Search
  • Follow NativePlanet
Share
» »ఒకే రాత్రిలో స్వయంగా దెయ్యాలే నిర్మించిన దేవాలయమిది.

ఒకే రాత్రిలో స్వయంగా దెయ్యాలే నిర్మించిన దేవాలయమిది.

మహామహిమలు కలిగిన దేవతల రహస్యాలు, అందమైన గోపురాలు, రమణీయ శిల్పాలతో కూడిన దేవాలయాలను చూడటమే ఒక అద్భుతం. అందులోనూ దేవాలయాల గురించి ఇంత విశ్లేషణ ఎందుకు ? అని ఆలోచిస్తున్నారా? అయితే చెప్తాను వినండి.

By Venkatakarunasri

LATEST: సముద్రగర్భంలో 5000 సంవత్సరాల పురాతనమైన దేవాలయం

సామాన్యంగా భగవంతుని మీద వున్న భక్తితో గానీ నమ్మకంతో గానీ దేవాలయాన్ని నిర్మిస్తారు. కాబట్టి రాజులు గానీ లేదా భక్తులు గానీ దేవాలయాన్ని స్థాపిస్తారు. మరికొన్ని దేవాలయాలు స్వయంగా భగవంతుడే నిర్మించినవి లేదా స్వయంభూగా వెలసిన దేవాలయాలను ప్రఖ్యాతి గాంచిన ఎన్నెన్నో దేవాలయాలను మనం కళ్ళారా చూసుంటాం!

మహామహిమలు కలిగిన దేవతల రహస్యాలు, అందమైన గోపురాలు, రమణీయ శిల్పాలతో కూడిన దేవాలయాలను చూడటమే ఒక అద్భుతం. అందులోనూ దేవాలయాల గురించి ఇంత విశ్లేషణ ఎందుకు ? అని ఆలోచిస్తున్నారా? అయితే చెప్తాను వినండి. దెయ్యాలు ఒక అందమైన దేవాలయాన్ని నిర్మించాయి. ఆశ్చర్యపడకండి. ఇది అక్షరాలా నిజం.

ప్రస్తుత వ్యాసంలో దెయ్యాలు నిర్మించిన దేవాలయం గురించి తెలుసుకోండి.

ఒకే రాత్రిలో స్వయంగా దెయ్యాలే నిర్మించిన దేవాలయమిది.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. ఎక్కడుంది?

1. ఎక్కడుంది?

దెయ్యాలు నిర్మించిన దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరులో ఒక గ్రామీణ ప్రాంతంలో దొడ్డబళ్ళాపురం మరియు దేవనహళ్ళి మార్గమధ్యంలో వున్న బొమ్మావర అనే గ్రామంలో కనిపించే ఈ దేవాలయంలో దెయ్యాలు స్వయంగా స్వయంగా నిర్మించిన దేవాలయం నందు అక్కడ వుండే వాళ్ళు దృఢంగా చెప్తారు.

PC: youtube

2. సుందరేశ్వర దేవాలయం

2. సుందరేశ్వర దేవాలయం

బొమ్మావర గ్రామంలో ఈ సుందరేశ్వర దేవాలయం దెయ్యాల చేత నిర్మించబడినది. ఈ దేవాలయంలో మాహా శివుడు సుందరేశ్వరునిగా ఈ దేవాలయంలో వెలసినాడు.

PC: youtube

3. బొమ్మావర గ్రామం

3. బొమ్మావర గ్రామం

బొమ్మావర గ్రామ స్థలం యొక్క కథ ప్రకారం సుమారు 600 సం.లకు పూర్వం దెయ్యాలు ఆ స్థలంలో నివశించేవారిని హింసిస్తూ వుండేవంట. ఈ గ్రామంలో వుండే ప్రజలకు అనేక రీతులుగా కష్టాలను కలిగించేవి. ఈ దెయ్యాల చేసే పనికి అక్కడ వుండే ప్రజలకు బేజారెత్తిపోయేదంట.

PC: youtube

4. బొచ్చయ్య

4. బొచ్చయ్య

బొమ్మావర గ్రామంలో మాంత్రిక విద్యలో బొచ్చయ్య చాలా ప్రఖ్యాతి గాంచాడు. ఇతను మహాశివుని పరమభక్తుడు. ఇతను శివుని మీద వున్న అపార భక్తి భావమునకు ఒక శివుని గుడి నిర్మించాలని బొమ్మావర ప్రజలకు సహాయం చేయటం కోసం కష్టపడి ఒక దేవాలయాన్ని నిర్మించాడు.

