Search
  • Follow NativePlanet
Share
» »ఘటోత్కచుని ఆశ్రమమే ... చిత్రదుర్గ !

ఘటోత్కచుని ఆశ్రమమే ... చిత్రదుర్గ !

ఇక్కడే హిడింబాసురిడికి మరియు పాండవరాజైన భీమసేనుడికి మధ్య పోటాపోటీ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో హిడంబాసురుడు చనిపోతాడు. ఇతనికి ఒక చెల్లలు ఉంటుంది. ఆమె పేరు హిడంబ.

By Mohammad

కర్ణాటక రాజధాని బెంగళూరు నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వత ప్రాంతమే చిత్రదుర్గ. విజయనగర రాజుల కాలంలో, నాయక వంశీయుల కాలంలో దీని వైభోగం వర్ణించహటానికి వీలుకానంతగా ఉండేది. బళ్లారికి 125 కిలోమీటర్ల దూరంలో ... బెంగళూరు-పూణే జాతీయ రహదారి మార్గంలో ఉన్న చిత్రదుర్గకు వారాంతంలో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది.

చరిత్ర

ఇక్కడే హిడింబాసురిడికి మరియు పాండవరాజైన భీమసేనుడికి మధ్య పోటాపోటీ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో హిడంబాసురుడు చనిపోతాడు. ఇతనికి ఒక చెల్లలు ఉంటుంది. ఆమె పేరు హిడంబ. ఈమె శాంతస్వభావురాలు. భీముడిని వలచి వివాహం ఆడింది. వీరికి పుట్టిన సుపుత్రుడే 'ఘటోత్కచ'. ఇతను మహా పరాక్రమ సంపన్నుడు. తండ్రివలె బలశాలి కూడా. ఇతని ఆశ్రమం చిత్రదుర్గ అవ్వటం బహు చిత్రం గా అగుపిస్తుంది.

ఇది కూడా చదవండి : కైవారా భీమలింగేశ్వర ఆలయం !

చిత్రదుర్గ లో సందర్శించటానికి కోటలు, మతపరమైన కేంద్రాలు ఉన్నాయి. కొండ మీద ఉన్న కోట ను చేరుకోవటానికి ఎక్కువ మంది పర్యాటకులు మొగ్గుచూపుతుంటారు. సాహసికులు ట్రెక్కింగ్ చేస్తూ కోట చేరుకోవటం ఒక అనుభూతి.

చిత్రదుర్గ కోట

చిత్రదుర్గ కోట

పెద్ద పెద్ద గ్రానైట్ బండలను కలిగి ఉన్న కొండలను కలుపుతూ కోట గోడల నిర్మాణం జరిగింది. కోట బయటివైపున పెద్ద కందకం ఉన్నది. కోటలోకి చేరుకోవటానికి 18 గుమ్మాలు, 38 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. కోటలోకి అత్యవసరంగా వెళ్లేందుకు కొన్ని రహస్యమార్గాలు ఉన్నాయి.

చిత్ర కృప : Nirde102

చిత్రదుర్గ కోట

చిత్రదుర్గ కోట

కోట ఎత్తైన ప్రదేశంలో కోటబురుజులు ఏర్పాటుచేశారు. ఇవి 4-6 కిలోమీటర్ల దూరం నుండి కనిపించే విధంగా ఉంటాయి. శత్రువుల రాకను ముందుగానే పసిగట్టి అప్రమత్తవటానికి ఇవి సహకరిస్తాయి. కోట గోడలు నలుగురైదుగురు నడిచేవిధంగా వెడల్పుగా ఉంటాయి.

చిత్ర కృప : Deep Goswami

కోట లో చూడవలసిన ప్రదేశాలు

కోట లో చూడవలసిన ప్రదేశాలు

గణపతి ఆలయం, రాతిదీపస్తంభం, రాతిస్తంభ ఉయ్యాలకొక్కేలు, వసంతకోనేరు, అక్కా- చెల్లల కోనేరు, సిద్దేశ్వరి దేవి గుడి, కొద్ది దూరంలో మట్టిగోడలతో నిర్మించిన టంకశాల ఉన్నాయి. కొండ కు ఒకవైపున గుట్టపై లింగేశ్వర స్వామి ఆలయం, అలానే కాస్త ముందు దూరం వెళితే రాఘవేంద్రస్వామి మఠం కనిపిస్తాయి.

