Search
  • Follow NativePlanet
Share
» »బేతాళుడు వ్రేలాడే చెట్టు మన భారతదేశంలో ఎక్కడ వుందో తెలుసా?

బేతాళుడు వ్రేలాడే చెట్టు మన భారతదేశంలో ఎక్కడ వుందో తెలుసా?

గోదావరీ తీరాన ప్రతిష్టానపురానికి విక్రమార్కుడు రాజు. ఒక భిక్షువు ఆయనకు రోజూ ఒక పండు లోపల రత్నం పెట్టి ఇస్తూ ఆయన ప్రాపకం సంపాదించటానికి ప్రయత్నించేవాడు.

By Venkatakarunasri

మనం చిన్నప్పటినుంచీ చాలా కథలు వినివున్నాం. అందులో చాలా ఇష్టమైన కథలంటే బేతాళ కథలు. ఈ కథలు చాలా ఇంట్రెస్ట్ గా వుంటాయి. మా అవ్వ బేతాళ కథలను చాలా బాగా చెప్తారు. అందులో బేతాళుని పలు ప్రశ్నలకు జవాబిచ్చే పరాక్రమశాలి విక్రమాదిత్యుని సమాధానాలు మనస్సుకు హత్తుకుంటాయి.

అందరికీ తెలిసిందే! కాని గోదావరీ తీరాన ప్రతిష్టానపురానికి విక్రమార్కుడు రాజు. ఒక భిక్షువు ఆయనకు రోజూ ఒక పండు లోపల రత్నం పెట్టి ఇస్తూ ఆయన ప్రాపకం సంపాదించటానికి ప్రయత్నించేవాడు. అలా పండులో రత్నం పెట్టి ఇస్తున్నట్లు కొన్ని రోజుల వరకు రాజుకు తెలియదు.ఆ విషయం తెలిసిన రోజున విక్రమార్కుడు భిక్షువు యొక్క విశ్వాసానికి మెచ్చి కారణం చెప్తేకానీ పండు తీసుకోనని చెప్తాడు.

దానికి భిక్షువు తను ఒక మంత్రాన్ని సాధించదలచానని అందుకు ఓ వీరుడ్ని సహాయం కావాలని విక్రమార్కుని నుంచి తానాసహాయం ఆశిస్తున్నానని అడుగుతాడు. విక్రమార్కుడు తగిన సహాయం చేయటానికి ఒప్పుకుంటాడు. భిక్షువు రాబోయే కృష్ణ చతుర్దశి నాటి చీకటిపడగానే రాజును మహాస్మశానానికి రమ్మంటాడు.అలాగే విక్రమార్కుడు వెళ్తాడు.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. శిషుంభా చెట్టు

1. శిషుంభా చెట్టు

అక్కడే వున్న భిక్షువు రాజును శిషుంభా చెట్టు పైన వ్రేలాడుతున్న పురుషుని శవం తెచ్చి తన సమీపంలో వుంచమంటాడు. అసలు శిషుంభా వృక్షం అంటే ఏమిటి?అది ఎలా వుంటుంది?

pc: youtube

2. విక్రమార్క రాజు

2. విక్రమార్క రాజు

అయితే విక్రమార్క రాజు ఆ చెట్టు ఎక్కి వ్రేలాడుతున్న శవాన్ని తాడు కోసి కింద పదేస్తేడు.క్రింద పడగానే శవం ఏడవటం మొదలుపెడుతుంది.

pc: youtube

3. విక్రమార్కుడు

3. విక్రమార్కుడు

బేతాళుడు ఆ శవాన్ని ఆవహించి వున్న సంగతి తెలుసుకోలేకపోతాడు విక్రమార్కుడు. ఎందుకు నవ్వుతున్నావు?పోదాం పద అంటాడు.

pc: youtube

4. బేతాళ ప్రశ్నలు

4. బేతాళ ప్రశ్నలు

నిజానికి బేతాళుడు ఏడుస్తున్నాడు.బేతాళుడు ఏడవడం విక్రమార్కునికి నవ్వినట్లుగా అనిపిస్తుంది.

