Search
  • Follow NativePlanet
Share
» »భారత్ లో ప్రమాదకరమైన ప్రదేశాలు మీరు తప్పకుండా చూడాలి !

భారత్ లో ప్రమాదకరమైన ప్రదేశాలు మీరు తప్పకుండా చూడాలి !

భారతదేశం భిన్న సంస్కృతులు, భిన్న అనుభవాలకలబోత.ఈ భిన్నత్వమే మన దైనందినజీవిత కాలంలో ఏం చేయాలో ఏం చేయకూడదో నేర్పుతుంది.

By Venkatakarunasri

భారతదేశం భిన్న సంస్కృతులు, భిన్న అనుభవాలకలబోత.ఈ భిన్నత్వమే మన దైనందినజీవిత కాలంలో ఏం చేయాలో ఏం చేయకూడదో నేర్పుతుంది. మనదేశంపై ప్రపంచ దేశాలన్నీ,ఆసక్తిచూపుతున్న ప్రస్తుత తరుణంలో మన ఎటువంటివారన్న విషయాన్ని మన పరిసరాలు ప్రతిబింబిస్తుంటాయి. ఇందులో కొన్ని మానవకల్పితమైనవికాగా, మరికొన్ని ప్రకృతిసిద్ధంగా ఏర్పడినవిఅయితే ఇవన్నీ మనకు ఆసక్తిని పెంపొందిస్తాయన్న హామీ మనకు ఎక్కడా కనపడదు. ప్రస్తుతం మీకు మనదేశంలోని అత్యంతప్రమాదకరమైన ప్రదేశాల వివరాలను ఈ వ్యాసంలో అందిస్తున్నాం. ముందుగా మనం కొండశిఖరాన నిర్మించబడినటువంటి పుగ్తల్ ఆశ్రమం.

పుగ్తల్ ఆశ్రమం

పుగ్తల్ ఆశ్రమం

ఈ అదివాస్తవికఆశ్రమాన్ని పుక్తల్ గుంపఅని కూడా పిలుస్తుంటారు.కొండశిఖరంపై తేనె పట్టుతరహాలో నిర్మితమైన ఈ ఆశ్రమం లడఖ్ ప్రాంతంలో వుంది. అత్యంత ఎత్తైన ఈ ప్రదేశానికి చేరుకునే మార్గాలు చాలా పరిమితంగానే వుంటాయి. ఈ ప్రదేశం స్థానికులకు సర్వసాధారణమే అయినప్పటికి ఇతరులకు మాత్రం ఇక్కడకు చేరుకోవటం కష్టసాధ్యమేననిచెప్పొచ్చు.

PC:youtube

బస్తర్

బస్తర్

ఇది నక్సల్స్ కు ఆనవాలమన్నమాట.ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని ఈ జిల్లా అటవీప్రాంతంతో, నదులతోకూడిన అత్యంత సుందరమైన ప్రదేశం.అత్యంత విస్తృతమైన,నిర్మానుష్యమైన ఈ ప్రాంతం గిరిల్లాకార్యకలాపాలకు అత్యంత అనువైనదికావటంతో నక్సల్ వుద్యమానికి ఇది ఆనవాలమైనదని చెప్పవచ్చును. ఈ ప్రాంతంలో చోటుచేసుకున్న పలుదాడులు, ఎదురు కాల్పులువంటి వాటితో ఈ ప్రాంతం ఇప్పుడు శవాలగుట్టగా మారుతోంది.

PC:youtube

డ్రాస్

డ్రాస్

ప్రపంచంలోనే రెండో అత్యంతచల్లనైన ప్రదేశం ఇది.జమ్మూకాశ్మీర్ లో వున్న ఈ పట్టణాన్ని లడఖ్ యొక్క ముఖద్వారం, గేట్వే టు లడఖ్ అని పిలుస్తారు. ఈ పట్టణంలోని పలుప్రాంతాలలో కార్గిల్ యుద్ధసమయంలో అనేకదాడులు జరిగాయి.అంతే కాదు అత్యంత తీవ్రస్థాయి వుగ్రవాదానికి కూడా ఈ పట్టణం నెలవుగా మారింది.

PC:youtube

డ్రాస్

డ్రాస్

అయితే ప్రపంచంలోనే అత్యంత చల్లనినివాస ప్రదేశాల్లో ఇది రెండవస్థానంలో నిలవటం విశేషం. ఇక్కడకు వెళ్లి మిలిటెంట్ ల తుపాకీలను గురికాకుండా,ప్రాణాలతో తిరిగి రావటం అదృష్టమేనని చెప్పొచ్చు.

