అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

కలియుగాంతం రంకె వేసే నంది యాగంటి రహస్యం !

Written by: Venkatakarunasri
Updated: Tuesday, May 9, 2017, 17:10 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. నల్లమల, ఎర్రమల అడవుల మధ్య వెలసిన ఈ పుణ్యక్షేత్రాల్లో ఒక్కో క్షేత్రానికి ఎంతో విశిష్టతలు వున్నాయి. ఈ మూడు శైవ క్షేత్రాలు ఇక్కడ కొండల నుండి నిరంతర జలధారలుప్రవహించటం చాలా ప్రత్యేకం. బనగానపల్లి మండలానికి దగ్గరలో యాగంటి అనే దివ్యక్షేత్రం వుంది. అద్భుతమైన శైవ క్షేత్రం. ఇక్కడ స్వామి వారు పరమశివుడు విగ్రహరూపంలో దర్శనమిస్తారు.బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కలియుగాంతంలో ఆలయం ముందున్న నందీశ్వరుడు కాలు దువ్వి రంకె వేస్తాడని అది భూమండలం దద్దరిల్లేలా ఆ రంకె వుంటుందని పేర్కొనటం జరిగింది.

అంతేకాకుండా ఆ నందీశ్వరుని విగ్రహం సైజు అనేది పెరుగుతూవుండటం ఇక్కడ మరో విశేషం. దీనిని అర్కియాలజీవారు కూడా అంగీకరించటం జరిగింది. ఈ ఆలయం యొక్క పరిసరప్రాంతాలలో ఒక్క కాకి కూడా కనిపించదు. దీనికి సంబంధించి ఒక చారిత్రాత్మక కథనం వుంది.

Latest: భారతదేశంలో 10 ట్విన్ టౌన్స్ మరియు సిస్టర్ సిటీస్ గురించి మీకు తెలుసా?

యాగంటి దేవాలయము కర్నూలు జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము. ఇక్కడ వున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారని కాని తయారయిన విగ్రహంలో చిన్న లోపం వున్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని, స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. లోప భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్దంగా వున్న గుహలో ఇప్పటికి దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది.

యాగంటి నంది విగ్రహం

టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

అగస్త్య పుష్కరిణి

పూర్వం అగస్త్యమహర్షి పర్యటిస్తూ ఎర్రమల అడవుల ప్రకృతికి నిరంతర జలధారలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ఆ ప్రాంతంలో కలియుగదైవమైన వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాలని తలచాడట. మరి స్వామివారి విగ్రహ ప్రతిష్ట సమయంలో స్వామివారి యొక్క బొటనవేలు కొద్దిగా విరిగిపోవటంతో ఎంతో చింతించిన అగస్త్యమహర్షి ఆ పరమశివుడి కోసం ఘోరతపస్సు తేస్తాడట.

PC:youtube

శనిగ్రహ బాధలు

అప్పుడు అక్కడ కాకులు ఋషి యొక్క తపస్సుకి భంగం కల్గించటంతో కోపోద్రిక్తుడైన అగస్త్యమహర్షి ఆ ప్రాంతంలో ఇకపై కాకులు ఉండరాదని శపించాడట. అందుకే ఇక్కడ కాకులు అనేవి కనిపించవు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శనిగ్రహ బాధలతో బాధపడే వారు ఈ ఆలయంలో దీపం వెలిగిస్తే శనిగ్రహ బాధలు తొలిగిపోతాయని గట్టి నమ్మకం.

PC:youtube

ఘోరతపస్సు

అగస్త్యుడి ఘోరతపస్సుకి మెచ్చిన పరమశివుడు పార్వతీదేవి సమేతంగా విగ్రహరూపంలో వెలుస్తానని చెప్పటంతో అక్కడ ఇది శైవక్షేత్రంగా వెలసింది. ఈ క్షేత్రాన్ని శివరాత్రిరోజు కార్తీక మరియు శ్రావణమాసాలలో లక్షలకొద్దీ భక్తులు స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది.

ఇది కూడా చదవండి: బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాసిన రవ్వలకొండ ప్రదేశం !

PC:youtube

 

ఆహ్లాదకరమైన భావన

అయితే అడవి మధ్యలో ప్రకృతిఒడిలో మనస్సుకు ఎంతో సంతోషాన్ని ఆహ్లాదకరమైన భావనను కల్గిస్తుంది. ఇక్కడ వున్న కోనేరులోని నీరు అనేది నిరంతరం వస్తూనే వుంటుంది. అగస్త్యమహర్షి స్నానమాచరించటంతో దీనిని అగస్త్య పుష్కరిణి అంటారు.

