Search
  • Follow NativePlanet
Share
» »హిమాలయ సామ్రాజ్యం అనే నగరం ఉందని తెలుసా ? దాని వింతలు విశేషాలు !

హిమాలయ సామ్రాజ్యం అనే నగరం ఉందని తెలుసా ? దాని వింతలు విశేషాలు !

హిమాలయ సామ్రాజ్యం పురాణాలలో పేర్కొనబడిన హిమాలయాలలో ఒక పర్వత దేశం. హిమావత్ లేదా హిమవంతుడు దీని పాలకుడు. అతని కుమార్తె పార్వతి, ఈ రాజ్యం యువరాణి. ఈమె శివుని భార్య అయ్యింది.

By Venkatakarunasri

హిమాలయ సామ్రాజ్యం పురాణాలలో పేర్కొనబడిన హిమాలయాలలో ఒక పర్వత దేశం. హిమావత్ లేదా హిమవంతుడు దీని పాలకుడు. అతని కుమార్తె పార్వతి, ఈ రాజ్యం యువరాణి. ఈమె శివుని భార్య అయ్యింది. భారత పురాణ గ్రంథం మహాభారతం నందు హిమాలయ పేరుతో ఒక రాజ్యమును ప్రస్తావించబడలేదు, కానీ హిమాలయ పర్వతాలలో కులిందా రాజ్యం, పర్వత రాజ్యం, నేపా రాజ్యం, కిరాట రాజ్యం, కింపురుష రాజ్యం, కిన్నెర రాజ్యం వంటి అనేక రాజ్యాలు ఉన్నట్లు ప్రస్తావనలు ఉన్నాయి.

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

పర్వత అనే పేరుగల సాధువు

మహాభారతం మరియు పురాణాల్లో ప్రస్తావించబడిన నారద సాధువుకు సహచరుడు అయినా పర్వత అనే పూర్ణ మహర్షి కూడా ఉన్నాడు. ముందు చారిత్రాత్మక యుగాల్లో పర్వతుడు మరియు నారదుడు ఇద్దరూ ప్రయాణికులు. వారు మధ్య ఆసియా, చైనా మరియు పశ్చిమ ఆసియాలో హిమాలయాలు దాటి పురాతన భారతదేశం యొక్క రాజ్యాలు అలాగే ఇతర రాజ్యాలను సందర్శించారు.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

పర్వత పేరు (సంస్కృతంలో పర్వతం అని అర్ధం), ' యాత్రికుడికి ' ఇవ్వబడింది. బహుశా ఎందుకంటే వేద ప్రజలు హిమాలయ పర్వతాలను దాటిన తర్వాత అవి తమవైపు వస్తున్నట్లు వాటిని చూశారు. శివుడి భార్య పార్వతి పేరు పెట్టారు. ఆమె పార్వతా తెగకు చెందినది అని ఆ పేరు సూచిస్తుంది.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

మహాభారతంలో మూలాలు

హిమాలయ పర్వత ప్రాంతాలలోని రాజ్యాలకు అర్జునుడు యాత్ర జరిపినట్లు అర్జునుడు పేర్కొన్నాడు. హిమాలయాలు మరియు నిష్కుట పర్వతాలు జయించి తెల్ల పర్వతాల వద్దకు వచ్చిన తరువాత, అతను దాని రొమ్ము మీద నివసించాడు.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

పాండవులు హిమాలయాలపై ఉన్న సువాహు యొక్క విస్తారమైన ప్రదేశాలు, గుర్రాలు మరియు ఏనుగులలో విస్తృతంగా వ్యాపించి ఉండి, కిరాటులు, టాంగాంన్లు నివసించే ప్రాంతం మరియు వందలకొద్దీ పులిందులతో నిండిపోయిన ప్రదేశాలను చూసి ఆనందించారు. ఈ ప్రాంతాన్ని పాండవులు హిమాలయాల బంగారు గనుల నుండి వచ్చిన గని బంగారంగా ప్రస్తావించారు.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

హిమాలయాలు ఎలా పుట్టాయో తెలుసా..?