PC:youtube

థార్ ఎడారి

థార్ ఎడారి

థార్ ఎడారి అనగానే మీఅందరికీ గుర్తొచ్చేవుంటుంది.రాజస్థాన్ లో వుంది. ఇసుకతిన్నెలతో మాటలకందని సౌందర్యంతో అలరారే ఈ ఎడారిప్రాంతంలో అంతే స్థాయిలో ప్రమాదంకూడా దాగివుంది. మీరు ముందుజాగ్రత్తతో తగినంతజాగ్రత్తతో ఆహారం,నీరు వెంటతీస్కువెళ్లినా ఈ ప్రాంతంలో ప్రయాణించటం కష్టసాధ్యమేనని చెప్పకతప్పదు.ఈ ప్రాంతంలో అనేక విషసర్పాలు,కౄరమృగాలు,ఇతరజంతువులు పొంచివుండటమే ఇందుకు కారణం.

PC:youtube

ఖర్దుంగ్లా

ఖర్దుంగ్లా

ప్రపంచంలో అత్యంతఎత్తైన రోడ్డు మార్గం ఇది.లడఖ్ నుంచి లెహ్ కు వెళ్ళే ఈ రోడ్డు మార్గం సముద్రమట్టానికి అత్యంతఎత్తులో వుండటంతో పాటు సూర్యరశ్మినేరుగా పడుతుంది.ఈ మార్గంలో ప్రాణవాయువు స్వల్పప్రమాణంలో లభిస్తుండటంతో ఇక్కడ కొన్ని సందర్భాలలో పరిస్థితి చేయ్యిదాటిపోయే ప్రమాదంకూడా వుంది.

PC:youtube

అస్సాంలో వున్న లుండింగ్ టు హాఫ్లాంగ్ రైలుమార్గం

అస్సాంలో వున్న లుండింగ్ టు హాఫ్లాంగ్ రైలుమార్గం

అస్సాంలోని లుండింగ్ హాఫ్లాంగ్ ప్రాంతం ఎంత ప్రకృతిసౌందర్యంతో నిండివుంటుందో అంతే భయంకరమైన ప్రదేశంకూడా.ప్రకృతి సిద్ధమైన ఈ అటవీప్రాంతం ప్రకృతిఆహ్లాదకరమైన వాతావరణంతో మనకు కనువిందు చేస్తుంది.

PC:youtube

అస్సాంలో వున్న లుండింగ్ టు హాఫ్లాంగ్ రైలుమార్గం

అస్సాంలో వున్న లుండింగ్ టు హాఫ్లాంగ్ రైలుమార్గం

అయితే అదేసమయంలో ఇక్కడి బ్లాక్ విడో వుగ్రవాదసంస్థ పాల్పడే కిరాతక చర్యలు చాలా భయంకరంగా, అత్యంత భయానకంగా వుంటాయి. ఈ ప్రాంతంలో పనిచేసే రైల్వేవుద్యోగులను, ఇంజనీర్లను కిడ్నాప్ చేస్తూ కొన్నిసందర్భాలలో వారి ప్రాణాలను కూడా తీస్తూంటారు ఈ వుగ్రవాదులు. కొన్ని సందర్భాలలో అత్యంత రక్తసిత్తమైన రైలుమార్గాలలో ఇది కూడా ఒకటి.

PC:youtube

పంబన్ బ్రిడ్జ్

పంబన్ బ్రిడ్జ్

తమిళనాడులోని రామేశ్వరప్రాంతాన్ని భారతదేశ ప్రధాన భూభాగంతో కలిపే రైలుమార్గం ఇది. సముద్రంపై కొనసాగే ఈ రైలుమార్గం క్రిందనుంచి నౌకలు ప్రయాణిస్తుండటం మనకు ఆశ్చర్యాన్ని కలిగించేవిషయం.

PC:youtube

పంబన్ బ్రిడ్జ్

పంబన్ బ్రిడ్జ్

నౌకలరాకపోకలను వీలుకలిగించే ఈ బ్రిడ్జి యంత్రంగాలను నిర్వహించేందుకు దాదాపు 12మంది కార్మికులు నిరంతరాయంగా పనిచేస్తుంటారు. శతాబ్దికాలం నాటి ఈ బ్రిడ్జ్ వయస్సు దీనిని ప్రమాదకరంగా మారుస్తోంది.

PC:youtube

సిజు గుహలు

సిజు గుహలు

మేఘాలయరాష్ట్రంలోని సిజు గుహలు అత్యంతప్రమాదకరమైనటువంటి చీకటిగుహలతో పాటు,ప్రపంచంలోనే ప్రమాదకరమైన హ్యాంగింగ్ బ్రిడ్జి లకు నెలవు. పర్వతశిఖరాలను కలుపుతూ చెక్కతో,తాళ్ళతో,నిర్మించిన ఈ బ్రిడ్జి మనల్ని అత్యధికస్థాయిలోనే భయపెడుతుంది.

