Search
  • Follow NativePlanet
Share
» »ద్రాస్ : ప్రపంచంలోనే రెండవ అతి శీతల ప్రదేశం !

ద్రాస్ : ప్రపంచంలోనే రెండవ అతి శీతల ప్రదేశం !

By Mohammad

సైబీరియా తర్వాత ప్రపంచంలో రెండవ శీతల నివాస ప్రదేశం 'ద్రాస్'. ఇది సముద్ర మట్టానికి 3280 మీటర్ల ఎత్తున కలదు. "లడఖ్ కు ప్రవేశద్వారం" అని కూడా పిలవబడే ద్రాస్, జమ్మూ & కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో ఉంది. కార్గిల్ కు 62 కి. మీ ల దూరంలో, సోనామార్గ్ కు 61 కి. మీ ల దూరంలో మరియు శ్రీనగర్ కు 141 కి. మీ ల దూరంలో ఉన్న ద్రాస్, ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా పేరుగాంచినది.

ఇది కూడా చదవండి : సొనామార్గ్ - పర్యాటక స్థలాలు !

కేవలం లడఖ్ కు మాత్రమే కాకుండా, జమ్మూ కాశ్మీర్ లోని ఇతర పర్వత ప్రాంతాలకు మరియు నగరాలకు ద్రాస్ ప్రవేశద్వారం గా ఉన్నది. ద్రాస్ ను సందర్శించే యాత్రికులు సాహస క్రీడలు, సురు లోయ వరకు ట్రెక్కింగ్ చేయవచ్చు మరియు సైనికుల స్మారకం, ద్రౌపది కుండ్ మొదలైన చారిత్రక సంబంధిత నిర్మాణాలను సందర్శించవచ్చు.

ద్రౌపది కుండ్

ద్రౌపది కుండ్

చిత్ర కృప : Nupur Singh

ద్రాస్ లోని కొన్ని ముఖ్య సందర్శన స్థలాలు !

ద్రౌపది కుండ్

ద్రాస్ పట్టణానికి 18 కి. మీ ల దూరంలో ఉన్న ద్రౌపది కుండ్ ను మీకు సమయం అనుకూలిస్తే తప్పక సందర్శించాలి. హిందూ మత పురాణం ప్రకారం, మహాభారతంలోని ద్రౌపది, మరణానికి ముందు హిమాలయాలలో ఇక్కడే తన ఆఖరి స్నానం చేసింది.

ద్రాస్ యుద్ధ స్మృతి చిహ్నం

బింబట్ యుద్ధ స్మృతి చిహ్నం గా కూడా పిలవబడే ద్రాస్ యుద్ధ స్మృతి చిహ్నం ద్రాస్ పట్టణ ప్రధాన ఆకర్షణ. "టైగర్ హిల్" మీదుగా 5 కి. మీ దూరంలో ఉన్న స్మృతి చిహ్నం, కార్గిల్ యుద్ధ అమరవీరులను గుర్తుకు తెస్తుంది. స్మారక చిహ్నం యొక్క ముఖద్వారం మీద చెక్కబడిన, హరివంశ్ రాయ్ బచ్చన్ (అమితాబ్ బచ్చన్ తండ్రి) రాసిన పద్యం, గోడలపై యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల పేర్ల ను సందర్శకులు గమనించవచ్చు.

ద్రాస్ యుద్ధ స్మృతి చిహ్నం

ద్రాస్ యుద్ధ స్మృతి చిహ్నం

చిత్ర కృప : Rohan

యుద్ధ స్మృతి చిహ్నానికి ఆనుకుని పక్కనే ఉన్న సంగ్రహాలయం 'ఆపరేషన్ విజయ్' ను గుర్తుకు తెచ్చుకునేందుకు స్థాపించబడినది. ఇక్కడ కార్గిల్ యుద్ధం నుంచి సేకరించబడిన భారతీయ సైనికుల చిత్రాలు, ముఖ్యమైన యుద్ధ పత్రాలు, రికార్డింగులు మరియు భారత సైన్యం అధికారిక చిహ్నాలు చూడవచ్చు.

ట్రెక్కింగ్

ద్రాస్ పర్యటనలో భాగంగా, ట్రెక్కింగ్ ఇష్టపడే పర్యాటకులు పట్టణానికి చేరువలోని సురు లోయ వరకు ట్రెక్కింగ్ చేయవచ్చు. ఈ ట్రెక్, జోజిల కింద ఉన్న మినామార్గ్ నుండి ప్రారంభమై 5200 మీటర్ల ఎత్తు గల కనుమలను దాటవలసి వస్తుంది. ఇది మీకు వీలుకాకపోతే చిన్న స్థాయి పర్వతారోహణ కు కూడా అవకాశం ఉంది.

ద్రాస్ విహంగ వీక్షణ

ద్రాస్ విహంగ వీక్షణ

చిత్ర కృప : Andrey Salikov

ద్రాస్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

150 కి. మీ ల దూరంలో ఉన్న షేక్ ఉల్ ఆలం విమానాశ్రయం (శ్రీనగర్ విమానాశ్రయం) ద్రాస్ కి సమీపాన ఉన్నది. జమ్మూ, న్యూ ఢిల్లీ, ముంబై, చండీఘర్ వంటి నగరాల నుండి ఈ ఎయిర్ పోర్ట్ కు తరచూ విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ వాహనాలను అద్దెకు తీసుకొని ద్రాస్ చేరుకోవచ్చు.

రైలు మర్గం

శ్రీనగర్ రైల్వే స్టేషన్ ద్రాస్ కు చేరువలో ఉన్న రైల్వే స్టేషన్ (150 కి. మీ). ఢిల్లీ, జమ్ముతావి మొదలైన ప్రధాన రైల్వే స్టేషన్ ల నుండి ఇక్కడికి రైళ్ళు రాకపోకలు సాగిస్తుంటాయి. స్టేషన్ వెలుపల వచ్చి క్యాబ్ లేదా టాక్సీ లో ప్రయాణించి ద్రాస్ చేరుకోవచ్చు.

రోడ్డు / బస్సు మార్గం

ద్రాస్ కు రహదారి గుండా వెళ్ళే ఆసక్తి గల యాత్రికులు, పర్యాటకులు బస్సులు లేదా టాక్సీలు ద్వారా గమ్యం చేరుకోవచ్చు. ద్రాస్ వరకు ప్రత్యక్ష బస్సులు లేవు. అయితే, శ్రీనగర్ నుంచి ద్రాస్ కు బస్సులు ఉన్నాయి. శ్రీనగర్ కు నేరుగా కొత్త ఢిల్లీ, లుధియానా, చండీగఢ్, అంబాలా, జలంధర్, మరియు సిమ్లా వంటి నగరాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి.

ద్రాస్ స్వాగత బోర్డ్

ద్రాస్ స్వాగత బోర్డ్

చిత్ర కృప : Ranjan MG

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X