Search
  • Follow NativePlanet
Share
» »డా. దాసరి నారాయణరావుగారు పుట్టిన ఊరు విశేషాలు మనం తెలుసుకుందామా !

డా. దాసరి నారాయణరావుగారు పుట్టిన ఊరు విశేషాలు మనం తెలుసుకుందామా !

పాలకొల్లు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. ఊరిచుట్టూ పచ్చని వరిచేలు, కొబ్బరితోటలు, చేపల చెరువులు కనిపిస్తాయి. పాలకొల్లు చుట్టుప్రక్కల భూములు సారవంతమైనవి.

By Venkatakarunasri

ఈ గ్రామంలో 75 ఇళ్లుంటే 45 మంది IAS !ఈ గ్రామంలో 75 ఇళ్లుంటే 45 మంది IAS !

గుడి మధ్యలో స్తంభం దానంతట అదే తిరిగే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?గుడి మధ్యలో స్తంభం దానంతట అదే తిరిగే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?

పాలకొల్లు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. ఊరిచుట్టూ పచ్చని వరిచేలు, కొబ్బరితోటలు, చేపల చెరువులు కనిపిస్తాయి. పాలకొల్లు చుట్టుప్రక్కల భూములు సారవంతమైనవి. డా. దాసరి నారాయణరావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత మరియు రాజకీయ నాయకుడు పుట్టింది ఈ పాలకొల్లులోనే. డా. దాసరి నారాయణరావు అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నీస్ పుటలకెక్కాడు.

1947, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించాడు. దాసరిది పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబం. ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి. దాసరి నాన్నా పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్‌ తగలబడిపోయింది. అప్పట్లో ఇన్సూరెన్సులు ఉండేవి కాదు. దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సివచ్చింది. వారు మొత్తం ఆరుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ఆడపిల్లలు. దాసరి మూడో వాడు.

అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమాన సంఘాలు ఉండేవి. పాలకొల్లుకు దుగ్ధోపవనపురం, ఉపమన్యుపురం అనేవి నామాంతరాలు.

మహాభక్తుడైన ఉపమన్యుడు ఈ ప్రదేశంలో క్షీరాన్ని పొందడంతో ఉపమన్యుపురమనీ, పాలకొలను అనీ పేర్లు వచ్చాయంటారు. పాలకొలను అనే పేరు జనవ్యవహారంలో పాలకొల్లు అయింది. పాలకొల్లు అన్న పేరుకు సంస్కృతీకరణగా క్షీరారామం అన్న వ్యవహారం కూడా వుంది.

ఇంతటి ఘన చరిత్ర కలిగిన పాలకొల్లు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామా !

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం

1. ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం

ఆంధ్ర ప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు ఒకటి. శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో ప్రతిష్ఠితమైన ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది. ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో, 10 - 11 శతాబ్దులలో, నిర్మించారు.

Gopal vemu

2. రామగుండం

2. రామగుండం

ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉన్నది గోపుర నిర్మాణసమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టినిపోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట ఆవిధంగా మట్టి తీయగా ఏర్పడినదే ఈ చెరువు. ప్రస్తుతం దీనిని రామగుండం అని పిలుస్తున్నారు.

Varmapak

3. శిల్పకళా రీతులు

3. శిల్పకళా రీతులు

ఆంధ్ర ప్రదేశ్‌లో ఎత్తయిన,మరియు చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు ఒకటి. శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో ప్రతిష్టితమైన ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది.

PV Bhaskar

4. పావనమైన పుణ్య క్షేత్రం

4. పావనమైన పుణ్య క్షేత్రం

ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో క్రీ.శ. 10 -11 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పార్వతీ సమేతుడై 'శ్రీ రామలింగేశ్వరుడు' వెలసిన పరమ పావనమైన పుణ్య క్షేత్రం.

Gopal vemu

5. ఆదిశంకరాచార్యులవారు

5. ఆదిశంకరాచార్యులవారు

ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్టించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యులవారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్ఠించారు.

