Search
  • Follow NativePlanet
Share
» »50 రూపాయల నోటు మీద ఉండే ప్రదేశం ఏదో మీకు తెలుసా?

50 రూపాయల నోటు మీద ఉండే ప్రదేశం ఏదో మీకు తెలుసా?

నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి పాలన అధికారంలో కొత్తగా అనేక ఉద్దీపనా కార్యక్రమాలుప్రారంభించింది దీని ప్రకారం, భారతదేశంలో మొదటిసారిగా 200 మరియు 50 రూపాయల నోట్లను పరిచయం చేశారు.

By Venkatakarunasri

నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి పాలన అధికారంలో కొత్తగా అనేక ఉద్దీపనా కార్యక్రమాలుప్రారంభించింది దీని ప్రకారం, భారతదేశంలో మొదటిసారిగా 200 మరియు 50 రూపాయల నోట్లను పరిచయం చేశారు. నవంబర్ 8, 2016 వరకు, ఐదు వందల రెండు వేల రూపాయలు చెల్లుబాటు అయ్యాయి మరియు కొత్త 500 మరియు 2000 రూపాయలు జారీ చేయబడ్డాయి.

అలాగే 50 రూపాయల నోట్లు కొత్తగా ప్రవేశపెట్టబడ్డాయి. దీనికి ముందు రూ. 2,000 రూపాయల మీద ఢిల్లీ ఎర్రకోట, రూ. 200 ల నోటుమీద సాంచి స్థూపాన్ని ముద్రించి ప్రవేశపెట్టారు. ఇదే విధంగా 50 రూపాయల నోటు మీద వుండే చిత్రం ఏంటో తెలుసా? ఇది ఒక చారిత్రక ప్రదేశం. ప్రస్తుత వ్యాసంలో దీని గురించి తెలుసుకుందాం.

 50 రూపాయల నోటులో ఉన్నది ఏమిటి?

50 రూపాయల నోటులో ఉన్నది ఏమిటి?

50 రూపాయల నోటు మీద వున్న ప్రదేశం కర్ణాటక రాష్ట్రంలో వున్న చారిత్రాత్మక ముఖ్యమైన ప్రాంతం హంపి. ఇది ముఖ్యమైన పర్యాటక ప్రదేశం.

హంపి

హంపి

హంపి పేరు వింటే చాలు వెంటనే మీకు విజయనగర పట్టణ అందచందాలు, వాటిని చుట్టుముట్టిన ప్రఖ్యాత శిధిలాలు గుర్తుకు వచ్చేస్తాయి. హంపి పట్టణం విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. ఈ పట్టణంలో హోయసలులనాటి శిల్ప సంపద కనపడుతూంటుంది. రాతి శిల్పాలైనప్పటికి సందర్శకులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి.

హంపి గురించిన కొన్ని వాస్తవాలు

హంపి గురించిన కొన్ని వాస్తవాలు

హంపి ప్రాచీన పట్టణమే కాదను. దీనిని గురించి రామాయణంలో కూడా చెప్పబడింది. దీనిని ఆనాటి కాలంలో కిష్కింధ అనేవారని చరిత్ర చెపుతోంది. 13 నుండి 16 శతాబ్దాలవరకు విజయనగర రాజుల పాలనలో ఎంతో ఔన్నత్య స్దితిలో రాణించింది.

PC: Srikar.agnihotram

ఎక్కడ ఉంది ?

ఎక్కడ ఉంది ?

కర్నాటకకు ఉత్తర భాగాన బెంగుళూరుకు 350 కిలో మీటర్ల దూరంలో ఉంది. బెంగుళూరునుండి బస్సులు అనేకం. ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అంతర్జాతీయ సంస్ధ యునెస్కో గుర్తించింది. ప్రతి సంవత్సరం వేలాదిమంది పర్యాటకులు దీనిని దర్శిస్తారు.

PC:IM3847

హంప్ చుట్టూ సైకిల్ రైడ్

హంప్ చుట్టూ సైకిల్ రైడ్

హంపి శిధిలాలు చూడాలంటే, స్ధానికంగా ఒక సైకిల్ అద్దెకు తీసుకొని దనిపై తిరుగుతూ చూస్తే పూర్తిగా వాటిని ఆనందించినవారవుతారు.

PC:ShivaRajvanshi

అసలు టూరిస్టులు హంపి ఎందుకు ఇష్టపడతారు?

అసలు టూరిస్టులు హంపి ఎందుకు ఇష్టపడతారు?

