అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

బ్రహ్మాండాన్నే ఆశ్చర్యానికి గురిచేసిన విశ్వంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ వుందో తెలుసా ?

Updated: Tuesday, June 20, 2017, 17:27 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: ధైర్యం వుంటే ఈ దేవాలయానికి వెళ్ళండి

దేవాలయాల్లో అత్యంత ఆకర్షణీయమైన దేవాలయం ఏదంటే ఢిల్లీలో వున్న స్వామి నారాయణ దేవాలయం. ఈ దేవాలయం చాలా అందంగా వుంటుంది. కేవలం దీని గురించి వింటేనే కాదు. అక్కడ వున్న వైభవాన్ని కళ్ళతో చూసి ఆనందించాలి. దశావతారి నారాయణుడు రాజసింహాసనం మీద కూర్చొని ఈ సర్వ ప్రపంచాన్ని పరిపాలించినట్లుగా అనిపిస్తుంది.

ఇంతటి సుందరమూర్తి న్యూ ఢిల్లీలోని అక్షరధామంలో వుంది. ఈ దేవాలయాన్ని వర్ణించటానికి అసాధ్యమన్నంతగా సుందరమైన ఆకర్షణ కట్టడాలు వున్నాయి. ఈ ప్రదేశానికి ఒక్కసారి వెళ్లి చూస్తే జీవితంలో ఎప్పుడూ మరిచిపోనంత అసాధ్యమైన సుందరమైన అనుభవాలు మీ సొంతం అవుతాయి. ఒక్కసారి వెళ్లి రండి.

ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచే అతిపెద్ద హిందూ దేవాలయం !

1. దేవాలయం ఎక్కడ వుంది?

ఏ పవిత్ర దేవాలయం భారత రాష్ట్ర రాజధాని న్యూ ఢిల్లీలో వుంది. ఈ సుందరమైన మరియు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నారాయణుని దేవాలయం యమునా నదీ తీరంలో నిర్మించబడి వుంది.
న్యూ ఢిల్లీలోని అక్షరధామం లో వుంది.

PC:vaibhav shukla

 

2. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం

ఈ దేవాలయం వాస్తు శిల్పకళలలో, విస్తీర్ణంలో ప్రపంచప్రఖ్యాతి చెందినది. ఈ అతి పెద్ద హిందూ దేవాలయం గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించింది.

PC:Vinayaraj

 

3. నిర్మాణం

న్యూ ఢిల్లీలో సుమారు 1000 ఎకరాల అద్వితీయమైన పరిసరాలు కలిగిన స్థలంలో నిర్మించబడింది. ఇది భారతదేశంలో ఏకైక అతిపెద్ద స్వామీ నారాయణ దేవాలయం. నారాయణ దేవాలయాన్ని భగవాన్ స్వామి జ్ఞాపకార్ధం స్థాపించబడింది.

PC:Vinayaraj

 

4. భగవాన్ స్వామి

భవనం గర్భభాగంలో 11 అడుగుల ఎత్తుతో బంగారం తాపడం చేసిన స్వామి నారాయణ్ పంచలోహ విగ్రహం దర్శనమిస్తుంది.

PC:Vinayaraj

 

5. నారాయణుని మూర్తి

ఆలయం గర్భగుడిలో 11 అడుగుల స్వామి నారాయణ్ మూర్తి పంచ లోహ విగ్రహమున్నది. ఈ స్వామి సింహాసనం మీద విరాజమానంగా దర్శనమిస్తారు.

PC:Swaminarayan Sanstha

 

6. వాస్తు శిల్పాలు

ఈ దేవాలయంలోని వాస్తు శిల్పాలు అత్యంత మనోహరంగా వుంటుంది. 2005లో స్థాపించబడిన ఈ దేవాలయం వాస్తు శిల్పాలు గులాబీ రంగులో మారులుగోలుపుతూ తెల్ల అమృతాన్ని పోలిన శిలలతో నిర్మించబడినది. రాత్రి వేళ స్వర్గంలాగా కనిపిస్తుంది.

PC::Alivewilson

 

7. శిల్పాలు

ఈ దేవాలయంలో సుమారు 234 స్థంభాలు మరియు అందమైన 9 మంటపాలు వున్నాయి. 90 రమణీయమైన శిఖరాలు మరియు 20,000లకు పైన శిల్పశిలాకృతులు వున్నాయి. ఈ శిల్పాలు లోహాలతో తయారుచేసి నిర్మించబడినది.

