Search
  • Follow NativePlanet
Share
» »చిత్రగుప్తుని దేవాలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా?

చిత్రగుప్తుని దేవాలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా?

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ఈ దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. మధ్యప్రదశ్‌ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో చిత్రగుప్త దేవాలయాలు ఉన్నాయి.

By Venkatakarunasri

యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడా దేవాలయాలు ఉన్నాయి. కానీ వీటిని వేళ్ల మీద లెక్కించొచ్చు. ముఖ్యంగా ఆసియా ఖండంలో చిత్రగుప్తుడి భక్తులు ఎక్కువగా ఉన్నారు భరతుడు పాలించిన భారత దేశంలో వీటిని నిర్మించారు. రాముడు సైతం చిత్రగుప్తుడిని కొలిచినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుకే రాముడు రాజ్యమేలిన అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయం ఉంది.స్వయంగా రాముడే ఇక్కడ పూజలు చేసినట్టు ప్రతీతి.

దీన్ని ధర్మ హరి చిత్రగుప్త దేవాలయం అని అంటారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ఈ దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. మధ్యప్రదశ్‌ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో చిత్రగుప్త దేవాలయాలు ఉన్నాయి. జబల్‌ పూర్‌ లోని ఫూటాతాల్‌, షిప్రా నదీ తీరంలోని రామ్‌ఘాట్‌లో , ఉజ్జయినిలో రెండు దేవాలయాలు ఉన్నాయి. అవి దాదాపు రెండు శతాబ్దాలు దాటినవి అయి ఉంటాయి. అంటే ఒక్క మధ్య ప్రదేశ్‌లో నాలుగు చిత్ర గుప్త దేవాలయాలు ఉన్నాయి. రాజస్థాన్‌ అల్వార్‌లో మూడు శతాబ్దాల చిత్రగుప్త దేవాలయం ఉంది. అదే రాష్ట్రం ఉదయపూర్‌లో మరో చిత్రగుప్త దేవాలయం ఉంది.

చిత్రగుప్తుని దేవాలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా?

1. ఎక్కడ వుంది?

1. ఎక్కడ వుంది?

ఉత్తర భారత దేశంలో అరుదుగా ఉన్న చిత్రగుప్త దేవాలయాలు దక్షిణాదిన తమిళనాడులోని కాంచిపురంలో ఒకటి ఉంది. తెలంగాణాలో చిత్రగుప్తుడి దేవాలయం కేవలం ఒకే ఒకటి ఉంది. ఇంత అరుదైన దేవాలయం హైద్రాబాద్‌ పాతబస్తీ కందికల్‌ గేట్‌ ప్రాంతంలో ఉంది.

2. చిత్రగుప్త దేవాలయం

2. చిత్రగుప్త దేవాలయం

అయినా స్థానికులు చాలా మందికి ఇక్కడ చిత్రగుప్త దేవాలయం ఉందన్న విషయం తెలియదు. చిత్రగుప్తుడి గుడి గంట మోగే శబ్దం వినిపించడం కన్నా వారికి చావు డప్పు, బంధువుల శోకాలు వినిపిస్తుంటాయి.

3. చిత్రగుప్త దేవాలయం

3. చిత్రగుప్త దేవాలయం

దేవాలయం ముందు నుంచి తరచుగా పీనుగులను మోసుకెళ్లే పాడెలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే దేవాలయానికి కూత వేటు దూరంలోనే నల్లవాగు స్మశాన వాటిక ఉండటంతో ఈ మార్గం గుండానే అనేక శవయాత్రలు వెళాల్సి ఉంటుంది.

4. చిత్రగుప్త దేవాలయం

4. చిత్రగుప్త దేవాలయం

దేవాలయ పరిసరాల్లో సాంబ్రాణి పొగ వాసనకు బదులుగా శవం కాలుతున్న వాసనలే విపరీతం. పాతబస్తీలో ఇదే అతిపెద్ద స్మశానవాటిక అని చెప్పొచ్చు. అపుడపుడు కందికల్‌ గేట్‌ రైల్వే ట్రాక్‌ మీద ప్రమాదాలు జరిగి మృత్యువాత పడే జీవులెందరో.

5. చిత్రగుప్త దేవాలయం

5. చిత్రగుప్త దేవాలయం

బహుశా ఆ భయంతోనే ఇక్కడ రాత్రిపూట పెద్దగా జనసంచారం ఉండదు. దీపావళి రెండో రోజు మాత్రమే ఘనంగా జరిగే ఉత్సవం తప్పించి మామూలు రోజుల్లో కూడా పెద్దగా పూజలు జరగవు.
దాదాపు 250 ఏళ్ల క్రితం ఇక్కడ చిత్రగుప్త దేవాలయాన్ని నిర్మించారు.

