Search
  • Follow NativePlanet
Share
» » చెన్నై మహా నగరం ... పరిసర ఆకర్షణలు !

చెన్నై మహా నగరం ... పరిసర ఆకర్షణలు !

అందమైన సముద్ర తీరం, అనేక దేవాలయాలు కల తమిళనాడు రాష్ట్ర రాజ దాని చెన్నై ( దీనిని గతం లో మద్రాస్ అనేవారు) ప్రస్తుతం చెన్నై గా పిలువబడే ఈ నగరం దేశంలోని నాలుగు ప్రసిద్ధ మహానగరాలలో ఒకటి. అద్భుత కట్టడాలు కానీ, సాంప్రదాయక మార్కెట్ లు కానీ, లేదా అతి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు కానీ అన్నీ ఈ మహానగరం లో ఆధునికత నుండి సాంప్రదాయ తమిళ సంస్కృతి వరకు కనపడతాయి. ఈ నగరం ప్రతి ఏటా వేలాది పర్యాటకులు, యాత్రికులను ఆకర్షిస్తోంది.

రామేశ్వరం, కన్యాకుమారి, మదురై, కంచి వంటి ప్రసిద్ధ నగరాలతో పాటు చెన్నై నగరం కూడా అనేక దేవాలయాలు కలిగి వుంది. చెన్నై నగరం ఒకప్పుడు తెలుగు సినిమాల తయారీ కి పుట్టినిల్లుగా వుండేది. తర్వాతి కాలంలో ఈ సినీ రంగాన్ని చాలా వరకు హైదరాబాద్ కు తరలించారు. దేశం లోని నాలుగు ప్రసిద్ధ మహానగరాలలో ఒకటి అయినందున చెన్నై నగరం చేరటం చాలా తేలిక. బెంగుళూరు, ఢిల్లీ, ముంబై, కొలకత్తా వంటి నగరాల నుండి విమాన, రైలు, బస్సు ప్రయాణ సౌకర్యాలు తరచుగా కలవు. మరి ఇంత ప్రసిద్ధి చెందిన ఈ నగరం లోను, చుట్టుపట్ల కల ఆకర్షణలు గురించి చిత్ర సహితంగా కొంత తెలుసుకోనండి.

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

గిండి నేషనల్ పార్క్ : చెన్నై లోని ఈ ప్రదేశం ఒక రక్షిత ప్రదేశం ఈ నేషనల్ పార్క్ సుమారు 2.70 చ. కి. మీ. లలో విస్తరించి వుంది. నగరంలో ఇది ఒక ప్రధాన ఆకర్షణ. దీనిలో 2000 మచ్చల జింకలు, వివిధ రకాల పక్షులు, ఇతర మృగాలు కలవు.

ఫోటో క్రెడిట్: Thamizhpparithi Maari

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

మెరీనా బీచ్ : నగరంలో మరొక ఆకర్షణ మెరీనా బీచ్. ఈ తీరం సెయింట్ జార్జ్ కోట నుండి సుమారు 13 కి. మీ. ల పొడవు కలిగి దేశంలో మొట్ట మొదటి, ప్రపంచంలో రెండవ అతి పొడవైన బీచ్ గా ప్రసిద్ధి చెందినది.

ఫోటో క్రెడిట్: L.vivian.richard

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

ప్రభుత్వ మ్యూజియం : దేశంలో రెండవ అతి పురాతన మ్యూజియం చెన్నై లోని ఎగ్మూరు లో కలదు. ఎగ్మూరు మ్యూజియం గా పిలువబడే దీనిని 1851 లో స్థాపించారు. దీనిలో అనేక పురాతత్వ వస్తు సేకరణలు కలవు.

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

పార్ధ సారధి దేవాలయం : చెన్నై నగరంలోని ట్రిప్లికేన్ లో కల పార్ధ సారధి దేవాలయం ఒక వైష్ణవ దేవాలయం. శ్రీ కృష్ణ భగవానుడికి సంబంధించినది. సంస్కృతం లో పార్ధ సారధి అంటే, అర్జునుడి రధ సారధి. ఇది ఒక అతి పురాతన దేవాలయం.

