అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

ఇక్కడ వివాహమైన మరుసటి రోజే వేలకొలది మహిళలు విధవలౌతారు మీకు తెలుసా?

Written by: Venkatakarunasri
Updated: Thursday, July 13, 2017, 12:05 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

వివాహం అంటే రెండు మనసులను కలిపే సంబంధం. ఈ సంబంధం కలకాలం సంతోషంగా వుండాలని అనేకమంది భార్యలు దేవునికి ప్రార్ధిస్తారు. వివాహమైన ఒక్క రోజులోనే భర్త చనిపోతే ఆ దుఃఖం ఆకాశాన్ని తాకుతుంది. ఎందరో మహిళలు సుమంగళిగా మరణించాలని పూజలను చేస్తారు.

అయితే ఇక్కడ ఒక విచిత్రమున్నది.అదేమిటంటే ఇక్కడ పెళ్లైన మరుదినమే విధవలౌతారు. ఆ విధవలయ్యేవారు ఎవరు తెలుసా? నపుంసకులు. ఆశ్చర్యపడకండి ఇది నిజం. ఈ ఆశ్చర్యకరమైన ఘటన జరిగేది తమిళనాడు రాష్ట్రంలో. ఇక్కడ ఒక చిన్న గ్రామంలో జరిగే కూతాండవర్ దేవాలయం ఉత్సవంలో నపుంసకులు విధవలౌతారు.

ఇలాంటి వివాహమైన మరు దినం విధవలై ఏడ్చేదెందుకు? అనే అనేక ప్రశ్నలకు ఈ వ్యాసం ద్వారా జవాబు తెలుసుకోండి.

ఇక్కడ వివాహమైన మరుసటి రోజే వేలకొలది మహిళలు విధవలౌతారు మీకు తెలుసా?

1. ఎక్కడుంది?

ఈ ఆశ్చర్యకరమైన దేవాలయముండేది తమిళనాడు రాష్ట్రంలోని విళుపురం జిల్లాలోని ఉళుందూర్ పేట తాలూకాలోని ఒక చిన్న గ్రామంలో.

2. నపుంసకుల దేవాలయం

ఈ విశేషమైన నపుంసకుల దేవాలయం పేరు కూతాండవర్ దేవాలయం.

3. దేవాలయం యొక్క విశేషం

ఈ దేవాలయం ఎక్కువగా నపుంసకుల దేవాలయంగా ప్రఖ్యాతి గాంచిన దేవాలయంగా ఉంది. కేవలం నపుంసకులే గాకుండా ఇంకా ఇతర జనాలు కూడా ఈ దేవాలయానికి వస్తారు.

4. ఉత్సవం

ఇక్కడ 18 రోజులు వైభవోపేతంగా ఉత్సవాలు ఆచరిస్తారు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క విధమైన కార్యక్రమాలు జరుగుతాయి.

5. భక్తులు

ఈ విశేషమైన దేవాలయానికి దేశ,విదేశాల నుంచి భారీసంఖ్యలో జనాలు వచ్చి చేరుతారు. వేలకొలది నపుంసకులు ఈ దేవాలయం యొక్క ఉత్సవంలో పాల్గొంటారు.

6. భర్త

నపుంసకుల భర్త ఎవరు తెలుసా?

కూతాండవర్ దేవాలయంలోని దేవతామూర్తి కూతాండవర్.

 

7. మొదటి రోజు

ఇక్కడ అనేక విధాలైన కార్యక్రమాలు జరుగుతాయి. అవి బ్యూటీ కాంటెస్ట్ మరియు ప్రతిభా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో అందమైన వధువులాగా సింగారించుకుని క్యాట్ వాక్ చేస్తారు నపుంసకులు.

8. కూతాండవర్ ఉత్సవం

కూతాండవర్ దేవాలయంలో 17 రోజులు వైభవంగా ఉత్సవాలు ఆచరిస్తారు. అక్కడ వేలకొలది భక్తులు చేరుతారు. ఈ పండుగ చూసేదే ఒక అద్భుతంగా వుంటుంది.

9. వధువు

నపుంసకులు ఈ అన్ని కార్యక్రమాల అనంతరం 17 వ రోజున అందమైన వధువులాగా అలంకారం చేసుకుంటారు.

10. వివాహం

కూతాండవర్ దేవాలయానికి వస్తారు. సామాన్యంగా నపుంసకుల భర్త లేకపోవటం వల్ల కూతాండవర్ దైవమే వారి భర్త అని భావించుకుని అక్కడ ఉన్న పూజారుల చేత తాళి కట్టించుకుని పెళ్లి చేసుకుంటారు.

11. చివరి రోజు

చివరి రోజు ఇక్కడ కార్ పండుగ అని ఆచరిస్తారు. ఆ పండుగలో తమ భర్త అని భావించిన కూతాండవర్ మరణించాడని ఏడుస్తారు.

12. విధవ

నపుంసకులు విధవుల వేషంలో అంటే తెల్ల చీరలు ధరించి దేవాలయ ప్రాంగణంలో వచ్చి చేరుతారు.

13. శాస్త్రాలు

విధవలకు శాస్త్రాలు చేస్తారు. అంటే గాజులు పగుల కొట్టి, పూలను తీసివేసి, పసుపు కుంకుమలు తుడిచేసి ఏడుస్తూ అన్ని శాస్త్రాలు నెరవేర్చుకుంటారు.

14. కూతాండవర్ పండుగ

ఈ కూతాండవర్ దేవాలయం యొక్క 18 రోజుల ఉత్సవం సంవత్సరానికి ఒక సారి జరుగుతుంది. ఆ సమయంలో అనేకమంది నపుంసకులు, పురుషులు, మహిళలు ఈ దేవాలయ ఉత్సవంలో పాల్గొంటారు.

15. పూజా సమయం

కూతాండవర్ దేవాలయంలో పూజా సమయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అదే విధంగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు

16. సమీపంలోని రైల్వే స్టేషన్

ఈ కూతాండవర్ దేవాలయానికి వెళ్ళటానికి రైల్వే స్టేషన్ ఏదంటే విళుపురం రైల్వే స్టేషన్.

17. విమాన మార్గం

కూతాండవర్ దేవాలయానికి వెళ్ళటానికి సమీపంలోని విమానాశ్రయం పాండిచ్చేరి విమానాశ్రయం.

18. ఎలా వెళ్ళాలి?

తమిళనాడు రాష్ట్రంలో విళుపురం జిల్లాలో ఉళుందూర్ తాలూకాలో ఒక చిన్న గ్రామంలో ఈ కూతాండవర్ దేవాలయం వుంది. ఉళుందూర్ నుంచి సుమారు 25 కి.మీ వుండటం వల్ల సులభంగా వెళ్ళవచ్చును.

PC: google maps

ఎలా వెళ్ళాలి

 

English summary

Do You Know About the Thousand Women Becoming Widows The Next Day They Get Married?

The marriage is a relationship between two lives. Many wives pray in God that this relationship should be firmly established. The sadness of the husband dies when he is married on the same day. Worshipers do so that many women want to die as Sumas.
Please Wait while comments are loading...