PC: youtube

5. నాశనం చేసిన దెయ్యాలు

5. నాశనం చేసిన దెయ్యాలు

ఈ ప్రదేశంలో దేవాలయాన్ని నిర్మించటం ఆ దెయ్యాలకు ఇష్టం లేని కారణంగా రాత్రికి రాత్రే బొచ్చయ్య కష్టపడి నిర్మించిన దేవాలయాన్ని నాశనం చేసాయి. తాను కష్టపడి శివుని కోసం నిర్మించిన దేవాలయాన్ని దెయ్యాలు నాశనం చేశాయని విపరీతంగా కోపంగా వుండెను.

PC: youtube

6. దెయ్యాలను వశపరచుకున్నాడు

6. దెయ్యాలను వశపరచుకున్నాడు

మరికొన్ని మాంత్రిక శక్తులను నేర్చుకొని దెయ్యాలను తన మాంత్రిక శక్తి చేత వశపరుచుకున్నాడు. ఆ దెయ్యాలు తమను బంధన నుంచి విముక్తిచేయమని పరిపరి విధాలు వేడుకున్నాయి బుచ్చయ్య విడువలేదు.

PC: youtube

7. షరతు

7. షరతు

చివరికి దెయ్యాలను బంధన నుంచి విడుదల చేయుటకు 2 షరతులను దెయ్యాల ముందర పెట్టెను. ఈ షరతులను ఒప్పుకుంటే మాత్రమే విడుదల చేస్తానని లేకపోతే లేదు అని దృఢంగా చెప్పెనంట.

PC: youtube

8. రెండు షరతులు

8. రెండు షరతులు

ఆ 2 షరతులుకారణంగానే ఈవిధంగా నాశనం అయ్యిన దేవాలయాన్ని ఒకే రాత్రిలో పునఃనిర్మాణం చేయవలసివచ్చింది. ఇంకొకటి బొమ్మావర గ్రామంలోని ప్రజలకు ఏ విధంగా కూడా హింసించకూడదు అనే షరతు విధించెను.

PC: youtube

9. దేవాలయాన్ని నిర్మించిన దెయ్యాలు

9. దేవాలయాన్ని నిర్మించిన దెయ్యాలు

షరతులకు ఒప్పుకున్న దెయ్యాలు నాశనం చేసిన దేవాలయాన్ని రాత్రికి రాత్రే పునః నిర్మించాయంట. తరువాత అక్కడున్న ప్రజలను హింసించటం మానిందని అక్కడున్న వారు తెలిపారు.

PC: youtube

10. శిల్పాలు

10. శిల్పాలు

ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే దేవాలయాలలో దేవుని శిల్పాలు కానీ శృంగార భరితమైన శిల్పాలు కానీ కనిపించటం సర్వసాధారణం. కానీ ఈ దేవాలయంలో దెయ్యాలు నిర్మించినవి కాబట్టి ఇక్కడ విచిత్రమైన దెయ్యాల శిల్పాలు కనిపిస్తాయి. అంటే దెయ్యాలే స్వయంగా నిర్మించిన దేవాలయమని చెప్పటానికి ఈ శిల్పాలే ఆధారమని అక్కడి వారు తెలిపారు.

PC: youtube

11. ఆశ్చర్యం

11. ఆశ్చర్యం

దెయ్యాల చేత నిర్మించబడ్డ దేవాలయం కాబట్టి ఆశ్చర్యమే. ఇక్కడ అనేకమంది పర్యాటకులు దెయ్యాలు నిర్మించిన దేవాలయాన్ని చూడటానికి వస్తూ ఉంటారు.

PC: youtube

12. విగ్రహాలు

12. విగ్రహాలు

దెయ్యాలు దేవాలయాన్ని నిర్మించాయి అయితే ఇక్కడ ఏ దేవతామూర్తీ లేదు. సుమారు 50 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ త్రాగునీటి కోసం భూమిని త్రవ్వినప్పుడు ఒక శివలింగం దొరికింది.

PC: youtube

13. అతి పెద్ద శివలింగం

13. అతి పెద్ద శివలింగం

కర్ణాటకలో అతిపెద్ద శివలింగం అని పిలుస్తారు. ఈ శివ లింగం సుమారు 8 అడుగుల ఎత్తులో వుంది. ఈ లింగాన్ని దెయ్యాలు నిర్మించిన దేవాలయంలో ప్రజలు నిర్మించారు.

PC: youtube

14. అతి పెద్ద శివలింగం

14. అతి పెద్ద శివలింగం

శివుడు భూతనాథుడు కాబట్టి దెయ్యాలు నిర్మించిన దేవాలయంలో అంతా మంచిది జరుగుతుంది అని అక్కడ ప్రజలు భావించారు. అనంతరం సుందరేశ్వర దేవాలయం అని నామకరణం చేసారు.

PC: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X