అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?

Written by: Venkata Karunasri Nalluru
Updated: Monday, April 17, 2017, 9:28 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

కాకతీయుల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది ఓరుగల్లు నగరం. ఆ తర్వాత రామప్పదేవాలయం, వేయిస్థంభాల గుడి, వరంగల్ ఖిల్లా. ఈ చారిత్రక స్థలాలు నిత్యం సందర్శకులతో కళకళలాడుతూ వుంటాయి. ఇవన్నీ ఆ నాటి పాలకుల వైభవాన్ని చాతిచెపుతున్నాయి.

కాకతీయుల చరిత్ర అంటే కేవలం గుళ్ళు గోపురాలు, అపురూపమైన శిల్ప సంపద మాత్రమే కాదు. అబ్బురపరిచే ఇంజనీరింగ్ నైపుణ్యాలు కూడా కాకతీయుల సొంతం. బాహ్యప్రపంచానికి తెలియని ఈ అంతస్థుల బావి రహస్యమేమిటో తెలుసుకుందాం.

రోగాలను నయం చేసే శివుడు ఎక్కడున్నాడో మీకు తెలుసా?

రాణిరుద్రమదేవి స్నానమాడిన శృంగార బావి రహస్యం

1. బాహ్యప్రపంచానికి తెలియని బావి

వరంగల్ జిల్లాలో వెలుగుచూడని కాకతీయుల కాలం నాటి ఎన్నో కట్టడాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఇందులో బాహ్యప్రపంచానికి తెలియని రహస్యాలు ఎన్నో దాగున్నాయి.

PC:Youtube

2. రాణిరుద్రమదేవి స్నానమాడిన బావి

నేటి తరానికి తెలియకుండా క్రమంగా కనుమరుగయిపోతున్నాయి. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవలసిన ఇంజనీరింగ్ నైపుణ్యమే శృంగార బావి.

PC:ShashiBellamkonda

3. టైం మిషన్ లో వెళుతున్న ఫీలింగ్

ఈ బావిని 3అంతస్థులుగా నిర్మించారు. శృంగార బావి లోనికి దిగి చూస్తే టైం మిషన్ లో వెళుతున్న ఫీలింగ్ కలుగుతుంది.

PC: ShashiBellamkonda

4. బావి ప్రత్యేకత

ఈ బావి ప్రత్యేకత ఏమిటి అంటారా? రాణి రుద్రమదేవితో సహా ఎందరో రాజులు, రాణులు ఇక్కడ స్నానమాచరించేవారు.

pc:youtube

5. సొరంగ మార్గం

శృంగార బావి నుండి నేరుగా వేయిస్థంభాల గుడికి సొరంగ మార్గం కూడా వుండేది. కాకతీయులు 360 బావులు నిర్మించారని ప్రతీతి. అందులో ఈ అంతస్థుల బావి ఒకటి.

రోజులో కాసేపు మాత్రమే కనిపించే దేవాలయం ! ఎక్కడుందో మీకు తెలుసా?

pc:youtube

6. బావి ప్రత్యేకత

ఈ బావి ప్రత్యేకత ఏమిటంటే ఈ బావిలో ఒక సొరంగ మార్గం వుండుట. అయితే వేయిస్థంభాల గుడిలో వున్న నీరు స్నానమాచరించుటకు నిషిద్ధం.

అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?

pc:ShashiBellamkonda

 

7. సొరంగ మార్గం

ఈ నీరు కేవలం శివునికి అభిషేకం చేయటానికి మాత్రమే వాడాలి అందువలన ఇక్కడ స్నానం చేసి సొరంగ మార్గం ద్వారా వేయిస్థంభాల గుడికి వెళ్లి అక్కడ అర్చన చేసుకుని వచ్చేవారని చెప్తారు.

రోగాలను నయం చేసే శివుడు ఎక్కడున్నాడో మీకు తెలుసా?

pc:ShashiBellamkonda

8. శృంగార బావి నిర్మాణం

శృంగార బావి నిర్మాణం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడి శిల్పకళా శైలి, నాట్యభంగిమలు అందర్నీ ఆకట్టుకుంటాయి.

pc:ShashiBellamkonda

9. శృంగార బావి ప్రత్యేకత

మూడంతస్థులుగా నిర్మించిన ఈ బావిలోకి శత్రువులు ప్రవేశిస్తే క్రింది అంతస్తులో వున్నవారు వెంటనే పసిగట్టవచ్చును. శత్రువుల జాడ వెంటనే తెలుస్తుంది.

pc:ShashiBellamkonda

10. వరంగల్ లోని రాణిరుద్రమదేవి స్నానమాడిన శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?

కాకతీయులు కేవలం స్నానమాచరించుకొనుటకు ఉపయోగించిన బావి ఇది. ఇందులో 3 అంతస్తులు వున్నాయి. మొదటి అంతస్తులో 9 పిల్లర్లు, రెండవ అంతస్తులో 4 పిల్లర్లు, మూడవ అంతస్తులో 2 పిల్లర్ల తోటి ఈ బావి నిర్మించబడినది.

భారతదేశంలో హనుమంతుని విగ్రహం లేని రామాలయం ఎక్కడుందో తెలుసా ?

pc:ShashiBellamkonda

11. బావి యొక్క ప్రత్యేకత

ఈ బావి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో రాచరికపు స్త్రీలు స్నానం చేస్తున్నప్పుడు ఎవరైనా వేరే వ్యక్తులు వచ్చినప్పుడు పైన రాగానే వాళ్ళ యొక్క నీడ క్రింద నీళ్ళల్లో వారి ప్రతిబింబం కనపడేది.
అలా వారు ఏ అంతస్తులో వున్నా కూడా వారి ప్రతిబింబం నీటిలో కనపడేది.

ఒకే కొండ మీద 1000కి పైగా దేవాలయాలు ఎక్కడ వున్నాయో మీకు తెలుసా ?

pc:ShashiBellamkonda

12. అద్భుత కట్టడం

ఈ కట్టడం భౌతికశాస్త్రానికి సంబంధించిన అద్భుత కట్టడం. ఈ బావి ఎంత ఎండాకాలమైనా కూడా ఏ రోజూ ఎండిపోలేదు.

pc:ShashiBellamkonda

13. శృంగార బావిలో నీరు

వర్షాభావ పరిస్థితులు కరువురోజుల్లో కూడా శృంగార బావిలో నీరు ఎండిపోకుండా, ఇంకిపోకుండా వుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ గల మూడు అంతస్తుల్లో 20 గదులు వుంటాయి.

pc:ShashiBellamkonda

English summary

Did You Know A Secret About The Well In Warangal?

Warangal was the ancient capital of kakatiya dynasty. Warangal is a city and the district headquarters in the Indian state of Telangana. Warangal is the second largest city in Telangana after Hyderabad.
Please Wait while comments are loading...