V Bhaskar

6. గోపురం

6. గోపురం

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ క్షేత్రాన్ని క్షీరపురి పాలకొలను, ఉపమన్యుపురం, అనే పేర్లతో కూడా పిలుస్తూ వుంటారు. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని విశ్వసిస్తున్నారు.

PV Bhaskar

7. రుణహర గణపతి

7. రుణహర గణపతి

స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీ దేవి కొలువై వుంటుంది. ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ... రుణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ రుణహర గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు.

PV Bhaskar

 8. విశేషమైన పూజలు, ఉత్సవాలు

8. విశేషమైన పూజలు, ఉత్సవాలు

ఇక్కడి రాజగోపురం 9 అంతస్తులను కలిగి 120 అడుగుల ఎత్తులో అద్భుతమైన శిల్ప కళతో అలరారుతూ వుంటుంది. ఇక ఇక్కడ పర్వ దినాల సమయంలో విశేషమైన పూజలు, ఉత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి. వీటిని తిలకించడానికి భక్తులు విశేషమైన సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి స్వామివారినీ, అమ్మవారిని దర్శించుకుంటారు.

రహ్మానుద్దీన్

9. స్థలపురాణం

9. స్థలపురాణం

పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను ఉపమన్యుపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థలపురాణం చెబుతోంది.

Ramireddy.y

10. స్థలపురాణం

10. స్థలపురాణం

క్షీరం అంటే పాలు. ఆ పేరుమీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడ బాణం వేస్తే భూమి లోనుంచి పాలు ఉబికివచ్చాయి.

Ramireddy.y

 11. స్థలపురాణం

11. స్థలపురాణం

పాలకొల్లును పూర్వము క్షీరపురి, ఉపమన్యుపురం, పాలకొలను అని పిలిచేవారు. ప్రతిరోజూ చేయబడే అభిషేక క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అను పేరున పిలువబడుతూ ఆప్రాంతమునకు కూడా వర్తించి ఉండ వచ్చని ఒక కథనం. ​

PV Bhaskar

12. అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి మందిరం

12. అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి మందిరం

పాలకొల్లులో చిన్న గోపురం అని పిలువబడే మరొక ఆలయము ఉంది.ఇక్కడి మూలవిరాట్ కేశవస్వామివారు అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి మందిరం ఉంది. ఇక్కడి బ్రహ్మోత్సవం ఊళ్ళో ఒక పెద్ద పండుగ. ఈ మందిరంలో ధనుర్మాసంలో జరిపే ప్రత్యేక పూజలు కూడా ప్రసిద్ధం.

Hegde Naveen

 13. దసరా ఉత్సవాలు

13. దసరా ఉత్సవాలు

ఎడ్ల బజారు వద్ద గల శ్రీ కనకదుర్గమ్మవారి దేవస్థానము ఉంది. దసరా ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుపుతారు. నాటకాలు బుర్రకథలు,హరికథలు మొదలగునవి పదిరోజులు పాటు ప్రదర్శిస్తారు.
పాలకొల్లు పట్టణ దేవత శ్రీ పెద్దింట్లమ్మ వారు.

Kalyan Kumar

14. పదిరోజులు జరిగే ఉత్సవాలు

14. పదిరోజులు జరిగే ఉత్సవాలు

పాలకొల్లు వర్తకసంఘాల ఆధ్వర్యంలో పదిరోజులు జరిగే పెద్దింట్లమ్మ వారి ఉత్సవాలలో ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రఖ్యాత నాటక సమాజాల వారిచే నాటకాలు ప్రదర్శించబడును. పాలకొల్లు గ్రామ దేవత దేసాలమ్మ వారు.

Tandavakrishna tungala

 15. ఉచిత భోజన కార్యక్రము

15. ఉచిత భోజన కార్యక్రము

కాలువ మార్గములో షిర్డిసాయినాథుని మందిరము నాలుగెకరాల విస్తీర్ణములో ఉంది. ఆలయము వెనుక భోజనశాల, ధ్యాన మందిరము, ఉద్యానవనములు ఉన్నాయి. గురువారము రోజున వేలమంది స్వామిని దర్శించేందుకు తరలి వస్తుంటారు. ప్రతి రోజూ ఉచిత భోజన కార్యక్రము జరుగును.