సాధారణంగా మనదేశానికి ఉత్తర సరిహద్దు ఏంటని అడిగితే..? వెంటనే "హిమాలయా పర్వతాలు" అని ఠక్కున చెప్పేస్తుంటాం. అయితే అసలు ఈ హిమాలయాలు ఎలా పుట్టాయి, వాటి వయసెంత..? అనే ప్రశ్నలు అడిగితే మాత్రం కాస్త తడబడాల్సిందే..! ఇంతకీ ఈ పర్వతాలు ఎప్పుడు, ఎలా పుట్టాయి.. వాటి వయసెంత.. తదితర విషయాలను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

పిల్లలూ.. ఇప్పుడు మీ వయస్సు ఎంత..? అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పవచ్చు. మీ బర్త్ సర్టిఫికెట్ ద్వారా చూసి అలా చెప్పవచ్చుగానీ.. హిమాలయాలకు అలా ఉండదు కదా..! ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం ఇవి పుట్టినప్పుడు మనుషులే ఉండేవారు కాదు. అలాంటప్పుడు అవి ఎలా పుట్టాయి, వాటి వయస్సెంత..? అనే విషయాలు తెలుసుకోవాలంటే.. భూ పరిశోధనలే మార్గం.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

రెండు భాగాలు ఢీకొట్టటం వల్లనే..

ఆ చిన్న ముక్క లక్షలాది సంవత్సరాలపాటు నెమ్మదిగా జరుగుతూ, జరుగుతూ... ఇప్పటి ఆసియాలో ఉండే మరో ముక్కలా ఉండే భూభాగాన్ని ఢీకొట్టింది. అలా ఢీకొన్న చోటునే హిమాలయా పర్వతాలు పైకి పొడుచుకు వచ్చాయి. ఈ రకంగా హిమాలయా పర్వతాలు పుట్టాయన్నమాట..!

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

కాబట్టి.. శాస్త్రవేత్తలు భూమిని పరిశోధించి, చాలా ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చారు. అవేంటంటే.. ఇప్పటిదాకా మనమంతా.. హిమాలయా పర్వతాలు సుమారు 80 లక్షల సంవత్సరాల క్రితం పుట్టాయని భావిస్తూ వస్తున్నాం. అయితే అది తప్పని... 139 నుంచి 144 లక్షల సంవత్సరాల క్రితమే హిమాలయాలు పుట్టినట్లు తాజా పరిశోధనల ద్వారా వారు కనుక్కొన్నారు.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి మీద ఖండాలు ఇప్పట్లాగా ఉండేవి కావు. అవన్నీ కలిసి దగ్గరదగ్గరగా ఒకేచోట ఉండేవి. అయితే అవి నెమ్మదిగా దూరం జరుగుతూ.. సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం రెండు మహా ఖండాలుగా విడిపోయాయి. వాటినే గోండ్వానాలాండ్, లారాసియా అని పిలుస్తారు. ఇప్పుటి మన భారత భూభాగం అప్పట్లో గోండ్వానాలాండ్‌లో ఓ చిన్న ముక్కలాగా ఉండేది.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

ఆ చిన్న ముక్క లక్షలాది సంవత్సరాలపాటు నెమ్మదిగా జరుగుతూ, జరుగుతూ... ఇప్పటి ఆసియాలో ఉండే మరో ముక్కలా ఉండే భూభాగాన్ని ఢీకొట్టింది. అలా ఢీకొన్న చోటునే హిమాలయా పర్వతాలు పైకి పొడుచుకు వచ్చాయి. ఈ రకంగా హిమాలయా పర్వతాలు పుట్టాయన్నమాట..!

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ రెండు భూఫలకాలూ ఢీకొనటం ఇంకా ఆగిపోలేదట. భారత భూఫలకం ఉత్తరదిశంగా ఏడాదికి 67 మిల్లీమీటర్ల వంతున కదులుతూనే ఉందట. అందుకనే హిమాలయాలు ఇప్పటికీ ప్రతి సంవత్సరం సుమారు 5 మిల్లీమీటర్లు ఎత్తు పెరుగుతూనే ఉన్నాయి.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

హిమాలయాల గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే.. హిమాలయాలుగా పిలుచుకునే ఈ పర్వతాల వరస పొడవు 3 వేల కిలోమీటర్లు. ఇవి ఆప్ఘనిస్తాన్, భూటాన్, చైనా, ఇండియా, నేపాల్, పాకిస్థాన్ దేశాలను తాకుతూ విస్తరించాయి. ఈ హిమాలయాల నుంచి జారే మంచు హిమానీనదులు (గ్లాసియర్స్)గా మారుతుంది. ఇలాంటివి 15 వేల దాకా ఉన్నాయి.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

