అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముకేష్‌ అంబానీ అర్ధాంగి నీతాఅంబానీ దర్శించుకున్న బల్కంపేటఎల్లమ్మ ఆలయ రహస్యం

Written by: Venkatakarunasri
Updated: Monday, June 12, 2017, 12:35 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: శివునికి చేపలకూర నైవేద్యంగా ఎక్కడ పెడతారో తెలుసా !

గుడి స్తంభాల మీద వుండే రహస్య జంతువు యొక్క రహస్యం ఏంటో తెలుసా !

హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తే...అష్టాదశ శక్తిపీఠాల్ని దర్శించుకున్నంత ఫలమని చెబుతారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ, సృష్టిలోని ఎల్లజీవులకూ అమ్మ... ఎల్లమ్మ! ఏడు వందల సంవత్సరాల నాటి సంగతి.

అప్పటికసలు, హైదరాబాద్‌ నగరమే పుట్టలేదు. బల్కంపేట ఓ కుగ్రామం. చుట్టూ పొలాలే. ఓ రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా...బండరాయి అడ్డొచ్చినట్టు అనిపించింది. పరీక్షగా చూస్తే... అమ్మవారి ఆకృతి! చేతులెత్తి మొక్కాడా రైతు. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించాడు.

టాప్ 3 ఆర్టికల్స్ కోసం కింద చూడండి

బల్కంపేట ఎల్లమ్మ ఆలయం

హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తే...అష్టాదశ శక్తిపీఠాల్ని దర్శించుకున్నంత ఫలమని చెబుతారు.

pc:youtube

ఏడు వందల సంవత్సరాల నాటి సంగతి

ముగ్గురమ్మల మూలపుటమ్మ, సృష్టిలోని ఎల్లజీవులకూ అమ్మ... ఎల్లమ్మ! ఏడు వందల సంవత్సరాల నాటి సంగతి.

కుగ్రామం

అప్పటికసలు, హైదరాబాద్‌ నగరమే పుట్టలేదు. బల్కంపేట ఓ కుగ్రామం. చుట్టూ పొలాలే.

pc:youtube

బండరాయి

ఓ రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా...బండరాయి అడ్డొచ్చినట్టు అనిపించింది.

pc:youtube

రైతు

పరీక్షగా చూస్తే... అమ్మవారి ఆకృతి! చేతులెత్తి మొక్కాడా రైతు. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించాడు.

శివసత్తులు

కాస్తంతైనా కదల్లేదు. వూళ్లొకెళ్లి జనాన్ని తీసుకొచ్చాడు. తలోచేయీ వేశారు. అయినా, లాభంలేకపోయింది. శివసత్తులను పిలిపించారు.

pc:youtube

ప్రాధాన్యం

శివసత్తులంటే...పరమశివుడి ఆరాధకులు. శైవ సంప్రదాయంలో వీరికి చాలా ప్రాధాన్యం ఉంది.

దైవనిర్ణయం

ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభీష్టం కావచ్చు. దైవనిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరం?' సలహా ఇచ్చారు శివసత్తులు.

అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?

pc:youtube

పూజలు

అమ్మవారిని రేణుకాంబగా గుర్తించిందీ వీళ్లే. మూలవిరాట్టు బావి లోపల ఉండటంతో ... భక్తజనం ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు.

హైదరాబాద్ టాప్ 10 బిర్యానీ హోటల్స్ !

pc:youtube

మహిమలు

కొంతకాలానికే, రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకూ విస్తరించాయి. ఓ చిన్న ఆలయం వెలసింది.

హైదరాబాద్ చుట్టుపక్కల గల ట్రెక్కింగ్ ప్రదేశాలు !

pc:youtube

బెహలూఖాన్‌ గూడా

రాజా శివరాజ్‌ బహద్దూర్‌ అనే సంస్థానాధీశుడి హయాంలో ఈ ప్రాంతాన్ని ‘బెహలూఖాన్‌ గూడా' అని పిలిచేవారని చారిత్రక ఆధారాల్ని బట్టి తెలుస్తోంది.

