అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

ఆంధ్ర ప్రదేశ్ లో ఊగే రైలు వంతెన ఎక్కడుందో తెలుసా ?

Written by: Venkatakarunasri
Published: Saturday, July 15, 2017, 15:42 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

దొరబావి వంతెన ఆంధ్ర, తెలంగాణ భూభాగంలో ఉన్న నల్లమల అడవులలో కలదు. నంద్యాల నుండి గిద్దలూరు వెళ్ళే మార్గంలో బొగద టన్నెల్ వద్ద ఇది కనిపిస్తుంది. నంద్యాల నుండి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇది నంద్యాల రైల్వే స్టేషన్ నుండి 30 కి.మీ ల దూరంలో ఉన్నది(రైల్వే ఆధారాల ప్రకారం). 'దిగువమిట్ట' గ్రామం వద్దకు చేరుకొని కూడా బ్రిడ్జి వద్దకు చేరుకోవచ్చు.

దొరబావి వంతెన .. బహుశా ఆంధ్ర ప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రాలకి ఈ వంతెన గురించి తెలిసి ఉండకపోవచ్చు. కానీ బ్రిటీష్ వారికి ఈ వంతెన ఎంతో ప్రతిష్టాత్మకం. అప్పట్లో పనిచేసిన రైల్వే కూలీలకు ఈ పేరువింటే హడల్. మరి ఈ వంతెన ఆషామాషీ వంతెన కాదు. ఊగే వంతెన.

ఆంధ్ర ప్రదేశ్ లో ఊగే రైలు వంతెన ఎక్కడుందో తెలుసా ?

మూడేళ్ళ సమయం

నల్లమల అడవులలో నిర్మించిన ఈ భారీ వంతెనను ఎటువంటి యంత్రాలు, సాంకేతికత ఉపయోగించకుండా .. కేవలం కూలీల భుజబలం, కండబలం తోనే భారీ ఇనుపదిమ్మెలను ఒక్కొక్కటిగా చేర్చుతూ ఈ నిర్మాణాన్ని పూర్తిచేశారు. కిలోమీటర్ పొడవున్న ఈ వంతెనను నిర్మించటానికి మూడేళ్ళ సమయం పట్టింది.

క్రూరమృగాలకు ఇది ఆవాసం

నల్లమల అడవులు అంటే అందరికీ గుర్తుకొచ్చేవి దుర్భేద్యమైన వృక్ష, జంతు సంపద. పులులు, ఏనుగులు, సింహాలు మరియు ఇతర క్రూరమృగాలకు ఇది ఆవాసం.

ఆశ్చర్యం కలిగించకమానదు

అలాంటి ఈ ప్రదేశంలో మూడు సంవత్సరాల పాటు నివాసం ఉండి ఈ రైల్వే వంతెనను నిర్మించారంటే ఆశ్చర్యం కలిగించకమానదు.

గోవా నుండి మచిలీపట్నం వరకు

దొరబావి వంతెన గురించి మరొకొన్ని విషయాలు (రైల్వే యాజమాన్యం రికార్డులలో తెలిపిన ప్రకారం) : గోవా నుండి మచిలీపట్నం వరకు సరకు రవాణా కోసం మీటర్ గేజ్ రైల్వే లైన్ ఏర్పాటుచేయాలని బ్రిటీష్ ప్రభుత్వం 1962 వ సంవత్సరంలో ఒక సర్వే చేపట్టింది.

రైల్వే వంతెన

సర్వే పూర్తయిన తర్వాత 1967 నాటికి గుంతకల్ వరకు రైలు మార్గం వేశారు. అటుపిమ్మట నల్లమల అడవులలో లోయలను కలుపుతూ రైల్వే వంతెన ఏర్పాటుచేయాలని అనుకుంటారు ఆంగ్లేయులు. చలమ, బొగద రైల్వే స్టేషన్ సమీపంలో సముద్రమట్టానికి 260 అడుగుల ఎత్తులో ఈ బ్రిడ్జిని నిర్మిచటానికి శ్రీకారం చుట్టారు.