చిత్ర కృప : Nagarjun Kandukuru

ఒనకే ఒబవ్వ కుండి

ఒనకే ఒబవ్వ కుండి

కన్నడ చరిత్రలో కిత్తూరు చెన్నమ్మ తరువాత అంతటి వీరవనితగా ఖ్యాతికెక్కిన ఒబవ్వ వీరత్వాన్ని కోటను దర్శించే ప్రతి యాత్రికుడు గుర్తుకుతెచ్చుకొని తీరాల్సిందే! ఈమె కోట కాపలాదారుని భార్య. ఒకరోజు మధ్యాహ్నం భర్తకు భోజనాన్ని తీసుకొని సత్రానికి వెళ్ళింది.

చిత్ర కృప : Pavithrah

ఒనకే ఒబవ్వ కుండి

ఒనకే ఒబవ్వ కుండి

భర్త తినేందుకై ఉపక్రమించగా, అతనికి నీరు తేవటానికి నీటి చెలమ వద్దకు చేరుకుంది. హైదర్ అలీ సైన్యం రెండు బండరాళ్ల మధ్య ఉన్న సన్నని కన్నం నుండి రావటం గమనించిన ఒబవ్వ, భర్తని తినే పళ్లెం ముందు నుంచి లేపడం ధర్మం కాదని పక్కనే ఉన్న రోకలిని తీసుకొని లోనికి ప్రవేశిస్తున్న ఒక్కో సైన్యాన్ని మట్టుబెట్టింది.

చిత్ర కృప : Palagiri

ఒనకే ఒబవ్వ కుండి

ఒనకే ఒబవ్వ కుండి

భోజనం ముగించుకొని వచ్చిన ఆమె భర్త, గుట్టలుగుట్టలుగా పడిఉన్న శవాలను, రక్తపు మరకలలో తడిసిన ఒబవ్వను చూసి విస్తుపోతాడు. అలా ధీరవనితగా ఒబవ్వ చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పటికీ ఆ కన్నాన్ని పర్యాటకులు చూడవచ్చు.

చిత్ర కృప : Palagiri

భారీ రాతి తిరుగల్లు

భారీ రాతి తిరుగల్లు

కోటలోని భారీ రాతి తిరుగల్లు ను తప్పక సందర్శించాలి. ఇది చూడటానికి తిప్పే ఇరుసువలె ఉంటుంది. ఈ ఇరుసును యూఏపీయోగించి రొట్టె పిండి ఆడించారని స్థానికుల కధనం. కానీ, పర్యాటక శాఖవారు దీనిని తుపాకులతో వాడే మందుపొడిని తయారుచేయటానికి వాడేవారని చెబుతారు.

చిత్ర కృప : Deep Goswami

మత కేంద్రాలు

మత కేంద్రాలు

కోటలో శివ, వైష్ణవ ఆలయాలతో పాటు చిన్న, పెద్ద ఆలయాలు కలిపి మొత్తం 20 వరకు ఉన్నాయి. ఇందులో ఒక మసీదు కూడా కలదు.

చిత్ర కృప : Arun Kumar Mathivaanan

వాల్మీకి మ్యూజియం

వాల్మీకి మ్యూజియం

కోటలోని వస్తుప్రదర్శన శాలనే వాల్మీకి మ్యూజియం అంటారు. ఇందులో దుర్గాన్ని పాలించిన నాయక్ చిత్రపటాలు, ఖడ్గాలు, కైజారులు, తుపాకులు, నాణేలు ఉన్నాయి. నగరానికి చుట్టుపక్కల 2-4 కిలోమీటర్ల పరిధిలో కొండల వరుసలలో గాలిమరలు కనిపిస్తాయి.

చిత్ర కృప : alagiri

చిత్రదుర్గ ఎలా చేరుకోవాలి?

చిత్రదుర్గ ఎలా చేరుకోవాలి?

వాయు మార్గం : చిత్ర దుర్గ సమీపాన 189 కిలోమీటర్ల దూరంలో హుబ్లీ విమానాశ్రయం, 200 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, 135 కిలోమీటర్ల దూరంలో బళ్ళారి విమానాశ్రయం కలదు.

రైలు మార్గం : చిత్రదుర్గ లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి బెంగళూరు, హైదరాబాద్, బళ్లారి తో పారు ఇతర ప్రాంతాల నుండి కూడా రైళ్లు వస్తుంటాయి. బెల్లెహళ్లి సమీపాన ఉన్న మరో రైల్వే స్టేషన్.

రోడ్డు/ బస్సు మార్గం : బళ్లారి, బెంగళూరు, అనంతపురం తో పాటు కర్ణాటక రాష్ట్రంలోని సమీప ముఖ్య పట్టణాల నుండి కూడా చిత్రదుర్గ కు బస్సులు వస్తుంటాయి.

చిత్ర కృప : Nagarjun Kandukuru

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X