మన హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలకు పుట్టినిల్లు..., పవిత్ర హిమాలయాలు..! ఎందరో యోగులు, మునులు, రుషులు ఇప్పటికీ కూడా హిమాలయాల్లో సంచరిస్తారని చెబుతారు. అంతేకాదు ఈ హిమగిరుల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలిశాయి. మనిషీ ఎంత అభివృద్ధి సాధించినా కూడా ఈ ప్రకృతికి నిబద్ధుడై ఉండాల్సిందే. ఈ పరమ సత్యాన్ని ప్రాచీన భారతీయ రుషులు ఎప్పుడో గ్రహించారు. అందుకే ప్రకృతికీ-మనిషీకి మధ్య బంధాన్ని వీడదీయలేనంతగా పెనవేశారు.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

హిమవన్నగాల చెంత ఉన్న రాష్ర్టం ఉత్తరాఖండ్. ఈ రాష్ర్టంలోని నాలుగు దివ్యస్థలాన్ని చార్ ధామ్ గా వ్యవరిస్తారు.యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్ క్షేత్రాల దర్శన సమాహారాన్ని చార్ధామ్ యాత్రగా పరిగణిస్తారు. ఇవి పూర్తిగా హిమలయాల్లోనే వెలిసిన పుణ్యధామాలు..!

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

చార్ధామ్ క్షేత్రాల యాత్రకు హరిద్వార్ను ముఖద్వారంగా భావిస్తారు. భగీరథ యత్నానికి తలవంచి, చండప్రచండమైన వేగంతో, గంగ శివుడి జటాఝూటంలోకి దూకింది. ఆ గంగ హిమ పర్వతాల నుంచి జనావాసాల్లోకి వచ్చింది హరిద్వార్లోనే! ఇక్కడ నీల పర్వతంపై నెలకొన్న చాందీదేవి, బిల్వ పర్వతంపై ఉన్న మానసాదేవి ఆలయాల్ని భక్తులు సందర్శిస్తారు.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అటు హరిద్వార్ నుంచి రిషికేశ్కు భక్తులు చేరుకుంటారు. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన హాలాహలాన్ని మహాదేవుడు సేవించిన ప్రదేశంగా వ్యవహరించే నీలకంఠ మహాదేవాలయాన్ని దర్శిస్తారు. ఇక్కడే ఉన్న రామ్, లక్ష్మణ్ ఝూలాలు, వసిష్ఠ గుహ, భరత్ మందిరాల్ని తిలకిస్తారు.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

చార్ధామ్ యాత్రలో మొదటి క్షేత్రమైన యమునోత్రికి డెహ్రాడూన్, ముస్సోరీల మీదుగా భక్తులు పయనమవుతారు. యమునా నది పర్వతాగ్రాల నుంచి కిందకు దిగిన ప్రదేశం యమునోత్రి. హనుమాన్ చట్టి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి కాలినడకన లేదా గుర్రాల మీద భక్తులు వెళ్తారు. సముద్రమట్టానికి 3,165 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో యమునాదేవి ఆలయం గోచరమవుతుంది. కిలోమీటరు దూరంలో ఉన్న భారీ పర్వతాన్ని అధిరోహిస్తే యమున జన్మస్థలి దర్శనమిస్తుంది.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

దేవతల్లో విష్ణువు.., సరోవరాల్లో సాగరం.., నదుల్లో గంగ.., పర్వతాల్లో హిమాలయం, భక్తుల్లో నారదుడు, గోవుల్లో కామధేనువు, పురాల్లో కైలాసం, క్షేత్రాల్లో కేదారం నాకు పరమ ప్రియమైనవి'- అని స్వయంగా పరమశివుడే పేర్కొన్నాడని మన పురాణాలు చెబుతున్నాయి.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

వీటిల్లో విష్ణుధామమైన బదరీనాథ్ తోపాటు, గంగ, కైలాస పర్వతం, కేదార క్షేత్రం అన్ని కూడా హిమాలయాల్లోనే ఉన్నాయి. సృష్టి ప్రారంభం నుంచే పరమ శివుడు...హిమాలయాలలోని క్షేత్రాల్లో నివసిస్తున్నాడని పురాణాలు చెబుతున్నాయి.అలాగే పాండవులు స్వర్గారోహణం చేసింది కూడా పవిత్ర హిమగిరుల్లోనే..! ఇంకా జగద్గురువు ఆది శంకరాచర్యాలు కైవల్యం పొందింది కూడా ఈ గిరుల్లోనేనని చెబుతారు.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

