Search
  • Follow NativePlanet
Share
» »ఈ దేవాలయంలో దేవత మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది

ఈ దేవాలయంలో దేవత మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది

దేవుడు యందు భక్తి భూమి మీద వుందో లేదో అనేది వారివారి నమ్మకానికి సంబంధించింది. అయితే సామాన్యంగా మనుష్యులకు కష్టం వచ్చినప్పుడు దేవుడు దగ్గరకు వెళ్తారు.

By Venkatakarunasri

 షిరిడిలో వి ఐ పి దర్శనం కావాలంటే ఈ ఒక్క పని చేయండి చాలు షిరిడిలో వి ఐ పి దర్శనం కావాలంటే ఈ ఒక్క పని చేయండి చాలు

ఈ 6 దేశాలకు ఇండియా అంటే ఎంతో గౌరవమట ఎందుకో మీకు తెలుసా ?ఈ 6 దేశాలకు ఇండియా అంటే ఎంతో గౌరవమట ఎందుకో మీకు తెలుసా ?

సముద్రంలో దెయ్యాలు నడుపుతున్న నౌకలు ఇవే ..!సముద్రంలో దెయ్యాలు నడుపుతున్న నౌకలు ఇవే ..!

హైదరాబాద్ కి పెను ప్రమాదం.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా.. ?

దేవుడు యందు భక్తి భూమి మీద వుందో లేదో అనేది వారివారి నమ్మకానికి సంబంధించింది. అయితే సామాన్యంగా మనుష్యులకు కష్టం వచ్చినప్పుడు దేవుడు దగ్గరకు వెళ్తారు. ఆ దేవుడు వల్ల అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రతిఒక్క భక్తుడు ఎదురుచూస్తుంటారు.

అయితే నేను చెప్పబోయే దైవము మీ ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇస్తుంది. ఇదేంటీ దేవుడు సమాధానాలు ఇస్తుందా అనే సందేహంలో వున్నారా? ఇది నిజం. కర్ణాటక రాజ్యంలో తిపటూరులో వెలసిన మహిమాన్విత పరాశక్తి వుంది ఆమె దాసరిఘట్టలోని చౌడేశ్వరీదేవి. ఆశ్చర్యమేమంటే ఈ దేవి భక్తుల పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే పరాశక్తి.

ప్రస్తుత వ్యాసంలో మీ ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చే దేవి దేవాలయం గురించి తెలుసుకుందాం.

ఈ దేవాలయంలో దేవత మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. దేవాలయం ఎక్కడ ఉంది?

1. దేవాలయం ఎక్కడ ఉంది?

దాసరిఘట్ట చౌడేశ్వరీదేవి కర్ణాటక రాష్ట్రంలో తుమకూరు జిల్లాలోని తిపటూరులో దాసరిఘట్టలో వెలసివున్నది. బెంగుళూరు నుంచి తుమకూరు సుమారు 72కి.మీ దూరం అదేవిధంగా తుమకూరు నుంచి తిపటూరుకి 74 కి.మీ ల దూరంలో దాసరిఘట్ట వుంది. ఇక్కడికి వచ్చినవారి సమస్యలకు పరిహారం ఇచ్చే ప్రఖ్యాత దేవత చౌడేశ్వరీ యొక్క దేవాలయం ఇది.

PC:wikipedia

2. ప్రాముఖ్యత

2. ప్రాముఖ్యత

మహిమాన్విత చౌడేశ్వరీ దేవాలయం అత్యంత ప్రసిద్దిచెందినది. కేవలం కర్ణాటకలో వున్నా కూడా దేశవిదేశాల నుండి అనేకమంది భక్తులు ఈ దేవీ దర్శనానికి తమ సమస్యలకు సమాధానాల కోసం వస్తారు.

PC:wikipedia

3. చౌడేశ్వరీ దేవి

3. చౌడేశ్వరీ దేవి

చౌడేశ్వరీ దేవి దేవాలయంలో మీ ప్రశ్నలకు సమాధానాలు పొందుటకు ప్రత్యేకమైన టికెట్ తీసుకుని దేవాలయ ప్రాంగణంలో కూర్చుంటారు. చోదేశ్వరీ దేవి పంచలోహ విగ్రహాన్ని బియ్యం పిండి మీద వుంచుతారు. దేవీ విగ్రహం మీద ఒక కలశాన్ని వుంచుతారు.

4. అమ్మ యొక్క సమాధానం

4. అమ్మ యొక్క సమాధానం

ఈ విధంగా పూజారులు సిద్ధం చేసి కలశాన్ని కదిలించి తిప్పుతారు. వెంటనే అక్షరరూపంలో వచ్చిన సమాధానాన్ని పూజారులు తెలుపుతారు ఈ విధంగా వేల కొలది భక్తులు సమాధానాలు తెలుసుకున్నారు. వారికి సరియైన సమాధానాలు కూడా దొరికిందంట. ఈ తల్లి చెప్పే భవిష్యత్తు ఎప్పుడూ తప్పు కాదు అనేది వారి నమ్మకం.