PC:ArishG

 

8. పుష్కరిణి

ఈ దేవాలయంలో ఉన్నటువంటి పుష్కరిణి దేశంలోనే పెద్దదై వున్నది. సుమారు 2670 మెట్లు కలిగి వున్నది.

PC::Balurbala

 

9. ఇంకా ఏమేముంది ?

ఇంకా ఈ దేవాలయంలో తామర పువ్వు ఆకారంలో వున్న యజ్ఞకుండ్ అనే జలాశయం వున్నది. దాని నడుమ రంగు రంగులుగా వుండి సంగీత స్వరాలు ప్రతిధ్వనించే నీటి ఊట ఆనందకారం. సంగీత స్వరాలు ప్రతిధ్వనించే జలాశయం చూడటం ఒక అపూర్వమైన సొగసు.

PC:Balurbala

 

10. అందమైన చెక్కడాలు

ఈ పవిత్రక్షేత్రంలో అందమైన మంటపాలు వున్నాయి. స్థంభాల పైన పెద్దపెద్ద ఏనుగులు, పక్షులు మరియు కొన్ని ప్రాణులు వివిధ భంగిమలలో వున్న చెక్కడాలు అత్యంత మనోల్లాసంగా వుంటుంది.

PC:Sujit kumar

 

11. అక్షరధామం స్మారకం

ఇక్కడ సుమారు 500 మంది పరమహంసుల యొక్క విగ్రహాలు వున్నాయి. అమృత శిలయైన 65 అడుగుల ఎత్తులో వున్న లీలా మండపం, భక్త మంటపాలు వున్నాయి.

PC::Rao'djunior

 

12. ఇవతలివైపు

అక్షరధామం ఇవతలివైపు అనేక హిందూ దేవతలైన సరస్వతీ, లక్ష్మీ, పార్వతి మొదలైన దేవతలు మరియు గోపీ కృష్ణుని రాసలీలల యొక్క శిల్పాలు సుమారు 180 అడుగులు ఎత్తులో వున్నాయి.

PC:Smn25hzb

 

13. నౌక విహారాలు

అక్షరధామంలో నౌక విహారం కూడా చేయవచ్చును. ఇక్కడ వస్తుప్రదర్శనలు కూడా వున్నాయి.

PC:Daniel Echeverri

 

14. ద్వారాలు

ఈ మహోన్నత దేవాలయంలో 3 విశిష్టమైన ద్వారాలు వున్నాయి. అవి భక్తి ద్వారం, మయూర ద్వారం, దశ ద్వారం కూడా వుంది.

PC:Juthani1

 

15. నారాయణ సరోవరం

ఈ అక్షరధామంలో 3 దిక్కులలో నారాయణ సరోవరం నిర్మించబడి వుంది. అత్యంత పవిత్రమైన జలం ఇక్కడ ప్రవహిస్తూ వుంది.

PC:Juthani1

 

16. భోజన శాల

ఇక్కడ భోజన శాల చాలా శుభ్రమైన మరియు స్వాదిష్టమైన ఆహారాన్ని భక్తులకు సమకూరుస్తుంది. ఈ భోజన శాలను ప్రేమవతి భోజన శాల అని పిలుస్తారు.

PC:World

 

17. బోచసన్వాసి శ్రీ అక్షరపురుషోత్తమ స్వామి సంస్థానం

అక్షరధామ దేవాలయంలో మహారాజ స్వామి బోచసన్వాసి శ్రీ అక్షరపురుషోత్తమ స్వామి సంస్థానం నేతృత్వంలో ఈ ప్రపంచంలో పలు ప్రదేశాలలో స్థాపించబడింది.

PC:Kapil.xerox

 

18. ఈ దేవాలయం దర్శించుటకు ఉత్తమ సమయం

ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఉత్తమ సమయం.

PC:vaibhav shukla

 

English summary

Did You Know About Heart Of The Swaminarayan Akshardham !

Akshardham or Swaminarayan Akshardham complex is a Hindu mandir, and a spiritual-cultural campus in New Delhi, India Also referred to as Akshardham Temple or Swaminarayan Akshardham, the complex displays millennia of traditional Hindu and Indian culture, spirituality, and architecture.
Please Wait while comments are loading...