తెలంగాణ తిరుమల ... చిలుకూరు బాలాజీ !

pc:youtube

బల్కంపేట

బెహలూఖాన్‌.. ఈ ప్రాంతానికి సుబేదారో, రాచప్రతినిధో అయి ఉంటాడు. ఆ పేరు కాస్తా బల్కంపేటగా మారిపోయింది. ఎల్లమ్మతల్లి ‘బల్కంపేట ఎల్లమ్మ'గా సుప్రసిద్ధురాలైంది.

హేమలాంబ

ముజ్జగాలకూ మూలపుటమ్మ...సృష్టిలోని ఎల్లజీవులకూ అమ్మ కాబట్టి...ఆ అమ్మ ఎల్లమ్మ అయ్యింది! ‘హేమలాంబ' (హేమం అంటే బంగారం, బంగారుతల్లి) అన్న సంస్కృత నామమే, గ్రామీణుల వ్యవహారంలో ఎల్లమ్మగా స్థిరపడిందని పండితులు విశ్లేషిస్తారు.

pc:youtube

పాముల పుట్టలు

ఇక, రేణుక అన్న మాటకు - పుట్ట అనే అర్థం ఉంది. ఆరోజుల్లో అమ్మవారి ఆలయ పరిసరాల్లో పాముల పుట్టలుండేవేమో!

pc:youtube

పూజలు, సేవలు

దేవాలయ రాజగోపురానికి దక్షిణ భాగంలో, తూర్పుముఖంగా మహాగణపతి దర్శనమిస్తాడు - లోపలికి వచ్చే భక్తుల్ని ‘నిర్విఘ్నమస్తు' అని ఆశీర్వదిస్తున్నట్టు.

ఆనవాయితీ

పోచమ్మతల్లి కూడా ఇక్కడ పూజలు అందుకుంటోంది. నవ వధూవరులు పెళ్లిబట్టలలో ఆ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీ.

pc:youtube

 

పీఠాధిపతి విరూపాక్షానంద స్వామి

దాదాపు రెండు దశాబ్దాల క్రితం .. హంపీ పీఠాధిపతి విరూపాక్షానంద స్వామి ఆలయ ఆవరణలో నాగదేవతనూ ప్రతిష్ఠించారు.

pc:youtube

 

18 అడుగుల రాజరాజేశ్వరీ అమ్మవారి విగ్రహం

నిత్యం నాగదోష, కాలసర్పదోష పూజలు జరుగుతుంటాయి. అంతేకాదు, పద్దెనిమిది అడుగుల రాజరాజేశ్వరీ అమ్మవారి విగ్రహమూ ఉందిక్కడ.

ఈశ్వరుడు 101 లింగములలో దర్శనమిచ్చిన క్షేత్రం !!

pc:youtube

 

మహాప్రసాదం

ప్రతి శుక్రవారం ఎల్లమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.పేదాధనికా తేడా లేకుండా ఆ భోజనాన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు.

pc:youtube

 

భక్తులు వేల సంఖ్యల్లో

ఆది, మంగళ, గురువారాలు...అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమని ఓ నమ్మకం. ఆ మూడు రోజుల్లో భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది.

pc:youtube

 

ఎల్లమ్మతల్లి కల్యాణోత్సవం

ఏటా ఆషాఢమాసం మొదటి మంగళవారం ఎల్లమ్మతల్లి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడురోజుల పాటూ జరిగే ఉత్సవాల్ని చూడ్డానికి ముల్లోకాల నుంచీ దేవతలు దిగొస్తారని ప్రతీతి.

మనకు తెలియని రహస్య పురాణ ప్రదేశాలు

pc:youtube

 

కైలాసగిరి

దాదాపు ఐదు లక్షలమంది జనం హాజరవుతారు. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చే శివసత్తులైతే బల్కంపేటను కైలాసగిరిగానే భావిస్తారు.

