతూ వారికి పూజలు చేస్తారు.

Photo Courtesy: Premnath Thirumalaisamy

మహారాష్ట్ర

మహారాష్ట్ర

మహారాష్ట్ర లో ప్రజలు దీపావళి పండుగను అయిదు రోజుల పాటు జరుపుతారు. వీరు ఒక ఆవుకు దాని దూడకు హారతి ఇవ్వటంతో పండుగ మొదలు పెడతారు. అమావాస్య నాడు ఇంట్లోని లక్ష్మి దేవి విగ్రహం వద్ద ఆభరణాలను ఉంచి పూజలు చేస్తారు. తమకు అధిక ఐశ్వర్యం, జ్ఞానం ప్రసాదించమని కోరుకుంటారు. ఇంటిలో తమకు నచ్చిన అనేక రకాల తీపి, ఇతర వంటకాలు చేసుకొని తిని ఆనందిస్తారు. ఇరుగు పొరుగు వారికి పంచి పెడతారు. రాత్రి అయ్యిందంటే చాలు, నల్లని అమావాస్య రోజు రాత్రి బాణా సంచా కాల్చి ఆనందిస్తారు.

Photo Courtesy: Manvendra Bhangui

ఓడిషా

ఓడిషా

ఓడిషా లో దీపావళి పండుగను పెద్దల పండుగ గా ఆచరిస్తారు. తమ పూర్వీకులు ఈ అమావాస్య రోజున ఆకాశంలో వచ్చి విహరిస్తున్నారని భావిస్తారు. వారి ఆత్మ శాంతి కి మోక్షం కలిగేందుకు, వెలుగులు చూపాలని బాణ సంచా కాలుస్తారు. ఓడిషా లో ఈ అంశం పండుగలోని ప్రధాన అంశంగా వుంటుంది. మాత లక్ష్మి దేవికి పూజలు చేస్తారు. వివిధ టవున్ లలో కాళి మాత పూజ నిర్వహిస్తారు.

Photo Courtesy: [email protected]

బీహార్ మరియు అస్సాం

బీహార్ మరియు అస్సాం

బీహార్ లోని ప్రజలు దీపావళి రోజును మాత కాళి దేవి కి ప్రత్యేకం గా భావించి ఆ దేవి పూజలు జరుపుతారు. రాత్రి వేళ బాణ సంచా కాలుస్తారు. బిహార్ లోని మిధిలా ప్రాంతం, అస్సాం లోను కాళి దేవి పూజతో పాటు లక్ష్మి మరియు గణేశ విగ్రహాలకు కూడా పూజలు చేస్తారు. తమ కుటుంబాలను క్షేమంగా ఉంచమని, సకల సంపదలూ ప్రసాదించమని ఆ దేవతలను వేడుకుంటారు. బంధు మిత్రులతో కలసి ఇష్టమైన వంటకాలు తింటూ ఆనందిస్తారు.

మరింత సమాచారం కోసం చదవండి : వివిధ రాష్ట్రాలలో దీపావళి సంబరాలు, వేడుకలు !!

Photo Courtesy: Kinshuk Kashyap

శివకాశి

శివకాశి

తమిళనాడు రాష్ట్రంలో మధ్రాస్ నగరానికి 533 కి. మీ .దూరంలో, బెంగళూరు నగరానికి 499 కి. మీ. దూరంలో శివకాశి అనే పట్టణం ఉన్నది. ఇక్కడ బాణా సంచా పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. దీపావళి సమయంలో దేశం మొత్తం సరఫరా అయ్యే బాణాసంచాలలో 75 శాతం ఇక్కడ తయారుచేసినవే. వీటితో పాటు ప్రింటింగ్, అగ్గిపెట్టల తయారీ సంస్థలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఊరిలో ప్రధానంగా చూడవలసినది భద్రకాళి అమ్మన్ ఆలయం. పడమటి కనుమలలో గల అయ్యనార్ జలపాతాలు కూడా ఇక్కడ చూడవలసిన ఆకర్షణలలో ఒకటి.

మరింత చదవండి : శివకాశి లో జరిగే దీపావళి సంబరాలు !

Photo Courtesy: McKay Savage

వివిధ దేశాలలో ...

వివిధ దేశాలలో ...

దీపావళి వేడుకలు మన భారత దేశంలోనే కాక విదేశాలలో స్థిరపడిన మన భారతీయులు కూడా ఘనంగా నిర్వహించుకుంటారు. మలేసియా, నేపాలు, యూకే, జపాన్ మరియు థాయ్‌లాండ్ లలో దీపావళి వేడుకలను వెలుగులను విరజిమ్ముతూ ఆనందంగా జరుపుకుంటారు.