ఇది కూడా చదవండి:గుంటుపల్లి బౌద్ధారామాలు, పశ్చిమ గోదావరి జిల్లా !!

ShirdiSaiGurusthanTrust

 16. అయ్యప్పస్వామి వారి ఆలయము

16. అయ్యప్పస్వామి వారి ఆలయము

అయ్యప్పస్వామి వారి ఆలయము. సాయినాథుని దేవాలయమునకు ఎదురుగా కాలవ ఇవతలి వైపు నర్సాపురం వెళ్ళే రోడ్డులో రెండు అంతస్తులుగా అద్భుత నిర్మాణముగా మలచారు.

ఇది కూడా చదవండి:భీమవరంలో మరియు చుట్టుప్రక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు !!

kedarnathreddy

17. లలిత కళాంజలి కళా క్షేత్రం

17. లలిత కళాంజలి కళా క్షేత్రం

విద్యుదాధారిత వినోద సాధనాలు పెరుగుతుండటంతో నాటకాలకు తరిగి పోతున్న ఆదరణ ఎరిగినదే. అటువంటి కళా సంరక్షణార్ధం ఏర్పాటైన కొద్ది సంస్థలలో లలిత కళాంజలి కళా క్షేత్రం ఒకటి. ప్రతి సంవత్సరం నాటకోత్సవాలు నిర్వహించి ఉత్తమ నాటకాలకు, ఉత్తమ నటీ నటులకు పురస్కారములతో సత్కరించటం జరుగుతున్నది.

Nartanam.lakshmi

18. ప్రసిద్దులైన ఎందరో నటీ నటులు

18. ప్రసిద్దులైన ఎందరో నటీ నటులు

ఈ సంస్థ ద్వారా ఇప్పటికే ప్రసిద్దులైన ఎందరో నటీ నటులు సినిమాలకు పరిచయమయ్యారు, అవుతున్నారు.

Varmapak

19. ప్రయాణ వసతులు

19. ప్రయాణ వసతులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. షుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు ముగుస్తుంది.

LOVEofZ

20. పాలకొల్లు ఎలా చేరుకోవాలి ?

20. పాలకొల్లు ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం

గన్నవరం ఎయిర్ పోర్ట్ - 148 కి.మీ., రాజమండ్రి ఎయిర్ పోర్ట్ - 85 కి.మీ.

SridharSaraf

21. సమీప రైల్వే స్టేషన్

21. సమీప రైల్వే స్టేషన్

పాలకొల్లు లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల నుండి రైళ్ళు నడుస్తుంటాయి.

Roberta F.

22. రోడ్డు/ బస్సు మార్గం

22. రోడ్డు/ బస్సు మార్గం

ఏలూరు, రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురం తదితర ప్రాంతాల నుంచి పాలకొల్లుకు బస్సులు కలవు.

Gnt

సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళిన గుహ రహస్యం తెలుసా ? </a><br><a href=ఇండియాలో రాబోతున్న టాప్ 6 మెగా టెంపుల్స్ ఏవేవో తెలుసా?
మీలో ఎంతమందికి హిమాలయాలలోని మిస్టరీ మనిషి గురించి తెలుసు ?" title="సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళిన గుహ రహస్యం తెలుసా ?
ఇండియాలో రాబోతున్న టాప్ 6 మెగా టెంపుల్స్ ఏవేవో తెలుసా?
మీలో ఎంతమందికి హిమాలయాలలోని మిస్టరీ మనిషి గురించి తెలుసు ?" loading="lazy" width="100" height="56" />సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళిన గుహ రహస్యం తెలుసా ?
ఇండియాలో రాబోతున్న టాప్ 6 మెగా టెంపుల్స్ ఏవేవో తెలుసా?
మీలో ఎంతమందికి హిమాలయాలలోని మిస్టరీ మనిషి గురించి తెలుసు ?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X