ఫోటో క్రెడిట్: Nsmohan

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

సెయింట్ థామస్ మౌంట్: ఇది చెన్నై నగరంలో కనపడే ఒక చిన్న కొండ. ఇక్కడ నుండి చెన్నై నగర సౌందర్యం చూడవచ్చు. ఇది అంతర్జాతీయ విమానాశ్రయం కు సమీపంలో కలదు.

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

కోవ లాంగ్ : ఈస్ట్ కోస్ట్ సముద్రం తీరం మార్గంలో మహాబలిపురం మార్గంలో సుమారు 40 కి. మీ. ల దూరంలో ఈ మత్స్య కారుల పల్లె కలదు. ఇక్కడ మీరు విండ్ సర్ఫింగ్ ఆనందించవచ్చు.

ఫోటో క్రెడిట్: Kmanoj

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

వల్లువార్ కొట్టం : తమిళ ప్రసిద్ధ కవి, ఆధ్యాత్మికుడు అయిన తిరువల్లువార్ జ్ఞాపకార్ధం నిర్మించిన స్మారకమే వల్లువార్ కొట్టం

ఫోటో క్రెడిట్: Surajram

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

వివేకానంద భవనం : ఈ భవనం వివేకానందుడికి సంబంధించినది. వివేకానందుడు చెన్నై కి వచ్చినపుడు ఈ భవనంలో నివసించే వాడు. ఇది ఇపుడు రామకృష్ణ మట్ యొక్క ప్రధాన భవనంగా మారింది.

ఫోటో క్రెడిట్: SriniG

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

క్వీన్స్ ల్యాండ్ : చెన్నై నగరంలోని పూనమల్లి అనే ప్రదేశంలో ఈ ఆకర్షణీయ తోట కలదు. 2003 లో ప్రారంభమైన ఈ తోట లేదా పార్క్ సుమారు 70 ఎకరాలలో విస్తరించి వుంది. ఇక్కడ మీకు అనేక రైడ్ లు లభిస్తాయి. ఈ పార్క్ ఎంట్రన్స్ ఫీజు పెద్దలకు రూ.350 మరియు పిల్లలకు రూ.250 గా కలదు. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10.30 గం నుండి సా. 6.30 వరకూ తెరచి వుంటుంది

ఫోటో క్రెడిట్: Vijay5050

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

వి జి ఫై యూనివర్సల్ కింగ్డం : ఇది ఒక మనోరంజన్ పార్క్. 1997 నుండి ఈ పార్క్ నగర ప్రజలకు వివిధ క్రీడలను అందిస్తోంది.

ఫోటో క్రెడిట్: వి జి పి

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

ఏమ్పా స్కై పార్క్ : చెన్నై నగరం లో ఇది ఒక సుప్రసిద్ధ షాపింగ్ మాల్. ఇక్కడ మల్టీ ప్లేక్స్ థియేటర్, ఇంకనూ అనేక షాపింగ్ ఆకర్షణలు కలవు.

ఫోటో క్రెడిట్: Ashwin Kumar

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

ఎడ్వర్డ్ ఎలియత్స్ బీచ్ : దీనినే బెసెంట్ నగర్ బీచ్ అని కూడా పిలుస్తారు. నగర ప్రజలు వారాంతపు సెలవులకు ఇక్కడి బీచ్ కు వచ్చి ఆనందిస్తారు. ఇది చెన్నై లోని బెసెంట్ నగర్ లో కలదు.

ఫోటో క్రెడిట్: B.Sandman

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

రిప్పన్ భవనం :చెన్నై మహానగర పాలిక భవనమే రిప్పన్ భవనం. ఇది ఇండో - సార్సెనిక్ శిల్ప శైలి కలిగిన నిర్మాణం. తెలుపు రంగులో కల ఈ భవనం, చెన్నై సెంట్రల్ స్టేషన్ కు సమీపంలో కలదు.