6. చిత్రగుప్త దేవాలయం

6. చిత్రగుప్త దేవాలయం

నిజాం నవాబుల కాలంలో రాజా కిషన్‌ పర్షాద్‌ దీన్ని అభివృద్ది చేశారు.కాయస్త్‌ సామాజిక వర్గానికి చెందిన రాజా కిషన్‌ పర్షాద్‌ రెండు సార్లు హైద్రాబాద్‌ సంస్థానానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. కిషన్‌ పర్షాద్‌ పూర్వికులు ఈ దేవాలయ అంకురార్పణకు కృషి చేసినట్టు వినికిడి.

7. చిత్రగుప్త దేవాలయం

7. చిత్రగుప్త దేవాలయం

కిషన్‌ పర్షాద్‌ ముగ్గురు హిందువులను, నలుగురు ముస్లింలను పెళ్లి చేసుకున్నారు. హిందూ భార్యలకు పుట్టిన సంతానాన్ని హిందువులతో, ముస్లిం భార్యలకు పుట్టిన సంతానాన్ని ముస్లింలతో వివాహం జరిపించారు.

8. చిత్రగుప్త దేవాలయం

8. చిత్రగుప్త దేవాలయం

వారి సంతానం అపుడపుడు ఈ దేవాలయానికి వస్తుంటారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. వాస్తవానికి ఈ దేవాలయ నిర్మాత ఎవరు అనే విషయంలో స్పష్టత లేదు. ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ నుంచి వలస వచ్చిన కాయస్తులు దీన్ని నిర్మించారన్న ప్రచారం కూడా ఉంది.

9. చిత్రగుప్త దేవాలయం

9. చిత్రగుప్త దేవాలయం

మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయ భూమి రోజు రోజుకి అన్యాక్రాంతమౌతుంది. భక్తుల కోసం ఏర్పాటు చేసిన సత్రాలు కూడా కబ్జాకు గురయ్యాయి. ఈ సత్రాల్లోనే ఎన్నో కుటుంబాలు కాపురాలు చేస్తున్నాయి. సాధారణంగా సత్రాలలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మూడు నాలుగు రోజులకు మించి ఉండకూడదు.

10. చిత్రగుప్త దేవాలయం

10. చిత్రగుప్త దేవాలయం

కానీ ఇక్కడ మాత్రం మూడు నాలుగు తరాల నుంచి తిష్ట వేసిన భక్తులు ఉన్నారు. సత్రాలలో ఉన్న భక్తుల గూర్చి వాకబు చేయడానికి వెళ్లగా అక్కడ ఓ వృద్ద మహిళ కనిపించింది. ఃఃఇది మా అత్తగారిల్లు.నా పెళ్లయిన నాటి నుంచి నేటి వరకు ఇదే ఇంట్లో ఉంటున్నాముఃః అని ఎంతో నిర్బయంగా చెప్పింది. 80 వ దశకంలో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కబ్జాదారులు ఈ భూమి విడిచి వెళ్లాలి కానీ ప్రభుత్వం వారిని ఇంతవరకు ఖాళీ చేయించలేక పోయింది. గేదెల పాక ఇదే స్థలంలో ఉండడంతో భక్తులకు కొంత అసౌకర్యం కలుగుతుంది.

11. చిత్రగుప్త దేవాలయం

11. చిత్రగుప్త దేవాలయం

దేవాలయ మెయింటెనెన్స్‌ కోసం ప్రయివేటు పాఠశాలకు కొంత స్థలం ఇచ్చారు. తెలుగు, ఇంగ్లీషు మీడియం ఉన్న ఈ పాఠశాల నెలకు ఎంత ఆర్జిస్తుంది. దేవాలయ నిర్వహణ కోసం ఎంత ఇస్తుంది అన్నది శేష ప్రశ్నే.

12. చిత్రగుప్త దేవాలయం

12. చిత్రగుప్త దేవాలయం

చిత్ర గుప్త దేవాలయం కాల క్రమంలో నాలుగుళ్ల దేవాలయంగా మారింది. ఇక్కడే శివాలయం, సాయిబాబా ఆలయం, హనుమంతుడి ఆలయం, అయ్యప్ప ఆలయం ఇలా నాలుగు ఆలయాలు చిత్రగుప్త దేవాలయంలో కొనసాగుతున్నాయి కాబట్టి నాలుగుళ్ల దేవాలయంగా ఇటీవలి కాలంలో ఖ్యాతి పొందింది.

