Search
  • Follow NativePlanet
Share
» »కెమ్మనగుండి విహారం... కోరుకున్న ఆనందం!

కెమ్మనగుండి విహారం... కోరుకున్న ఆనందం!

ఓట్లు వేయడం అయింది. మరుసటి రోజు నుండి వారాంతపు సెలవలె...? కుటుంబ సభ్యులందరూ కలసి వారాంతపు విహారం ఎక్కడికి వెళ్ళాలి ? అనే ఆలోచన ప్రతి పర్యాటక మహాశయుడికి వచ్చేస్తుంది. మరి మూడు రోజుల పాటు వచ్చే ఈ సెలవులు ఒక పక్క ఆనందిస్తూ మరో పక్క అలసి పోకుండా మరల సోమవారం పనిలో పడాలంటే బెంగుళూరు వాసులు సమీప పర్యాటక ప్రదేశం ఎంచుకోవాలి.

కర్నాటక లోని చికమగలూరు లో కల కెమ్మనగుండి హిల్ స్టేషన్ ఇందుకు సరైనది అనటంలో సందేహంలేదు. ఎత్తైన కొండలు, ఆహ్లాదకర వాతావరణం, బాబా బూదాన్ గిరి కొండల అందాలు, ఎగిసిపడే జలపాతాలు, దట్టమైన అడవులు, పచ్చటి ప్రదేశాలు అన్నీ కలసి కెమ్మనగుండి ని ఒక అద్భుత విశ్రాంతి ప్రదేశంగా చేసాయి. కెమ్మనగుండి బెంగుళూరు కు 270 కి. మీ. ల దూరం. నాలుగున్నర గంటల రోడ్డు ప్రయాణం. వీక్ ఎండ్ విహారానికి అనుకూలమైనది. ఇక వసతి అంటారా ...ఎన్నో ఎంపికలు, హోం స్టే లు, ఖరీదైన హోటల్లు ఎన్నో కలవు.

 ఎన్నికలు ముగిశాయి...ఎక్కడికి వెళదాం ?

ఎన్నికలు ముగిశాయి...ఎక్కడికి వెళదాం ?

బెంగుళూరు నుండి కెమ్మనగుండి కి రెండు రూట్లు కలవు. ఒకటి నేరుగా చేరటం కాగా రెండవది చిక్ మగలూర్ ద్వారా వెళ్ళటం. కర్నాటక ప్రభుత్వ బస్సు లు రెండు రూట్ల లోను తరచుగా కలవు.

ఎన్నికలు ముగిశాయి...ఎక్కడికి వెళదాం ?

ఎన్నికలు ముగిశాయి...ఎక్కడికి వెళదాం ?

జీ పాయింట్
కెమ్మనగుండి లోని జీ పాయింట్ ప్రదేశానికి ట్రెక్కింగ్ లో ఎత్తు కొండ ఎక్కి వెళ్ళాలి. పచ్చటి కొండ ప్రదేశం ఆకర్షణీయంగా వుంటుంది. ఇక్కడి నుండి సూర్యోదయం దృశ్యాలు తప్పక చూడాలి. Pic Credit: Praveen Selvam

ఎన్నికలు ముగిశాయి...ఎక్కడికి వెళదాం ?

ఎన్నికలు ముగిశాయి...ఎక్కడికి వెళదాం ?

రోజ్ గార్డెన్
రోజ్ గార్డెన్ లో వివిధ రకాల గులాబీలు కలవు. దీనిని కర్నాటక ప్రభుత్వ హార్టికల్చర్ డిపార్టుమెంటు నిర్వహిస్తోంది. సందర్శకులు గులాబీల అందాలు ఆస్వాదించవచ్చు. Pic Credit: Alexandre Dulaunoy

ఎన్నికలు ముగిశాయి...ఎక్కడికి వెళదాం ?

ఎన్నికలు ముగిశాయి...ఎక్కడికి వెళదాం ?

శాంతి జలపాతాలు '
శాంతి జలపాతాలు జీ పాయింట్ నుండి రెండు కి. మీ. ల దూరం మాత్రమే. ఇక్కడ అందమైన షోలా గ్రాస్ లాండ్స్ కలవు. Pic Credit: Elroy Serrao

ఎన్నికలు ముగిశాయి...ఎక్కడికి వెళదాం ?

ఎన్నికలు ముగిశాయి...ఎక్కడికి వెళదాం ?

ముల్లాయనగిరి
ముల్లాయనగిరి పర్వత శ్రేణి పశ్చిమ కనుమల కిందే వస్తుంది. సముద్ర మట్టానికి సుమారు రెండు వేల మీటర్ల ఎత్తున కల ఈ కొండలు ట్రెక్కింగ్ ప్రియులకు ఒక స్వర్గం. కొండపై ఒక శివ దేవాలయం కూడా చూడవచ్చు. ఇక్కడ రోడ్, మౌంటెన్ బైకింగ్ లు కూడా చేయవచ్చు.
Pic Credit: Riju K

ఎన్నికలు ముగిశాయి...ఎక్కడికి వెళదాం ?

ఎన్నికలు ముగిశాయి...ఎక్కడికి వెళదాం ?

ఫుడ్స్ మరియు వసతి
ఇక్కడ కల ప్రభుత్వ గెస్ట్ హౌస్ లలో సందర్శకులకు అన్ని వసతులు కలవు. అయితే, ముందుగా రిజర్వ్ చేసుకోవాలి. వీటిలో ఉదయం వేల లభ్యం అయ్యే వేడి వేడి స్నాక్స్, సూప్ లు మిస్ కాకండి.
Pic Credit: Ash

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X