Search
  • Follow NativePlanet
Share
» »కుట్రాలం - దక్షిణ భారతదేశ చికిత్సాలయం !!

కుట్రాలం - దక్షిణ భారతదేశ చికిత్సాలయం !!

కుట్రాలం ఆరోగ్య కేంద్రాలు, జలపాతాలకే కాక దేవాలయాలు మరియు దాని చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు నెలవు. వారాంతంలో పర్యాటకులు ఇక్కడి అందాలను చూడటానికి తరచూ వస్తుంటారు.

By Mohammad

కుట్రాలం తమిళనాడు రాష్ట్రంలో పడమటి కనుమలలో సముద్రమట్టానికి 167 మీటర్ల ఎత్తులో కలదు. ఇక్కడ ప్రకృతి చికిత్సా కేంద్రాలు అధికం. కనుకనే దీనికి దక్షిణాది ప్రకృతి చికిత్సాలయం అని పేరు. ఔషధ గుణాలు కలిగిన జలపాతాలు ఇక్కడ అనేకం ఉన్నాయి. ఇవి ఈ ప్రదేశ అందాలను మరింతగా పెంపొందింపజేస్తున్నాయి.

కుట్రాలం ఆరోగ్య కేంద్రాలు, జలపాతాలకే కాక దేవాలయాలు మరియు దాని చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు నెలవు. వారాంతంలో పర్యాటకులు ఇక్కడి అందాలను చూడటానికి తరచూ వస్తుంటారు. వసతి సదుపాయాలు, రవాణా సదుపాయాలు ఉన్నాయి.

తెన్ కాశి విశ్వనాథ స్వామి దేవాలయం

తెన్ కాశి విశ్వనాథ స్వామి దేవాలయం

కుట్రాలం కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం ను పాండ్యరాజ పరాక్కిరమ పాండ్యన్ నిర్మించారు. ప్రధాన దైవం కాశీ విశ్వనాథుడు. 178 అడుగుల ఎత్తులో నిర్మించిన గోపురం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. పిళ్ళయార్ కోవిల్ కూడా సందర్శించవచ్చు.

చిత్రకృప : pandiaeee

కుట్రాలం జలపాతాలు

కుట్రాలం జలపాతాలు

కుట్రాలం మొత్తం మీద 9 జలపాతాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది పేరారువి జలపాతం. కుట్రాలం జలపాతాల మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చిత్రకృప : Jeya2lakshmi

బోట్ క్లబ్

బోట్ క్లబ్

అందమైన ప్రకృతి దృశ్యాలు మరియు బోటు విహారాలు ఉండటం చేత ఈ ప్రదేశం పిల్లలకు, పెద్దలకు నచ్చుతుంది. బోట్ విహారాలలో ఇక్కడికి వచ్చే ప్రతి పర్యాటకుడు విహరిస్తాడు.

చిత్రకృప : PREVRAVANTH

కుట్రల ననగై కోవిల్

కుట్రల ననగై కోవిల్

ఈ టెంపుల్ కుట్రాలం టెంపుల్ దేవస్థానం వారిచే నిర్వహించబడుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులు కుతారు టెంపుల్, షేన్ బాగా దేవి అమ్మన్ టెంపుల్, తిరుజ్ఞాన సంబంధార్ కోవిల్ ను తప్పక వీక్షించవచ్చు.

చిత్రకృప : Balajijagadesh

కాలుగుమలయి

కాలుగుమలయి

ఇది అసంపూర్తిగా నిర్మితమైన ఒక హిందూ దేవాలయం. మురుగన్ ఇక్కడి ప్రధాన దైవం. టెంపుల్ పరిసరాలలో జైన్, వినాయక మరియు ఇతర దేవాలయాలను చూడవచ్చు. టెంపుల్ సమీపంలో చిత్ర ప్రదర్శన శాల తప్పక చూడదగినది.

చిత్రకృప : Booradleyp

దక్షిణామూర్తి టెంపుల్

దక్షిణామూర్తి టెంపుల్

దక్షిణామూర్తి టెంపుల్ పులియారాయి వద్ద కలదు. ఇది కుట్రాలం కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దేవాలయంలో నిర్వహించే ఉత్సవాలకు భక్తులు అధికసంఖ్యలో హాజరవుతారు.

చిత్రకృప : எஸ். பி. கிருஷ்ணமூர்த்தி

ఇల్లాంజి కుమారన్, షేన్ బాగా దేవి అమ్మన్ టెంపుల్

ఇల్లాంజి కుమారన్, షేన్ బాగా దేవి అమ్మన్ టెంపుల్

ఇళ్ళనుంజి కుమారన్ టెంపుల్ : కుట్రాలం కు కిలోమీటర్ దూరంలో ఉన్నది. చుట్టూ వరిపొలాలు, మామిడి తోటలు ఆకర్షిస్తాయి.

షేన్ బాగా దేవి టెంపుల్ : ఈ టెంపుల్ షేన్ బాగా దేవి జలపాతానికి దగ్గరలో ఉన్నది. ఇక్కడ అనేక షేన్ బాగా చెట్లు ఉన్నాయి. ఆ చెట్టు పూలను దేవి అమ్మన్ కు అర్పిస్తారు.

చిత్రకృప : Booradleyp1

కుట్రాలనాథర్ టెంపుల్

కుట్రాలనాథర్ టెంపుల్

కుట్రలనాథర్ టెంపుల్ కుట్రాలంలో ప్రసిద్ధి. దీనిని ఇది ష్వభగవానుడికి అంకితం చేయబడిన దేవాలయం అగస్త్యుడు శివుడిని అర్చించడంచే దేవాలయానికి ఆ పేరొచ్చిందని చెబుతారు. పాండ్యులు, చోళులు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. సమీపంలో మహాదేవగిరి తప్పక సందర్శించదగినది.

చిత్రకృప : Booradleyp1

వసతి

వసతి

పర్యాటకులకు వసతి సదుపాయాల విషయానికి వస్తే ప్రపంచ స్థాయి రిసార్టులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేవారు ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవటం ఉత్తమం.

చిత్రకృప : Abhilashwrites

కుట్రాలం ఎలా చేరుకోవాలి ?

కుట్రాలం ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : ట్యుటికోరిన్ విమానాశ్రయం దగ్గరలో కలదు.
రైలు మార్గం : 5 కి.మీ. ల దూరంలో ఉన్న తెన్ కాశి రైల్వే స్టేషన్ కుట్రాలం సమీపంలో ఉన్నది.
రోడ్డు మార్గం : చెన్నై, కడయనల్లూర్, తిరునల్వేలి, అలెప్పి, త్రివేండ్రం తదితర ప్రాంతాల నుండి కుట్రాలం కు ప్రభుత్వ/ప్రవేట్ బస్సులు తిరుగుతాయి.

చిత్రకృప : Raghukraman

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X