చార్ ధామ్ యాత్రలో భాగంగా..యమునోత్రిని దర్శిచిన భక్తులు...ఇక్కడ నుంచి ఉత్తరకాశి మీదుగా గంగనాని, ధూలి ప్రాంతాల్ని సందర్శించి...ఆ తర్వాతే గంగోత్రికి చేరుకుంటారు. సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఈ ప్రదేశం ఉంటుంది.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

భగీరథుడి తపోఫలితంగా గంగాదేవి నదీరూపంలో భూమిపై అడుగిడిన చోటుగా భావించే స్థలంలో పవిత్రమైన శిల ఉంటుంది. సహజసిద్ధంగా ఏర్పడిన ఈ శిలాకృతిని శివలింగంగా భక్తులు పూజిస్తారు. గంగమ్మ దూకుడును తట్టుకుని తన జటాఝూటంలో బంధించేందుకు శివుడే ఇక్కడ కూర్చున్నాడని స్థల పురాణం.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

గంగోత్రిలో మంచు కారణంగా ఏటా ఆరు నెలల పాటు మూసి ఉండే గంగా మాత ఆలయాన్ని, అక్షయ తృతీయ నుంచి దీపావళి వరకు తెరుస్తారు. ఈ ఆలయానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోముఖ్ను గంగానది జన్మస్థలిగా భావిస్తారు. ఇక్కడ భాగీరథి ప్రవహిస్తుంది.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

ఇది దేవప్రయాగ దగ్గర అలకానంద నదితో సంగమమై గంగానదిగా మారుతుంది. గంగోత్రి నుంచి శ్రీనగర్, రుద్రప్రయాగ, గౌరీకుండ్ మీదుగా భక్తులు మూడో దివ్యధామమైన కేదార్నాథ్కి చేరుకుంటారు. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం సముద్ర మట్టానికి 12 వేల అడుగుల ఎత్తున ఉంటుంది. హరుడు, కేదారేశ్వరుడిగా వెలసిన ఈ క్షేత్ర వైభవం స్కాంద పురాణంలో ఉంది.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

చార్ధామ్ యాత్రలో నాలుగో దివ్యస్థలి బదరీనాథ్. హిమాలయాల్లోని నీలకంఠ పర్వతాల నేపథ్యంలో నర, నారాయణ కొండల నడుమ, అలకానంద నదీ తీరాన విష్ణు రూప బదరీనాథుడు కొలువుతీరి ఉంటాడు. ఈ ఆలయం ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

గర్భాలయంలో ధ్యానముద్రాంకితుడైన శ్రీహరి విగ్రహం గోచరమవుతుంది. ప్రధాన ఆలయంతోపాటు ఆదిబద్రి, యోగధ్యాన్ బద్రి, బృధా బద్రి, భవిష్య బద్రి పేరిట మరో నాలుగు ఆలయాలు ఉంటాయి. ఇక్కడ పంచ ప్రయాగలుగా పేర్కొనే దేవ, రుద్ర, నంద, కర్ణ, విష్ణుప్రయాగలు దర్శనీయ ప్రదేశాలు.

PC: youtube

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

అంతుచిక్కని హిమాలయ సామ్రాజ్యం ..!

మన భారతదేశం.... ‘నమోనమామి' అంటూ ఆరాధించదగిన కర్మభూమి, పుణ్యభూమి! ఆసేతు హిమాచలం వరకు ఎన్నో దివ్యసన్నిధులు ధామాలు, క్షేత్రాలు ఇక్కడ నెలకొన్నాయి. హిమాలయాల్లోని ఈ మహనీయ స్థలాల్ని శ్రద్ధతో, భక్తితో, విశ్వాసాలతో దివ్య, భవ్య, ఆధ్యాత్మిక పెన్నిధులుగా సేవించాలి. అప్పుడే యాత్ర సిద్ధి, చిత్తశుద్ధి, అలౌకికమైన ఆత్మానంద లబ్ధి చేకూరుతాయి.

PC: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X