Search
  • Follow NativePlanet
Share
» »గోవాలో క్రిస్టమస్ ! గోవా చర్చి లు !

గోవాలో క్రిస్టమస్ ! గోవా చర్చి లు !

ఈ క్రిస్టమస్ కు గోవా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా ? మీ ట్రిప్ లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ చర్చిలను చూడటం మరువకండి. గోవా చర్చి లు గోతిక్ శిల్ప శైలి లో నిర్మాణం చేయబడ్డాయి. గోవా లో అనేక చర్చి లు పర్యాటకులను మరో మారు కూడా ఆకర్షిస్తాయి. క్రిస్టమస్ సీజన్లో ఈ గోవా చర్చి లను పూర్తి లైట్ ల వెలుగులతో అలంకరించి మరింత ఆకర్షణీయంగా చేస్తారు. ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తారు. కనుక ఈ సమయంలో గోవా వెళితే ఈ చర్చిలను తప్పక చూసి ఆనందించవచ్చు. గోవా లోని చర్చి లు చాలవారకు పోర్చుగీస్ పాలనలో వున్నపుడు నిర్మించారు. అంటే ఇవి సుమారుగా 16 లేదా 17 శతాబ్దాల నాటివి. అయినప్పటికీ వీటి నిర్వహణ బాగుంటుంది. ఈ చర్చి లలో ప్రధానమైనవి దిగువ ఇస్తున్నాం, పరిశీలించండి.

 బాసిలికా అఫ్ బాం జీసస్

బాసిలికా అఫ్ బాం జీసస్

400 సంవత్సరాల చరిత్ర కల ఈ చర్చి గోవాలో ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ చర్చి ఒకప్పుడు ఈ ప్రాంతంలో క్రైస్తవ మతాన్ని తెచ్చిన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ స్థాపించాడు. ఈ చర్చి యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. కనుక ఇంతటి ప్రసిద్ధి చెందిన ఈ చర్చి తప్పక చూడదగినది.

Photo Courtesy: P.S. Sujay

సెయింట్ కాజేతాన్ చర్చి

సెయింట్ కాజేతాన్ చర్చి

గోవా లో అత్యంత సుందరమైన చర్చి ఇది అని అడిగితే, అది నిస్సందేహంగా సైట్ కాజేతాన్ చర్చి అని చెప్పాలి. ఇది పురాతన గోవా లో కలదు. రాజ దర్పం కల ఈ నిర్మాణం లో కోరియన్తాన్ మరియు బారోక్ శిల్ప రీతులు వాడారు. దీనిని ఇటలీ లోని సైట్ పీటర్ చర్చి నమూనా లో నిర్మించారు. Photo Courtesy: Carlosalvaresferreira

సే కేథడ్రాల్ అఫ్ సంత కాతారిన

సే కేథడ్రాల్ అఫ్ సంత కాతారిన

ది సే కేథడ్రాల్ అఫ్ శాంతా కాతారీనా ఇండియా లోనే అతి పెద్ద చర్చి. అతి పెద్దదైన ఈ చర్చి ని పూర్చుగీస్ ప్రభుత్వం, తాము మొగలుల నుండి గోవా ను జయించిన గుర్తుగా నిర్మించినది. నేటి వరకూ ఈ చర్చి చక్కగా నిర్వహించబడుతోంది. టూరిస్ట్ లు సంవత్సరం పొడవునా ఈ చర్చి కి వస్తూనే వుంటారు.

Photo Courtesy: Abhiomkar

అవర్ లేడీ అఫ్ ఇమ్మాకులేట్ కన్సెప్షన్

అవర్ లేడీ అఫ్ ఇమ్మాకులేట్ కన్సెప్షన్

ఈ చర్చి గోవా రాజధాని అయిన పాన్జిం సిటీ లో ప్రసిద్ధి చెందినది. ఈ చర్చి పరిసరాలు, అలంకరణలు ఆకర్షణీయంగా వుంటాయి. ఇక్కడ కల పొడవైన వర్జిన్ మేరీ విగ్రహం చాలా ఆకర్షణీయంగా వుండి పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. క్రిస్టమస్ సీజన్లో ఈ తెల్లటి చర్చి ని బాగా అలంకరిస్తారు.

Photo Courtesy: AaronC's Photos

 సెయింట్ ఫ్రాన్సిస్ అఫ్ అస్సిసి చర్చి

సెయింట్ ఫ్రాన్సిస్ అఫ్ అస్సిసి చర్చి

సెయింట్ ఫ్రాన్సిస్ అఫ్ ఆస్సిసి చర్చి చాలా అందమైన నిర్మాణం కలిగి వుంటుంది. దీనిని లాట రేట్ రాతితో నిర్మించారు. దీని నిర్మాణంలో తుస్చాన్ మరియు మానులినే ఆర్కిటెక్చర్ ఉపయోగించారు. చర్చి లో కల విగ్రహాలను ప్రపంచంలోని వివిధ ప్రాంతాలనుండి తెప్పించారు. లేడీ అఫ్ మిరకల్ విగ్రహాన్ని శ్రీ లంక నుండి తెప్పించి పెట్టారు.

Photo Courtesy: Aaron C

సెయింట్ అన్నే చర్చి

సెయింట్ అన్నే చర్చి

సెయింట్ అన్నే చర్చి గోవా లోని తలావులిం నుండి పది కి. మీ. ల దూరంలో కలదు. అందమైన ఈ చర్చి సిరిదావో రివర్ ఒడ్డున కలదు. ఈ చర్చి కి ప్రపంచ వ్యాప్త పర్యాటకులు సందర్శిస్తారు.

Photo Courtesy: Naizal Dias

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X