Search
  • Follow NativePlanet
Share
» »దేవికాపురం - కృష్ణదేవరాయల జన్మస్థలం ?!

దేవికాపురం - కృష్ణదేవరాయల జన్మస్థలం ?!

దేవికాపురం 'దేవుళ్ళ యొక్క నగరం' అని, 'శ్రీ కృష్ణదేవరాయల స్వస్థలం' అని, 'సిల్క్ చీరల ఉత్పత్తి కేంద్రం' అని పేరుగాంచింది. అంతేకాదు అనేక దేవాలయాలు, స్మారక కట్టడాలు, చిహ్నాలు ఈ ప్రదేశంలో ఉన్నాయి.

By Mohammad

గుడులు, గోపురాలు శ్రీ కృషదేవరాయలు ఎంత బాగా కట్టించారో చరిత్ర మనకు చెబుతుంది. శ్రీ కృషదేవరాయలు అంటే అందరికీ గుర్తుకొచ్చేది హంపి. దీనినే ఆయన రాజధాని చేసుకొని విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. స్వర్ణ యుగం గా కిర్తించబడ్డ రాయల కాలంలో వజ్రాలను, వైఢుర్యాలను రాసులుగా పోసి అమ్మేవారట. అంతటి గొప్ప రాజుగా చరిత్రలో నిలిచిపోయిన ఆ మహనీయుడు ఎక్కడ పుట్టారో మీకు తెలుసా ? అయితే మీరు తప్పక తెలుసుకోవలసిందే !!

దేవికాపురం లేదా దేవిగై అని పిలువబడే ప్రాంతం శ్రీ కృష్ణదేవరాయ స్వస్థలం. ఈ ప్రదేశం తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణమలై జిల్లాలో కలదు. కాంచీపురం, తిరువణ్ణమలై, తిరుమల తిరుపతి, తిరుక్కోయిలూర్ లాంటి ప్రసిద్ధ దేవాలయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా పెరియనాయగి అమ్మన్ ఆలయం ఉన్నది.

ఇది కూడా చదవండి : హంపి - విజయనగర కాలానికి ప్రయాణం !!

దేవికాపురం 'దేవుళ్ళ యొక్క నగరం' అని, 'శ్రీ కృష్ణదేవరాయల స్వస్థలం' అని, 'సిల్క్ చీరల ఉత్పత్తి కేంద్రం' అని పేరుగాంచింది. అంతేకాదు అనేక దేవాలయాలు, స్మారక కట్టడాలు, చిహ్నాలు ఈ ప్రదేశంలో ఉన్నాయి.

పెరియనాయగి అమ్మన్ దేవాలయం

పెరియనాయగి అమ్మన్ దేవాలయం

పెరియనాయగి అమ్మన్ దేవాలయం, దేవికాపురం గ్రామానికి సరిగ్గా మధ్యలో ఉన్నది. ఈ గుడిని విజయనగర రాజు క్రీ.శ. 14 వ శతాబ్దంలో కట్టించాడు. తిరువణ్ణమలై అరుణాచలేశ్వర్ టెంపుల్ తర్వాత రెండవ అతిపెద్ద టెంపుల్ ఇది.

చిత్రకృప : Balu 606902

చెక్కబడిన శిల్పాలు

చెక్కబడిన శిల్పాలు

గుడి మూడు ఎకరాలలో విస్తరించబడి ఉన్నది. చుట్టూ గోడలు గుర్రాలు, ఎద్దు, వరాహం బొమ్మలతో చెక్కబడి ఉంటాయి. గుడి తూర్పువైపున నాలుగు స్తంభాల మండపం ప్రధాన ఆకర్షణ.

చిత్రకృప :Balu 606902

గుడిలో చూడవలసినవి

గుడిలో చూడవలసినవి

మొదటి ప్రాకారం : బ్రహ్మతీర్థం, కళ్యాణ మంటపం, అద్భుతంగా చెక్కబడిన స్తంభాల మంటపాలు, బలిపీఠం, వినాయగర్ సన్నిధి, ఆరుముగర్ సన్నిధి, మూడు అంచెల పగోడాలు

రెండవ ప్రాకారం : శ్రీ కాశి విశ్వనాథర్, శ్రీ పిళ్ళైయార్, నవరథిర్ మంటపం, ఉత్సవ విగ్రహాలు : మహామండపంలోని వినాయగర్, నటరాజర్, సమస్కంధర్ విగ్రహాలు.