13. చిత్రగుప్త దేవాలయం

13. చిత్రగుప్త దేవాలయం

ఈ నాలుగు గుళ్లకు కలిపి ఇద్దరు పూజలు ఉన్నారు. ప్రస్తుతం చిత్రగుప్త దేవాలయం గుడుంబా వ్యాపారులకు అడ్డాగా మారింది. కూలీ నాలీ పనిచేసే కార్మికులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండడంతో ఈ వ్యాపారం మూడుపూవులు ఆరుకాయలుగా వర్దిల్లుతుంది.

14. చిత్రగుప్త దేవాలయం

14. చిత్రగుప్త దేవాలయం

దీంతో మహిళా భక్తులు దేవాలయానికి రావడానికి జంకుతున్నారు. దేవాలయ అభివృద్ది కోసం ఏర్పాటైన ట్రస్ట్‌ బోర్డ్‌ కార్యకలాపాలు కూడా సందేహా స్పదంగా ఉన్నాయి. ప్రభుత్వం నియమించిన ఎండోమెంట్‌ కమిటీకి సుదర్శన్‌ రెడ్డి చైర్మెన్‌ ఉన్నారు.

15. చిత్రగుప్త దేవాలయం

15. చిత్రగుప్త దేవాలయం

ఈయన నేతృత్వంలోని కమిటీకి, స్థానిక కమిటీకి విభేదాలు ఉండడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని స్థాని కులు ఆరోపిస్తున్నారు. హుండీ ఆదాయాన్ని పంచుకోవడంలో అనేక సార్లు గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. సరైన పర్యవేక్షణ లేదు.

 16. చిత్రగుప్త దేవాలయం

16. చిత్రగుప్త దేవాలయం

పంచలోహ విగ్రహం కొన్నేళ్ల క్రితం చోరీ అయ్యింది. చిత్రగుప్తుడు తన ఇద్దరు భార్యలతో కల్సి ఉన్న రాతి విగ్రహం ప్రస్తుతం ఇక్కడ కొలువుతీరింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనకపోతే చారిత్రాత్మక ఈ దేవాలయం ఆనవాళ్లు చెరిగి పోయే ప్రమాదం ఉంది.

17. చిత్రగుప్తుడి పూజా సామాగ్రి

17. చిత్రగుప్తుడి పూజా సామాగ్రి

చిత్రగుప్తుడి పూజలో పెన్ను, పేపరు, ఇంక్‌, తేనె, వక్క పొడి, అగ్గిపెట్టె, చెక్కెర, గంధం చెక్కె, ఆవాలు, నువ్వులు,తమలపాకులు ఉంటాయి. న్యాయం, శాంతి, అక్షరరాస్యత, విజ్ఞానం ఈ నాలుగు గుణాలు పొందడానికి చిత్ర గుప్తుడి పూజా సామాగ్రిలో ఉంటాయి.

18. అకాలమృత్యువును జయించొచ్చు

18. అకాలమృత్యువును జయించొచ్చు

వాన రాకడ ప్రాణం పోకడ తెలియదంటారు పెద్దలు. వాన వచ్చే విషయాన్ని అయినా కొంతవరకు చెప్పవచ్చుగానీ ప్రాణం పోకడ గూర్చి ఎవరూ చెప్పజాలరు. అకాల మృత్యువు వల్ల ఆ కుటుంబం దిక్కులేకుండా పోతుంది. వారి మీద ఆధారపడ్డ వారంతా అనాథలవుతారు. పిల్లల చదువులు, పెళ్లిల్లు అర్దాంతరంగా ఆగిపోతాయి.

19. పిల్లల చదువులు, పెళ్లిల్లు అర్దాంతరంగా ఆగిపోతాయి.

19. పిల్లల చదువులు, పెళ్లిల్లు అర్దాంతరంగా ఆగిపోతాయి.

పుట్టినవారు గిట్టక మానరు కానీ అకాల మృత్యువును జయించడం సాధ్యం కాదు. దీన్ని ఎదుర్కోవడానికి చిత్రగుప్తుడు కొంతవరకు సహకరిస్తాడని భక్తుల నమ్మకం. ఎందుకంటే చిత్రగుప్తుడు యమ ఆస్థానంలో అకౌంటెంట్‌ లేదా రికార్డ్‌ కీపర్‌. మనం చేసిన పాపపుణ్యాల చిట్టా చిత్రగుప్తుడి వద్ద ఉంటుంది.పాపాల చిట్టా పెరిగినప్పుడే యముడు తన లోకానికి తీసుకెళ్తాడన్న ప్రచారం ఉండనే ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X