Search
  • Follow NativePlanet
Share
» »సుల్తాన్ కుమార్తె మనసు దోచిన కృష్ణయ్య !

సుల్తాన్ కుమార్తె మనసు దోచిన కృష్ణయ్య !

By Mohammad

మేల్కొటే (మేల్కోట) చరిత్ర సాధారణంగా ఎవరికీ అంతుపట్టదు. దీని చరిత్ర అంత సామాన్యమైనదేం కాదు. గొప్ప వైష్ణవ భక్తుడైన శ్రీ రామానుజాచార్య తో ఈ ప్రదేశం ముడిపడి ఉంది. ఇక్కడే భగవాన్ రామానుజాచార్యులు సంఘసంస్కర్తగా రూపం దాల్చాడు.

ఇది కూడా చదవండి : ఆధ్యాత్మిక పీఠం .. శృంగేరి క్షేత్రం !

కర్ణాటక లోని మండ్య జిల్లాలో పాండవపురం తాలూకాలో మేల్కొటే క్షేత్రం కలదు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ కృష్ణ దేవాలయం ఉన్నది. ఇందులోని విగ్రహాన్ని శ్రీ రామానుజుడు ప్రతిష్టించారని ప్రశస్తి. ఇక్కడ స్వామి వారిని ' చల్ల పిళ్ళ రాయుడు' అంటారు. బహుసుందరుడులెండీ ..!

చరిత్ర

చరిత్ర

అది ... ఢిల్లీ సుల్తానులు తమ సామ్రాజాన్ని విస్తరిస్తున్న కాలం. దండయాత్రలు, యుద్ధాలు చేసుకుంటూ .. చేసుకుంటూ మాండ్యా లోని మేల్కొటే ను సైతం జయించారు. వారు ఆక్రమించిన ఈ స్థలంలో శ్రీ కృష్ణుని విగ్రహం కంటపడగా ... తీసుకొని వెళ్లారు.

చిత్రకృప : sai sreekanth mulagaleti

చరిత్ర

చరిత్ర

స్వామి, రామానుజాచార్యుల కలలో కనపడి ఈ విషయం గురించి చెప్పగా, వెంటనే రామానుజుడు ఢిల్లీ సుల్తాన్ వద్దకు పయనమవుతాడు. ఎంత బతిమాలాడిన సుల్తాన్ ఆ విగ్రహాన్ని ఇవ్వటానికి ఒప్పుకోడు. పైగా అయన గారాలపట్టి ఆ విగ్రహంతో ఆడుకుంటుంది .. దాని పై మనసు పారేసుకుంది.

చిత్రకృప : Bobinson K B

చరిత్ర

చరిత్ర

అప్పుడు ఆచార్యులు ధ్యాన ముద్రలో కూర్చొని " చల్ల పిళ్ళ రాయా ! కృష్ణా ! ఇటు రా వయ్యా ! ' అంటూ ఆర్తిగా పిలవగానే శ్రీ కృషుని విగ్రహం నృత్యం చేసుకుంటూ వచ్చి ఆయన ఒడిలోకి చేరుకుంది. సుల్తాన్, అతని సిబ్బంది ఇదంతా చూస్తూ ఆశ్చర్యపోతారు. భక్తితో సుల్తాన్ రామానుజాచార్యులవారికి కృష్ణుని విగ్రహాన్ని ఇచ్చేస్తాడు. ఆ విగ్రహాన్ని తీసుకొని మేల్కొటే కు వచ్చి దేవాలయంలో ఉత్సవ మూర్తిగా ప్రతిష్టించారు.

చిత్రకృప : Sudarshana

చరిత్ర

చరిత్ర

సుల్తాన్ బిడ్డ అప్పటికే కృష్ణ భక్తిలో మునిగిపోయింది. కృష్ణుని మీద పెంచుకున్న ఆ విరహమే తనని మేల్కొటే రప్పించింది. జీవితాంతం కృష్ణుడిని సేవిస్తూ ఆయనలో లీనమైపోయింది.

చిత్రకృప : sai sreekanth mulagaleti

దేవాలయ విశేషాలు

దేవాలయ విశేషాలు

ఆలయంలో 'వైర్ ముడి' అనే వజ్రాల కిరీట ఉత్సవం ప్రసిద్ధి చెందినది.

చిత్రకృప : Pavuluri satishbabu 123

దేవాలయ విశేషాలు

దేవాలయ విశేషాలు

రామానుజాచార్యులు మొట్టమొదట దేవాలయంలో హరిజనులకు ప్రవేశం కల్పించాడు. ఎందుకంటే ఢిల్లీ సుల్తాన్ వద్దకు వెళ్లి విగ్రహాన్ని వెనక్కు తీసుకురావటంలో ఆయన వెంట ఉన్నది, సహాయపడింది వీరే.