PC:youtube

చంబల్ లోయ

చంబల్ లోయ

మధ్యప్రదేశ్ లోని చంబల్ లోయ గత కొన్ని దశాబ్దాలుగా కరడుగట్టిన బందిపోట్లకు ప్రసిద్ధిచెందిన విషయమని మనకు తెలిసిందే. లోతైన లోయప్రాంతాలు ఇక్కడ సహజనీటి వనరుగా వుపయోగపడుతున్న ఒక పెద్ద వనరుగా మారి పొంచివున్న ముప్పును తెలియజేస్తుంది.

PC:youtube

కైలాసమానస సరోవరయాత్ర

కైలాసమానస సరోవరయాత్ర

సముద్రమట్టానికి దాదాపు 18,000అడుగుల ఎత్తులో వున్నకైలాసపర్వతయాత్రలో భాగంగానే మనకు మానససరోవర యాత్రకూడా వుంటుంది. కొంతమంది యోగులు, అనుభవజ్ఞులు, యేటా ఒట్టికాళ్ళయాత్రలో సాధారణదుస్తులతోనే ఈ పర్వతారోహకయాత్రకు పాల్గొంటున్నప్పటికి తొలిసారి ఈ యాత్రకు వచ్చేవారు మాత్రం అంతఎత్తైన ప్రాంతంలో కొంతమేర అస్వస్థతకు గురయ్యేప్రమాదం వుంది.

PC:youtube

హెమిస్ నేషనల్ పార్క్

హెమిస్ నేషనల్ పార్క్

లడఖ్ ప్రాంతంలో వున్న పర్వతఅటవీప్రాంతం ఇది. పర్వతారోహణలో ఎవరైనా అనేక సవాళ్ళను, సమస్యలను ఎదుర్కొనే తొలిప్రాంతం కూడా ఇదే. మైనస్ 20డిగ్రీల వుష్ణోగ్రతతో వుండే ప్రతికూలవాతావరణం ఇక్కడిప్రధానసమస్యకాగా, ఈ ప్రాంతంలోవున్న మంచుచిరతలు రెండో సమస్య.

PC:youtube

గురెజ్ లోయ

గురెజ్ లోయ

గురెజ్ లేదా గురేస్ లోయ.శ్రీనగర్ కు 120కిమీల దూరంలోవున్న ఈ ప్రాంతం వాస్తవాధీనరేఖకు అత్యంత సమీపంలో వుంటుంది. సరిహద్దుకు సమీపంలోవున్న ఈ ప్రాంతం ఇక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది.

PC:youtube

గురెజ్ లోయ

గురెజ్ లోయ

ఇక్కడ ఎక్కువగా మందు పాతర్లపేలుళ్లకు గురై వికలాంగులైనవారే ఎక్కువ.దీనితో పాటు మంచుపెళ్లలు విరిగిపడే ప్రమాదంకూడా ఎక్కువే. ఒక్కోసారి ,మూడురోజుల్లో 80కి పైగా మంచుపెళ్లలు విరిగిపడిన సందర్భాలుకూడా వున్నాయి.

PC:youtube

భాంగర్ కోట

భాంగర్ కోట

రాజస్థాన్ లో వున్న ఈ భాంగర్కోట ప్రపంచవ్యాప్తంగా దాని పురాతత్త్వసౌందర్యంతో పాటు అందులోవున్న దెయ్యాలు, భూతాలూ వంటివాటికి కూడా ప్రసిద్ధిచెందింది.అందులో ప్రేతాత్మలు సంచరిస్తుంటాయని ఈ నగరశివార్లలో నివసిస్తున్న ప్రజలు విశ్వసిస్తుంటారు. గతంలో అనేక కిడ్నాపింగ్ లు, హత్యలు జరిగినసందర్భాలుండటంతో రాత్రి సమయాల్లో ఈ తోటలోకి ప్రవేశాన్ని నిషేధించారు.

PC:youtube

కుల్దారా

కుల్దారా

ఇది అదృశ్యగ్రామం అనొచ్చు.రాజస్థాన్ లోనే ఉన్న ఈ గ్రామం.300సంల క్రితం అత్యంత సంపన్న గ్రామం. ఆరోగ్యవంతులైన ప్రజలతో సన్నిహితసంబంధాలతో కళకళలాడుతూవుండేది. ఇప్పుడు పాడుబడిన దెయ్యాలగ్రామంగా మారిపోయింది.

PC:youtube

డ్యూమాస్ బీచ్

డ్యూమాస్ బీచ్

గుజరాత్ లో వున్న ఈ బీచ్ అత్యంత మిస్టీరియస్ బీచ్.స్మసాన వాటికకూడా కావటం కొంతజాగ్రత్తగా వుండాల్సివుంటుంది. ఈ బీచ్ కొచ్చిన సందర్శకులలో కొందరు అదృశ్యమైన దాఖలాలు కూడా వున్నాయి. ఇక్కడి నల్లఇసుక,చీకటి రాత్రులు ఈ ప్రదేశాన్ని రాత్రి సమయంలో నిషిద్ధ ప్రదేశంగా మార్చేసాయి.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X