pc: youtube

5. నేల మీది శవం

5. నేల మీది శవం

రాజుకు ఇలా మౌనభంగం అవగానే నేల మీది శవం మాయమై మళ్ళీ చెట్టుకు వ్రేలాడుతూ కనపడుతుంది.

pc: youtube

6. స్మశానం

6. స్మశానం

విక్రమార్కుడు బేతాళుడు పూనివున్న ఆ శవాన్ని మళ్ళీ కిందపడేసి భుజం మౌనంగా స్మశానం వైపు నడవటం మొదలుపెడతాడు.

pc: youtube

7. వినోదం

7. వినోదం

అప్పుడు శవంలోని బేతాళుడు రాజా !నీకు వినోదంగా వుండటానికి ఒక కథ చెబుతాను విను అంటూ ఒక కదా చెబుతాడు.

pc: youtube

8. విక్రమార్కుడు

8. విక్రమార్కుడు

కధ చివర ప్రశ్న వేసి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అంటాడు.విక్రమార్కుడు మౌనం వీడి ప్రశ్నకు తగిన సమాధానం చెబుతాడు.

pc: youtube

 9. బేతాళుడు

9. బేతాళుడు

ఆ విధంగా విక్రమార్కుడికి మౌన భంగం జరగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టు పైకి వెళ్తాడు.ఇందాక చెప్పాను కదా శిషుంభా వృక్షం అంటే ఏమిటో?ఇప్పుడు చెబుతాను.

pc: youtube

10. శిషుంభా చెట్టు ఏది?

10. శిషుంభా చెట్టు ఏది?

జిడ్డేగి అంటారు. ఒక కలప చెట్టు ఇది. ఇది తూర్పు మరియు ఉత్తర భారతదేశంలోని ఉష్ణమండల రైన్ ఫారెస్ట్ లలో దొరుకుతుంది.

pc: youtube

11. బాంబే బ్లాక్ వుడ్, రోజ్ వుడ్

11. బాంబే బ్లాక్ వుడ్, రోజ్ వుడ్

దీని కున్న కొన్ని ఇంగ్లీష్ పేర్లు. బ్లాక్ వుడ్, బాంబే బ్లాక్ వుడ్, రోజ్ వుడ్ ఇలా కొన్ని పేర్లతో పిలుస్తారు.

pc: youtube

12. ఉపయోగాలు

12. ఉపయోగాలు

వీటి వాడుక పేర్లు ఇండియాలో ఏంటంటే బీటీ మరియు సిట్సా. ఈ వృక్షాలు సుమారు 40మీ ఎత్తు పెరుగుతాయి. ఈ వృక్షం వల్ల ఉపయోగాలు కూడా వున్నాయండి.

pc: youtube

13. బీ.టి చెట్టు

13. బీ.టి చెట్టు

బీ.టి చెట్టు ఉపయోగాలేంటంటే దీని బెరడును గాయం చేయగా దాని నుంచి స్రవించే ఎర్రటి ద్రవంను మనకు తగిలిన గాయములను మాన్పుటకు వాడుతారు.

pc: youtube

14. కుర్చీలు, బల్లలు

14. కుర్చీలు, బల్లలు

దీని కలప నల్లగా అందంగా వుండి కుర్చీలు, బల్లలు మొదలైనవి తయారుచేయటానికి వాడుతారు.

pc: youtube

15. గిటార్

15. గిటార్

గిటార్ తయారుచేయటంలో,బెంచీలు తయారుచేయటంలో వాడతారు.

pc: youtube

16. వృక్షం

16. వృక్షం

విక్రమార్కుడు దాదాపు 40మీ ఎత్తు వున్న వృక్షాన్ని ఎక్కి అక్కడ వున్న బేతాళుని శవాన్ని కింద పడేసి తీస్కోచ్చాడన్న మాట.

pc: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X