Search
  • Follow NativePlanet
Share
» »సెలబ్రెటీలు - దత్తత గ్రామాలు !

సెలబ్రెటీలు - దత్తత గ్రామాలు !

By Super Admin

21,467 అడుగుల అత్యంత ఎత్తులో గంగోత్రి జాగేశ్వర్ ఆలయం !21,467 అడుగుల అత్యంత ఎత్తులో గంగోత్రి జాగేశ్వర్ ఆలయం !

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014, అక్టోబర్ 11న సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్ఏజివై) ప్రారంభించారు. ఈ పథకంలో ప్రతీ పార్లమెంటు సభ్యుడు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని 2016 వరకు ఆ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దాలి.

అదే విధంగా తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కొన్ని పథకాలను ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. తెలంగాణలో గ్రామజ్యోతి పేరుతో గ్రామాల దత్తత కొనసాగుతుంది. ఈ పథకాలలో భాగంగా గ్రామాలను దత్తత తీసుకొనేందుకు మేము సైతం అంటూ సినిమా తారలు పోటీపడుతున్నారు. వారిలో మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ .. ఇలా కొంతమంది ఉన్నారు.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

పేరుపాలెం

పేరుపాలెం

ప్రముఖ నటుడు, రాజ్య సభ సభ్యుడు అయిన మెగాస్టార్ చిరంజీవి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పధకం కింద పశ్చిమ గోదావరి జిల్లాలో తన స్వగ్రామమైన మొగల్తూరు కి దగ్గరలో పేరుపాలెం ని దత్తత తీసుకున్నాడు. ఈ గ్రామం విజయవాడ నగరానికి 147 కి. మీ. దూరంలో మరియు రాజమండ్రి కి 101 కి. మీ. దూరంలో ఉంది.

Photo Courtesy: global_takeoff / prudhviraju

బుర్రిపాలెం

బుర్రిపాలెం

ప్రముఖ నటుడు అయిన మహేష్ బాబు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని తన తండ్రి స్వగ్రామమైన గుంటూరు జిల్లాలోని తెనాలి తాలూకా లో ఉన్న బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న చింతలకుంట గ్రామాన్ని గ్రామజ్యోతి పథకం కింద కూడా గ్రామ జ్యోతి పథకం కింద తీసుకున్నాడు.

Photo Courtesy: filmibeat / prasad

కొండారెడ్డిపల్లి

కొండారెడ్డిపల్లి

తెలంగాణ చేపట్టిన గ్రామ జ్యోతి స్పూర్తితో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి ని దత్తత తీసుకున్నాడు. ఈ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఆయన నడుంబిగించాడు. ఇది హైదరాబాద్ నగరానికి 94 కి. మీ. దూరంలో ఉన్నది.

Photo Courtesy: filmibeat / adarsh

చంద్రగిరి

చంద్రగిరి

ప్రముఖ నటుడు మోహన్ బాబు పెద్ద కుమారుడైన నేటి తరం నటుడు మంచు విష్ణు కూడా ఆంధ్ర ప్రదేశ్ లోని తన స్వంత జిల్లా అయిన చిత్తూర్ లో కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నాడు. ఈయన చంద్రగిరి మండలం లోని 10 గ్రామాలను దత్తత తీసుకున్నాడు. ఈ మండలం తిరుపతి కి 16 కి. మీ. దూరంలో ఉన్నది.

Photo Courtesy: filmibeat / Adityamadhav83

పుట్టంరాజువారి కండ్రిగ

పుట్టంరాజువారి కండ్రిగ

రాజ్యసభ సభ్యుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పధకం కింద ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ఆయన తీసుకున్న గ్రామం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని నెల్లూరు జిల్లాలో గల పుట్టంరాజువారి కండ్రిగ. ఈ గ్రామాన్ని ఆయన అన్నివిధాలా మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఈ గ్రామాన్ని పలుమార్లు సందర్శించారు.

Photo Courtesy: sonal bahl / nellore village

జయపూర్

జయపూర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తాను ప్రవేశ పెట్టిన పథకంలో భాగంగా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోని జయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు.

Photo Courtesy: Narendra Modi

రావల్

రావల్

రాజ్యసభ సభ్యురాలు, నటి హేమామాలిని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని యమునా నది తీరాన ఉన్న మథుర జిల్లాలో గల రావల్ గ్రామాన్ని దత్తత తీసుకుంది. ఈ గ్రామాన్ని మహిళా సాధికారత కు గుర్తుగా మరియు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆవిడ పలుమార్లు రావల్ గ్రామాన్ని సందర్శించింది.

Photo Courtesy: Co9man / Nanda Sunu dasa

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X