Search
  • Follow NativePlanet
Share
» »చూడామణి ఆలయం : వింత ఆచారం !

చూడామణి ఆలయం : వింత ఆచారం !

By Super Admin

సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళిన గుహ రహస్యం తెలుసా ?సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళిన గుహ రహస్యం తెలుసా ?

లేపాక్షిలో వ్రేలాడే స్థంభాన్ని నిర్మించిన బ్రిటిష్ ఇంజనీర్ ఎవరో తెలుసా?లేపాక్షిలో వ్రేలాడే స్థంభాన్ని నిర్మించిన బ్రిటిష్ ఇంజనీర్ ఎవరో తెలుసా?

శివుడు నరికిన వినాయకుని తల ఈ ప్రదేశంలో ఉందా !

మాల్డా...మ్యాంగో నగరం !! ఎక్కడ ఉందో మీకు తెలుసా?మాల్డా...మ్యాంగో నగరం !! ఎక్కడ ఉందో మీకు తెలుసా?

అనగనగ ఒక ఆలయం .. ఆ ఆలయంలో దొంగతనం పట్టపగలే అందరూ చూస్తుండగానే జరుగుతుంది. అయినా, చూసిన వారెవరూ అడ్డుచెప్పరు. పైగా ఆలయంలో పూజారి దొంగతనం చేయటానికి ప్రోత్సహిస్తాడు. హతవిధి ఏమిటీ అపచారం అనుకుంటున్నారా ? అయితే అసలు విషయం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు.

సాధారణంగా ఆలయాల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఇంకా పటిష్టంగా, పోలీసు పహారాల నీడ లో కనిపిస్తాయి. గుడిలో దొంగతనం అంటే ఆబ్బో .. అపచారం .. అపచారం అని లెంపలేసుకుంటారు. కానీ ఓ గుడిలో వింత ఆచారం ఉంది. అదేమిటంటే, దర్శనానికై వచ్చే భక్తులు దొంగతనం తప్పకుండా చేయాలి. ఈ వింతైన దేవాలయం ఉన్నది ఎక్కడో కాదు... ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ జిల్లాలోని చూడియాలాలో ..

ఇది కూడా చదవండి : చౌకోరి - పవిత్ర స్థలాల గర్భ గుడి !

ఆలయం పేరు చూడామణి ఆలయం. ఈ గుడి ఎంతో పురాతమైనది మరియు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయానికి గల మరో పేరు సంతఃన ఆలయం. సంతానం లేనివారు ఈ ఆలయాన్ని దర్శిస్తే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. ఆ నమ్మకమే ఈ ఆలయాన్ని ఇంతటి గుర్తింపును తీసుకువచ్చింది.

చూడామణి ఆలయం

చూడామణి ఆలయం

చిత్ర కృప : Manfred Sommer

పిల్లలు లేని దంపతులు ఈ చూడామణి ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. పెళ్లైన తర్వాత చాలాకాలం వరకు పిల్లలు లేని దంపతులు గుడిని సందర్శిస్తారు.

ప్రత్యేకత

చూడామణి ఆలయానికి వచ్చేవారు తప్పనిసరిగా దొంగతనం చేయాలి. ఈ దొంగతనం ఏదో రాత్రి పూట అనుకునేరు... పట్టపగలే. దొంగతనం అంటే ఏదో నగలు, నట్రా, డబ్బు అనుకుంటే పొరబడినట్లే..! అమ్మవారి పాదాల మీద ఉన్న చెక్క బొమ్మను దొంగలించాలి అంతే. ఆ చెక్కబొమ్మను ఎవరైతే తస్కరిస్తారో వారు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తారని ఆలయ పూజారులు చెబుతారు.

ఏడాదిపొడవునా తెరిచి ఉంచే ఈ ఆలయానికి దేశం నలుమూలల నుండి భక్తులు, ముఖ్యంగా పిల్లలు లేని దంపతులు తరలివస్తారు. చెక్కబొమ్మను అపహరించిన తర్వాత పుట్టిన బిడ్డతో .. మళ్ళీ ఆలయానికి వచ్చి ఆ చెక్కబొమ్మను తీసుకున్న చోటే పెట్టాలి. దాంతో పాటు మరియొక చెక్క బొమ్మను అక్కడ సమర్పించాలి.

అమ్మవారి విగ్రహం

అమ్మవారి విగ్రహం

చిత్ర కృప : boldsky telugu

వింత ఆచారం వెనక ఒక పురాన గాధ

దొంగతనం వెనక ఒక పురాణ గాధ దాగి ఉందని అక్కడి స్థానికులు కొందరు చెబుతుంటారు. లాందౌరా రాజు ఒకనాడు వేటకై అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయనకు చూడామణి ఆలయం కనిపించింది. ఆలయం వద్దకు వెళ్లి తనకు బిడ్డను ప్రసాదించమని వేడుకుంటాడు. అమ్మవారు మాయమై చెక్క రూపంలో దర్శనమిస్తుంది. రాజు ఆ చెక్క బొమ్మను తన వెంట తీసుకొని వెళ్ళిపోతాడు.

రాజు భార్య పండింటి మగ బిడ్డకు జన్మనిస్తుంది. వెంటనే రాజు సతీసమేతుడై ఆలయానికి వచ్చి చెక్కబొమ్మను సమర్పిస్తాడు. ఇదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుందంటున్నారు అక్కడి ఆలయ పూజారులు.

రూర్కీ రైల్వే స్టేషన్

రూర్కీ రైల్వే స్టేషన్

చిత్ర కృప : Sameer Verma

ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

చూడియాలా సమీపాన డెహరాడూన్ విమానాశ్రయం కలదు. ఇది 65 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. క్యాబ్ లేదా టాక్సీ ల ద్వారా ఎయిర్ పోర్ట్ నుండి చూడియాలా ఆలయానికి చేరుకోవచ్చు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎయిర్ పోర్ట్ కు విమాన సర్వీసులు నడుస్తాయి.

రైలు మార్గం

చూడియాలా లో రైల్వే స్టేషన్ కలదు. స్టేషన్ బయట దిగి ఆటో రిక్షాల లో ఆలయానికి చేరుకోవచ్చు. చూడియాలా సమీపాన ఉన్న మరో రైల్వే స్టేషన్ రూర్కీ రైల్వే స్టేషన్(19 KM). దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి.

బస్సు మార్గం

హరిద్వార్, డెహరాడూన్, రుషికేశ్, చండీఘర్, మీరట్, ముజాఫర్ నగర్, అంబాలా, ఢిల్లీ ల నుండి మరియు రూర్కీ నుండి రాష్ట్ర సర్వీసు బస్సులు లభ్యమవుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X