అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

నిజంగానే ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా? షాకింగ్ నిజాలు !

Written by: Venkata Karunasri Nalluru
Updated: Monday, April 17, 2017, 9:22 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

మనం మన జీవితంలో తప్పకుండా సందర్శించవలసిన ప్రాంతాలు అనేకం వుంటాయి. కానీ అన్నీ మనం చూడలేం. కొన్నయితే ఖచ్చితంగా మనం వీక్షించాలి. వాటిలో ఎల్లోరా గుహలు!దాని గురించి మనం తెలుసుకుందాం.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో వున్న అజంతా, ఎల్లోరా గుహలు బౌద్దులకాలంలో ఏర్పడినట్లు తెలుస్తుంది. దాదాపు ముప్పై వరకు వున్న ఈ గుహలు రాతి కొండలను తొలచి క్రీ.పూ.480 - క్రీ.శ.650 మధ్య కాలంలో నిర్మితమైనట్లు తెలుస్తోంది.ఈ గుహలలో నిక్షిప్తమైవున్న చిత్రాలు, శిల్పాలు భారతీయ కళాసంపదకు ముఖ్యంగా చిత్రకళకు నిలువెత్తు ప్రతిరూపాలని వీటిని సంరక్షిస్తున్న భారత ప్రభుత్వ పరిశోధనాసంస్థ ప్రకటించింది. మరి ఈ గుహలను మీకు సందర్శించాలనిపిస్తుందా?లేదా? ఖచ్చితంగా అనిపిస్తుందండి. అయితే ఒక్క విషయం ఆ వివరాలు తెలుసుకుని అప్పుడు వెళ్తే ఇంకా మనం ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా.అయితే రండి ఒక్కసారి ఆ విశేషాలను మనం పరిశీలిద్దాం.

ఇది కూడా చదవండి : వరంగల్ - చరిత్ర కల భూమి !

ఎల్లోరా గుహలు

1.భూగర్భం

ఇక్కడ దాదాపు 40 అడుగుల లోతు వున్న ఒక స్వరంగం వుంది. అక్కడ ఇది కుడివైపు మలుపు తిరిగి భూగర్భంలోకి దారితీస్తుంది.

pc: Danial Chitnis

 

2. ఇరుకు మార్గం

అయితే ఈ మార్గం క్రమంగా దానికున్న వెడల్పు కుదించుకుపోతూ మనిషి కూడా పట్టనంత ఇరుకు మార్గంగా మారిపోవడంతో ఇందులో ఏముందన్న విషయం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు.

3. మానవ నిర్మితాలేనా

ఎల్లోరా గుహల్లో మరో రహస్య మార్గం కూడా వుంది. 10 అడుగుల లోతుకు వెళ్ళే సరికి అది మనిషి పట్టనంత ఇరుకుగా మారిపోయింది.ఇంతకీ ఈ రహస్యసొరంగ మార్గాలలో ఏముంది? ఈ ఇరుకు మార్గాల్ని ఎవరు ఉపయోగించుటారు.

4. జవాబు దొరకని ప్రశ్నలు

ఈ సొరంగాలను మనిషి కూడా పట్టనంత ఎవరు తొలుచుంటారు. అసలీ మార్గాలు మానవ నిర్మితాలేనా?

pc:G41rn8

 

5. ప్రశ్నలు

లేక మనుషుల కన్నా చిన్నగా వుండే మరే ఇతర జీవులైనా నిర్మించివుంటాయా? అన్న ప్రశ్నలు సందర్శకులకు ఇప్పటికీ జవాబు దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.

6. భూగర్భం

ఎల్లోరా గుహలలో భూగార్భంలోకి ప్రవేశించే మార్గం మనకు స్పష్టంగానే కనిపిస్తుంది. అయితే ఈ భూగర్భ ప్రాంతాలు సాధారణ దృష్టికి అందని రీతిలో వున్నాయి.

pc: Sanket901

 

7.సొరంగాలు

ఎల్లోరా గుహలలో భూగర్భంలో అనేక సొరంగాలు వున్నాయని అక్కడి సెక్యూరిటీ గార్డులు చెపుతూ వుంటారు. ఇవి క్రమంగా మనుషులు కూడా పట్టనంత ఇరుకుగా వుంటాయట. వీటన్నిటికీ తాళాలు వేసినట్టు గార్డులు చెపుతూ వున్నారు.

శని దోషం ఉన్నవారు తప్పకుండా దర్శించవలసిన ఆలయమేదో మీకు తెలుసా?l

pc:Pratheepps

 

8. ప్రవేశద్వారాలు

తాళాలు వేసివున్న ఈ ప్రవేశద్వారాలను గమనిస్తే గనక ఇవి మూడు నుండి నాలుగు దశాబ్దాల క్రితమే మూతపదివుంటాయన్న విషయం మనకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. ఎల్లోరా గుహల్లోనే మరో రహస్య మార్గం కూడా వుంది.

pc:Pratheepps

 

9.మూడు నుండి నాలుగు దశాబ్దాలు

ఇది కూడా ముందుకు పోయేకొద్దీ మనిషి కూడా పట్టనంత ఇరుకుగా మారిపోతుంది. అసలీ మార్గాలన్నీ ఎక్కడకు వెళుతున్నాయి?ఈ ఇరుకు మార్గాలని ఇంతకు ముందు ఎవరు ఉపయోగించి వుంటారు?ఇవన్నీ కూడా ఇప్పటికీ మిస్టరీ గానే మిగిలిపోయాయి.

pc:Amitmensa

English summary

Did You Know Mystery About Ellora Caves?

Ellora Caves Are Located In Maharashtra.Ellora Is A UNESCO World Heritage Site In Maharashtra.
Please Wait while comments are loading...