420 టన్నుల స్వచ్ఛమైన ఇనుము

బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ ఉక్కు కర్మాగారం నుండి 420 టన్నుల స్వచ్ఛమైన ఇనుమును సేకరించి, అక్కడే విడిభాగాలను తయారుచేసి సముద్రమార్గం ద్వారా మచిలీపట్టణానికి తెప్పించారు.

దిమ్మెల నిర్మాణం

అప్పటికే అక్కడ దిమ్మెల నిర్మాణం పూర్తికావడంతో రైలు ద్వారా వంతెన సామాగ్రిని చేర్చారు. ఈ రైలు మచిలీపట్నం నుండి ఇక్కడికి రావటానికి మూడు రోజుల సమయం పట్టేదట.

మూడు రోజుల సమయం

అప్పటికే అక్కడ దిమ్మెల నిర్మాణం పూర్తికావడంతో రైలు ద్వారా వంతెన సామాగ్రిని చేర్చారు. ఈ రైలు మచిలీపట్నం నుండి ఇక్కడికి రావటానికి మూడు రోజుల సమయం పట్టేదట.

1884 లో నిర్మాణపనులు

1884 లో నిర్మాణపనులు మొదలుపెట్టి, 1887 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి, అదే సంవత్సరంలో మొదటి రైలు ను వంతెన మీద పరుగులు తీయించారని రైల్వే బోర్డు తెలిపింది.

250 అడుగులు వంతెన

ఎత్తైన ప్రదేశంలో (250 అడుగులు) వంతెనను నిర్మించారు కనుక స్ప్రింగ్ లను వాడారు. దాంతో ఏ చిన్నపాటి గాలి వీచినా దొరబావి వంతెన ఊయలలాగా ఊగేది. దాంతో జనం ఈ రైలు అంర్గంలో ప్రయాణించటానికి ఇష్టపడేవారు.

గుంటూరు - గుంతకల్ మీటర్ గేజ్

ఎటువంటి ఆటంకాలు లేకుండా 110 ఏళ్ళు గడిచిన తర్వాత అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు (నంద్యాల నుండి ఎన్నికయ్యారు) గుంటూరు - గుంతకల్ మీటర్ గేజ్ ను బ్రాడ్ గేజ్ గా బదలాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

బ్రాడ్ గేజ్

దాంతో ఈ వంతెనకు సమీపంలోనే మరో నూతన రైలు మార్గాన్ని (బ్రాడ్ గేజ్) నిర్మించారు రైలు అధికారులు. నిరుపయోగంగా ఉన్న ఈ వంతెనను ఎందరు వ్యతిరేకించినా కూల్చేసి, ఉక్కును అమ్మేశారు.

మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ గా

బొగద సొరంగం ఇది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో అత్యంత పొడవైనది. దీని పొడవు 1565 మీటర్లు. గిద్దలూరు - నంద్యాల రైలు మార్గాన్ని మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ గా మార్పిడి చేస్తున్నప్పుడు బ్రిటీష్ వారు కట్టిన సొరంగాన్ని బదులుగా ఈ సొరంగాన్ని నిర్మించారు.

సొరంగ నిర్మాణం

సొరంగ నిర్మాణ పనులు 1994 లో మొదలుపెట్టి 1996 లో కేవలం 15 నెలల్లో పూర్తిచేశారు. ఆతరువాత అప్పటి ప్రధాని పివి ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

ఎలా చేరుకోవాలి ?

నంద్యాల, బొగద, దొనకొండ రైల్వే, గిద్దలూరు రైల్వే స్టేషన్ ల వద్దకు చేరుకొని దిగువమిట్ట గ్రామం వద్దకు చేరుకుంటే ఈ బ్రిడ్జ్ ను చేరుకోవచ్చు (లేదా) నంద్యాల - గిద్దలూరు రోడ్డు మార్గంలో ప్రయాణించి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. నంద్యాల నుండి 30 కిలోమీటర్ల దూరంలో దొరబావి వంతెన ఉన్నది.

English summary

Dorabavi railway bridge in Nallamala forest

Dorabavi is a railway bridge in Nallamala forest, Guntur Division. It is situated in between Nandyal and Giddalur. It was the first Hanging bridge in Andhra pradesh.
Please Wait while comments are loading...