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

చెన్నై సెంట్రల్ : ఇది చెన్నై లోని ప్రధాన రైలు స్టేషన్. దీనినే మద్రాస్ సెంట్రల్ అని కూడా అంటారు. ఇక్కడ నుండి న్యూ ఢిల్లీ, బెంగుళూరు, ముంబై వంటి నగరాలకు రైళ్ళు కలవు. ఎల్లపుడూ ఈ స్టేషన్ చాలా బిజి గా వుంటుంది.

ఫోటో క్రెడిట్: Planemad

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

బిర్లా ప్లానిటోరియం : ఈ ప్లానిటోరియం చెన్నై లోని కొట్టుపురం లో కలదు. ఇది ఆకాశంలోని నక్షత్రాల గురించిన ఖగోళ శాస్స్త్ర విజ్ఞానం తెలుపుతుంది.

ఫోటో క్రెడిట్: Googlesuresh

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

ఎస్.డి.ఎ.టి . టెన్నిస్ స్టేడియం : ఈ క్రీడా ప్రదేశం చెన్నై లోని నుంగం బాకం ప్రదేశంలో కలదు. ప్రతి సంవత్సరం ఇక్కడ జనవరి మొదటి వారంలో టెన్నిస్ క్రీడా పోటీలు ఇక్కడ ఏర్పరుస్తారు.

ఫోటో క్రెడిట్: Matthewmayer

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

సమాలి పూన్గా : తమిల్ భాష లో దీనికి అర్ధం ఒక పూ తోట. ఇది ఒక బొటానికల్ గార్డెన్. చెన్నై హోర్తికల్చర్ శాఖ నిర్వహిస్తుంది.

ఫోటో క్రెడిట్: Balajijagadesh

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

సమాలి పూన్గా : నవంబర్ 24 , 2010 లో ఈ తోట స్థాపించబడినది.

ఫోటో క్రెడిట్: Eashchand

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

సమాలి పూన్గా : ఆహ్లాదకరమైన ఈ తోటలు నీటి కొలనులు, వివిధ రకాల పక్షులు కలవు.

ఫోటో క్రెడిట్: Eashchand

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

సమాలి పూన్గా : ఈ ఉద్యానవనంలోని బొమ్మల ఫౌంటెన్ లలో సాయంత్రపు వేళ నీరు చిమ్ముతుంది. ఈ దృశ్యం ఎంతో మనోహరంగా వుంటుంది.

ఫోటో క్రెడిట్: Eashchand

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

ఎం. ఎ. చిదంబరం స్టేడియం : చెన్నై లోని చీపాక్ ప్రదేశంలో కల చిదంబరం స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ కు ప్రసిద్ధి. ఇక్కడ అనేక ఇంటర్నేషనల్ క్రికెట్ ఆటలు జరుగుతాయి.

ఫోటో క్రెడిట్: Chandrachoodan Gopalakrishnan

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

కాపాలీస్వర దేవాలయం : చెన్నై లోని మైలాపూర్ ప్రదేశంలో కల కాపాలీస్వర దేవాలయం శివుడికి సంబంధించినది. ఈ దేవాలయం సుమారు ఎదవ శతాబ్దంలో ద్రావిడ శిల్ప శైలిలో నిర్మించారు.ప్రస్తుతం నగరం లో ఇది ఒక ప్రసిద్ధ దేవాలయంగా పేరు పడింది.

ఫోటో క్రెడిట్: Nsmohan

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

లైట్ హౌస్ : బంగాళా ఖాతం కు ఎదురుగా కల ఈ లైట్ హౌస్ మరీనా సముద్ర తీరంలో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ లైట్ హౌస్ లో వాతావరణ కార్యాలయం కూడా కలదు.

ఫోటో క్రెడిట్: Balu Velachery

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

వాడపాలని మురుగన్ దేవాలయం: చెన్నై లోని వాడపాలని లోని అందవార్ దేవాలయం లో మురుగన్ విగ్రహం వుంటుంది. మురుగన్ అంటే సుబ్రమణ్య స్వామీ. ఈ దేవాలయం మరియు రాజగోపురం లు సుమారు 1920 సంవత్సరంలో నిర్మించారు.