హంపి పట్టణం దాని శిధిలాలకంటే కూడా దాని మతపర చరిత్రకు ప్రాధాన్యత కలిగి ఉంది. ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి. విరూపాక్ష దేవాలయం, విఠల దేవాలయం, ఆంజనేయాద్రి మొదలైనవి కలవు. కర్నాటకలోని ప్రధాన నదులలో ఒకటైన తుంగభద్ర ఈ పట్టణం గుండా ప్రవహిస్తుంది. ఎంతో ఆనందింపజేస్తుంది. హంపి పట్టణంలోని దేవాలయాల నిర్మాణానికి గాను విజయనగర రాజులు అక్కడి సమీప కొండల రాళ్ళను చక్కగా చెక్కించి నిర్మించారు. దేవాలయాలు, సహజ అందచందాలే కాక అక్కడ అనేక సరస్సులు కూడా ఉన్నాయి. అందమైన భవనాలను నర్మించారు.

విజయనాగర రాజుల నేర్పరితనం

విజయనాగర రాజుల నేర్పరితనం

ఈ పట్టణ నిర్మాణంలో విజయనాగర రాజుల ఎంతో నేర్పరితనం ప్రణాళిక కనపడతాయి. 13 నుండి 15 శతాబ్దాలలోనే ఈ పట్టణంలో అనేక నేటి ఆధునిక నీటి ప్రణాళికా విధానాలు ఆచరించారు.

PC: Tania Dey

రాష్ట్ర టూరిజం శాఖ

రాష్ట్ర టూరిజం శాఖ

పర్యాటకులకు ఈ పట్టణంలో చూడాలంటే 500 ప్రదేశాలకు పైగా ఉన్నాయి. వాటిలో సుమారు 100 ప్రదేశాలు పర్యాటకులను అమితంగా ప్రతి ఏటా ఆకర్షిస్తున్నాయి. విఠల దేవాలయం వద్ద గల రాతి రధం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. విజయనగర రాజుల సాంప్రదాయాలను వెల్లడిస్తూంటుంది.

PC:Dey.sandip

త్రవ్వకాలు

త్రవ్వకాలు

దీనినే రాష్ట్ర టూరిజం శాఖ తన పర్యాటక చిహ్నంగా ఆమోదించింది. నేటికి హంపి లో పురావస్తు శాఖ తన పరిశోధనలు సాగిస్తూనే ఉంది. ఇక్కడి పురావస్తు మ్యూజియం తప్పక చూడదగినది.

PC:Tania Dey

కోటకు సెక్యూరిటీ

కోటకు సెక్యూరిటీ

తుంగభధ్రా నది ఒక వైపు, మూడు వైపుల కొడలు గల హంపి పట్టణాన్ని విజయనగర రాజులు ఎంతో ప్రణాళికగా తమ రాజ్య రాజధానిగా చేసుకొని పాలించారు. ఈ పట్టణాన్ని జయించటం శత్రురాజులకు అసంభవంగా భావించి వారు దీనిని ఎంపిక చేశారు.

PC:Dharani.prakash

పర్యాటకులు మిస్ కాకుండా దర్శించి తీరాల్సిందే

పర్యాటకులు మిస్ కాకుండా దర్శించి తీరాల్సిందే

నేడు ఈ కొండ ప్రాంతాలు, చక్కటి నదీ ప్రవాహం పర్యాటకులకు ఎంతో ఆనందాన్నిస్తోంది. దక్షిణ భారత దేశానికి వచ్చిన పర్యాటకులు హోయసల శిల్ప సంపదలకు ప్రధానమైన హంపి పట్టణాన్ని తప్పక దర్శించి తీరాల్సిందే.

PC: LennartPoettering

అనెగుండి

అనెగుండి

అనెగుండి గ్రామం హంపికి సుమారు 10 కి.మీ.ల దూరంలో తుంగభద్రనది ఒడ్డున కలదు. ఇది ఒకప్పుడు విజయనగరసామ్రాజ్యానికి ప్రాంతీయ రాజధానిగా ఉండేది. కన్నడంలో అనెగుండి అంటే, ఏనుగుల గొయ్యి అని అర్ధం చెపుతారు. ఈ ప్రాంతం హంపి కంటే కూడా పురాతనమైంది. రామాయణం మేరకు ఈ ప్రదేశం కోతి రాజైన సుగ్రీవుడు పాలించిన కిష్కింధగా చెపుతారు.ఇక్కడి కల అంజనాద్రి హిల్ అంటే, హనుమంతుడి జన్మ స్ధలాన్ని కూడా పర్యాటకులు దర్శించవచ్చు.

