Search
  • Follow NativePlanet
Share
» »దొడ్డమాకళి ఫిషింగ్ & నేచర్ క్యాంప్ !

దొడ్డమాకళి ఫిషింగ్ & నేచర్ క్యాంప్ !

బెంగుళూరు నుండి రోడ్డు ప్రయాణంలో దొడ్డమాకళి మూడు గంటలలో చేరవచ్చు. జూలై - ఫిబ్రవరి నెలలు సందర్శనకు అనుకూలం. వర్షాకాలం తర్వాత కూడా పచ్చటి ప్రదేశంగా ఉన్నపుడు సందర్శకులు ఇక్కడకు వచ్చి ఆనందిస్తారు.

By Mohammad

దొడ్డమాకళి కర్నాటక రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి గాంచిన విహార స్ధలం. పచ్చటి ప్రదేశాల ఆకర్షణ, చక్కటి వాతావరణం ఈ ప్రదేశాన్ని మరోమారు తప్పక సందర్శించేలా పర్యాటకులను చేస్తాయి. ఈ ప్రాంతం భీమేశ్వరి ఫిషింగ్ కేంప్ నుండి ఎగువభాగాన 6 కి.మీ. ల దూరంలో ఉంది. బెంగుళూరుకు 132 కి.మీ. దూరంలో ఉంటుంది.

బెంగుళూరు నగరానికి సమీపం కనుక వారాంతపు సెలవులకు కంపెనీల సిబ్బంది ఎంతో తేలికగా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. నగరానికి దూరంగా ఉన్న ప్రశాంత ప్రదేశం కనుక చాలామంది వారాంతపు సెలవులలో ఇక్కడ సమయం గడిపేందుకు ఇష్టపడతారు. ఇది కావేరీ నదీ తీరంలోని చక్కని విశ్రాంత ప్రదేశం. దొడ్డమకాలి లో వన్యజీవుల సంచారం, పక్షుల గమనం, మరెన్నో ఇతర వినోదాలు ఉంటాయి.

కావేరి నది

కావేరి నది

చిత్రకృప : Ashwin Kumar

పర్యాటకులు దొడ్డమాకళి ఎందుకు సందర్శిస్తారు ?

పక్షుల ప్రియులకు ఇది ఒక స్వర్గంగా ఉంటుంది. నీటి ఆధారిత పక్షులు అనేక రకాలు ఈ ప్రాంతం సందర్శిస్తాయి. అరుదైన బ్లాక్ బెల్లీడ్ రివర్ టెర్న్, ఓస్ప్రే, గ్రే ఫిష్ ఈగిల్, కింగ్ ఫిషర్, వడ్రంగి పిట్టలు, మైనాలు, బాతులు, వంటివి ఎన్నో ఇక్కడ చూడవచ్చు. దొడ్డమాకళి సుమారుగా 200 పక్షి జాతులకు నిలయంగా ఉంది.

జంతువుల సందర్శనకు ఈ ప్రదేశం ఎంతో బాగుంటుంది. ఎలుగు బంటి సంబార్, మచ్చల జింకలు, ఉడుతలు, చిరుతపులులు, ఏనుగులు, మలబార్ ఉడతలు, గుంట నక్కలు, పాములు మొసళ్ళు, తాబేళ్ళు, ఊసర వెల్లులు ఎన్నో కనపడతాయి.

మెల్లగా పారుతున్న కావేరి నదీ తీరం దొడ్డమాకళి లో చేపలు పట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. సరిగ్గా ఈ ప్రాంతంలో ఎంతో నిరు నిలువ చేయబడి ఉంటుంది. చేపలు పట్టడం, మరల వదిలేయడం పద్ధతిపై ఇక్కడ అనేకమంది ఆనందిస్తూంటారు. మహసీర్ మరియు మరికొన్ని స్ధానిక జాతి చేపలు ఇక్కడ దొరుకుతాయి. ఈ ప్రాంతంలో గైడ్ సేవలు కూడా లభ్యంగా ఉంటాయి. కనుక చేపలు పట్టటానికి అవసరమయ్యే శిక్షణ కూడా లభిస్తుంది.