ఫోటో క్రెడిట్: wikipedia

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

పులాల్ ఏరి : ఇది ఒక జలాశయం. ఇది చెన్నై సెంట్రల్ నుండి సుమారు 20 కి. మీ. ల దూరంలో కలదు. నగర ప్రజలు వారాంతపు విహారాలకు ఈ ప్రదేశానికి వెళతారు. ఇది తిరువల్లువార్ జిల్లా లో కల పొంనేరి వద్ద కలదు. ఈ జలాశయం నుండి చెన్నై కి తాగు నీరు సరఫరా అవుతుంది.

ఫోటో క్రెడిట్: பரிதிமதி

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

మరున్దీస్వర దేవాలయం శివుడికి చెందినది. ఇది తిరువన్నియూర్ లో కలదు. ఇక్కడ సుమారు 275 దేవాలయాలు కలవు.

ఫోటో క్రెడిట్: Mohan Krishnan

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

మధ్య కైలాష. ఈ దేవాలయం చెన్నై లోని అడయార్ ప్రదేశంలో కలదు. దేవాలయంలో దేవుడు, వెంకట ఆనంద వినాయక అంటే గణేశుడు. చుట్టూ శివ, విష్ణు మరియు ఇతర దేవుళ్ళ విగ్రహాలు కూడా కలవు. ఇక్కడ మీరు సప్తస్వరాలైన ఏడూ స రి గ మా ప ద ని స లతో ద్వ్హని వచ్చే ఏడు గంటలు చూడవచ్చు. వినాయక చతుర్ధి నాడు సూర్య కిరణాలు మూల విరాట్టు పై పడటం ఒక విశేషం.

ఫోటో క్రెడిట్: Sankar Pandian

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

శ్రీ రామకృష్ణ మట్ : యూనివర్సల్ టెంపుల్ లేదా ప్రపంచ దేవాలయం గా పిలువా బడే చెన్నై లోని శ్రీ రామకృష్ణ మట్ దక్షిణ భారత దేశంలో రామకృష్ణ మండలి వారి అతి ప్రాచీన మట్

ఫోటో క్రెడిట్: Srinivasan G

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

త్యాగరాజ దేవాలయం: చెన్న నగర ఉత్తర భాగంలో కల తిరువోట్టియూర్ అనే ప్రదేశంలో శివ సంబంధిత త్యాగరాజ దేవాలయం చూడవచ్చు.

ఫోటో క్రెడిట్: Mohan Krishnan

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

ప్యారీస్ కార్నర్ : చెన్నై నగరంలోని చెన్నై బందర్ ప్రదేశంలో కలది ప్యారీస్ కార్నర్. పూర్వం థామస్ ప్యారీ అనే ఒక ఇంగ్లాండ్ వ్యాపారి ఇక్కడ ఇ ఐ డి ప్యారీ అనే కంపెనీ ని స్థాపించాడు. ఆయన పేరుతో ఈ ప్రదేశం ఏర్పడింది. ఇక్కడ ఎన్నో వ్యాపారాలు జరుగుతాయి. హాలివుడ్ మరియు తమిళ చిత్రాల సి డి లు, డి వి డి లు విరివిగా దొరుకుతాయి.

ఫోటో క్రెడిట్: L.vivian.richard

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

స్పెన్సర్ ప్లాజా : చెన్నై నగరంలోని అన్నా శాలై లో కల స్పెన్సర్ ప్లాజా ఒక ప్రసిద్ధ షాపింగ్ మాల్. చాలా పురాతనమైనది. ఇక్కడ మీకు వివిధ అంతర్జాతీయ బ్రాండ్ వస్తువులు లభిస్తాయి. భారత దేశంలోని అతి పెద్ద షాపింగ్ మాల్స్ లో ఇది ఒకటి గా గుర్తించబడినది.