PC:youtube

కోనేరు

ఇక్కడ నుండి నీరు అనేది ఆలయం ముందు ప్రాంగణలో కోనేరులోకి నంది యొక్క నోటిలో నుండి నీరు అనేది నిరంతరం వస్తూనే వుంటుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో అద్భుతం సహజసిద్ధంగా ఏర్పడ్డ గుహలు. ఇక్కడ మూడు గుహలు వున్నాయి.

ఇది కూడా చదవండి: యాగంటి : యుగాంతంతో ముడిపడి ఉన్న క్షేత్రం !

PC:youtube

 

శ్రీ వెంకటేశ్వరస్వామి

ఒక గుహలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారి యొక్క విగ్రహం వుంటుంది. రెండవ గుహలో శివలింగాన్ని ప్రతిష్టించి అగస్త్యమహర్షి తపస్సు చేసాడంట. మరి మూడవగుహను శంకరగుహ అంటారు దీన్ని. శ్రీ పోతులూరివీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాశాడని తన శిష్యులకు కాలజ్ఞానం భోదించటం జరిగిందనిచెప్పుకుంటారు.

PC:youtube

పుష్కరిణి

ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలో నైనా పుష్కరణి లోని నీరు ఒకె మట్టంలో వుండడం విశేషం.

PC:youtube

ఔషధ గుణాలు

ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది. ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానె రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, ఉన్నాయి.

PC:youtube

లింగ రూపం

గర్బాలయంలో లింగ రూపం పై ఉమా మహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి. శ్రీ పోతులూరి వీర బ్రంహం గారు రచించిన కాలగ్నానంలో యాగంటి బసవన్న రోజు రోజుకి పెరుగు తున్నాడని అన్నాడు.

PC:youtube

సహజసిద్ధమైన గుహలు

యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. వెంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడు. ఇక్కడున్న వేంకటేశ్వరుడు భక్తుల పూజలనందుకొంటున్నాడు. ఆ ప్రక్కనె ఇంకో గుహలో బ్రంహం గారు కొంత కాలం నివసించారని, శిష్యులకు ఙానోపదేశం చేసాడని భక్తులు నమ్ముతారు.

ఇది కూడా చదవండి: కర్నూలు లో ఒక్కరోజు బైక్ యాత్ర !!

PC:youtube

వసతి సౌకర్యాలు

దీనిని శంకరగుహ, రోకళ్ళగుహ అనికూడా అంటారు. యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర వున్న బనగాన పల్లిలో వసతులున్నాయి. ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగాన పల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.

PC:youtube

యాగంటి బసవన్న

ఇక ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ వుండటం . పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది.

PC:youtube

రంకె

కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడిఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది.

PC:youtube

నంద్యాల మహానంది ఆలయం

నంద్యాలకు సమీపంలో వుంటుంది. ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు కట్టించారని ఆధారాలు లేవు. ఈ ఆలయ దర్శనం సకలపాపాలకు పరిహారం. ఇక్కడ పుట్టలో వెలసిన శివలింగం, గోమాత స్వామివారిని పాలతో అభిషేకించేదట.

PC:youtube

ఆయుష్ వృద్ధి

అందుకే ఇక్కడ స్వామివారికి పాలాభిషేకం చేయిస్తే ఆయుష్ వృద్ధి కలుగుతుందని నమ్ముతారు. ఎవరికైతే జాతకంలో మృత్యుగండాలు వుంటాయోవారు స్వామికి పాలాభిషేకం చేయిస్తే వారి మృత్యుదోషాలన్నీ తొలగిపోతాయంట.

PC:youtube

కాకులకు శాపం

ఇక యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో వుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు.

PC:youtube

వెంకటేశ్వరస్వామి

ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పములో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు.

PC:youtube

ఎలా వెళ్ళాలి

ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగాన పల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.

English summary

Did You Know About Mystery Of Yaganti Temple!

Yaganti is a temple of Lord Shiva in Kurnool District of Andhra Pradesh. This temple was constructed by King Harihara Bukka Raya of the Sangama Dynasty of the Vijayanagara Empire in the 15th century.
Please Wait while comments are loading...