Photo Courtesy: Hrishikesh Premkumar

జాగ్రత్తలు

జాగ్రత్తలు

ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగినా ముందుగా మాటలను ఆర్పేందుకు బకెట్ లలో నీళ్ళను నిండుగా పెట్టుకోండి

Photo Courtesy: Ashwin Kumar

జాగ్రత్తలు

జాగ్రత్తలు

మీ వాహనాల పై కవర్లు వేసి ఉంచండి. పండుగ సమయంలో వీలైనంత వరకు ఇంటిలోపలే వాహనాన్ని పెట్టుకొనేలా చర్యలు తీసుకోండి

Photo Courtesy: McKay Savage

జాగ్రత్తలు

జాగ్రత్తలు

పిల్లలతో పాటుగా పెద్దవారు కూడా కాటన్ దుస్తులను ధరించడం మంచిది.

Photo Courtesy: Simply CVR

జాగ్రత్తలు

జాగ్రత్తలు

ఒకవేళ నిప్పురవ్వలు పడి చిన్న చిన్న గాయాలైతే సెప్టిక్ కాకుండా నిరోధించేందుకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సిద్ధంగా పెట్టుకోండి. ప్రాధమిక చికిత్స తరువాత ఉపశమనం పొందాక పోతే డాక్టర్ ను సంప్రదించండి.

Photo Courtesy: Ed Furry

జాగ్రత్తలు

జాగ్రత్తలు

పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దల వద్ద ఉండాలి. దగ్గరుండి వారితో కాల్పించుకోవడం ఉత్తమం.

Photo Courtesy: Travis Wise

జాగ్రత్తలు

జాగ్రత్తలు

టపాసులు కాల్చేటప్పుడు పిల్లలు ఒళ్ళు, ఇల్లు మరిచిపోయి కాలుస్తుంటారు. వారిని ఇంటిలోపల, రోడ్డు మధ్యలో మరియు గుంపులు గుంపులు ఉన్న జనావాసాల మధ్యలో కాల్చవద్దని చెప్పండి.

Photo Courtesy: Rishabh Mathur

జాగ్రత్తలు

జాగ్రత్తలు

పిల్లలు టపా కాయలు కాల్చేటప్పుడు లేదా కాల్చిన తరువాత చేతులు నోట్లో, ముక్కులో మరియు కళ్ళలో పెట్టుకోకుండా చూడాలి.

Photo Courtesy: sowrirajan s

జాగ్రత్తలు

జాగ్రత్తలు

బుర్జు, భూచక్రాలు కాల్చేటప్పుడు కాళ్లకు చెప్పులు వేసుకోవడం మారవద్దు. ఆ సమయంలో పాకే పసి పిల్లలను కిందకు వదలవద్దు.

Photo Courtesy: Koshy Koshy

జాగ్రత్తలు

జాగ్రత్తలు

మీ దీపావళి మందుగుండు సామాగ్రి వద్ద కొవ్వొత్తి లేదా అగరవత్తు లను దగ్గర ఉంచనీయకండి.

Photo Courtesy: Shovona Ngela

జాగ్రత్తలు

జాగ్రత్తలు

వెలిగి పేలకుండానే ఆరిపొయిన చిచ్చుబుడ్లు, బాంబులు వద్ద కి వెళ్ళి పరిశీలించడం, మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయటం అత్యంత ప్రమాదకరం.

Photo Courtesy: Pravinraaj

జాగ్రత్తలు

జాగ్రత్తలు

పిల్లలు చేతిలో బాంబులు పట్టుకొని కాల్చవద్దు. అదేదో ఫ్యాషన్ అనుకొనేరు. ఒక్కోసారి మీ ప్రాణాలు కూడా పోతాయి. దయచేసి భారీ శబ్ధం వచ్చే బాణాలను పిల్లల చేతికి ఇవ్వవద్దు.

Photo Courtesy: Travis Wise

జాగ్రత్తలు

జాగ్రత్తలు

పిల్లల చేతికి రాకెట్‌, తారాజువ్వ తరహా వస్తువులను ఇవ్వకపోవడమే మేలు. పెద్దలు మాత్రం వీటిని గుడిసెలకు దూరంగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకొని కాల్చడం మంచిది. రాత్రి అయిన తరువాత, జన సంచారం తగ్గాక కాల్చుకోవటం మేలు.

Photo Courtesy: Ashwin Kumar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X