PC:wikipedia

5. నరేంద్ర మోడీ

5. నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ ప్రస్తుత ప్రధానమంత్రి కొన్ని సంవత్సరాల ముందే కొంతమంది బి.జె.పి రాజకీయ వేత్తలు ఈ దేవాలయానికి వచ్చి ప్రశ్నలు అడిగినదానికి సరియైన సమాధానం ఇచ్చిందంట. అంటే ఇంక ముందు ప్రధాని నరేంద్ర మోడీ అని. ఇది కొంతమందికి అనుమానంగా వున్నా కూడా ఇది నిజంగా జరిగింది.

PC:Global Panorama

6. ఏ భాషలో

6. ఏ భాషలో

వచ్చే భక్తులు తమ ప్రశ్నలను కన్నడ. ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషలలో అడిగినా కూడా చౌడేశ్వరీ అమ్మ కన్నడలోనే సమాధానం ఇస్తుంది.

PC:wikipedia

7. దేవీ చరిత్ర

7. దేవీ చరిత్ర

వందల సంవత్సరాలకు ముందు కర్ణాటక రాయచూరు జిల్లాలో తుంగా నదీ సమీపంలో నందవరం అనే సామ్రాజ్యం వుండేది. ఈ ప్రదేశాన్ని పరిపాలించే రాజు శక్తిదేవతలను ఆరాధించేవాడు.

PC:wikipedia

8. రాజు

8. రాజు

రాజు శక్తిదేవతలను ఆరాధించటం వల్ల అనేక మంత్రవిద్యలలో ప్రావీణ్యత కలిగివుండేవాడు. తన అపూర్వమైన శక్తి వల్ల ప్రతి నిత్యం ఉదయాన్నే 4 గంటలకు నిద్ర లేచి కాశీలో గంగా స్నానం చేసి సాయంకాలం సమయంలో మళ్ళీ సాయంత్రం తన సామ్రాజ్యానికి తిరిగివచ్చేవాడంట.

PC:wikipedia

9. మహా రాణి

9. మహా రాణి

ప్రతి రోజు ఉదయాన్నే రాజు ఎక్కడికి వెళ్తున్నాడని రాణి ప్రశిస్తుంది. చెప్పమని ఒత్తిడి చేయటంతో రాజుకు చెప్పక తప్పలేదు.

PC:wikipedia

10. కోరిక

10. కోరిక

విషయం తెలిసిన రాణి తన భర్తతో కలిసి తను కూడా ఒకే రోజులో కాశీయాత్ర చేయాలని కోరుకుంటుంది.

PC:wikipedia

11. కాశీయాత్ర

11. కాశీయాత్ర

రాణి కోరికను అంగీకరించిన రాజు సరే అని మరుసటిరోజు ఆమెతో కూడా బయలుదేరాడు. ఈ విధంగా ఇద్దరూ కూడా కాశీయాత్రలో వుండగా రాణికి నెలసరి ఋతుచక్రం వచ్చింది.

PC:wikipedia

12. నెలసరి ఋతుచక్రం

12. నెలసరి ఋతుచక్రం

రాణి యొక్క నెలసరి ఋతుచక్రం వల్ల అతను తన మంత్రశక్తులన్నీ కోల్పోయాడు. అతని రాజ్యానికి తిరిగి వచ్చి చింతించెను.

PC:wikipedia

13. బ్రాహ్మణులు

13. బ్రాహ్మణులు

గంగా నది ఒడ్డున తిరుగుతున్నప్పుడు చండీ యాగం చేస్తున్న బ్రహ్మణులను రాజు చూశాడు. అతను తన సమస్య గురించి వారికి చెప్పాడు. రాణిని బ్రాహ్మణులు స్వచ్చంగా పవిత్రంగా చేశారు. అప్పుడు బ్రాహ్మణులు రాజు ముందు ఒక కోరిక ఉంచుతారు.

PC:wikipedia

14. నిందించటం

14. నిందించటం

అప్పుడు రాజు తాను రథాలను దానం చేస్తానని చెప్తాడు. ఒకసారి కరువు వస్తుంది. ఆ సమయంలో బ్రాహ్మణులు తమ దానాన్ని అడుగుతారు. పూర్తిగా మర్చిపోయిన రాజు దానాన్ని ఇవ్వకుండా వారిని నిందించాడు.

PC:wikipedia

15. చౌడేశ్వరీ దేవి

15. చౌడేశ్వరీ దేవి

రాజు బ్రాహ్మణులకు ఇచ్చిన మాటకు చౌడేశ్వరీ దేవియే సాక్షి అయితే ఇక్కడకు రావాలని ప్రార్ధిస్తారు. అక్కడ ప్రత్యక్షమైన తల్లిని చూసిన రాజు తన తప్పులను తెలుసుకుని క్షమించమని వేడుకుంటాడు. అప్పటి నుండి ఈ తల్లి ఇక్కడే ఉంది అని పురాణాలు మనకు చెప్తున్నాయి.

PC:wikipedia

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X