Search
  • Follow NativePlanet
Share
» »చిత్రగుప్తుని దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా ?

చిత్రగుప్తుని దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా ?

చిత్రగుప్తునికి ఆలయాలు బహుఅరుదు. వేళ్ళ మీద లెక్కపెట్టేవిధంగా ఉంటాయి. చిత్రగుప్తుని దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా ?

By Mohammad

యమలీల, యమగోల, యమదొంగ .. లాంటి చిత్రాలను చూసినవారికి చిత్రగుప్తుడు గురించి తెలిసే ఉంటుంది. చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాప పుణ్యాల చిట్టా రాసేవాడు. యమధర్మ రాజు ఆస్థానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తరువాత వారికి స్వర్గమో, నరకమో ఈయన తేలుస్తాడు. చిత్రగుప్తుడు భారత్ లోనూ, నేపాల్ లోనూ కాయస్థులకు ఆరాధ్య దేవుడు. ఈయన బ్రహ్మ పుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది.

మనదేశంలో రావణాసురుడు ఆలయాలు ఇవే !

చిత్రగుప్తుడు ఎలా ఉద్భవించాడు ?

బాగా ప్రాచుర్యం చెందిన కథ ప్రకారం, బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు. యముడు తన దగ్గరికి వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడూ వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించడంలో పొరపాట్లు జరిగేవి. బ్రహ్మ యముడిని ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు. కానీ ఒక్కో జీవి ఎత్తే ఎనభై నాలుగు జన్మల వలన తనకు నిర్వహించడం కష్టంగా ఉందని తెలియజేస్తాడు. దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆఖరున కళ్ళు తెరిచి చూసే సరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలం, కాగితం పట్టుకుని కనిపించాడు. చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు కాబట్టి ఆయనకు జన్మించిన వారసులను 'కాయస్థులు' అని వ్యవహరిస్తారు.

భారతదేశంలో మహిళలు కట్టించిన అద్భుత కట్టడాలు !

మొదటగా బ్రహ్మ మనసులో ఆలోచనగా మొదలై (చిత్ర), మిగతా దేవతలకు తెలియకుండా (గుప్తంగా) సృష్టించబడ్డాడు కాబట్టి అతని పేరు చిత్రగుప్తుడు అయ్యింది.

ఆలయాలు

ఆలయాలు

చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి దక్షిణ భారతదేశంలో రెండే ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఉండగా, మరొకటి తమిళనాడు రాష్ట్రంలోని కంచి లో కలదు. ఇప్పుడు ఆ రెండు దేవాలయాల గురించి తెలుసుకుందాం !

చిత్రకృప : Deepa Chandran2014

చిత్రగుప్తుని ఆలయం

చిత్రగుప్తుని ఆలయం

హైదరాబాద్ లోని ఫలక్ నామా, కందికల్ గేటు దగ్గర చిత్రగుప్త మహాదేవ దేవాలయం ఉన్నది. దీనికి 250 సంవత్సరాల చరిత్ర ఉన్నది. భూలోకానికి అప్పుడప్పుడు వచ్చిపోయే చిత్రగుప్తుడికి ఈ దేవాలయాలు నివాసాలు అని చెబుతారు. నవాబుల కాలంలో మంత్రిగా ఉన్న రాజా కిషన్ పర్షాద్ ఈ గుడిని అభివృద్ధి పరిచాడు. దేవాలయం మూడున్నర ఎకరాలలో విస్తరించి ఉంటుంది.

చిత్రకృప : Ponnuru Sudeep

చిత్రగుప్తుల వారికి ఇద్దరు భార్యలు

చిత్రగుప్తుల వారికి ఇద్దరు భార్యలు

చిత్రగుప్తుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య సూర్య దక్షిణ నందిని, మరొకరు పార్వతీ శోభావతి. మొదటి భార్యకు నలుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు. రెండవ భార్య కు ఎనిమిది మంది కుమారులు, ఎనిమిది మంది కుమార్తెలు. ఇద్దరు భార్యలతో కులుకుతున్న చిత్రగుప్తుని రాతి విగ్రహం ఇక్కడ ఉన్నది.

చిత్రకృప : Raghavendra Puligadda

ఉత్సవం

ఉత్సవం

దీపావళి రెండవ రోజు ఘనంగా ఉత్సవం జరుపుతారు. ఆరోజు చిత్రగుప్తుని పుట్టినరోజు గా వ్యవహరిస్తారు. గుప్తునికి బుధవారం అంటే మహాఇష్టమట!

చిత్రకృప : McKay Savage

పూజలు

పూజలు

చావుని జయించటానీకే కాదు .. ఆరోగ్యం, సంతానం, చదువు, పెళ్లి వంటి అనేక సమస్యల పరిష్కారం కోసం భక్తులు దర్శిస్తుంటారు. బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయి. కేతు గ్రహ దోష నివారణకు పూజలు జరుగుతుంటాయి.

చిత్రకృప : Ponnada Viswanath

చిత్రగుప్తుని ఆలయం

చిత్రగుప్తుని ఆలయం

తమిళనాడు లోని కంచి లో కూడా చిత్రగుప్తుడికి ఆలయం ఉంది. దీనిని క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దంలో చోళులు నిర్మించారు. చిత్రగుప్తుడికి ఈ ఆలయం అరుదైనది. క్రీ.శ. 1911 లో పురావస్తుశాఖ తవ్వకాలలలో ఇక్కడి పంచలోహ విగ్రహం బయటపడింది.

చిత్రకృప : Ssriram mt

చిత్రగుప్త టెంపుల్

చిత్రగుప్త టెంపుల్

ఉత్తర భారతదేశంలో చిత్రగుప్తునికి కొన్ని ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అయోధ్యలో ఉన్నది. రాముడు సైతం చిత్రగుప్తుడిని కొలిచినట్లు పురాణాలు చెబుతున్నాయి. స్వయంగా రాముడు ఇక్కడ పూజలు చేసినట్లు ప్రతీతి. దీనినే ధర్మహరి చిత్రగుప్త దేవాలయం అంటారు. లక్నో లో కూడా ఒక ఆలయం ఉన్నది.

చిత్రకృప : Shirshakbaniya

మధ్య ప్రదేశ్ లో

మధ్య ప్రదేశ్ లో

'భారతదేశానికి గుండెకాయ' గా పిలువబడే మధ్యప్రదేశ్ లో కూడా చిత్రగుప్త ఆలయాలు మూడు ప్రాంతాలలో ఉన్నాయి. జబల్పూర్ లోని ఫుటాతాల్ లో ఒకటి, శిప్రా నదీ తీరంలోని రాంఘాట్ వద్ద మరొకటి, ఉజ్జయినిలో మరో రెండు దేవాలయాలు కలవు. ఈ నాలుగు దేవాలయాలు రెండవ శతాబ్దానికి చెందినవిగా చెబుతారు. ఖజురహో లో సూర్యభగవానుడికి అంకితం చేయబడిన చిత్రగుప్త దేవాలయం ఉన్నది.

చిత్రకృప : Dennis Jarvis

రాజస్థాన్ లో

రాజస్థాన్ లో

రాజస్థాన్ రాష్ట్రంలో రెండు ప్రదేశాల్లో చిత్రగుప్త దేవాలయాలు ఉన్నాయి. అల్వార్ లో మూడవ శతాబ్దంలో కట్టించిన చిత్రగుప్త దేవాలయం, ఉదయపూర్ లో మరో చిత్రగుప్త ఆలయం కలదు.

చిత్రకృప : Suraj Belbase

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X