Search
  • Follow NativePlanet
Share
» »'దిల్ చహ్ తా హై' కోట చూసొద్దామా !!

'దిల్ చహ్ తా హై' కోట చూసొద్దామా !!

గోవా లో ఒక కోట ఉందండీ! అక్కడ ఎదో ఒక సినిమా ఎప్పుడూ చిత్రీకరిస్తుంటారు. బాలీవూడ్, టాలీవూడ్, కొలీవూడ్ ఇలా ఏ చిత్రరంగ పరిశ్రమైనా ఇక్కడ షూటింగ్ చేయటానికి ఇష్టపడుతుంటారు.

By Mohammad

చిన్నప్పటి నుంచి కోటల గురించి ఎన్నో కహానీలు మన పెద్దలు చెబుతుంటే విన్నాము. అందులో రాజు నివాసం ఉండేవాడని, అక్కడి నుంచే పరిపాలన సాగించేవాడని, ఎవరైనా శత్రువులు దాడిచేస్తే కోట రహస్య మార్గాలలో దాక్కునేవారని వింటూవచ్చాము. అది అప్పుడు! మరి ఇప్పుడు !!

కోటలు చాలా వరకు అదృశ్యమైనాయి. వాటిలో కొన్ని శిధిలావస్థలో, అప్పుడప్పుడూ టూర్లకని వెళ్ళి వచ్చేవిధంగా ఉన్నాయి. ఇంకొన్ని అసలు మనకు తెలీనే తెలీదు. అప్పుడప్పుడూ హిందీ, తెలుగు సినిమాలలో సన్నివేశాలు చూస్తుంటే అరె ఆ కోట బాగుంది కదా ! అని అనుకుంటుంటాం. ఆ విధంగా చూపించడం దర్శకుని సృజనాత్మకత కు నిదర్శనం.

గోవా లో ఒక కోట ఉందండీ! అక్కడ ఎదో ఒక సినిమా ఎప్పుడూ చిత్రీకరిస్తుంటారు. బాలీవూడ్, టాలీవూడ్, కొలీవూడ్ ఇలా ఏ చిత్రరంగ పరిశ్రమైనా ఇక్కడ షూటింగ్ చేయటానికి ఇష్టపడుతుంటారు. అదే ఛపోరా ఫోర్ట్. హిందీ లో 2001 లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన దిల్ చహ్ తా హై సినిమా గుర్తుందా ! అందులోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు.

కోట ప్రవేశం

కోట ప్రవేశం

చిత్రకృప : Kumars

ఛపోరా కోట గోవా లోని వెగేటర్ బీచ్ కు సమీపంలో కలదు. ఈ బీచ్ అంతగా ప్రసిద్ధి చెందినప్పటికీ చూడటానికి ఆకర్షణీయమైనదే. గోవాలో ఇతర కోతల వలె ఇది కూడా చూడటానికి ఆకర్షణీయంగా కనపడుతుంది. నేటికీ పర్యాటకులు ఈ కోటను చూడటానికి ఇష్టపడుతున్నారంటే దీని ప్రాధాన్యత ఏపాటిదో ఈపాటికే అర్ధమయ్యే ఉంటుంది. ఒకప్పుడు ఈ కోట పోర్చుగీసు శిల్పకళా వైభవానికి అద్దం పడుతుండేది.

ఛపోరా కోట చరిత్ర

ఛపోరా కోట ను పోర్చుగీసు వారు క్రీ.శ. 1617 లో నిర్మించారు. ఈ కోట ను నిర్మించటానికి ప్రధాన కారణం హైందవ దాడుల నుండి తమను తాము రక్షించుకోవటానికి. దీని నిర్మాణం అగోడా కోట నిర్మాణ సమయంలో జరిగి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. కానీ అగోడా కోట హిందువుల ధాటికి తట్టుకోలేక శిధిలమైపోయింది. నేడు ఆ శిధిలాలను ఇక్కడికి వచ్చే పర్యాటకులు చూడవచ్చు.

కోట లోపలి భాగం

కోట లోపలి భాగం

చిత్రకృప : Savikagomes

2001 లో బాలీవూడ్ లో 'దిల్ చహ్ తా హై' బిగ్గెస్ట్ హిట్ ఇవ్వడంతో ఛపోరా కోట కాస్త 'దిల్ చాహ్ తా హై' కోట గా సినిమా వాళ్ళ దృష్టిలో పడింది. అప్పటి నుంచి ఇక్కడ ఏ సినిమా తీసినా తప్పక హిట్ అవుతుందనే నమ్మకం దర్శక, నిర్మాతలకు తెలిసివచ్చింది. బాలీవూడ్ కు కేంద్రబిందువైన ముంబై కు గోవా అతి చేరువ. ఇది కూడా ఒకరకంగా దర్శక, నిర్మాతలకు ప్లస్ పాయింటే!

ఫోర్ట్ సందర్శన సమయం : ఉదయం 7 నుండి సాయంత్రం 6 వరకు.

ఏదేమైనా సరే మీరు గోవా వెళితే బీచ్ లతో పాటు చారిత్రాత్మకమైన ఈ కోటను కూడా తప్పక సందర్శించండి. ఇక్కడికి ఉత్తర గోవా మాపూసా పట్టణం నుండి బస్సులు, క్యాబ్ లు, టాక్సీ లు దొరుకుతాయి. మాపూసా పట్టణం నుండి కోట కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కోట కు దిగువన సెయింట్ జెరోమ్ చర్చి ని తప్పక సందర్శించండి. ఇక్కడ ప్రతిఏటా జనవరి 6 వ తేదీన ఫెస్టా దాస్ రీస్ మేగోస్ వేడుక వైభవంగా జరుగుతుంది. ఛపోరా కోట కు వెళ్ళే దారిలో రీస్ మేగోస్ కోట ను కూడా వీలైతే చూడండి.

కోట పై నుండి అరేబియా సముద్రం దృశ్యం

కోటపై నుండి అరేబియా సముద్రం దృశ్యం

చిత్రకృప : Catchuec

మాపూసా పట్టణం లో వసతి

మాపూసా లో వసతి తక్కువ ధరకే దొరుకుతుంది. పట్టణంలో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. చుట్టుప్రక్కల గ్రామాల నుండి వర్తకులు ఇక్కడికి వచ్చి సంప్రదాయ చేతికళ వస్తువులను, తాజా పండ్లను, సంప్రదాయ ఆభరణాలను, వ్యవసాయ పరికరాలను అమ్ముతుంటారు.

ఇది కూడా చదవండి : అంజునా బీచ్ - అంతులేని విశ్రాంతి !!

ఆహారపు అలవాట్లు

మాపూసా పట్టణం సముద్రపు ఆహారాలకు ప్రసిద్ధి. అనేక రెస్టారెంట్లు, హోటళ్ళు ఇక్కడ ఉన్నాయి. వెగేటర్ బీచ్ వద్ద ఉన్న ప్రిమ్ రోజ్ షాక్ రెస్టారెంట్ గోవా వంటకాలకు, సంప్రదాయ భారతీయ వంటకాలకు పేరుగాంచినది. సముద్రపు ఆహారాలు కావలసినవన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. చీకటైతే నైన్ బార్ చేరి ఆనందించండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X