PC: Hawinprinto

అంజనాద్రి

అంజనాద్రి

రామాయణం మేరకు అంజనాద్రి హిల్స్ ప్రభువు హనుమంతుడి జన్మస్ధలంగా చెప్పబడుతోంది. అందమైన ఒక హనుమాన్ గుడి హనుమంతుడికి ఈ ప్రదేశంలో అర్పణగావించారు. దేవాలయం అంజనాద్రి కొండలపై కలదు. పర్యాటకులు సుమారు 570 మెట్లు ఎక్కి దేవాలయం చేరాలి. వెళ్ళే దోవలో వారు అనేక కోతులను ఎదుర్కొంటారు. హనుమంతుడి భక్తులు ఈ దేవాలయాన్ని తప్పక చూసి ఆశీర్వాదాలు పొందాలి.

PC: Indiancorrector

శాంతియుత వాతావరణం

శాంతియుత వాతావరణం

హంపి దగ్గర ఉన్న అనెగుండి గ్రామం సమశీతోష్ణ మరియు ప్రశాంతమైన వాతావరణం. ఇప్పుడు తుంగభద్ర నదిపై కొత్త వంతెన నిర్మించబడి వుండటం వలన అనెగుండికి ప్రయాణికుల సౌలభ్యం మరింత సౌకర్యాలు కల్పించబడినది. అనెగుండి సందర్శించే పర్యాటకులు హజార రామా దేవాలయం, లోటస్ దేవాలయం, గణేష్ ఆలయం, చింతామణి శివ దేవాలయం, ఏనుగుల నివాసాలు మరియు జైన దేవాలయం కూడా చూడవచ్చు.

PC: Indiancorrector

అంజనాద్రి కొండలు

అంజనాద్రి కొండలు

రామాయణం మేరకు అంజనాద్రి హిల్స్ ప్రభువు హనుమంతుడి జన్మస్ధలంగా చెప్పబడుతోంది. అందమైన ఒక హనుమాన్ గుడి హనుమంతుడికి ఈ ప్రదేశంలో అర్పణగావించారు. దేవాలయం అంజనాద్రి కొండలపై కలదు. పర్యాటకులు సుమారు 570 మెట్లు ఎక్కి దేవాలయం చేరాలి. వెళ్ళే దోవలో వారు అనేక కోతులను ఎదుర్కొంటారు. హనుమంతుడి భక్తులు ఈ దేవాలయాన్ని తప్పక చూసి ఆశీర్వాదాలు పొందాలి.

PC: Indiancorrector

అక్విడక్ట్స్ మరియు కెనాల్స్

అక్విడక్ట్స్ మరియు కెనాల్స్

హంపి ప్రాంతం అనేక సాగునీటి కాల్వలను భవనాలు, దేవాలయాలు, కొలనులు మరియు వ్యవసాయ భూములకు కలుపబడి ఉంది. వాటిలో చాలావరకు విజయనగర కాలంలో కట్టబడినవే. రాయ కెనాల్, తర్తు కెనాల్, కమలాపుర వాటర్ ట్యాంక్ మరియు బసవన్న కెనాల్ వంటివి విజయనగర రాజులు నిర్మించారు. ఇప్పటికి వ్యాలీ ప్రాంతంలోని కొన్ని కాల్వలను వ్యవసాయ పనులకు ఉపయోగిస్తున్నారు. వీటిని చూడగోరే పర్యాటకులు తప్పక ఈ పురాతన ప్రాంతాలను సందర్శించాలి. జానపదుల మేరకు శ్రీరాముడు తన తండ్రి అంత్య క్రియలు తుర్తు కెనాల్ ఒడ్డున చేశాడని చెపుతారు. ఈ కెనాల్ లక్ష్మీ నరసింహ విగ్రహం సమీపంలో కలదు. కమలాపుర నుండి హంపి వచ్చేటపుడు చూడవచ్చు. అనేక రాతి అక్విడెక్టులు కూడా రాజ భవనంలో కనపడతాయి. రాతి తొట్టెలు సుమారు 20 కొలనులకు, బావులకు కలిపారు. కొన్ని రూపాంతరం చెందినప్పటికి ఆ కాలంనాటి నీటి సరఫరా విధానాన్ని మనం ప్రశంసించవచ్చు. హంపిలో అతి పెద్ద అక్విడక్ట్ విరూపాపూర్ గద్దె వద్ద కలదు.

