Search
  • Follow NativePlanet
Share
» »భారత్ లో ఉన్న లగ్జరీ పర్యాటక రైళ్ల గురించి మీకు తెలుసా?

భారత్ లో ఉన్న లగ్జరీ పర్యాటక రైళ్ల గురించి మీకు తెలుసా?

మన దేశంలో నడుస్తున్న లగ్జరీ పర్యాటక రైళ్లన్నీ భారతీయ రైల్వేల ద్వారా లేదా రైల్వేల సహకారంతో నడపబడుతున్నాయి.ప్రపంచంలోనే అత్యుత్తమ రైళ్లుగా 2010వ సంవత్సరంలో గుర్తింపుపొందిన రైళ్ళు ఐదున్నాయి.

By Venkata Karunasri Nalluru

భారత్ లో ఉన్నలగ్జరీ పర్యాటక రైళ్లు !

మన దేశంలో నడుస్తున్న లగ్జరీ పర్యాటక రైళ్లన్నీ భారతీయ రైల్వేల ద్వారా లేదా రైల్వేల సహకారంతో నడపబడుతున్నాయి.ప్రపంచంలోనే అత్యుత్తమ రైళ్లుగా 2010వ సంవత్సరంలో గుర్తింపుపొందిన రైళ్ళు ఐదున్నాయి. ఇవి ప్యాలెస్ ఆన్ వీల్స్, మహారాజా ఎక్స్ ప్రెస్,ఫైరీ క్వీన్, హెరిటేజ్ ఆన్ వీల్స్ అండ్ ఇండియన్ మహారాజా.

విరాట్ నగర్ కు జైపూర్ రైలు స్టేషన్ సమీపం. ఈ ప్రదేశానికి సాధారణ రైళ్ళు మాత్రమే కాక, ప్యాలెస్ ఆన్ వీల్స్ వంటి లగ్జరీ రైళ్ళు కూడా కలవు. ఢిల్లీనుండి ఈ రైలు పై జైపూర్, ఆల్వార్, ఉదయపూర్ పట్టణాలు చేరుకొని అక్కడినుండి విరాట్ నగర్ క్యాబ్ లలో చేరవచ్చు.

ఇది కూడా చదవండి:ఉల్లాస పరిచే ఊటీ రైలు ప్రయాణం !

ముందుగా మనం మహారాజా ఎక్స్ ప్రెస్ గురించి తెలుసుకుందాం

1. మహారాజా ఎక్స్ ప్రెస్

1. మహారాజా ఎక్స్ ప్రెస్

భారతీయ రైల్వే ఆతిధ్య పర్యాటక సంస్థ ఐ ఆర్ టి సి నిర్వహిస్తున్న ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పర్యాటక రైలు.వాయువ్య మధ్యభారతదేశంలోని పర్యాటక కేంద్రాలని కలుపుతూ ప్రయాణించేటు వంటి ఈ రైలు రాజస్థాన్ కేంద్రంగా ఈ మహారాజా ఎక్స్ ప్రెస్ ఐదు మార్గాలలో తన సేవలని అందిస్తోంది.ఆ మార్గాలేంటో చూద్దాం.

ఊరెళ్ళే రైలు కాదు ... టూరెళ్ళే రైలు !

PC:youtube

2. హెరిటేజ్ ఆఫ్ ఇండియా

2. హెరిటేజ్ ఆఫ్ ఇండియా

ఈ రైలు ముంబై, అజంతా, ఉదయ్ పూర్, జోద్పూర్, బికనీర్,జైపూర్, రణథంబోర్, ఆగ్రా, ఢిల్లీ మార్గాలలో నడుస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తుంది.

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన రైలు మ్యూజియంలు !

PC:youtube

3. ట్రెజర్స్ ఆఫ్ ఇండియా

3. ట్రెజర్స్ ఆఫ్ ఇండియా

ఈ రైలు ఢిల్లీ,ఆగ్రా,రణథంబోర్,జైపూర్,ఢిల్లీ మార్గంలో నడుస్తుంది.ఈ మార్గంలోనే జేమ్స్ ఆఫ్ ఇండియా పేరుతో అనే మరొక పర్యాటక రైలు కూడా వుంది.

మహారాష్ట్ర లో దక్కన్ ఒడిస్సీ ప్రయాణం !!