మూడవ ప్రాకారం : మూడవ ప్రాకారం దాటగానే పెరియానయాగి అమ్మన్ దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారు గర్భగుడిలో కొలువై ఉంటారు. ప్రతి శుక్రవారం భక్తులు అధికసంఖ్యలో దర్శిస్తుంటారు.

చిత్రకృప : Balu 606902

తీర్థాలు

తీర్థాలు

అగ్ని తీర్థం, బ్రహ్మ తీర్థం, నవగ్రహ తీర్థం, దేవరైదియార్ తీర్థం మరియు కొండ చుట్టూ అనేక చిన్న చిన్న తీర్థాలు కలవు.

చిత్రకృప : Balu 606902

శ్రీ కనక గిరీశ్వరర్ ఆలయం

శ్రీ కనక గిరీశ్వరర్ ఆలయం

ఇక్కడ లార్డ్ శివుడు స్వయంభూ మూర్తి. గర్భగుడిలో రెండు శివలింగాలు ఉంటాయి. శక్తి పీఠాలలో ఇది ఒకటి. గుడి సముద్రమట్టానికి 500 అడుగుల ఎత్తులో కలదు. సంవత్సరంలో 365 ఉన్నట్లు, ఆ సంఖ్యను సూచించే విధంగా గుడి చేరుకోవటానికి 365 ఎక్కవలసి ఉంటుంది.

చిత్రకృప : Balu 606902

చూడవలసినవి

చూడవలసినవి

మూడంతస్తుల రాజగోపురం, నంది విగ్రహం, వినాయక, మురుగన్, శివుడు, దక్షిణామూర్తి, చండికేశ్వర, అగోర వీరభద్ర మరియు సప్త మఠాలు.

సందర్శించు సమయం : కొండ పైన ఉన్న గుడిని 9 am - 10 am వరకు మాత్రమే తెరుస్తారు. కొండ కింద ఉన్న గుడిని 6 am - 12 pm వరకు మరియు తిరిగి 5 pm - 8 pm వరకు తెరుస్తారు.

చిత్రకృప : Balu 606902

పోన్మలై నాథర్ ఆలయం

పోన్మలై నాథర్ ఆలయం

పోన్మలై నాథర్ ఆలయం సముద్రమట్టానికి 500 అడుగుల ఎత్తులో కలదు. 1000 ఏళ్ల ఈ గుడిని చోళరాజుల నిర్మించినట్లు చెబుతారు. క్రీ.శ.15 వ శతాబ్దంలో ముఖ్యంగా కృష్ణదేవరాయల కాలంలో గుడి విస్తరణ పనులు శరవేగంగా సాగాయి. ఆ సమయంలోనే పునః నిర్మాణ పనులు కూడా చేపట్టారు. కొండ మీద ఉన్న దేవాలయం 140 అడుగుల పొడవు, 70 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది.

చిత్రకృప : Balu 606902

దేవికాపురం లో చూడవలసిన మరొకొన్ని దేవాలయాలు

దేవికాపురం లో చూడవలసిన మరొకొన్ని దేవాలయాలు

తిరుకామేశ్వర్ గుడి, కొండపైన బాల మురుగన్ టెంపుల్, ఆదిపరాశక్తి దేవాలయం, పిళ్ళయార్ టెంపుల్, అనుమాన్ టెంపుల్, గ్రామ దేవతలైన మరియమ్మన్, కాళీ, ముతలమ్మన్, త్రయోపతి, పచైఅమ్మాన్ గుళ్ళు చూడవలసిందే!

చిత్రకృప : Balu 606902

దేవికాపురం ఎలా చేరుకోవాలి ?

దేవికాపురం ఎలా చేరుకోవాలి ?

దేవికాపురం పోలూరు - చెయ్యూర్ రాష్ట్ర రహదారి (నెంబర్ : 115) మార్గంలో కలదు. పోలూరు కు 14 కి.మీ. తూర్పు దిక్కున, చెట్ పుట్ కు 12 కి. మీ. పశ్చిమం దిక్కున, ఆర్ని కి 21 కి.మీ. దక్షిణం దిక్కున దేవికాపురం కలదు. ఈ గ్రామం దాని చుట్టుప్రక్కల నగరాలైన కాంచీపురం, చెన్నై, వెల్లూరు మొదలగు ప్రాంతాల నుండి చక్కగా అనుసంధానించబడింది. దేవికాపురం గ్రామానికి సమీపాన పోలూరు రైల్వే స్టేషన్ కలదు.

చిత్రకృప : Balu 606902

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X