చిత్రకృప : innacoz

వైర్ ముడి ఉత్సవాలు

వైర్ ముడి ఉత్సవాలు

ఆలయంలో ఏటా నిర్వహించే ఉత్సవాల కంటే వైర్ ముడి ఉత్సవాలు ఎంతో ప్రసిద్ధిచెందినవి. ఇవి 13 రోజుల వరకు నిర్వహిస్తారు. సంవత్సరానికి ఒకసారి నిర్వహించే ఈ ఉత్సవాలకు 5-6 లక్షల మంది హాజరవొచ్చని అంచనా !

చిత్రకృప : Pavuluri satishbabu 123

వైర్ ముడి ఉత్సవాలు

వైర్ ముడి ఉత్సవాలు

వైర్ ముడి అంటే స్వామి వారికి అలంకరించే కిరీటం. దీనిని పాల సముద్రం మీద పాడుకొనే సాక్షాత్ శ్రీమన్నారాయనుడి కిరీటంగా భావిస్తారు భక్తులు.

చిత్రకృప : Bala Subs

కిరీటం గురించి విశేషాలు

కిరీటం గురించి విశేషాలు

కిరీటానికి సూర్య కిరణాలు తాకకూడదు

స్వామి వారికి అలంకరించిన తరువాత సూర్యాస్తమయం అయ్యాక ఉత్సవ మూర్తిని నగర పుర వీధుల్లో ఊరేగిస్తారు.

స్వామి వారికి కిరీటం అలంకరించేత వరకు ప్రధాన అర్చకుడు సైతం కిరీటాన్ని చూడరాదు. కళ్ళకు గంతలు కట్టుకొని అలంకరించిన తరువాత చూడాలి.

గర్భగుడి లో రామానుజాచార్య విగ్రహానికి ఎదురుగా, ఉత్సవ మూర్తయిన చల్ల పిళ్ళ రాయుడికి విగ్రహం అలంకరించడం అనాదిగా వస్తున్నది.

చిత్రకృప : Bhelki

వైర్ ముడి పురాణ గాధ

వైర్ ముడి పురాణ గాధ

పాల సముద్రం మీద శయనించి ఉన్న శ్రీమన్నారాయనుడి కిరీటాన్న, భక్త ప్రహ్లాద కొడుకు, రాక్షస రాజైన విరోచనుడు తస్కరించి పారిపోతాడు. స్వామి వారు కిరీటాన్ని తీసుకొచ్చే బాధ్యత గరుత్మంతుని మీద పెడతాడు. అప్పుడు గరుత్మంతుడు ముల్లోకాలు గాలించి అతనితో యుద్ధం చేసి వైర్ ముడి కిరీటాన్ని స్వామి వారికి అప్పగిస్తాడు. ఏరోజైతే స్వామి వారు కిరీటాన్ని ధరించారో ఆరోజు నుండి ఇప్పటి వరకు వైర్ ముడి సేవను చేసుకుంటున్నాం.

చిత్రకృప : Hayavadhan

ఉత్సవ తీరు

ఉత్సవ తీరు

ఉత్సవాలకు ముందు స్వామి వారిని బంగారు గరుడ వాహనంపై ఊరేగిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామివారిని చూడటానికి వేలసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. సూర్యాస్తమ సమయం నుండి సూర్యోదయ సమయం వరకు ఉత్సవ మూర్తిని తిరువీధుల్లో ఊరేగిస్తారు.

చిత్రకృప : Dr Murali Mohan Gurram

ఆలయాన్ని తెరిచి ఉంచే సమయం

ఆలయాన్ని తెరిచి ఉంచే సమయం

సందర్శన సమయం : 7:30 am నుండి 1:00 pm వరకు, 4 :00 pm నుండి 6 :00 pm వరకు మరియు 7:00 pm నుండి 8:00 pm వరకు

శని, ఆదివారాలు మరియు ప్రభుత్వ సెలవు దినాలలో : 7:30 am - 1:30 pm , 3:30 pm - 6:00 pm, 7:00 pm - 8:00 pm

చిత్రకృప : arshotam Lal Tandon

ఇతర ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు

చలువ నారాయణ స్వామి ఆలయంతో పాటు కొండపై వెలసిన యోగా నరసింహ స్వామి ఆలయం, తొండనూర్ లో గల నంబి నారాయణ ఆలయం, పార్థిసారధి ఆలయం, రామానుజ ఆలయం, మేల్కొటే ఆలయ అభయారణ్యం, ఇస్కాన్ వనప్రస్థాన ఆశ్రమం మొదలైనవి చూడదగ్గవి.

చిత్రకృప : HPNadig

మేల్కొటే ఎలా చేరుకోవాలి ?

మేల్కొటే ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : మేల్కొటే కు సమీపాన 180 km ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు.

రైలు మార్గం : మండ్య సమీప రైల్వే స్టేషన్. ఇది మేల్కొటే నుండి 55 km ల దూరంలో ఉన్నది.

రోడ్డు మార్గం : బెంగళూరు, మండ్య, మైసూర్ తదితర ప్రాంతాల నుండి మేల్కొటే కు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుస్తాయి.

చిత్రకృప : Kanthmss

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X