ఫోటో క్రెడిట్: Ashwin Kumar

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

అన్నా నగర టవర్ పార్క్ : అధికారికంగా చెప్పబడే డా. విశ్వేశ్వరయ్య టవర్ పార్క్ చెన్నై లో ని అన్నా నగర్ లో ప్రముఖ ఆకర్షణ. ఈ గార్డెన్ లో కల గోపురం నగరంలో అతి ఎత్తైన గోపురం. పిక్నిక్ లేదా విశ్రాంతి ప్రదేశంగా ఇది ఒక సరైన ప్రదేశం

ఫోటో క్రెడిట్: Acvasagam

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

శివన్ పార్క్ : చెన్నై లోని కే.కే. నగర ప్రదేశంలో ఈ గార్డెన్ చూడవచ్చు. ఉదయం వాకింగ్ సమయం నుండి సాయంత్రం వాకింగ్ సమయం వరకూ ఇక్కడ జనం తిరుగుతూనే వుంటారు. పిల్లలకు ఒక ఆట స్థలం గా కూడా పేరు పడింది. సాయంత్రపు సమయంలో రుచికరమైన చాట్ లు కూడా ఇక్కడ దొరుకుతాయి.

ఫోటో క్రెడిట్: Destination8infinity

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

మద్రాస్ మొసళ్ళ తోట : చెన్నై నగరానికి సుమారు 40 కి. మీ. ల దూరంలో ఈ మొసళ్ళ ఉద్యానవనం చూడవచ్చు. అపాయంలో చిక్కుకున్న మొసళ్ళను రక్షించి ఇక్కడ వుంచి పెంచు ఉద్దేశ్యంతో ఈ మొసళ్ళ తోట నిర్మించబడింది. ఇక్కడకు టూరిస్ట్ లు అధిక సంఖ్యలో వస్తారు.

ఫోటో క్రెడిట్: Kmanoj

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

చోలమండలం ఆర్టిస్ట్ విలేజ్ : 1966 లో స్థాపించిన ఈ గ్రామం కళాకారులకు గొప్ప నిలయం అయింది. మద్రాస్ స్కూల్ అఫ్ ఆర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ కే.సి ఎస్. పానికర్ చే స్థాపించబడిన ఈ విలేజ్ లో అనేక తోటలు, కళాకృతులు చూడవచ్చు. ఈ విలేజ్ చెన్నై నగరానికి 9 కి. మీ. ల దూరంలో కలదు.

ఫోటో క్రెడిట్: Destination8infinity

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

దక్షిణ చిత్ర : దక్షిణ భారత దేశ ప్రజల జీవన శైలి ని ప్రతిబింబించే లక్ష్యంతో ఈ సంస్థ స్థాపించబడినది. ఇది ఒక సాంప్రదాయక గ్రామం. చెన్నై నగరానికి ఇది 25 కి. మీ. ల దూరంలో కలదు.

ఫోటో క్రెడిట్: Koshy Koshy

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

కన్నెమరా పబ్లిక్ లైబ్రరీ : ఈ పబ్లిక్ లైబ్రరీ చెన్నై నగరంలోని ఎగ్మూర్ ప్రదేశంలో కలదు. దేశంలోని ప్రసిద్ధ గ్రంధాలయాలలో ఇది ఒకటి. వివిధ రకాల గ్రంధాలు, దైనందిన పత్రికలు ఇక్కడ పాటకులకు లభిస్తాయి.

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

శరవణ భవనం : చెన్నై నగరంలో ఇది ఒక ప్రసిద్ధ హోటల్. అనేకమంది టూరిస్ట్ లు ఈ హోటల్ లో తమ ఆహార అవసరాలు తప్పక తీర్చుకుంటారు.

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

చెన్నై నగరానికి దక్షిణంగా సుమారు 20 కి. మీ. ల దూరం లో కల ఈ జలాశయం అనేక పక్షులకు స్థావరంగా వుంటుంది. అనేక ఫాల్కన్ పక్షులు, బాతులు ఇక్కడ చూడవచ్చు.

ఫోటో క్రెడిట్: GnanaskandanK

మహానగరంలో మాయాజాలం!

మహానగరంలో మాయాజాలం!

సెయింట్ జార్జ్ కోట : భారత దేశంలో బ్రిటిష్ పాలకులు నిర్మించిన కోట ఇది. దీనిని 1644 లో నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనం, తమిలానాడు విధాన సౌద గా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఇంకనూ అనేక కార్యాలయాలు కూడా చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X