Search
  • Follow NativePlanet
Share
» »ఆ ఊరిలో మనుషుల కన్నా పాములే ఎక్కువంట !

ఆ ఊరిలో మనుషుల కన్నా పాములే ఎక్కువంట !

ఛత్తీస్ ఘడ్ లోని తప్కరా అనే చిన్న గ్రామం అతి భయంకర పాములకు నెలవైంది. ఈ గ్రామంలోనికి వెళ్ళగానే మనుషుల కన్నా ముందు పాములే మనకు ఎదురవుతాయి. అక్కడ పాములు ఏ రేంజ్ లో తిరుగుతుంటాయో అర్థం చేసుకోవచ్చును.

By Venkata Karunasri Nalluru

వెనక్కి తిరిగి చుస్తే ఆ ఆలయ గోపురం మీ వెనకాలే వస్తుంది ఎక్కడో తెలుసా?వెనక్కి తిరిగి చుస్తే ఆ ఆలయ గోపురం మీ వెనకాలే వస్తుంది ఎక్కడో తెలుసా?

ఈ భూమి మీద విషపూరిత జీవులలో పాములు ముందు వరుసలో వుంటాయి. మనుషులకు వాటి పేరు చెబితేనే వెన్నులోంచి వణుకు పుడుతుంది. ఈ పాముల దెబ్బకి ప్రతి సంవత్సరం 94000 మంది చనిపోతున్నారు. అలాంటి పాము మన వీధిలోకి వచ్చిందంటే ఎలాగైనా చంపేద్దాం అనే పనిలో వుంటారు.

అలాంటిది ఒక ఊరు మెత్తం పాములుంటే దరిదాపుల్లోకి కూడా వెళ్ళరు. అయితే ఇక్కడ ఒక పల్లెవాసులు ఎన్ని పాములు ఎదురైనా, ప్రాణాలు పోయినా, ఆ పల్లెను మాత్రం వదలమని భీష్మించుక్కూర్చున్నారు. అసలు ఆ వూరు ఎక్కడుంది? ఆ పాములు మనుషులను చంపటానికి కారణాలేంటి?

ఛత్తీస్ ఘడ్ లోని తప్కరా అనే చిన్న గ్రామం అతి భయంకర పాములకు నెలవైంది. ఈ గ్రామంలోనికి వెళ్ళగానే మనుషుల కన్నా ముందు పాములే మనకు ఎదురవుతాయి. అక్కడ పాములు ఏ రేంజ్ లో తిరుగుతుంటాయో అర్థం చేసుకోవచ్చును.

ఇది కూడా చదవండి: బిలాస్ పూర్ - మరచిన దేవాలయాలు !

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. పచ్చని వాతావరణం

1. పచ్చని వాతావరణం

చుట్టూ కొండల మధ్య పచ్చని వాతావరణంతో ఎంతో అందంగా వుండే ఈ పల్లెలో రోజూ ఉదయాన్నే పాము కాటు పడ్డ వ్యక్తి ఆర్తనాదంతో అక్కడి జనాలు నిద్రలేస్తారు.

pc:youtube

2. పాముకాటుకు గురి అయ్యే వారి సంఖ్య

2. పాముకాటుకు గురి అయ్యే వారి సంఖ్య

మరికొంతమంది పాముకాటు వల్ల నిద్రలోనే ప్రాణాలు విడుస్తారు. ముఖ్యంగా వర్షాకాలంలో పాముకాటుకు గురి అయ్యే వారి సంఖ్య మరింత ఎక్కువగా వుంటుంది.

pc:youtube

3. స్వచ్చంద సంస్థలు

3. స్వచ్చంద సంస్థలు

అక్కడ ప్రజలు కూడా ఈ పాములను చాలా పెద్ద ఎత్తున చంపుతూ వుంటారు. వీరి పరిస్థితి గమనించిన ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం కొన్ని స్వచ్చంద సంస్థలు అక్కడి ప్రజలకు పాముల మీద అవగాహన కల్పిస్తున్నారు.

pc:youtube

4.వనమూలికల వైద్యం

4.వనమూలికల వైద్యం

కొన్ని సంవత్సరాల క్రితం వరకు పాము కాటుకు గురైన వారు వనమూలికల వైద్యాన్ని ఆశ్రయించేవారు.

ఇది కూడా చదవండి: నవరసభరితం - కొరియా పర్యాటకం !!

pc:youtube

5. క్షతగాత్రులు

5. క్షతగాత్రులు

దీని వల్ల ప్రతి సంవత్సరం 100 నుంచి 200 వరకు ప్రజలు చనిపోతూవుంటే 500 నుంచి 600 వరకు ప్రజలు క్షతగాత్రులయ్యే వారు.

ఇది కూడా చదవండి: ధంతరి - ఔత్సాహికులకు ఒక స్వర్గం !!

pc:youtube

6. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం

6. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం

ఈ పరిస్థితి గమనించిన ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించి అన్ని రకాల విషాలకు యాంటి వెనిన్ మందులను సప్లై చేసింది.

pc:youtube

7. ఇళ్ళలోకి కూడా పాములు

7. ఇళ్ళలోకి కూడా పాములు

వర్షాకాలంలో రోడ్ల మీద, పొలాలలోనే కాకుండా ఇళ్ళలోకి కూడా పాములు వచ్చేస్తుంటాయి. అలా రాత్రిపూట ఇళ్ళలోకి వచ్చే పాములు క్రింద పడుకునే వారిని కాటు వేయటంతో చాలా మంది నిద్రలోనే చనిపోయేవారు.

pc:youtube

8. మంచాలు

8. మంచాలు

అందుకని అక్కడ ప్రభుత్వం, పలు స్వచ్చంద సంస్థలు మంచాలను పంపిణీ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: కోర్బా - సాంస్కృతిక వారసత్వ స్థలం !

pc:youtube

9. చర్యలు

9. చర్యలు

ఆ గ్రామ ప్రజలకి ప్రతిరోజూ పాము ఇళ్ళలోకి రాకుండా వుండటానికి చేపట్టే చర్యల గురించి, ఒక వేల పాము ఇంట్లోకి వస్తే వాటిని చంపకుండా సురక్షితంగా పట్టుకోవటమో, లేక అక్కడి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో అన్న విషయాల మీద శిక్షణా తరగతులను చెబుతున్నారు.

pc:youtube

10. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం

10. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం

2015వ సంవత్సరంలో ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 40 మంది పాము కాటుకు చనిపోతే 120మంది పాము కాటుకు గురైనవారుగా ప్రకటించగా వాస్తవిక లెక్కల ప్రకారం ఈ సంఖ్యలు ఇంకా ఎక్కువ వుండవచ్చని చెబుతున్నారు.

pc:youtube

భైరవకోన గురించి మీకు తెలియని ఎన్నో నిజాలు !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X