PC:youtube

4. ఇండియన్ పనోరమ

4. ఇండియన్ పనోరమ

ఈ రైలు ఢిల్లీ,జైపూర్,రణథంబోర్,ఫతేఫూర్ సిక్రీ, ఆగ్రా, గ్వాలియర్, ఓర్చా,ఖజురహో, వారణాశి, లక్నో, ఢిల్లీ మార్గంలో తిరుగుతూ వుంటుంది.

బెంగుళూరు...ఢిల్లీ ... కే. కే. ఎక్స్ ప్రెస్ ప్రయాణం!

PC:youtube

5. ఇండియన్ స్పైందూర్

5. ఇండియన్ స్పైందూర్

ఈ రైలు ఢిల్లీ,ఆగ్రా,రణథంబోర్,జైపూర్,బికనీర్,ఉదయ్ పూర్, జోద్పూర్, బాలాసినోర్, ముంబై మార్గంలో తిరుగుతూ వుంటుంది.

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన రైలు మ్యూజియంలు !

PC:youtube

6.ప్యాలెస్ ఆన్ వీల్స్

6.ప్యాలెస్ ఆన్ వీల్స్

భారతీయ రైల్వేల సహకారంతో రాజస్థాన్ పర్యాటక అభివృద్ది సంస్థ నిర్వహిస్తున్న రైలు ఇది. రాజస్థాన్ లోని అనేక పర్యాటక కేంద్రాలను చుట్టివచ్చే ఈ రైలు ప్రయాణం ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్ళు కొనసాగుతుంది. ఈ రైలు న్యూ ఢిల్లీ, జైపూర్, సవాయి మధోపూర్‌,చిత్తోర్ ఘడ్, ఉదయ్ పూర్, జైసల్మేర్,జోద్పూర్, భరగ్ పూర్, ఆగ్రా మీదుగా ప్రయాణించి తిరిగి న్యూ ఢిల్లీ చేరుకుంటుంది.

PC:youtube

7. గోల్డెన్ చారియేట్

7. గోల్డెన్ చారియేట్

తెలుగులో మనం స్వర్ణరథం అనవచ్చును.ఈ రైలును భారతీయ రైల్వేల సహకారంతో కర్ణాటక రాష్ట్ర పర్యాటక సంస్థ నిర్వహిస్తోంది. దక్షిణ భారతదేశంలోని పురాతన ప్రదేశాలతో పాటు కర్ణాటక, గోవా, తమిళనాడు, పుదుచ్చేరిలలోని అన్ని పర్యాటక కేంద్రాలను ఇది చుట్టివస్తుంది. ప్రైడ్ అఫ్ సౌత్ పేరుతో వున్న ఈ మార్గంలో బెంగుళూర్, మైసూర్, నాగర్ హోల్, నేషనల్ పార్క్, హాసన్, బేలూర్, హళేబేడు,హోస్పేట, హంపి, పట్టడికల్, బాదామి, గోవా వంటి పర్యాటక ప్రదేశాలను చుట్టి ఈ రైలు తిరిగి బెంగుళూరు చేరుకుంటుంది.

బెంగళూరు టు మంగళూరు ట్రైన్ జర్నీ !

PC:youtube

8. డెక్కన్ ఒడిస్సి

8. డెక్కన్ ఒడిస్సి

కొంకన్, దక్కన్ పీఠభూమి, పశ్చిమకనుమలలో ప్రయాణించే ఈ లగ్జరీ పర్యాటక రైలు పర్యాటకులకు అద్వితీయమైన అనుభవాలను అందిస్తుంది.దక్షిణ భారతదేశంలో పర్యాటకరంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ డెక్కన్ ఒడిస్సి రైళ్ళను మహారాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఈ రైలు మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ లలోని ఆరు ప్రముఖ మార్గాలలో ప్రయాణిస్తూ పర్యాటకులకి జీవితాంతం మర్చిపోలేని పర్యాటక అనుభూతినందిస్తుంది. మహారాష్ట్ర స్పెండూరు: ముంబై నుంచి గోవా వరకు సాగే ఈ మార్గంలో అజంతా ఎల్లోరా గుహలు, కొల్హాపూర్, సింధుదుర్గ్ ప్రాంతాలను సందర్శించవచ్చును.

ఇండియన్ ఒడిస్సీ: న్యూ ఢిల్లీ నుంచి ముంబై వరకు కొనసాగే ఈ మార్గంలో సవాయి మద్వాపూర్,ఆగ్రా, జైపూర్, ఉదయ్ పూర్, బరోడా, ఎల్లోరా గుహలను సందర్శించవచ్చును.