PC:Indiancorrector

ఆర్కియాలాజికల్ మ్యూజియం

ఆర్కియాలాజికల్ మ్యూజియం

కమలాపుర వద్ద గల ఆర్కియాలాజికల్ మ్యూజియం పర్యాటకులు ప్రధానంగా చూస్తారు. ఇక్కడ హంపి ప్రాంత భౌగోళికతలు రెండు నమూనాలలో చూపబడతాయి. ప్రాంతంలోని ఆకర్షణలు పర్యాటకులు ఈ నమూనాలద్వారా తెలుసుకోవచ్చు. చిన్న నమూనా లోపల చివరి గ్యాలరీలో వుండి మీకు పూర్తి వివరాలను అందిస్తుంది. ఈ ఆర్కియాలాజికల్ మ్యూజియంలో నాలుగు విభాగాలు కలవు. మొదటిది హంపి నమూనాలు, రెండవది విగ్రహాలు, శిల్పాలు, మూడవది ఆయుధాలు, నాణేలు, పరికరాలు, నాల్గవది పురాతన వస్తువులు చూపుతుంది. ఆర్కియాలాజికల్ మ్యూజియం శుక్రవారాలు, జాతీయ సెలవు దినాలలో మూసి ఉంటుంది. మిగిలిన అన్ని దినాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు తెరచి ఉంటుంది. హంపి వెళ్ళేవారు దీనిని తప్పక దర్శించాలి.

PC:Dharani.prakash

బడవ లింగ

బడవ లింగ

బడవ లింగ....ఇది 9 అడుగుల పొడవైన దేవాలయం. లక్ష్మీ నరసింహ దేవాలయానికి దగ్గరలో ఉంది. ఇక్డి విశిష్టత అంటే ఈ నిర్మాణం నీటిలో ఉంటుంది. ఒకే రాయితో చేసిన లింగం ఇది మూడు కళ్ళు ఉంటాయి. ముక్కంటి శివుడికి ప్రతిరూపంగా భావిస్తారు. హంపి పట్టణానికి వచ్చిన ప్రతి పర్యాటకుడు ఈ దేవాలయాన్ని తప్పక సందర్శించాలంటారు.

PC:Dharani.prakash

స్ధానిక కధనాల లేదా నమ్మకాల మేరకు

స్ధానిక కధనాల లేదా నమ్మకాల మేరకు

స్ధానిక కధనాల లేదా నమ్మకాల మేరకు ఒక పేద భక్తుడు హంపి అనబడేవాడు అతని కోరికలు తీరితే శివలింగ నిర్మాణం చేయిస్తానని మొక్కుకున్నట్లు, శివ భగవానుడు అతని కోర్కెలు తీర్చినట్లు, తర్వాతి కాలంలో ఆ భక్తుడు బడవ లింగాన్ని ఒక పెద్ద రాతితో నిర్మించి దానిని శివ భగవానుడికి అర్పించినట్లు చెపుతారు. మరో కధనం మేరకు ఈ లింగం ఒక గ్రామీణ పేద మహిళ సమర్పించినదిగా చెపుతారు. బడవ అంటే కన్నడంలో పేద అని అర్ధంగా వస్తుంది.

PC: Lyon

చంద్రమౌళీశ్వర దేవాలయం

చంద్రమౌళీశ్వర దేవాలయం

చంద్రమౌళీశ్వర దేవాలయం 15వ శతాబ్దికి చెందిన హిందువుల పవిత్ర స్ధలం. హంపిలో ప్రధాన ఆకర్షణ. హంపి నడిబొడ్డున విఠల్ దేవాలయానికి అందుబాటులో కలదు. చంద్రమౌళీశ్వర దేవాలయం చూసే వారికి హంపి గుండా ప్రవహించే రెండు నదులు చూసే అవకాశం దొరుకుతుంది. పట్టణంలో కల పవిత్ర పర్వతానికి కూడా వీరు వెళ్ళవచ్చు.

PC:Ashwin Kumar

యునెస్కో గుర్తింపు

యునెస్కో గుర్తింపు

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల సంరక్షణలో భాగంగా దీనిని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతో శిల్పసంపదకలిగి కనుమరుగవుతున్న దేవాలయాలలో ఒకటిగా దీనిని యునెస్కో గుర్తించింది.

PC: Dr Murali Mohan Gurram

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X