మేతుకూర్ దుర్గంలోని పర్యాటక ప్రదేశాలను చూద్దాం రండి!

pc:youtube

 

దుష్టశిక్షణ - శిష్టరక్షణ

రథోత్సవాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. జయజయధ్వానాల నడుమ వీధుల్లో వూరేగుతున్న సమయంలో... దుష్టశిక్షణకూ శిష్టరక్షణకూ బయల్దేరుతున్నట్టు ఉంటుందా ఠీవి!

హైదరాబాద్ నుండి చిన్న వారాంతపు విహారాలు

pc:youtube

 

ఢమరుకాది వాద్యాలు

కళాకారులు తన్మయంగా నృత్యాలు చేస్తుంటారు. వాద్యకారులు మైమరచిపోయి ఢమరుకాది వాద్యాల్ని మోగిస్తుంటారు. అమ్మవారి సైన్యంలో మేమూ ఉన్నామంటూ .. గుర్రాలూ ఏనుగులూ ఒంటెలూ!

pc:youtube

 

జలధార

అమ్మవారి స్వయంభూమూర్తి శిరసు భాగం వెనుక నుంచీ నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్నే భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు.

హైదరాబాద్ లో రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ ను అందించే ఉత్తమ స్థలాలు !

pc:youtube

 

చర్మరుగ్మతలు

ఆ నీటితో ఇళ్లను శుద్ధిచేసుకుంటే భూతప్రేతపిశాచాది దుష్టశక్తులు పారిపోతాయని ఓ నమ్మకం. స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి, తామర మొదలైన చర్మరుగ్మతలు తొలగిపోతాయని బలమైన విశ్వాసం.

pc:youtube

 

మహిమలు

నీటిలో కొలువైన దేవత కాబట్టి, ఆ తల్లిని జలదుర్గగా ఆరాధిస్తున్నవారూ ఉన్నారు. బల్కంపేట ఎల్లమ్మ మహిమల్ని భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటారు.

pc:youtube

 

యాదృచ్ఛికం

ఆమధ్య రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముకేష్‌ అంబానీ అర్ధాంగి నీతా అంబానీ ఎల్లమ్మతల్లిని దర్శించుకున్నారు. ఇంటర్నెట్‌లో యాదృచ్ఛికంగా ఆలయం గురించి చదివాననీ, అప్పుడే అమ్మవారిని దర్శించుకోవాలన్న బలమైన సంకల్పం కలిగిందనీ ఆమె చెప్పారు.

ఎన్టీఆర్ గార్డెన్స్, హైదరాబాద్ !

pc:youtube

 

భక్తులు

ఎక్కడెక్కడి ప్రజలకో స్వప్న సాక్షాత్కారాలిచ్చి తన దగ్గరికి పిలిపించుకుని... కష్టాలు తీర్చి, వరాలవర్షం కురిపిస్తుందా తల్లి - అంటూ తన్మయంగా చెబుతారు భక్తులు.

pc:youtube

 

ఎలా వెళ్ళాలి

అమీర్‌పేట నుంచి ఆలయం మీదుగా ఆటోలు వెళ్తుంటాయి. నేచర్‌క్యూర్‌ ఆసుపత్రి ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్‌లో దిగైనా వెళ్లొచ్చు.

24 గంటల్లో శ్రీశైలం - తిరుపతి దర్శనం ఎలా ?

pc:youtube

 

English summary

Did You Know About 700 Years Old Balkampet Yellamma Temple !

One of the old and among the most revered temples of Hyderabad is the Yellamma Temple located at Balkampet, popularly called the Balkampet Yellamma temple. The temple is thronged by heavy crowd on Sundays and Tuesdays and is quite famous for the annual Bonalu Jathara festivity that takes place in Hyderabad.
Please Wait while comments are loading...