ఇండియన్ సో జర్న్:ముంబై నుంచి న్యూ ఢిల్లీ వరకు కొనసాగే ఈ మార్గంలో వివిధ పర్యాటక కేంద్రాలను సందర్శించవచ్చును.

జ్యూయల్స్ ఆఫ్ ది దక్కన్: ముంబై నుంచి బీజాపూర్ వరకు కొనసాగే ఈ మార్గంలో ఐహోల్ పట్టాడకల్,హంపి, హైదరాబాద్,అజంతా, ఎల్లోరా గుహలు సందర్శించవచ్చును.

హిడెన్ ట్రెజర్స్ ఆఫ్ గుజరాత్ :ఈ మార్గంలో ముంబై,బరోడా, పాలిటానా, గిర్,కచ్,నాసిక్ వంటి ప్రాంతాలను ఈ రైలు మనకు చూపిస్తుంది.

మాన్సూన్ లో ప్రయాణించదగిన ఉత్తమ 5 రైలు ప్రయాణాలు !

PC:youtube

9. రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్

9. రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్

ఈ లగ్జరీ రైలును పూర్తిగా భారతీయ రైల్వేలే నిర్వహిస్తున్నాయి.ప్యాలెస్ ఆన్ వీల్స్ తరహాలోని తాజ్ మహల్, ఘనా నేషనల్ పార్క్,ఆగ్రా ఫోర్ట్, ఖజురహో వంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలతో పాటు రాజస్థాన్ అన్ని పర్యాటక కేంద్రాలను కూడా ఈ రైలు చుట్తోస్తుంది. ఈ రైలులో ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్ళ పాటు సాగే ప్రయాణం రాజస్థాన్ లోని ప్రముఖ వన్యప్రాణి కేంద్రాలు, వారసత్వ సంపద కేంద్రాలను మనకు చూపుతుందన్నమాట.ఈ రైలు న్యూ ఢిల్లీలో బయలుదేరి జోద్పూరు, ఉదయ్ పూరు, చిత్తోర్ ఘడ్,రణథంబోర్ నేషనల్ పార్క్,జైపూర్, ఖజురహో, వారణాశి,సారనాథ్, ఆగ్రా మీదుగా తిరిగి ఢిల్లీ చేరుకుంటుంది.

PC:youtube

10.ఫెయిరీ క్వీన్

10.ఫెయిరీ క్వీన్

తొలినాళ్ళలో నాటి ఆవిరింజన్ తో నడిచే ఈ లగ్జరీ రైలు న్యూ ఢిల్లీ,ఆళ్వార్ మధ్య ప్రయాణిస్తుంది.గంటకు 40కి.మీ ల వేగంతో ప్రయాణిస్తుంది.మొత్తం 143కి.మీ ల దూరంతో ప్రయాణించే ఈ రైల్లో 60 మంది ప్రయాణీకులకు మాత్రమే అవకాశం వుంటుంది.ఢిల్లీ నుంచి బయలుదేరే ఈ రైలు సిరస్కా టైగర్ రిజర్వ్ మీదుగా ఆళ్వార్ చేరుకుంటుంది.

ఉల్లాస పరిచే ఊటీ రైలు ప్రయాణం !

PC:youtube

11. రాయల్ ఓరియంట్

11. రాయల్ ఓరియంట్

దీనిని మనం హెరిటేజ్ ఆన్ వీల్స్అనవచ్చును.గుజరాత్,రాజస్థాన్ ల మధ్య నడిచే ఈ రాల్ ఓరియంట్ లగ్జరీ పర్యాటక రైలు రాచఠీవీని, రాచరిక విలాసాలను రుచి చూపుతుంది.ఈ రెండు రాష్ట్రాలలో ప్రాధాన పర్యాటక కేంద్రాల గుండా ఈ రైలు ప్రయాణిస్తుందన్నమాట.
ముఖ్యంగా పర్యాటక కేంద్రాలను కలుపుతూ నడిచే ముఖ్యమైన రాళ్లగురించి మనం తెలుసుకున్నాం కదా! మరి మీకవకాశం వుంటే, వీలుంటే ఒక్కసారి చుట్టేసి రండి మరి. ఆ అనుభూతులను మీ సొంతం చేసుకోండి.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X