క్లామటోర్ జాకోబిన్స్ పక్షి

క్లామటోర్ జాకోబిన్స్ పక్షి

చిత్రకృప : Forestowlet

దొడ్డమాకళి గురించి మరింత చెప్పాలంటే.... దొడ్డమాకళి సాహస క్రీడాభిమానులకు మంచి ప్రదేశం. ఈ ప్రాంతంలో నావలు నడపవచ్చు. కయాకింగ్, ర్యాఫ్టింగ్ వంటి ఆటలు కావేరి నదిలో ఆడవచ్చు. పర్వత ప్రదేశ బైకింగ్ మరియు ట్రెక్కింగ్ లు కూడా దొడ్డమాకళి లో సర్వసాధారణ చర్యలుగా భావిస్తారు. దొడ్డమాకళి సందర్శించే ప్రకృతి ప్రియులు తరచుగా ఈ ప్రదేశంలో నడక సాగిస్తూ అక్కడే ఉన్న పురాతన శివాలయాన్ని సందర్శిస్తారు.

ఇది కూడా చదవండి : కాబిని - ఈ ప్రాంత సందర్శన మరవకండి !!

దొడ్డమాకళి అడవులలో సోలిగ జాతి తెగల ప్రజలుంటారు. వీరు ఎన్నో శతాబ్దాలనుండి ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారు. పర్యాటకులు ఈ స్ధానికులతో సంభంషించి వారి పురాతన నైపుణ్యాలు తెలుసుకుంటారు. దొడ్డమకాలికి దగ్గరలో భీమేశ్వరి ఫిషింగ్ కేంప్, మేకేదాటు జలపాతాలు, సంగం మరియు సింషా జలపాతాలున్నాయి.

బెంగుళూరు నుండి రోడ్డు ప్రయాణంలో దొడ్డమాకళి మూడు గంటలలో చేరవచ్చు. జూలై, ఆగస్టు, ఫిబ్రవరి నెలలు సందర్శనకు అనుకూలం. వర్షాకాలం తర్వాత కూడా పచ్చటి ప్రదేశంగా ఉన్నపుడు సందర్శకులు ఇక్కడకు వచ్చి ఆనందిస్తారు.

చేపలు పడుతున్న దృశ్యం

చేపలు పడుతున్న దృశ్యం

చిత్ర కృప : Rob Oo

దొడ్డమాకళి ఎలా చేరుకోవాలి ?

బస్ ప్రయాణం - భీమేశ్వరి ఎగువ భాగాన 6 కి.మీ. దూరంలో దొడ్డమాకళిఉంటుంది. బెంగుళూరు నుండి భీమేశ్వరికి రాష్ట్ర రోడ్డు రవాణా బస్సులు ప్రతి దినం లబ్యంగా ఉంటాయి. అక్కడనుండి ట్రెకింగ్ పై దొడ్డమాకళి చేరవచ్చు.

రైలు ప్రయాణం - దొడ్డమాకళి లో రైలు స్టేషన్ లేదు. బెంగుళూరు సిటీ జంక్షన్ దొడ్డమాకళికి సమీప రైలు స్టేషన్. బెంగుళూరు నుండి భీమేశ్వరి 100 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇక్కడనుండి దొడ్డమాకళి ప్రాంతానికి ట్రెక్కింగ్ చేయవచ్చు. బెంగుళూరు సిటీ జంక్షన్ నుండి దొడ్డమాకళి టాక్సీలు, క్యాబ్ లలో తేలికగా చేరవచ్చు.

విమాన ప్రయాణం - దొడ్డమాకళి భీమేశ్వరి ఎగువ భాగాన 6 కి.మీ. దూరంలో ఉంది. ట్రెక్కింగ్ మార్గంలో ఉంది. భీమేశ్వరికి బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉంటుంది. ఇక్కడి నుండి టాక్సీలు, క్యాబ్ లలో దొడ్డమాకళి చేరవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X